vision
-
కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!
కొంతమంది అదేపనిగా, చాలాకాలంగా సిగరెట్స్ తాగుతూనే ఉంటారు. పొగతాగడమన్నది కొద్దిగానైనా లేదా చాలా ఎక్కువగానైనా అది దేహం మీద దుష్ప్రభావం చూపుతూనే ఉంటుంది. స్మోకింగ్ దుష్ప్రభావం ఊపిరితిత్తుల మీద ఎక్కువని చాలామంది అనుకుంటుంటారు గానీ... ఈ అందమైన లోకాన్ని మనకు చూపించే కళ్ల మీద కూడా ఉంటుందని అనుకోరు. స్మోకింగ్ వల్ల కళ్ల మీద పడే దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. వాటి గురించి తెలుసుకొని, ఆ తర్వాత నుంచైనా పొగ తాగే అలవాటుకు దూరంగా ఉండడం కోసమే ఈ కథనం.కొంతమంది చాలా కాలం నుంచి పొగతాగే అలవాటు కలిగి ఉంటారు. వీళ్లనే ‘క్రానిక్ స్మోకర్స్’ అంటారు. దీర్ఘకాలంగా పొగతాగడం వల్ల కంటికి వచ్చే సమస్యలు ఒకటి రెండూ కాదు సరికదా ఈ జాబితా చాలా పెద్దది.కారణం: పొగాకులో దాదాపు 6,000కు పైగా హానికరమైన విషపదార్థాలు ఉంటాయి. సిగరెట్ కాల్చినప్పుడు వాటిల్లోని అత్యంత హానికరమైనవీ, క్యాన్సర్‌ను కలగజేసేవీ దాదాపు 69 విషపదార్థాల పొగ నేరుగా కంటికీ, ఒంటికీ తాకడం వల్ల అనేకానేక సమస్యలు వచ్చే అవకాశముంది. ఇందులో ఈ కింద ఉన్నవి ముఖ్యమైనవీ, కేవలం కొన్ని మాత్రమే. అర్లీ క్యాటరాక్ట్ : కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ కంట్లో ఉండే లెన్స్... తమ పారదర్శకతను కోల్పోవడంతో క్యాటరాక్ట్ అనే సమస్య రావడం తెలిసిందే. పొగతాగేవారిలో ఇది చాలా త్వరగా వచ్చేస్తుంది.టొబాకో ఆంబ్లోపియా : పొగాకులోని ‘నికోటిన్’ ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య వస్తుంది. ఇలా ఆంబ్లోపియా సమస్య వచ్చినవాళ్లలో కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని ఎదుటనున్న వారి క్లియర్ ఇమేజ్ స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఒక్కోసారి అది కేవలం ఓ స్కెచ్లాగానో లేదా నెగెటివ్ లాగానో కనిపించవచ్చు. ఎదుటి దృశ్యం నెగెటివ్‌లా కనిపించడాన్ని ఘోస్ట్ ఇమేజ్ అంటారు.ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీ–జనరేషన్ ఈ సమస్యలో రెటీనా పొరలోని కీలక భాగమైన ‘మాక్యులా’ దెబ్బతింటుంది. దృష్టిజ్ఞానాన్ని ఇవ్వడంలో ఈ మాక్యులాది కీలక పాత్ర. పొగతాగడం వల్ల ఇది చాలా త్వరగా వస్తుంది.ఆప్టిక్ న్యూరోపతి : మనందరి దృష్టిజ్ఞానానికి కారణమయ్యే అత్యంత సంక్లిష్టమైన నరం ‘ఆప్టిక్ నర్వ్’ అనే ఈ నరం దెబ్బతినడంతో వచ్చే సమస్యే ‘ఆప్టిక్ న్యూరోపతి’. విచక్షణ లేకుండా యాంటీబయాటిక్ మందులు, డ్రగ్స్, విషపదార్థాలు వాడటం దీనికి కారణం. సిగరెట్ పొగలోనూ ఉండేవి చాలా హానికారకవిషపదార్థాలతో ‘ఆప్టిక్ న్యూరోపతి’ వచ్చే అవకాశాలెక్కువ.రెటినల్ ఇస్కీమియా : రెటీనాకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్ల వచ్చే వ్యాధి ఇది. పొగతాగేవారిలో... పొగలోని విషపదార్థాలు, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్ కారణంగా రక్తకణాలకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా అన్ని కణాల్లో లాగే కంటి కణాలకూ పోషకాలూ, ఆక్సిజన్ అందక΄ోవడంతో ‘రెటినల్ ఇస్కీమియా’ వ్యాధి వచ్చి... అది అంధత్వానికి దారితీసే ప్రమాదం చాలా ఎక్కువ.థైరాయిడ్ ఆఫ్తాల్మోపతి : థైరాయిడ్ ఐ డిసీజ్ అంటూ పిలిచే ఈ వ్యాధిని గ్రేవ్స్ ఆఫ్తాల్మోపతి అని కూడా అంటారు. సొంత వ్యాధి నిరోధక శక్తి తమ సొంత కణాలను దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ సమస్య అయిన ఇది... పొగతాగేవారిలో చాలా ఎక్కువ. కార్నియల్ ఎపిథీలియల్ సమస్యలు : కంట్లో ఉండే నల్ల గుడ్డును కార్నియా అంటారు. చూపుజ్ఞానం కలిగించడంలో ఈ నల్లగుడ్డు భూమిక చాలా కీలకం. ఈ నల్లగుడ్డు మీద పారదర్శకమైన ఒక పైపొర ఉంటుంది. దాన్ని ‘ఎపిథీలియమ్’ అంటారు.సిగరెట్ అంటించడం కోసం తరచూ అగ్గిపుల్ల లేదా లైటర్ వెలిగించినప్పుడు, ఆ మంట ప్రభావం కంటికీ ఎంతో కొంత తాకే అవకాశం ఉంటుంది. ఆ మంట మాటిమాటికీ అలా తగులుతుండటం లేదా వేడి సెగగానీ, సిగరెట్ పొగగానీ తరచూ తగులుతుండటంతో ఈ ‘ఎపిథీలియమ్’పొర దెబ్బతినడానికి అవకాశాలెక్కువ. ఎపిథీలియమ్ దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, కన్ను ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.΄పొగతాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు కేవలం ఊపిరితిత్తుల మీదనో లేదా క్యాన్సర్ల రూపంలోనో మాత్రమే కాకుండా ఇలా కంటి మీద కూడా పడటమే కాదు... ఏకంగా చూపును దూరం చేసే అవకాశమూ ఉన్నందువల్ల ఆ దురలవాటును తక్షణం మానేయాలి. ఇవే కాకుండా గర్భవతుల్లో ఒకవేళ పోగతాగే అలవాటు ఉంటే కడుపులో ఉన్న చిన్నారికీ అనేక కంటి సమస్యలు రావచ్చు. ఉదాహరణకు కనుగుడ్లు నమ్మలేనంత చిన్నవిగా మారిపోయే ‘మైక్రో ఆఫ్తాల్మోస్’ అనే వ్యాధి, కళ్లు బాగా ఎర్రబారిపోవడమే కాకుండా కొందరిలో కనురెప్పలు బూడిద రంగులో కనిపించడం (గ్రేయిష్ అప్పియరెన్స్ ఆఫ్ ఐలిడ్స్) వంటి సమస్యలూ రావచ్చు. లక్షణాలు: కంటి సమస్య వచ్చినవారిలో కళ్లు ఎర్రబారడం, కళ్లవాపు, మంటలు, కనుగుడ్లు చిన్నగా మారడం, చూపు సరిగా కనిపించక΄ోవడంతో ΄పాటు నెగెటివ్‌ను చూస్తున్నట్లుగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏజింగ్ ప్రక్రియతో కంటి చుట్టూ ముడతలు : ΄పొగతాగడం వల్ల కంటి చుట్టూ నల్లగా మారడం, వయసుతోపాటు వచ్చే ముడతల్లాగా (ఏజింక్ స్కిన్ ఫోల్డ్స్) రావడం కూడా ఎక్కువ. క్రానిక్ స్మోకర్స్లో పెదవులు కూడా నల్లగా, బండగా మారిపోతాయి.చికిత్స : పొగతాగడం వల్ల వచ్చిన ఏ కంటి సమస్య అయినప్పటికీ, చూపులో ఏదైనా తేడా కనిపించిన వెంటనే కంటి వైద్యనిపుణులకు చూపించడం అవసరం. లేకపోతే అది అంధత్వానికి దారితీసే ప్రమాదమూ లేక΄ోలేదు. అందుకే డాక్టర్‌కు చూపిస్తే... వచ్చిన సమస్యను బట్టి కంటికి అవసరమైన వైద్యచికిత్స అందిస్తారు. కొందరికి అవసరాన్ని బట్టి కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ (అందునా మరీ ముఖ్యంగా బి1, బి2, బి12, బి6 వంటి విటమిన్లు) ఇస్తూ సమస్యను చక్కబరిచేందుకు ప్రయత్నిస్తారు.డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్యులు (చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు డాల్బీ విజన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో జర్మనీకి వెళ్లారని అన్నారు. అక్కడే సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారని నాగ్ వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న నాగార్జున సినిమా, థియేటర్ టెక్నాలజీపై మాట్లాడారు.మొట్ట మొదటిసారి ఈ సదుపాయాన్నిఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నామని నాగార్జున తెలిపారు. మనదేశంలో తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా.. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ-2024 ఈవెంట్ ఈనెల 28 వరకు కొనసాగనుంది. -
ప్రపంచంలోనే తొలి 'బయోనిక్ ఐ': అంధుల పాలిట వరం ఈ ఆవిష్కరణ!
