Shortage
-
ఈఎంఐలు.. ఇప్పట్లో తగ్గేనా?
ఆర్బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హమ్మయ్య రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడే వారు.. కొంత కాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. రెపో రేటు కోత ప్రభావం రుణాలు, డిపాజిట్లపై పూర్తిగా ప్రతిఫలించేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత కొరత (లిక్విడిటీ) ఉండడాన్ని, డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంక్‌ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ఆధారంగా మంజూరయ్యే రుణాలతోపాటు, డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చని.. అదే సమయంలో రెపో ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపు వేగంగా బదిలీ అవుతుందని చెబుతున్నారు. కొంత సమయం తర్వాతే.. ‘‘తాజా రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఆర్బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుందన్నారు. బ్యాంకు రుణాల్లో 40 శాతం మేర రెపో ఆధారిత రుణాలు ఉన్నట్టు చెప్పారు. ఆర్బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగిరావడం తెలిసిందే. మరోవైపు సమీప భవిష్యత్‌లో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి వ్యవస్థ వ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల లోటు ఏర్పడొచ్చని అంటున్నారు. అప్పుడు ఆర్బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపునకు రెండు త్రైమాసికాల సమయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ రుణాల రేట్లను బ్యాంక్‌లు ఆర్నెళ్లకోసారి సమీక్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంక్‌లు జూలై లేదా వచ్చే డిసెంబర్లో ఈ రుణాల రేట్లను సవరించే అవకాశం ఉంటుంది.డిపాజిట్లపై.. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభా వం పడదు. కొత్తగా డిపాజిట్ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంక్‌ల మధ్య పోటీ ఉన్నందున రేట్లను వెంటనే తగ్గించకుండా, ఆర్బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ‘‘ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్స్ అనుసంధానిత రుణాలపై రేట్ల మార్పు ప్రభావం వెంటనే అమల్లోకి రావచ్చు. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై అమలు కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ రేట్ల ప్రభావం డిపాజిట్లపై ప్రతిఫలించేందుకు కూడా రెండు త్రైమాసికాలు పట్టొచ్చు’’అని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ పేర్కొనడం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు కొరత
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కార్యాలయ వసతులకు (ఆఫీస్ స్పేస్) సంబంధించి కొత్త సరఫరా 25 శాతం తగ్గి 4.10 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితమైంది. స్థూల లీజింగ్ సైతం 25 శాతం తగ్గి 2.79 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లోనూ కొత్త కార్యాలయ వసతుల సరఫరా జూలై–సెప్టెంబర్ కాలంలో 4 శాతం మేర తగ్గి 12.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇదే కాలంలో ఏడు నగరాల పరిధిలో ప్రైమ్ వర్క్‌స్పేస్ (ప్రధాన ప్రాంతాల్లో) స్థూల లీజింగ్ 17 శాతం పెరిగి 18.61 మిలియన్ ఎస్ఎఫ్టీలకు చేరింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ విడుదల చేసింది. నగరాల వారీ వివరాలు.. → బెంగళూరులో ఆఫీస్ స్పేస్ కొత్త సరఫరా 33 శాతం పెరిగి 3.60 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ఇక్కడ లీజింగ్ 84 శాతం పెరిగి 6.63 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో సరఫరా 360 శాతం అధికమై 2.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. స్థూల లీజింగ్ 17 శాతం వృద్ధితో 1.49 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలో ఆఫీస్ వసతుల సరఫరా 26 శాతం తగ్గి 1.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక్కడ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 112 శాతం పెరిగి 2.33 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → ముంబైలో కొత్త సరఫరా 0.90 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. స్థూల లీజింగ్ 2 శాతం తగ్గి 2.25 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → చెన్నైలో తాజా ఆఫీసు వసతుల సరఫరా 58 శాతం తగ్గి 0.