హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ పాలన వల్ల కొరత కొనసాగుతోందంటూ సోమవారం ఉదయం కేటీఆర్ ఓ ట్వీట్ వేశారు.
బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత, ఈ అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీకి విజన్ కొరత అంటూ ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. అంతేకాదు ఈ పాలన అద్భుతమంటూ వెటకారం ప్రదర్శించారు.
ప్రధాని మోదీకి విజన్ లేకపోవడం వల్లే దేశానికి ఈ పరిస్థితి దాపురించిందన్న అర్థంతో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. సమకాలీన అంశాలను.. అది టైమింగ్‌లో అస్త్రాలుగా చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తుండడం విశేషం.
బీజేపీ పాలనలో *బొగ్గు కొరత*
— KTR (@KTRTRS) May 2, 2022
కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత*
పరిశ్రమలకు *కరెంట్ కొరత*
యువతకు *ఉద్యోగాల కొరత*
గ్రామాల్లో *ఉపాధి కొరత*
రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత*
అన్ని సమస్యలకు మూలం PM
*మోడీకి విజన్ కొరత*
NPA Govt’s amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF
Comments
Please login to add a commentAdd a comment