సాంకేతికతో కూడిన వైద్య విధానం సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. బాధితులకు కొత్త ఆశను అందించేలా ఆధునిక వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే తాజాగా పరిశోధకులు 'బయోనిక్ ఐ'ని అభివృద్ధి చేశారు. జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్ అని పిలిచే ఈ ఆవిష్కరణ అంధత్వంతో బాధపడుతున్న లక్షలాదిమందికి కొత్త ఆశను అందిస్తోంది. అసలేంటీ ఆవిష్కరణ? ఎలా అంధులకు ఉపయోగపడుతుంది..?సాంకేతిక పుణ్యమా అని.. వైద్య విధానంలోని ప్రతి సమస్యకు పరిష్కారం క్షణాల్లో దొరుకుతుంది. ఆ దిశగానే చేసిన అధ్యయనంలో అంధత్వ చికిత్సకు సంబంధించిన కొంగొత్త ఆవిష్కరణకు నాంది పలికారు ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వారంతా ప్రపంచంలోనే తొలి బయోనిక్ కంటిని అభివృద్ధి చేశారు. దీన్ని 'జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్' అని పిలుస్తారు. అంధత్వంతో బాధపడుతున్న వారికి కంటి చూపుని ప్రసాదించేలా కొత్త ఆశను రేకెత్తిస్తుంది. సాంకేతికతో కూడిన ఈ అత్యాధునిక చికిత్స విధానం అంధత్వ చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. ఈ జెన్నారిస్ వ్యవస్థ అనేది వందేళ్లుగా చేస్తున్న పరిశోధనలకు నిలువెత్తు నిదర్శనం. నిజానికి పుట్టుకతో అంధత్వంతో బాధపడుతున్నవారికి కంటి చూపుని ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే..? మనం కళ్లతో నేరుగా చూడలేం. మన కంటిలోని ఆప్టిక్ నరాలు మెదడుతో కనెక్ట్ అయ్యి ఉంటేనే ఇది సాధ్యం. ఇంతవరకు మన వైద్య విధానంలో ఈ దిశగా చికిత్స అభివృద్ధి చెందలేదు. ఎన్నాళ్లుగానో అపరిషృతంగా ఉన్నా ఆ సమస్యకు పరిశోధకులు ఈ సరికొత్త ఆవిష్కరణతో పరిష్కరించారు. ఈ జెన్నారిస్ సిస్టమ్ ఆప్టిక్ నరాలకు బదులుగా నేరుగా మెదడుకి దృష్టి సంకేతాలను పంపుతుంది. ముందున్న చిత్రాన్ని గ్రహించేలా అనుమతిస్తుంది. అయితే దీన్ని జంతువులపై ట్రయల్స్ నిర్వహించి.. సత్ఫలితాలు వస్తే గనుక మానవులపై ట్రయల్స్‌ని విజయవంతంగా నిర్వహించేలా సన్నద్ధమవతామని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం గొర్రెలపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికత ప్రధాన భాగం మెదడు నమునాకు విద్యుత్ ప్రేరణ అందించేలా వైర్లెస్ ఇంప్లాట్‌ను కలిగి ఉంటుంది. ఇది మెదడు ఉపరితలానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది చిన్న పాటి విద్యుత్ పల్స్‌తో మెదడు కణాలను ఉత్తేజపరిచేలా వైర్‌లెస్‌గా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఇది కస్టమ్ డిజైన్ హెడ్కేర్ ధరించే సూక్ష్మ కెమెరాను పోలి ఉంటుంది. కెమెరా ద్వారా క్యాప్చర్ చేసిన హై రిజల్యుషన్ ఇమేజ్‌లు విజన్ ప్రాసెసర్ యూనిట్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత ఈ సంకేతాలు 11 పరికరాలకు వైర్‌లెస్‌గా ప్రసారమవుతాయి. ఇవి మెదడులో శస్త్రచికిత్స ద్వారా అమర్చిన టైల్స్ అనే పరికరానికి రిసీవ్ అవుతాయి. అవి విజువల్ కార్టెక్స్‌లోని న్యూరాన్లను ఉత్తేజపరిచి దృశ్యం కనిపించేలా చేస్తుంది. ఇది దాదాపు 100 డిగ్రీల వీక్షణ క్షేత్రాన్ని అందిస్తుంది. అంటే ఇది మానవ కన్ను పరిధితో పోలిస్తే కొంచెం తక్కువే అయిన్పటికీ.. గణనీయమైన సెన్సార్ సాంకేతికత గలిగిన ఈ పరికరం మంచి విజన్‌ని అందించడం విశేషం . (చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!) -
దిసీజ్ విజన్ - దటీజ్ జగన్..అందుకే జగన్ మళ్లీ రావాలి
-
జగన్ అంటే..ఒక చరిత్ర ఒక బ్రాండ్
-
విశాఖను ఎన్నిరకాలుగా అభివృద్ధి చెయ్యవచ్చు..?
-
Vizag : విశాఖ స్వప్నం సాకారం దిశగా జగన్ పాలన
ఇవాళ వైజాగ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం విన్న ఎవరికైనా మనసులో ఒకటి కచ్చితంగా అనిపించి ఉంటుంది. ఏంటీ.. సీఎం జగన్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.? ఇంత బలంగా మాట్లాడుతున్నారని మనసులో తప్పకుండా అనుకుని ఉంటారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీఎం జగన్‌లో ఉత్సాహం రెట్టింపవుతోంది. విశ్వాసం పెరిగిపోతుంది. దీనికి తన పాలనపై తనకు నమ్మకం ఉండటం వలన కావొచ్చు. ఒక పక్క టీడీపీ - జనసేన పొత్తులతో కుస్తీ పడుతుంటే.. వైఎస్ఆర్ సీపీ మాత్రం తన ప్రశాంతంగా చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ తాడే పల్లి ప్యాలస్.. తాడేపల్లి ప్యాలస్ అని కామెంట్ చేసినవారు.. ఇప్పుడు ఆ ప్యాలెస్‌లో ప్రశాంతంగా కూర్చొని ..సీఎం జగన్ ఆడే రాజకీయ చదరంగం చూసి వణికిపోవడమే కాదు బెంబేలెత్తుతున్నారు. "వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానన్నారు." ఈ పదాలు పలుకుతున్నప్పుడు సీఎం జగన్ ముఖంలో ఆత్మవిశ్వాసం చూశారా.. యస్ నేను సాధిస్తాననే నమ్మకంలో ఆయన ముఖంలో అణువణువునా కనిపించింది. ఈ రోజు విశాఖలో జగన్ ఇచ్చిన స్పీచ్ ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి భరోసానిచ్చింది. ఉత్తరాంధ్ర విజన్‌నే కాదు విశాఖ భవిష్యత్తును రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోట్ల మంది కళ్లకు కనబడేలా ప్రసంగించారు. భవిష్యత్తులో విశాఖ నగరం హైదరాబాద్, చెన్నైల కంటే ఎక్కువుగా అభివృద్ధి చెందుతుందన్నారు. తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు సీఎం జగన్. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామని చెప్పారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని.. భవిష్యత్తులో రూ.10 నుంచి 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని సీఎం జగన్ చెప్పారు. విశాఖ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకు 6 లైన్ల రహదారి విశాఖకు మణిమకుటం కానుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 70 శాతం వృద్ధి సాధించామని సీఎం జగన్ చెప్పారు. 58 నెలల వైఎస్ జగన్ పాలనలో ఆయన తీసుకొచ్చిన వ్యవసాయ రంగంలోని సంస్కరణలు ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాయి. RBKలు విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నాయి. భవిష్యత్తులో ఆర్బీకేలు లావాదేవీ కేంద్రాలుగానే కాకుండా ప్రయోగ కేంద్రాలుగా కూడా మారబోతున్నాయి. ఉత్పత్తి రంగంలో ఏపీ మెరుగ్గా దూసుకెళ్తుందని చెప్పారు సీఎం జగన్. మూలపేట, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం రేవులతో ఆంధ్రా తీరం రూపురేఖలు మారిపోతోంది. ఏపీలో తలసరి ఆదాయం తెలంగాణ కంటే ఎక్కువుగా పెరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తమ ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొచ్చిన పరిశ్రమలు వలన రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం తగ్గిందన్నారు సీఎం జగన్. డీబీటీ ద్వారా నేరుగా కోట్ల మందికి డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. నిజంగా ఇది దేశంలోనే అత్యద్భుతమైన ప్రయోగమని ఆర్ధిక నిపుణులు, సామాజిక వేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా నిరుద్యోగిత రేటు తగ్గడం కాకుండా యువత క్రైం వైపు, టెర్రరిజం, మావోయిజం వైపు మొగ్గు చూపకుండా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఉద్యోగాలు చేసుకుంటారు. ఈ వాతావరణం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. మెగా, భారీ పరిశ్రమల వలన కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వల్ల 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం జగన్ విశాఖ వేదికగా చెప్పారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలకు, వ్యాపార వేత్తలకు కనీస విలువ ఉండేది కాదు. చంద్రబాబు హయాంలో అవినీతి గురించి కొందరు విదేశీ వ్యాపారులు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారంటేనే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఇక.. భవిత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జాబ్ ఓరియంటెడ్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నామన్నారు. స్కూల్లో 3వ తరగతి నుంచే సబ్జక్ట్ టీచర్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు. 158 పారిశ్రామిక సంస్థలు వచ్చి విద్యార్ధులకు శిక్షణ ఇచ్చాయన్నారు. విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మాటలు భవిష్యత్ తరానికి ఆశాకిరణంగా కనిపించాయి. పిల్లలను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గ వనరులను కల్పిస్తున్నారు. మంచి ఇంగ్లిష్ ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చనేది సీఎం జగన్ అనుకుంటున్నారు. ఇది నిజం. చేతిలో విద్య అనే ఆయుధముంటే విశ్వాన్నిగెలవచ్చు. సీఎం జగన్ నాణ్యమైన విద్య గురించి, నాణ్యమైన మానవ వనరుల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో ముందు చూపు ఉన్న నాయకుడు మాత్రమే ఇలా మాట్లాడగలరు. సీఎం జగన్ ప్రసంగంలోని కాన్పెన్స్కు ప్రధాన కారణం.. నిజాయితీ, అవినీతిలేని పాలన. తాను చేయాలి అనుకున్నది చేసుకుంటూ పోవడం. ప్రజలకు మంచి చేస్తున్నానే సంతృప్తి. పారదర్శక పాలన. ఇవన్నీ ఆయనలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. - YV రెడ్డి -