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. లీజింగ్ పరంగా పెద్ద మార్పు లేకుండా 2.01 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → కోల్‌కతాలో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ విభాగంలో సెప్టెంబర్ క్వార్టర్లో తాజా సరఫరా లేదు. ఆఫీస్ స్పేస్ లీజింగ్ 45 శాతం తక్కువగా 0.11 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. → బీఎఫ్ఎస్ఐ, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు ఆఫీస్ స్పేస్ డిమాండ్ కీలక చోదకాలుగా ఉన్నట్టు వెస్టియన్ తెలిపింది. వేగంగా వృద్ధి చెందుతున్న భాగ్యనగరం దేశ వ్యాప్తంగా ఆరు ప్రముఖ నగరాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్‌కు మొదటి స్థానం దక్కింది. పరిపాలన, సామాజిక ఆర్థిక అంశాలు, రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల ఆధారంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. వివిధ వృద్ది అంశాల ఆధారంగా ఆరు ప్రధాన నగరాల పనితీరును నైట్‌ఫ్రాంక్ విశ్లేషించింది. ‘‘వీటిల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. బలమైన మౌలిక వసతుల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగడం, అల్ట్రా హెచ్ఎన్ఐలు(అధిక ధనవంతులు), హెచ్ఐఎన్ల జనాభా పెరుగుదల, చురుకైన విధానాలు సామాజిక ఆర్థిక పరపతిని పెంచుతున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. అద్భుతమైన నిపుణుల లభ్యత, వ్యాపార నిర్వహణకు ఉన్న అనుకూలతలతో బెంగళూరు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో నగరంగా నిలిచింది. ముంబై ఎప్పటి మాదిరే అన్ని అంశాల్లో స్థిరమైన పురోగతి చూపించింది. దేశ ఆర్థిక రాజధాని హోదాను కాపాడుకుంది. విడిగా చూస్తే గొప్ప మౌలిక వసతులు, పరిపాలన పరంగా ఢిల్లీ ఎన్సీఆర్కు టాప్ ర్యాంక్ దక్కింది. సామాజిక ఆర్థిక అంశాల పరంగా బెంగళూరు ముందంజలో ఉంది. రియల్ ఎస్టేట్ వృద్ధి పరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. -
పత్తి తీతకు పట్నం కూలీలు
రామన్నపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పత్తితీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చౌటుప్పల్, చిట్యాల మండలాల్లోని జాతీయ రహదారి వెంటగల గ్రామాల్లో పత్తి తీయడానికి కూలీలు హైదరాబాద్‌లోని హయత్‌నగర్ నుంచి వస్తున్నారు. సోమవారం చద్దిమూటలు పట్టుకొని చౌటుప్పల్ బస్టాండ్‌లో బస్సు దిగిన కూలీలను ‘సాక్షి’పలకరించగా.. పత్తి తీయడానికి వచ్చామని చెప్పారు. కిలోకు రూ.16 చొప్పున రైతులు కూలీ చెల్లిస్తున్నారని, రోజుకు 50 నుంచి 80 కిలోల వరకు పత్తి తీయడం ద్వారా రూ.800 నుంచి రూ.1,200 వరకు గిట్టుబాటవుతుందని వారు తెలిపారు. బస్టాండ్ నుంచి పత్తి చేను వరకు రైతులే ఆటోలలో తీసుకువెళ్లి తిరిగి తీసుకొస్తున్నారని వారు తెలిపారు. -
ఉపాధి ఓకే.. నైపుణ్యాలేవి..?
సాక్షి, అమరావతి: దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉపాధికి తగిన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారతదేశం కీర్తి గడిస్తున్నా.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడం లేదు. పారిశ్రామిక, ఐటీ సంస్థల డిమాండ్ తీర్చడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సాధించలేకపోతున్నారు. ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డిగ్రీ పట్టాలు తీసుకుని బయటకు వెళ్తుంటే.. వారిలో కొందరికే ఉపాధి దొరుకుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యకు, ఉపాధికి మధ్య గణనీయమైన అంతరం కొనసాగుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రోగ్రామ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నాణ్యమైన విద్య లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లాభాపేక్షతో కూడిన యాజమాన్యాలు, నైపుణ్య విద్య లేకపోవడం, రోట్–లెర్నింగ్ పద్ధతులపై దృష్టి పెట్టడం, అధ్యాపకుల కొరత ఉన్నత విద్యను వేధిస్తున్న ప్రధాన సమస్యలుగా మారాయి. నైపుణ్య లేమికి కారణాలివీ..» పాత సిలబస్‌తోనే పాఠాలు: కోర్సు కంటెంట్ ఉపాధి తర్వాత ఉద్యోగ పరిశ్రమలో వాస్తవికతకు సహాయపడేలా ఉండటం లేదు. మార్కెట్‌కు ఏది అవసరమో భారతీయ విద్య అందించలేకపోతోంది. » నాణ్యమైన అధ్యాపకుల కొరత: భారతదేశంలో 33వేల కంటే ఎక్కువ కళాశాలలు ఇంజనీరింగ్ డిగ్రీలు మంజూరు చేస్తున్నాయి. ఈ విద్యాసంస్థలన్నిటికీ నాణ్యమైన ఉపాధ్యాయులు లేరు. బహుళజాతి కంపెనీలు, చిన్న ఇంజనీరింగ్ కంపెనీల్లో వడపోత తర్వాత అధ్యాపకుల ఎంపిక జరుగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా భారతీయ అధ్యాపకులు తెలివైన విద్యార్థులను సృష్టించే నైపుణ్యాలను అందించలేకపోతున్నారు. విద్యావంతులైన ఇంజనీర్లు ఉపాధ్యాయ వృత్తిలో అభిరుచితో