‘విజన్ విశాఖ’ సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘విజన్ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్న కోల్పోయామని దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. అయితే వైజాగ్ నగరం అభివృద్ది చెందుతోందని.. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని.. అభివృద్దిలో విశాఖ నగరం దూసుకెళ్తోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఏపీలో నిరుద్యోగం తగ్గింది ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. డీబీటీ పద్దతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. సముద్రతీరంలో పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని.. ఉపాధి అవకాశాలు పెరిగాయని సీఎం జగన్ పేర్కొన్నారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణం చేస్తా వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు. విశాఖపై విషం కక్కుతున్నారు చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని.. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని సీఎం జగన్ తెలిపారు. స్వయం సహాయక బృందాల పెండింగ్ రుణాలను మాఫీ చేశామని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కొన్నిమీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని అన్నారు. ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని తెలిపారు. కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ది చెందదని అన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని సీఎం జగన్ అన్నారు. అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని.. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని సీఎం జగన్ తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాలా కల్పనకు లక్ష కోట్లు కావాలన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని.. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని చెప్పారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌లా మారుస్తామని సీఎం జగన్ తెలిపారు. -
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్‌తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
అమిత్ షా ఎన్నికల శంఖారావం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆది వారం ఖమ్మం జిల్లాలో పాల్గొనే బహిరంగ సభకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అధికార బీఆర్ఎస్ విషయంలో బీజేపీ అనుసరించబోయే కఠిన వైఖరి గురించి, వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్పై సాగించబోయే పోరాటం గురించి స్పష్టతనిస్తారని తెలుస్తోంది. బీజేపీ, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వడంతోపాటు ఇప్పటిదాకా లేనంత తీవ్రస్థాయిలో విమర్శలు సంధించడం ద్వారా అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారనే విశ్వాసాన్ని పార్టీనేతలు వ్యక్తంచేస్తున్నారు. కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్దతను బద్దలుకొట్టడంతోపాటు రాష్ట్ర నాయకత్వాన్ని, కేడర్‌ను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసి పార్టీని ఎన్నికల కదనరంగంలోకి దూకేలా చేస్తారని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ అప్రజాస్వామిక పోకడలు, నియంతృత్వ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగట్టడంతోపాటు అవినీతి, అక్రమాలపై చర్యలు తప్పవని అమిత్ షా స్పష్టం చేస్తారని అంచనావేస్తున్నారు. వారసత్వ రాజకీయాలు, మైనారిటీ సంతుష్టికరణ విధానాలు, అవినీతి, కుంభకోణాలకు ఊతమిచ్చేలా సాగుతున్న పరిణామాలపై గట్టిగా నిలదీస్తారని భావిస్తున్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారానే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జరుగుతుందనే సందేశాన్ని ప్రజలకు ఇస్తారని అంటున్నారు. బీఆర్ఎస్ వైఖరిపై స్పష్టత ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అమిత్‌షా ప్రసంగం ఎలా ఉండబోతున్నదన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఈ రెండింటి మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందంటూ సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా కేసీఆర్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు సంధిస్తారని చెబుతున్నారు. గత నెల 8న వరంగల్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ తర్వాత దాదాపు 50 రోజుల తర్వాత జరుగుతున్న ఈ సభ ద్వారా అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇదీ అమిత్ షా షెడ్యూల్ ఈనెల 27న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు గన్నవరంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుంటారు. భద్రాద్రి ఆలయంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లో భద్రాచలం నుంచి ఖమ్మంకు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ రాష్ట్రకోర్ కమిటీ, ముఖ్యనేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు. -
గెలుపు గుర్రాలపై ఫోకస్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడమే లక్ష్యంగా మార్గదర్శకాలను సిద్ధం చేయడంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు సోమవారం గాందీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీల సమక్షంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీఈసీ సభ్యులు బలరాం నాయక్, రోహిత్‌చౌదరి, మహేశ్‌కుమార్‌గౌడ్, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మన్సూర్ అలీఖాన్, వంశీచంద్‌రెడ్డి, శివసేనారెడ్డి, సంపత్‌కుమార్, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి, జానారెడ్డి, జీవన్‌రెడ్డి, అజారుద్దీన్, సీతక్క, సునీతారావు తదితరులు ఇందులో పాల్గొని చర్చించారు. 18 నుంచి దరఖాస్తులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించాలని పీఈసీ సమావేశం నిర్ణయించింది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు గాందీభవన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు.. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. ఇక దరఖాస్తు రుసుము కింద ఓసీల నుంచి రూ.10 వేలు, ఇతర వర్గాల నుంచి రూ.5వేలను డీడీ రూపంలో తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయపడినా.. ఓసీలకు రూ.50 వేలు, ఇతరులకు రూ.25 వేలుగా ఫీజును ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫీజు ఎంతన్నది సబ్‌కమిటీ ఖరారు చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ ముగిశాక సెప్టెంబర్ మొదటివారంలో మరోమారు సమావే శం కావాలని.. మూడో వారానికల్లా తొలి విడత జాబితా సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు. ఆశావహులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే.. పార్టీలో అనుభవం, గత నాలుగేళ్లలో చేసిన కార్యక్రమాలను వివరించాలని పేర్కొననున్నట్టు తెలిసింది. బీసీలకు ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో కనీ సం 2 అసెంబ్లీ సీట్లకు తగ్గకుండా కేటాయించాలనే అంశంపైనా చర్చించినట్టు సమాచారం. అనంతరం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ మూడో వారంలో తొలి జాబితా ప్రకటిస్తామని, అభ్యర్థుల ఖరారులో సామాజిక న్యాయాన్ని పాటిస్తామని చెప్పారు. అడిగిన అందరికీ టికెట్లివ్వడం కుదరదు: మహేశ్‌కుమార్‌గౌడ్ పీఈసీ సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని.. అయితే అందరికీ టికెట్లు ఇవ్వడం కుదరనందున సర్వేలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఒక్క సర్వేలు మాత్రమే ఆధారం కాదని, పీఈసీ అనేక అంశాల్లో వడపోత చేపట్టి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తుందని వివరించారు. ఆ జాబితాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుందని, తర్వాత సీడబ్ల్యూసీ ఆమోదం తీసుకుని టికెట్లను ప్రకటిస్తారని చెప్పారు. రేవంత్ వర్సెస్ పొన్నాల పీఈసీ సమావేశం అనంతరం ఏఐసీసీ గదిలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. వరంగల్ జిల్లా రాజకీయాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని తాను చాలా కాలం నుంచి కోరుతున్నా.. సమయం ఇవ్వడం లేదని, ఇష్టారాజ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులను నియమిస్తున్నారని పొన్నాల ప్రశ్నించినట్టు సమాచారం.దీంతో వరంగల్‌లో జరిగిన సమావేశానికి పొన్నాల వచ్చి మాట్లాడి ఉండాల్సిందని రేవంత్ పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై పొన్నాల ఆగ్రహంగా స్పందిస్తూ.. ఎవరు పిలిచారని వరంగల్ మీటింగ్‌కు రావాలని నిలదీశారని, బీజేపీలోకి వెళ్లాలని చూసిన నాయకులను తీసుకొచ్చి అందలం ఎక్కించారని మండిపడినట్టు సమాచారం. పార్టీలో 45 ఏళ్లుగా పనిచేస్తున్న తమ లాంటి నేతలకు కనీస మర్యాద ఇవ్వకుండా వ్యవహరిస్తే ఎలాగని నిలదీసినట్టు తెలిసింది. ఈ సమయంలో అన్ని విషయాలు తర్వాత మాట్లాడుదామంటూ మాణిక్‌రావ్ ఠాక్రే సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. తానేమీ అబద్ధం చెప్పడం లేదని, పీసీసీ అధ్యక్షుడి ముందే అన్నీ ప్రస్తావిస్తు న్నానని పొన్నాల గట్టిగా మాట్లాడినట్టు సమాచారం. -
ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!