కాకుండా జీవనోపాధి కోసమే చేరుతున్నారు. » ఆవిష్కరణలు, పరిశోధన లేకపోవడం: విద్యార్థులు తమను తాము నిరూపించుకునేందుకు, ఆలోచించడానికి తగినంతగా ప్రేరణ లభించడం లేదు. » తప్పు విద్యా విధానం: సెమిస్టర్ విధానంతో నిరంతరం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టడానికే పరిమితమై మూల్యాంకన ప్రక్రియపైన, నిరంతర అభ్యాసంపైన ఆసక్తి చూపడం లేదు. వారు మంచి గ్రేడ్లను మాత్రమే కోరుకుంటున్నారు. » నైపుణ్యం–ఆధారిత విద్య లేకపోవడం: నైపుణ్యం ఆధారిత విద్య ఉండటం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు వాస్తవ ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యల ఆధారంగా శిక్షణ పొందటం లేదు. » సరైన ఆంగ్ల నైపుణ్యాలు లేకపోవడం: ఇంగ్లిష్ కమ్యూనికేటివ్ నైపుణ్యాలు లేకపోవడం, విశ్లేషణాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలు నిరుద్యోగానికి కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ కస్టమర్లతో కమ్యూనికేట్ చేయాల్సిన ఐటీ ఉద్యోగులకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రస్తుత ఉద్యోగ పరిశ్రమలో సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవిగా మారాయి. అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి వృత్తిపరమైన శిక్షణతోనే సాంకేతిక విద్యను జత చేయాలని టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. తద్వారా యువ ఇంజనీర్లు తొలిరోజు నుంచీ పరిశ్రమల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంటారని చెబుతోంది. అందుకే అప్రెంటిస్ షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత శిక్షణ కోసం వారిపై ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తున్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లోని సమస్యలతో పాటు ఇంగ్లిష్ భాషకు సంబంధించిన సమస్యలు ఉద్యోగానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇక్కడ టైర్–1 నగరాల నుంచి వచ్చే విద్యార్థులతో పోలిస్తే టైర్–2 నగరాల నుంచి వచ్చిన విద్యార్థులకు తక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. టైర్–2 నగరాల్లోని విద్యార్థులకు 24 శాతం తక్కువ ఉద్యోగ అవకాశాలతో పాటు జీతంలోనూ చాలా వ్యత్యాసం ఉంటోంది. 15 లక్షల్లో 10 శాతం మందికే ఉద్యోగాలుప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తుంటే.. వారిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయని పేర్కొంది. దేశంలో ఇంజనీరింగ్ రంగంలో 60 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటే.. వాటిలో 45 శాతం మందికి పైగా పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. వాస్తవానికి పరిశ్రమలు సైబర్ సెక్యూరిటీ, ఐటీ, రో»ొటిక్స్, డేటా సైన్స్ వంటి డొమైన్లలో నైపుణ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాయి. దీనికితోడు కృత్రిమ మేధ (ఏఐ)తో పోటీపడి పని చేయాల్సిన పరిస్థితుల్లో విద్యార్థులు సంప్రదాయ విద్య ఒక్కటే నేర్చుకుంటే సరిపోదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ‘ఏఐ’, కట్టెడ్జ్ సాంకేతికతలో అధునాతన నైపుణ్యాలు కలిగిన సుమారు 10 లక్షల మంది ఇంజనీర్లు అవసరమని ప్రభుత్వేతర ట్రేడ్ సంస్థ ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్–సర్వీస్ కంపెనీస్’ (నాస్కామ్) అంచనా వేసింది. డిజిటల్ ప్రతిభలో డిమాండ్–సరఫరా అంతరం ప్రస్తుతం 25 శాతం నుంచి 2028 నాటికి 30 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏఐ, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో వస్తున్న మార్పులు సైతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధించడంలో సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
Russia-Ukraine war: ‘ఖైదీ’ సైనికులు
వాళ్లంతా కొన్ని నెలల క్రితం దాకా ఖైదీలు. పలు నేరాలకు శిక్షను అనుభవిస్తున్న వారు. కానీ ఇప్పుడు మాత్రం దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్న సైనిక వీరులు! రష్యాతో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో నానాటికీ పెరుగుతున్న సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ తీసుకున్న వినూత్న నిర్ణయం వారినిలా హీరోలను చేసింది. ఎంతోమంది ఖైదీలు పాత జీవితానికి ముగింపు పలికి సైనికులుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ, కందకాలు తవ్వడం వంటి సహాయక పనులు చేస్తూ యుద్ధభూమిలో దేశం కోసం చెమటోడుస్తున్నారు.