పెల్లెట్ గన్‌లో నుంచి పెల్లెట్స్ గంటకి 1100 కి.మీ వేగంతో ఇన్షా రెండు కళ్లలోకి దూసుకెళ్లాయి. అప్పుడా అమ్మాయి 9 చదువుతోంది. 2016లో కశ్మీర్లో గుంపును అదుపు చేయడానికివాడిన పెల్లెట్ గన్స్ అమాయకులకు కూడా శాపంగా మారాయి. ఇన్షా ఓడిపోలేదు. నిరాశ పడలేదు. అంచెలంచెలుగా శ్రమ చేసి చదువుకుంది.మొన్న సీనియర్ ఇంటర్ పరీక్షలలో 500కి 315 మార్కులు సాధించింది. ‘నేను ఐ.ఏ.ఎస్ అవుతాను. అంధులకు ఆత్మవిశ్వాసం ఇస్తాను’ అంటోంది. అంధులేంటి.. ఓటమి భయంతో ఉన్నవారందరూ ఆత్మవిశ్వాసం పొందగలరు ఇన్షాను చూస్తే. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ ప్రాంతంలో సెదౌ అనే చిన్న పల్లె. వేసవి కాలం. అల్లర్లు చెలరేగాయి. భద్రతా దళాలు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో మొదటి అంతస్తు కిటికీలో నుంచి ఏం జరుగుతున్నదో చూద్దామని 16 ఏళ్ల ఇన్షా ముష్టాక్ కిటికీ తెరిచింది. ఆ తర్వాత ఏమైంది అర్థం కాలేదు. క్షణపాటులో ఆమె రెండు కళ్ల నుంచి రక్తం దౌడు తీసింది. విపరీతమైన నొప్పితో ఇన్సా ఆర్తనాదాలు చేసింది. 2016, 2017... రెండు సంవత్సరాల పాటు భద్రతాదళాలు కశ్మీర్లో ప్రయోగించిన పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా అంధులైన వారు 139 మంది. వారిలో ఇన్షా ఒకమ్మాయి. విఫలమైన డాక్టర్లు పెల్లెట్లు కళ్లల్లోకి దూసుకెళ్లగానే ఇన్షా చూపు పోయింది. కాని మానవీయ సంస్థలు, ప్రభుత్వం కూడా ఇన్షా చికిత్స కోసం ముందుకు వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో డాక్టర్లు కూడా ప్రయత్నించి ఆమెకు ఎప్పటికీ చూపు రాదని తేల్చారు. పెల్లెట్లు జీవితాంతం శరీరంలో ఉండిపోతాయి. అవి చాలా ప్రమాదం. ‘అయితే అంతకన్నా ప్రమాదం నిరాశలో కూరుకుపోవడం అని నాకు తెలుసు. నేను చదువుకోవాలనుకున్నాను. నా కంటే ముందు మా అమ్మ అఫ్రోజా, డ్రైవర్‌గా జీవితం గడిపే మా నాన్న ముష్టాక్ అహ్మద్ లోన్ నేను చదువుకోవాలని భావించారు. మరో రెండేళ్ల తర్వాత ఒక లేఖకుని సహాయంతో నేను టెన్త్ పాసయ్యాను’ అని తెలిపింది ఇన్హా. బ్రెయిలీ నేర్చుకుని... అయితే ఇంటర్ మాత్రం బ్రెయిలీ నేర్చుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని నిశ్చయించుకుంది ఇన్షా. ఇందుకోసం శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యింది. ఇంటర్‌తో పాటు కంప్యూటర్ కోర్సు, ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. బ్రెయిలీ ద్వారా పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాయడం చాలా కష్టమయ్యేది. అయినా సరే ఇన్షా ఆగలేదు. 2011లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఇంటర్ ఏ గ్రేడ్‌లో పాసయ్యింది. ‘చదువు ఒక్కటే నాకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇవ్వగలదు. అది నాకు తెలుసు. ఐ.ఏ.ఏస్ చేయాలనుకుంటున్నాను. అంధులకు మన దేశంలో తగినన్ని ప్రత్యేకమైన స్కూల్స్ లేవు. ఆ విషయంలో నేను కృషి చేస్తాను’ అని తెలిపింది ఇన్షా. సానుభూతి ఇష్టపడదు ఇంటర్ పాసయ్యిందని తెలిశాక ఆమె తల్లిదండ్రులు ఉద్వేగంతో కన్నీరు కార్చారు. తండ్రి, తల్లి తమ కూతురి పట్టుదలకు గర్వపడ్డారు. ఇన్షా కూడా తన విజయంతో సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ మినిస్ట్రీ అధికారులు ఆమెను మెచ్చుకున్నారు. మంచి కాలేజ్‌లో చదువు కొనసాగడానికి హామీలు దొరికాయి. ఉత్సాహపరిచే వాళ్లను తప్ప సానుభూతి చూపించేవాళ్లను ఇన్షా ఇష్టపడదు. ‘నేను అందరితో సమానంగా జీవించగలను. నాకు సానుభూతి చూపకండి. వీలైతే నా ప్రయాణంలో తోడు నిలవండి’ అంటోందామె. (చదవండి: ప్రాణం నిలిపే రక్తపు బొట్టు ) -
CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. ఆయనను ఎప్పుడు కలిసినా నేను విశాఖకు అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వస్తుందని అడుగుతుండేవాడిని. ఆయన దానికి ఇప్పుడు సమాధానం ఇచ్చారు. ఇంత భారీ ఎత్తున డేటా సెంటర్ రావడం అంటే విశాఖనగరం ముఖ చిత్రాన్ని మార్చడమే. దీనికి తోడు భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కూడా గొప్ప విషయం. ఈ రెండిటికి ఒక రకంగా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే.. అదానీ డేటా సెంటర్ లోనే మరో ఐదేళ్లలో 39 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేశారు. స్కిల్ యూనివర్శిటీ, రిక్రియేషన్ పార్క్, ఐటి పార్కు, విమానాశ్రయంలో కార్గో సెంటర్, ఎయిరోసిటీ మొదలైన వాటి ద్వారా మరిన్ని వేల మందికి అవకాశాలు రాబోతున్నాయి. వీరితో పాటే సర్వీస్ రంగం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే సమయంలో సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని కూడా జగన్ ప్రకటించారు. అంటే విశాఖ సిగలో ఈ పరిపాలన రాజధాని మరో ఆభరణం అవుతుంది. ఈ రకంగా తెలంగాణ రాజదాని హైదరాబాద్ కు విశాఖ అతి త్వరలోనే పెద్ద పోటీ కాబోతోంది. ఐటీ రంగంలో విశాఖ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంది. వైజాగ్ ఇప్పటికే మల్టీకల్చరల్ నగరంగా ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎప్పటినుంచో ఇక్కడ నివసిస్తున్నారు. ఏపీకి సంబంధించి కూడా పలు ప్రాంతాల ప్రజలు స్థిరపడ్డారు. ఈ దశలో ఈ అభివృద్ది అంతా జరిగితే విశాఖకే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల పంట పడుతుంది. 👉 ముఖ్యమంత్రి జగన్ అన్నట్లు ఈ ప్రాంతం నుంచి వలసలు కూడా బాగా తగ్గిపోతాయి. విశాఖకు సహజమైన కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఒక వైపు సముద్ర తీరం, మరో వైపు విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రాంతంలో నగరం విస్తరణకు ఎనలేని అవకాశం ఉండడం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంద్ర ప్రాంతాన్ని, ఈ కొత్త ప్రాజెక్టులకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అదానీ డేటా సెంటర్‌ను తీసుకు రావడానికి ఆయన విశేష కృషి చేశారు. రాజకీయంగా తన పలుకుబడిని సైలెంట్ గా ఉపయోగించారు. వారికి అవసరమైన భూమిని కేటాయించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. 👉 తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా ఆదాని డేటా సెంటర్ పై ఎంత విష ప్రచారం చేసినా, తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లారు సీఎం జగన్. దీనిని రాకుండా చేయడానికి జరిపిన ప్రయత్నాలు విఫలం అవడంతో తెలుగుదేశం మీడియా కొత్త రాగం అందుకుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో శంకుస్థాపన చేసిందని ప్రచారం ఆరంభించారు. అప్పుడు అదానీ గొప్పవాడయ్యాడు. అదే జగన్ టైమ్ లో అదానీ ముందుకు వస్తే ఎంత నీచ ప్రచారం చేశారో గమనిస్తే ఈ మీడియాలపై చీదర వేస్తుంది. 👉 నిజానికి గత ఎన్నికలకు ఒకటి, రెండు నెలల ముందు హడావుడిగా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. చంద్రబాబుకు ఇలా చేయడం కొత్తకాదు. అది వేరే విషయం. భోగాపురం ఎయిర్ పోర్టు, కడప స్టీల్ వంటివాటిని కూడా అలాగే చేశారు. కాని వాటన్నింటిని ఉత్తిత్తి వ్యవహారంగానే మిగిల్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక భోగాపురం ఎయిర్ పోర్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లు చేశారు. పర్యావరణ తదితర కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతులను సాధించారు. ఇవన్ని పూర్తి అయిన తర్వాతే జగన్ శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. 👉 అంతేకాక ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న గ్రంధి మల్లిఖార్జున రావు ఈ జిల్లాకే చెందినవారు కావడం అదనంగా కలిసి వచ్చే విషయం. ఆయన కూడా చాలా సంతోషంగా కనిపించారు. ముఖ్యమంత్రి కోరినట్లు ఆరు నెలల నుంచి ఏడాది ముందుగా ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడ జరిగిన సభలో జగన్ మాట్లాడిన తీరు ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా మరోసారి తెలియచేస్తుంది. 2026లో తానే వచ్చి మళ్లీ ఎయిర్ పోర్టును ప్రారంబిస్తానని ఆయన ప్రకటించారు. అంటే దాని అర్దం 2024 ఎన్నికలలో తిరిగి వైసిపి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారన్నమాట. 👉 యధాప్రకారం ఆయన తాను మంచి చేశానని అనుకుంటే ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ రకంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చెప్పడానికి సాహసించలేదు. అది ఒక్క జగన్ వల్లే అయింది. ఇక్కడ మరో సంగతి చూడాలి.. ఆదానీ డేటా సెంటర్ కాని, ఇతరత్రా స్కిల్ యూనివర్శిటీ వంటి ఆయా అభివృద్ది కార్యక్రమాలను విశాఖలో చేపట్టడం వల్ల అవి వేగంగా పూర్తి అయ్యే అవకాశం వస్తుంది. అదే అమరావతి గ్రామాలలో ఏర్పాటు చేయవలసి వస్తే ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. విశాఖలో చాలా వరకు ప్రాధమిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతి గ్రామాలలో సరైన రోడ్లు కూడా లేవు. కొత్తగా పరిశ్రమలు, ఇతర సంస్థలు రావాలంటే ఔత్సాహికులు వెనుకంజ వేసే అవకాశం ఉంది. 👉 అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చి ఎకరా భూమి ని నాలుగు కోట్ల వరకు తీసుకువెళ్లారు. దీనివల్ల కొత్తగా ఎవరైనా సంస్థలు పెట్టాలంటే చాలా వ్యయం చేయవలసి వస్తుంది. వారికి గిట్టుబాటు కాని పరిస్థితి ఎదురు అవుతుంది. గత ప్రభుత్వం ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ప్రభుత్వ భూములు లేవు. అటవీ భూములు ఉన్నా వాటిని వాడుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావల్సి ఉంటుంది. వీటిని గుర్తించకుండా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా ముందుకు వెళ్లారు. పోనీ ఏవైనా నిర్మాణాలు చేశారా అంటే అంతా తాత్కాలికం అన్నారు. తద్వారా వందల కోట్ల రూపాయల నిదులను దుర్వినయోగం చేయడానికి సిద్దమయ్యారు. 👉 ఈ నేపధ్యంలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విశాఖకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు. హైదరాబాద్ మాదిరి వేగంగా అభివృద్ది చెందడానికి, ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారడానికి విశాఖకు ఉన్న అవకాశాలను ఆయన అంచనావేశారు. ఇప్పటికే విశాఖ ఈ విషయంలో కొంతమేర ఉపయోగపడుతోంది. పరిపాలన రాజధాని అవడం, డేటా సెంటర్, కొత్త ఎయిర్ పోర్టు మొదలైనవన్ని వస్తే హైదరాబాద్ కు గట్టి పోటీ ఇచ్చే నగరంగా విశాఖ తయారవుతుంది. కానీ.. 👉 దీనిని అడ్డుకోవడానికి టిడిపి నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు విపరీతమైన కృషి చేశాయి. విష ప్రచారంతో ప్రజలలో వ్యతిరేక భావాలు నాటడానికి యత్నించాయి. అయినా జగన్ వారిని ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లారు కాబట్టి ఇప్పుడు అవి వాస్తవరూపం దాల్చి విశాఖ రూపురేఖలను మార్చబోతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పలు ప్రాజెక్టుల విషయంలోను టీడీపీ వర్గాలు ఇలాగే నిత్యం దుష్ప్రచారం చేసినా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా వ్యవహరించి ప్రజల నుంచి అభినందనలు అందుకున్నారు. అలాగే జగన్ కూడా ఎంతో పట్టుదలతో విశాఖ అభివృద్దిని కార్యరూపంలోకి తెచ్చి శెబాష్ అనిపించుకుంటున్నారు. ఎంతైనా రాజశేఖరరెడ్డి కుమారుడు కదా. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ ఇదీ చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలియదుగానీ.. -
బాబుకు విజనూ లేదు.. విస్తరాకుల కట్టా లేదు: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: ఎన్నికలకు ఇంకో ఏడాది ఉన్న తరుణంలో చంద్రబాబు రోజుకో వేషం పూటకో మాట మాట్లాడుకుంటూ మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమం చేపట్టారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రాంతాలలో చిచ్చు పెట్టి, తన మాయలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తానేదో సత్యహరిశ్చంద్రుడిలా, నీతి మంతుడిలా, ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్న గురువులా బిల్డప్‌లు ఇవ్వడం బాబు ప్రారంభించాడని, కొన్ని ఎల్లో పత్రికలు అయితే చంద్రబాబు ప్రవచనాలతో పేజీలకు పేజీలు నింపాయని ఫైర్ అయ్యారు. 'పేదరిక నిర్మూలనకు.. ఈ వృద్ధ నాయకుడికి కొత్త విజన్ అట.. అసలు పేదల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినవాడు.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినవాడు, 28 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నవాడు, ఇప్పుడు కొత్తగా పేదరిక నిర్మూలన అని అంటున్నాడు. పేదలకు ఏం చేశావు అంటే.. తన మార్కు ఉన్న ఒక్క పథకం పేరు చెప్పలేడు. పేదరిక నిర్మూలన గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఎక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ ప్రారంభింంచిన 2047 విజన్ కు తాను మద్దతు ఇచ్చానని చెబుతున్నాడు.' అని కన్నబాబు ఏకిపారేశారు. మోదీ కనికరం కోసం మోకరిల్లిన బాబు 'రిపబ్లిక్ టీవీకి చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే.. మోదీ కోసం తాను రెడీగా ఉన్నానని, ఆయన కరుణ కోసం ఎదురు చూస్తున్నాడన్నది.. రాజకీయాల్లో ఏ కొంచెం అవగాహన ఉన్నవారైనా ఇట్టే చెబుతారు. గతంలో మీరు ఎన్డీఏ యేతర పార్టీలతో కూటమి కట్టారు కదా.. అని ఇంటర్వ్యూలో అడిగితే.. అప్పుడు కూడా మోదీని వ్యతిరేకించలేదు. ఆయన విజన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన కోసం నేను, నా ప్రజలు కలిసి పనిచేస్తాం.. అని చెప్పే పరిస్థితికి బాబు వచ్చాడు.' అని కన్నబాబు ఎద్దేవా చేశారు. కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడమే బాబు విజన్ 'అనుభవం ఉందని 2014లో అధికారం అప్పగిస్తే.. ఒక్క పర్మినెంటు బిల్డింగు కట్టలేని వాడు, శివ రామకృష్ణన్ కమిటీ వద్దన్న చోటే రాజధానిని ప్రకటించి.. ఏమీ చేయలేని వాడు చంద్రబాబు. చంద్రబాబుకు విజన్ లేదు.. విస్తరాకుల కట్టా లేదు. బాబుకు భజన చేసే నారాయణ లాంటి వారు, కొన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. చంద్రబాబుకు ఉన్న విజన్ ఒక్కటే.. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలి. తన చుట్టూ ఉన్న వందిమాగధులకు దోచి పెట్టాలి. తన కొడుక్కు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి. ఇంతకంటే వేరే విజన్ బాబుకు ఉందా..?' అని మాజీ మంత్రి ప్రశ్నించారు. చదవండి: టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష -
దేవుడా ఎంత ఘోరం! మిన్నంటిన ఆర్తనాదాలు
అర్ధరాత్రి, డ్రైవర్ తప్ప అందరూ గాఢనిద్రలో ఉన్నారు. మరో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంట్లో ఉంటారు. కానీ విధి మరోలా తలచింది. పాల ట్యాంకర్ రాంగ్ రూట్లో మృత్యు శకటంలా వచ్చింది. యాత్రికుల టెంపో ట్రావెలర్ గమనించేలోపే ఢీ కొట్టారు. ఈ ఘోర ప్రమాదంలో పిల్లలు, మహిళలతో సహా 9 మంది దుర్మరణం చెందారు. దేవుని దర్శనానికి వెళ్లి వస్తుంటే ఎంత దారుణం జరిగింది దేవుడా అని మృతుల బంధువులు విలపించారు. బనశంకరి: టెంపో ట్రావెలర్‌కు ముందు పాల ట్యాంకర్, వెనుక నుంచి కేఎస్ఆర్టీసీ బస్ తాకిడితో భీకర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపోలోని నలుగురు పిల్లలతో పాటు 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా అరసికెరె తాలూకా బాణావర పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. ధర్మస్థల, హాసనాంబ దర్శనం చేసుకుని వివరాలు.. అరసికెరె తాలూకా బాణవార హొబళి హళ్లికెరె గ్రామానికి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది టెంపో ట్రావెలర్ వాహనంలో శనివారం ధర్మస్థల క్షేత్రానికి వెళ్లారు. మంజునాథ స్వామికి దర్శించుకుని తరువాత సాయంత్రం హాసన్‌కు బయలుదేరారు. హాసనాంబ మాతను దర్శించుకుని చేసుకుని హళ్లికెరె గ్రామానికి తిరుగుముఖం పట్టారు. మరో 10 నిమిషాల్లో క్షేమంగా సొంతూరికి చేరుకునేవారు. రాంగ్ రూట్లో పాల ట్యాంకర్ అరసికెరె–శివమొగ్గ హైవే – 69 బాణావర వద్ద వెళుతుండగా శివమొగ్గ నుంచి చెన్నరాయపట్టణ వైపునకు వస్తున్న పాల ట్యాంకర్ డ్రైవరుకు మలుపు తెలియకపోవడంతో టెంపోకి ఎదురుగా వెళ్లాడు. ఈ సమయంలో వేగంగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనం, పాల ట్యాంకర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఆ సమయంలో వెనుక వస్తున్న బెంగళూరు–శివమొగ్గ కేఎస్ ఆర్టీసీ బస్సు టెంపోను ఢీకొట్టింది. రెండు వైపులా ప్రమాదంతో టెంపోలోని యాత్రికులు విలవిలలాడారు. మృతులు వీరే..: తీవ్ర గాయాలతో లీలావతి (50), చైత్ర (33), సమర్థ (10), డింపి (12), తన్మయ్ (10), ధృవ (2), వందన (20), దొడ్డయ్య (60), భారతి (50) అనే 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టెంపో, బస్సులోని మరో 12 మందికి తీవ్రగాయాలు కావడంతో 10 మందిని హాసన్ జిల్లాసుపత్రికి, ఇద్దరిని అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. టెంపో నుజ్జునుజ్జుకావడంతో క్రేన్ సాయంతో వాహనాన్ని తొలగించారు. గాయపడిన వారిలో కేఎస్ఆర్టీసీ బస్ డ్రైవరుతో పాటు ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్యాంకర్ డ్రైవర్ అరెస్టు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే బాణవార పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాసన జిల్లాఆసుపత్రికి, అరసికెరె తాలూకా ఆసుపత్రికి తరలించారు. మతదేహాలకు శవపరీక్షల నిమిత్తం హాసన్ జిల్లాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. పాలట్యాంకర్ డ్రైవరును అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. హైవే అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదం విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారి అధికారులు మరమ్మతులు జరుగుతుండగా సక్రమంగా సూచిక బోర్డులు అమర్చకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని మండిపడ్డారు. రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునే వారు విగతజీవులయ్యారని తెలిపారు. రూ.2 లక్షల చొప్పున పరిహారం మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు పరిహారం అందిస్తామని సీఎం బొమ్మై ప్రకటించారు. ఈ సంఘటన దురదష్టకరమని సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విపక్ష నేతలు సిద్దరామయ్య, కుమారస్వామిలు కూడా సంతాపం తెలిపారు. మిన్నంటిన ఆర్తనాదాలు దేవునికి కళ్లు లేవు. దేవుని శాపమో, గ్రహచారమో అని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు విలపించారు. ఈ ప్రమాదంలో హళ్లికెరెలో పెద్ద కుటుంబానికి చెందిన 9 మంది మృత్యవాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. ప్రమాద స్థలంలో విలేకరులతో మాట్లాడిన మృతుల బంధువు రవికుమార్.. అందరూ శుక్రవారం ఇంటి వద్ద పెద్దల పూజ చేసుకుని శనివారం ఉదయం ధర్మస్థలకు వెళ్లారు. తరువాత హాసనాంబను దర్శించుకుని తిరుగుప్రయాణంలో వస్తూ మరణించారని విలపించాడు. ఏ దేవునికి కళ్లు లేవు సార్. మేమంతా ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబం«దీకులు. నా తమ్ముడు రెండేళ్ల కిందట కోవిడ్‌తో చనిపోయాడు. ఈ రోజు ప్రమాదంలో అతని ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని రోదిస్తూ చెప్పాడు. (చదవండి: విజయపురలో పరువు హత్య?) -
అన్నీ కొరతలే.. అద్భుతం: కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ పాలన వల్ల కొరత కొనసాగుతోందంటూ సోమవారం ఉదయం కేటీఆర్ ఓ ట్వీట్ వేశారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత, ఈ అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీకి విజన్ కొరత అంటూ ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. అంతేకాదు ఈ పాలన అద్భుతమంటూ వెటకారం ప్రదర్శించారు. ప్రధాని మోదీకి విజన్ లేకపోవడం వల్లే దేశానికి ఈ పరిస్థితి దాపురించిందన్న అర్థంతో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. సమకాలీన అంశాలను.. అది టైమింగ్‌లో అస్త్రాలుగా చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తుండడం విశేషం. బీజేపీ పాలనలో *బొగ్గు కొరత* కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత* పరిశ్రమలకు *కరెంట్ కొరత* యువతకు *ఉద్యోగాల కొరత* గ్రామాల్లో *ఉపాధి కొరత* రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత* అన్ని సమస్యలకు మూలం PM *మోడీకి విజన్ కొరత* NPA Govt’s amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF — KTR (@KTRTRS) May 2, 2022 చదవండి: చెప్పేది గాంధీ సూక్తులు.. కొలిచేది గాడ్సేను -
మంచి మాట: సమదృష్టి అంటే..?
మానవ జన్మను ఎత్తిన ప్రతి వాడూ సమదృష్టిని అలవరచుకోవాలని మన సనాతన ధర్మం చెబుతోంది. దీనినే సమదర్శనం అని కూడా అంటూ ఉంటాం. సమాజంలో ఎవ్వరికీ ఇబ్బంది కల్గించకుండా, ఎవ్వరినీ హీనంగా చూడకుండా అందరం ఒక్కటేనని, అందరిలోనూ ఆ భగవంతుడు అంతర్యామిగా ఉంటాడనే నిజాన్ని తెలుసుకోగలిగితే మనం సమదృష్టిని అలవరచుకోగలం. అయితే స్వార్ధం మనిషిని సమదృష్టిలో ఉంచకుండా చేస్తోంది. సాధారణంగా స్వసుఖం, స్వాతిశయం అనేవి మనిషిలో స్వార్ధాన్ని ప్రోది చేస్తూ ఉంటాయి. తానొక్కడే సుఖంగా ఉండాలనుకోవడం స్వసుఖం. అలాగే తానొక్కడే అందరికన్నా ఆధిక్యంలో ఉండాలనుకోవడం స్వాతిశయం. నిజానికి స్వార్ధంతో వచ్చే ఈ రెండు గుణాల వల్లనే మనిషి ఎన్నో అనర్ధాలకు, అక్రమాలకు పాల్పడుతుంటాడు. మంచీ, చెడు విచక్షణ మరచి అకృత్యాలు చేసుకుంటూ పోతాడు. సాధారణంగా సుఖంగా ఉండాలనుకోవడం, ఉన్నతస్థితికి చేరుకోవాలనుకోవడం తప్పేమి కాదు. కానీ తన సుఖం కోసం, తన ఉన్నతికోసం స్వార్ధంతో ఇతరులకు ఇబ్బంది కల్గించడం అధర్మమవుతుంది. తనకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు తాను ఇతరులకు ఇబ్బందులు కల్గించినట్లుగానే, తన పరిస్థితులు అనుకూలంగా లేనపుడు ఇతరులు కూడా తనకు ఇబ్బందులు కల్గించే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆ భావన కల్గినపుడు సహజంగానే మనం ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండగలం. అదేవిధంగా సంకుచిత స్వభావం కూడా సమదృష్టి లేకుండా చేస్తుంది. సంకుచిత భావనల వలన ఇతడు మనవాడు, అతడు పరాయి వాడు అనే భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అలాంటి భేదాభిప్రాయాలు ఎన్నో అనర్ధాలకు కారణభూతమౌతాయి. కనుక సంకుచిత భావం లేకుండా ఉదారంగా ఉండగలిగే మానసిక పరిపక్వతను ప్రతి మనిషీ అలవరచుకోవాలి. తనకు అన్నీ ఉన్నా ఎదుటివారికి లేకపోతే ఎద్దేవా చేయడం కానీ, ఎగతాళి చేయడం కానీ కూడదు. ఈరోజున ఏమీ లేకపోవచ్చు. కానీ రేప్పొద్దున వారిని భగవంతుడు కరుణించవచ్చు. వారి కుబేరులు కావచ్చు. లేదా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. ఇలా ఏదైనా జరగవచ్చు. జరగడం అనేది మనచేతుల్లో ఏదీలేదు. కనుక ఎవరినీ ఎందుకూ నొప్పించకూడదు. మనుషుల్లో స్వభావరీత్యా ఒక మనిషికీ, మరో మనిషికి మధ్య తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ప్రధాన కారణం మనిషి తనను తాను అర్థం చేసుకోలేకపోవడమే. ఆలోచనల్లో సరళీకృతం లేకపోవడం, ఆలోచనల్లో తానే అధికుడినని భావించడం, అన్నీ తనకే తెలుసనుకోవడం, ఎదుటివారి మాట తానెందుకు వినాలనుకోవడం లాంటి వన్నీ మనిషి స్వభావాన్ని మార్చివేస్తాయి. అనుకొన్నది జరగకపోతే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం మనిషి స్వభావాన్ని మార్చివేస్తుంది. దానితో అనుకొన్నది కాక మరొకటి ఎదురవుతుంది. అందుకే చుట్టూ సమస్యలు చుట్టుముట్టినా, ఎందరు కావాలని కష్టనష్టాలు కలిగిస్తున్నా, పనిగట్టుకొని హేళన చేస్తున్నా, పుట్టెడు దుఃఖం ఉబికి వస్తున్నా బాధపడడం మానేసి వాటికి దూరంగా వెళ్లిపోయి తమ పని తాము చేసుకోవడం ఉత్తమం. ఎదుటివారు ఏం చేసినా సరే తాను మాత్రం ఎవరికీ అపకారం చేయకుండా ఉండడమే సమదృష్టి. ఒకరికి మేలు చేయగలిగే స్థితిలో, ఒకరికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా జీవితాన్ని మలుచుకోగలిగిన నాడే సమదృష్టి ప్రస్ఫుటమవుతుంది. అందుకే మన స్వార్థాన్ని అదుపులో పెట్టడానికి, మన మాటలను, చేతలను క్రమబద్ధీకరించడానికి, మన వలన తోటివారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మన సనాతన ధర్మం ఎన్నో నియమాలను ఏర్పరచింది. మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు మానవ ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం ఏదని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. దానికి ధర్మరాజు సమాధానం చెబుతూ, ఇతరులు ఏం చేస్తే మనకు కష్టం కలుగుతుందో, దానిని మనం చేయకుండా ఉండడమే ఉత్తమ ధర్మమని చెబుతాడు. సమస్త ప్రాణుల యందు సమ భావం కలిగినవారు, ఇష్టాయిష్టాలకు, సుఖ–దుఃఖాలకు, సంతోష–బాధలకు అతీతంగా ఉండేవారు నిరంతరం జనన మరణ సంసారాన్ని దాటుతారని, వారే భగవంతుని రూపాలని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకు, సమదృష్టిని సాధించడం దుర్లభం అవుతుంది. శారీరక ఆహ్లాదం, కోరికలు, ద్వేషాలు నిత్యం అనుభవంలోకి వచ్చినంత కాలం సమదృష్టిని ప్రదర్శించడం దుస్సాధ్యం. ఎవరైతే మనస్సును ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంచుకుంటారో, శారీరక సుఖ–దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతులై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటారో, స్వార్థాన్ని, క్రోధాన్ని, ఐహిక సుఖాలను, ఆర్భాటాలను త్యజించి తమ మనస్సును భగవంతుని యందే లగ్నం చేస్తారో అలాంటి వారు ఈశ్వరునితో సమానంగా మన వేదాలు చెబుతున్నాయి. ఎవరైనా మనకు ఇబ్బంది కలిగించినా, మనపట్ల అమర్యాదగా ప్రవర్తించినా, మనతో పరుషంగా మాట్లాడినా, మనలను కించపరిచినా సహజంగానే మనకు బాధ కలుగుతుంది. అందుకే అలాంటి పనులను మనం ఇతరుల పట్ల చేయకుండా ఉండాలి. అదే సమదృష్టి. –దాసరి దుర్గాప్రసాద్ -
ఈ డజన్ కొత్త విజన్
మిలిటరీ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె హజ్ యాత్రికులకు సూచనలు ఇస్తుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఓపికగా తీరుస్తుంది. నడవడానికి ఇబ్బంది పడుతున్నవారికి సహాయపడుతుంది. సైనిక దుస్తుల్లో కనిపించే గంభీరత్వం మాట ఎలా ఉన్నా, ఆమె మాత్రం పక్కింటి ఆత్మీయనేస్తం లానే కనిపిస్తుంది. పవిత్ర మక్కా, మదీనాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సైనికుల చిత్రాలు ఒక చారిత్రక మార్పుకు సూచనగా నిలిచాయి. ఎందుకీ మార్పు? సౌదీ యువరాజు మహ్మద్‌బిన్ సల్మాన్ (ఎంబీఎస్) విజన్ 2030 ప్రణాళిక రూపొందించాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. అది జరగాలంటే ప్రధాన స్రవంతికి దగ్గరవ్వాలి. ఇందులో భాగంగా సంప్రదాయ విధానం నుంచి కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సౌదీ ప్రభుత్వం. మహిళలు సైన్యంలో చురుకైన పాత్ర నిర్వహించడమనేది ఈ మార్పుకు సంకేతంలా నిలుస్తుంది. సైన్యంలో పనిచేయాలనేది మోనా చిన్నప్పటి కల. అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో అది కలకే పరిమితమనే కఠిన వాస్తవం తెలిసింది. ఆ కఠిన వాస్తవం కరిగిపోయి మోనా సైన్యంలో చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘నాన్నలాగే సైన్యంలో పనిచేయాలనిది నా కోరిక. అది నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. పవిత్రభూమిలో విధులు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది మోనా. మక్కా, మదీనాలలో సైనిక విధులు నిర్వహిస్తున్న పన్నెండు మంది మహిళలలో మోనా ఒకరు. కాబా సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమర్ సైకాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘సైన్యంలో పనిచేయాలనుకుంటున్నాను’ అని తన మనసులో మాటను ఒకరోజు కుటుంబసభ్యులకు చెప్పింది. వారు సంతోషించారు. ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మానసిక దృక్కోణంలో వచ్చిన కీలక మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. ‘ఇదొక ఉద్యోగం అనుకోవడం లేదు. పవిత్ర బాధ్యతగా భావిస్తున్నాను’ అంటుంది సమర్. 2019లోనే సైన్యంలోకి మహిళలు రావడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సోల్జర్ నుంచి సార్జెంట్ వరకు వివిధ హోదాల్లో మహిళలు పనిచేడానికి దారి పడింది. ‘మహిళలను సైన్యంలోకి తీసుకోవాలా? వద్దా? అనేది గత 30 సంవత్సరాలుగా రగులుతున్న వివాదస్పద అంశం. ఏది ఏమైనా సైన్యంలోకి మహిళల రాక అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం’ అంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్ హలహ్. ఇక షాపింగ్ మాల్స్‌లో మహిళలు క్యాషియర్లుగా కనిపించడం సాధారణ దృశమైంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్‌లో పబ్లిక్ నోటరీలుగా వందమంది మహిళలను నియమించారు. త్వరలో మహిళా జడ్జీల నియామకానికి సన్నాహాలు చేస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే వివిధ రంగాలలో మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. మహిళలపై పరిమితులు విధించే సంరక్షణ విధానానికి చెల్లుచీటి ఇచ్చింది ప్రభుత్వం. మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని కూడా పక్కన పెట్టింది. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలో మరెన్ని మార్పులు జరగనున్నాయో వేచిచూద్దాం. -
రూ.లక్ష కోట్ల పరిశ్రమగా లైఫ్ సైన్సెస్
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణి క్లస్టర్‌గా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ రూపొందించిన ‘తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్–2030’నివేదికను కేటీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో విడుదల చేశారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ కమిటీ చైర్మన్, రెడ్డీస్ ల్యాబ్స్ అధిపతి సతీశ్‌రెడ్డితో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న ఫార్మా కంపెనీల అధిపతులు, నిపుణులు, విద్యాసంస్థల అధిపతులు సమావేశంలో పాల్గొన్నారు. నివేదికలోని వివరాలను సతీశ్‌రెడ్డి కేటీఆర్‌కు వివరించారు. పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నివేదిక ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మానవ వనరులు, సాంకేతిక వసతులు, అత్యుత్తమ మౌలిక వసతులు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు లైఫ్ సైన్సెస్ రంగం పురోగతికి దారితీసేలా ఉన్నాయని కమిటీ చైర్మన్ సతీశ్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. నివేదికలోని ప్రధానాంశాలు.. జనాభా సంఖ్య, జీడీపీ వృద్ధిరేటు, ఫార్మా ఎగుమతులు, మెడికల్ టూరిజం రంగం వృద్ధి, క్లినికల్ ట్రయల్స్‌కు ఉన్న అవకాశాలు రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి దోహదం చేసేదిగా ఉంది. జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్ ఫార్మా సిటీ, మెడ్ టెక్ పార్క్ వంటి విద్యా, పరిశోధన సంస్థలు రాష్ట్రంలో ఉండటం కలిసొచ్చే అంశాలు. రాష్ట్ర జీడీపీలో లైఫ్ సైన్సెస్ రంగం వాటా 2016లో రూ.900 కోట్లు కాగా, 2020 నాటికి రూ.1,300 కోట్లకు చేరింది. దీన్ని 2030 నాటికి మూడింతలు చేయాలనేది లైఫ్ సైన్సెస్ విజన్ లక్ష్యం. దేశీయ ఫార్మా ఎగుమతుల్లో తెలంగాణ వాటా 30 శాతం కాగా, ప్రస్తుతం రాష్ట్రాన్ని వ్యాక్సిన్ హబ్‌గా పరిగణిస్తున్నారు. దేశీయ వ్యాక్సిన్ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 33 శాతంగా ఉంది. దేశీయ బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50 శాతం, బల్క్ డ్రగ్ తయారీలో 40 శాతం తెలంగాణ నుంచే జరుగుతోంది. వచ్చే పదేళ్ల పాటు లైఫ్‌సైన్సెస్ రంగంలో ఏటా 15 శాతం వృద్ధిరేటుతో 2030 నాటికి రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, రూ.50 వేల కోట్ల రెవెన్యూ సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలోని 10 ప్రతిష్టాత్మక బహుళ జాతి సంస్థల్లో కనీసం 3 నుంచి 5 సంస్థలను రాష్ట్రానికి రప్పించాలి. కొత్త ఔషధాలపై పరిశోధన, తయారీ, ఫార్మా, బయో ఫార్మా, మెడికల్ డివైజెస్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు, దేశీయ పబ్లిక్ హెల్త్ డేటా సేకరించి క్లినికల్ పరిశోధన పెంచడం ద్వారా లైఫ్ సైన్సెస్ రంగానికి ఊతమివ్వడం సాధ్యమవుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు ఈ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు బయో ఫార్మా హబ్, డయాగ్నస్టిక్ హబ్(డీ హబ్) వంటివి ఏర్పాటు చేయాలి. లైఫ్ సైన్సెస్ రంగం తయారీ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు, మార్కెటింగ్, పరిశోధనశాలల ఏర్పాటు వంటి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రైవేటు సంస్థల ద్వారా కార్పస్ నిధి, పరిశ్రమకు విద్యా సంస్థలకు నడుమ అనుసంధానంతో పాటు లైఫ్‌సైన్సెస్ రంగం పరిధిని విస్తరించేందుకు ‘తెలంగాణ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్, సైన్స్, టెక్నాలజీ ఏర్పాటు చేయాలి. లైఫ్ సైన్సెస్ సాంకేతికతను విద్యా సంస్థలకు బదిలీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందించాలి. కొత్త ఔషధాలు, వ్యాక్సిన్ల కోసం రెగ్యులేటరీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. ఫార్ములేషన్, పరిశోధన, అభివృద్ధి కోసం సమీకృత లైఫ్ సైన్సెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ రంగంలో పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ‘డిజిటల్ తెలంగాణ’ నివేదిక విడుదల డిజిటల్ మీడియా విభాగం రూపొందించిన ‘డిజిటల్ తెలంగాణ– డిజిటల్ మీడి యా ఫర్ ఎఫెక్టివ్ డిజిటల్ మేనేజ్మెంట్’నివేదికను మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటెల్ నుంచి బడ్జెట్ ఫోన్ విజన్–1
న్యూఢిల్లీ: ట్రాన్సియాన్ ఇండియా ఐటెల్ బ్రాండ్‌పై విజన్–1 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. 6.088 అంగుళాల హెచ్డీ ప్లస్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లేతో కూడిన ఈ ఫోన్ధర రూ.5,499. ఫోన్‌తో పాటు రూ.799 విలువ చేసే ఐటెల్ బ్లూటూత్ హెడ్సెట్ కూడా ఉచితంగా లభిస్తుంది. దీనికి అదనంగా ఇన్‌స్టంట్‌గా రూ.2,000 వరకు క్యాష్ బ్యాక్, 25జీబీ జియో డేటా ఆఫర్లు ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 2.5డీ కర్వ్డ్ లామినెటెడ్ డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఏఐ డ్యుయల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 1.6 గిగాహెర్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ సామర్థ్యాలున్నాయి. గ్రాడేషన్ బ్లూ, పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. -
ఈ గద్దకు చూపెక్కువ!
లండన్: ‘పెరెగ్రిన్ ఫాల్కన్’అనే గద్ద పక్షి జాతిలోనే అత్యంత వేగవంతమైన దూరదృష్టి కలిగి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఒక సెకనుకు దాదాపు 130 ఫ్రేమ్‌లను తన కళ్లతో బంధిస్తుందని తెలిసింది. దీంతో ఈ పక్షులు ఎక్కువ వేగంతో ఎగిరేటప్పుడు నేలపై ఉండే తన ఆహారాన్ని వేగంగా గుర్తించి, స్పందించే వీలు కలుగుతుందన్న మాట. స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధన ప్రకారం మానవుడి కళ్లు ఒక సెకనులో 50 నుంచి 60 ఫ్రేమ్‌లను మాత్రమే బంధించగలుగుతాయి. ఎక్స్పెరిమెంటల్ బయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం సరైన వెలుతురు ఉన్న వాతావరణంలో పెరెగ్రిన్ ఫాల్కన్ సెకనుకు 129 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలదని తెలిసింది. సేకర్ ఫాల్కన్ అనే గద్ద సెకనుకు 102, హారిస్ హాక్ డేగ 77 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలవని తెలిపింది. వేటాడే పక్షుల దృష్టిపై తొలిసారిగా అధ్యయనం చేసి, ఎదురుగా కనిపించే దానికి ఎలా స్పందిస్తుందనే విషయం తెలుసుకున్నట్లు లుండ్ వర్సిటీకి చెందిన అల్ముట్ కెల్బర్ తెలిపారు. సేకర్ ఫాల్కన్, హారిస్ హాక్ డేగలు నేలపై మెల్లగా కదిలే క్షీరదాలను మాత్రమే వేటాడుతుంటాయని, అందుకే వాటికి తక్కువ దూరదృష్టి ఉంటుందని వివరించారు. అదే పెరెగ్రిన్ ఫాల్కన్ మాత్రం తన ఆహారాన్ని చూసిన వెంటనే ఆకాశం నుంచి దాదాపు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో కిందకు దిగి చటుక్కున నోట్లో వేసుకుంటుందని చెప్పారు. -
ఆకు కూరలతో దృష్టి లోపాలకు చికిత్స
కాయగూరలు మరీ ముఖ్యంగా పచ్చటి ఆకు కూరల్లో ఉండే నైట్రేట్లను ఆహారంగా తీసుకోవడం ద్వారా వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలను నిలువరించవచ్చునని వెస్ట్‌మీడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా తెలిపారు. దాదాపు యాభై ఏళ్ల వయసున్న రెండు వేల మందిపై 15 ఏళ్ల పాటు తాము పరిశీలనలను జరిపామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బామిని గోపీనాథ్ తెలిపారు. రోజుకు వంద నుంచి 142 మైక్రోగ్రాముల కాయగూరల నైట్రేట్లు తీసుకున్న వారికి కంటి సమస్యలు వచ్చే అవకాశాలు 35 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని చెప్పారు. నైట్రేట్లకు, కంటికి వచ్చే మాక్యులర్ డీజనరేషన్ సమస్యకు మధ్య సంబంధాన్ని తొలిసారి గుర్తించిన పరిశోధన ఇదేనని తెలిపారు. వంద గ్రాముల బీట్రూట్లో 20 మైక్రో గ్రాముల నైట్రేట్ ఉంటుందని, అలాగే వంద గ్రాముల పాలకూరలో 15 మైక్రోగ్రాములని తెలిపారు. కంటి జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసుకోవడం ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యం కాగా.. ఆహారపు అలవాట్ల ద్వారా జబ్బు ముదరకుండా చూసుకునేందుకు అవకాశమున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని వివరించారు. -
హైటెక్ సిటీలో 7వ కేబుల్ ఎక్స్పో విజన్
-
విశ్వనగరానికి ఓ విజన్..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం గ్లోబల్ సిటీగా మారాలంటే సరికొత్త విజన్ అవసరం అంటున్నారు వివిధ రంగాలకు చెందిన నిపుణులు. ట్రాఫిక్ కష్టాలు.. గుంతలమయమైన రహదారులు.. శ్వాసకోశ వ్యవస్థలను దెబ్బతీస్తోన్న వాయు కాలుష్యాన్ని సమూలంగా పారదోలాలని, చారిత్రక మూసీనది.. హుస్సేన్‌సాగర్.. దుర్గం చెరువు సహా వివిధ జలాశయాలను పది కాలాలపాటు పరిరక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామంటున్న పాలకులు ఆర్థికాభివృద్ధితోపాటు పర్యావరణ అంశాలు, నగర చరిత్ర, వారసత్వ కట్టడాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు కంకణబద్ధులు కావాలని సరికొత్త విజన్‌ను ఆవిష్కరించారు. రాజకీయ పక్షాలు, ప్రభుత్వం, ఆయా విభాగాలు పూర్తిస్థాయిలో భాగస్వాములైతేనే ఈ విజన్ సాకారమౌతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ‘ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్’ సంస్థ ఆధ్వర్యంలో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైలాగ్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అన్న అంశంపై ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న పలువురు నిపుణులు పలు అంశాలపై గ్రేటర్‌ను విశ్వనగరంగా మార్చాలంటే ప్రభుత్వ విజన్ ఎలా ఉండాలో నిర్దేశించారు. ఈ సదస్సులో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, కరుణా గోపాల్, జి.రామేశ్వర్రావు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, వేదకుమార్, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, నరసింహారెడ్డి, కేశవ్, తిలోత్తమ్, సక్సేనా, శ్రావ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాల్లో విశ్వనగర విజన్ ఇలా ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. పర్యావరణం.. ప్రస్తుత పరిస్థితి: గ్రేటర్ పరిధిలో ఫార్మా పరిశ్రమలు.. వాహన విస్ఫోటనంతో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. త్వరలో మన సిటీ ఢిల్లీని అధిగమించనుంది. గాలిలో చేరుతోన్న అతి సూక్ష్మధూళి కణాలు నేరుగా ఊపిరితిత్తులు, రక్తనాళాల్లో చేరి గుండెపోటుకు కారణమవుతున్నాయి. విజన్ ఇదీ: రోజువారీగా పరిశ్రమలు, వాహనాలు, ఇతరత్రా ఎన్ని టన్నుల కాలుష్యం గాలిలో కలుస్తుందో శాస్త్రీయంగా లెక్కించాలి. కాలుష్యానికి కారణమవుతున్న వారిని గుర్తించి కట్టడి చేయాలి. గ్రేటర్‌వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎంత కాలుష్యం నమోదవుతుందో మొబైల్యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ప్రతి సిటిజన్‌కు ఉండాలి. మూసీ, సాగర్, చెరువుల పరిరక్షణ ప్రస్తుత పరిస్థితి: చారిత్రక మూసీ నది డంపింగ్‌యార్డుగా మారింది. అడుగడుగునా ఆక్రమణలతో మూసీ చిన్నబోయింది. పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా నదిలో కలుస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని సుమారు 185 చెరువులు కాలుష్యకాసారంగా మారాయి. విజన్ ఇదీ: మూసీ, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు తక్షణం నడుంబిగించాలి. పారిశ్రామిక వాడల్లోనే ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పి శుద్ధిచేసిన అనంతరమే మూసీలోకి వదలాలి. జలాశయాలు, మూసీపై ఆక్రమణలు తొలగించాలి. తీరైన రహదారులు ప్రస్తుత పరిస్థితి: గ్రేటర్లో రహదారులు అడుగుకో అగాథంలా మారాయి. ట్రాఫిక్, గుంతల రోడ్లపై ప్రయాణం తో జనం నడుమునొప్పితో కుదేలవుతున్నారు. విజన్: రహదారులను విస్తరించాలి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఆక్రమణలను నిరోధించి తీరైన ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలి. మల్టీలెవల్ ఫ్లైఓవర్ల కన్నా రోడ్ల విస్తరణ, గుంతలను తక్షణం పూడ్చి సిటిజన్లకు ఉపశమనం కల్పించాలి. ప్రజారవాణా.. ప్రస్తుతం: గ్రేటర్లో వాహన విస్ఫోటనం జరుగుతోంది. నిత్యం 50 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుండటంతో ట్రాఫికర్ సిటిజన్లను బెంబేలెత్తిస్తోంది. విజన్: మెట్రో రైళ్లతోపాటు బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(బీఆర్టీఎస్) వంటి ప్రజారవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ఉంటేనే వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ప్రజారవాణా వినియోగం పెరుగుతుంది. నిరంతర నీటిసరఫరా.. ప్రస్తుతం: వందల కిలోమీటర్ల దూరం నుంచి సిటీకి తరలిస్తున్న కృష్ణా, గోదావరి జలాల్లో 40 శాతం సరఫరా నష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. విజన్: గ్రేటర్లో ప్రతి వ్యక్తికీ నిత్యం 150 లీటర్ల తాగునీటిని నిరంతరాయంగా(24 గంటలపాటు) సరఫరా చేసేలా సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించాలి. మురుగు నీటిపారుదల వ్యవస్థ ప్రస్తుతం: గ్రేటర్ శివార్ల లో పదకొండు మున్సి పల్ సర్కిళ్ల పరిధిలో డ్రైనేజి వ్యవస్థ లేక 40 లక్షల మంది సతమతమవుతున్నారు. విజన్: గ్రేటర్ హైద రాబాద్ వ్యాప్తంగా సమగ్ర మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,100 కోట్లతో డ్రైనేజి మాస్టర్‌ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి గ్రేటర్లో మూసీ, సాగర్ ప్రక్షాళనతోపాటు పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ దిశగా ప్రభుత్వం నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. – ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త మహిళల భద్రతకు పెద్దపీట వేయాలి గ్రేటర్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వారు స్వేచ్ఛగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునే వాతావరణం కల్పించాలి. ఆయా సమస్యల పరిష్కారానికి పౌరసమాజం నుంచి ప్రభుత్వం అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలి. – శ్రావ్యారెడ్డి, విఅండ్షి ఫౌండేషన్ అధ్యక్షురాలు