రష్యాతో రెండున్నరేళ్ల యుద్ధం ఉక్రెయిన్ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఈ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం ఉక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్లను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిశాక వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు, వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డూ ఉండబోదు! దీనికి తోడు ఫ్రంట్లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు 500 నుంచి 4,000 డాలర్ల దాకా వేతనం కూడా అందుతుంది!! అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి, కనీసం మూడేళ్లు, అంతకు మించి శిక్ష మిగిలి ఉండి, 57 ఏళ్ల లోపున్న ఖైదీలను మాత్రమే ఎంచుకున్నారు. ఈ లెక్కన 27,000 మంది ఖైదీలు పథకానికి అర్హులని ఉక్రెయిన్ న్యాయ శాఖ తేలి్చంది. కనీసం 20,000 మంది ఖైదీలన్నా సైనికులుగా మారతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా అవతారమెత్తారు. ఈ ‘ఖైదీ సైనికు’ల్లో 31 మంది మహిళలున్నారు! 21 రోజుల శిక్షణ తర్వాత వీరు విధుల్లో చేరారు. గట్టి రూల్సే ఖైదీలను ఇలా సైన్యంలోకి తీసుకునేందుకు కఠినమైన నిబంధనలే ఉన్నాయి. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులే. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని ష్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారినీ తీసుకుంటున్నారు. జైలరే వారి కమాండర్! తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్్కలో 59 బ్రిగేడ్‌లో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి ఓ గమ్మత్తైన ప్రత్యేకత ఉంది. బ్రిగేడ్ కమాండర్ ఒలెగ్జాండర్ వాళ్లకు కొత్త కాదు. ఆయన గతంలో జైలు గార్డుగా చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్‌గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఈ బ్రిగేడ్‌లో సైనికులుగా చేరారు. ఆయన కిందే పని చేస్తున్నారు! ‘‘యుద్ధభూమిలో వారు నన్ను మాజీ జైలు గార్డుగా కాక అన్నదమ్ములుగా, కమాండర్‌గా చూస్తారు. అంతా ఒకే కుటుంబంలా జీవిస్తాం. వీరికి తండ్రి, తల్లి, ఫిలాసఫర్... ఇలా ప్రతీదీ నేనే’’ అంటారాయన. సదరు జైలు నుంచి మరో పాతిక మంది దాకా ఈ బ్రిగేడ్‌లో చేరే అవకాశముందట.మట్టి రుణం తీర్చుకునే చాన్స్ జైల్లో మగ్గడానికి బదులుగా సైనికునిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని 41 ఏళ్ల విటాలీ అంటున్నాడు. అతనిది డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ నేపథ్యం. నాలుగు నేరాల్లో పదేళ్ల శిక్ష అనుభవించాడు. ‘‘మా ఏరియాలో అందరు కుర్రాళ్లలా నేనూ బందిపోట్ల సావాసం నడుమ పెరిగాను. ఇప్పటిదాకా గడిపిన జీవితంలో చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. అలాంటి నాకు సైన్యంలో చేరి దేశం రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కింది. ఇలాగైనా మాతృభూమికి ఉపయోగపడుతున్నాననే తృప్తి ఉంది. కానీ సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కాకపోతే బాగా సరదాగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా నిపుణులకు వీసాల జోరు పెంచండి
న్యూఢిల్లీ: చైనా నిపుణుల కొరత దేశీ కంపెనీలను వేధిస్తోంది. ముఖ్యంగా టాటా పవర్ సోలార్, రెన్యూ ఫోటోవోల్టాయిక్ , అవాడా ఎలక్ట్రో వంటి సోలార్ మాడ్యూల్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చైనా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల వీసా అప్లికేషన్లను వేగంగా అనుమతించాలంటూ ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా నుంచి నిపుణుల రాక ఆలస్యం కావడంతో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను పెంచలేకపోతున్నామని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మూడు కంపెనీలు తమ సోలార్ మాడ్యూల్ ప్లాంట్లలో అవసరమైన 36 మంది చైనా నిపుణుల కోసం బిజినెస్ వీసాల కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేయగా.. ఇప్పటిదాకా వాటికి అనుమతులు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో టాటా పవర్ సోలార్ అత్యధికంగా 20 మంది చైనా నిపుణుల కోసం వీసాలివ్వాల్సిందిగా కోరింది. ఈ కంపెనీ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 4 గిగావాట్ల (జీడబ్ల్యూ) గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, 4 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. దీనికోసం సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇక రెన్యూ పవర్ గుజరాత్‌లోని ధోలెరాలో, అవాడా కంపెనీ ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 500 జీడబ్ల్యూ లక్ష్యం.. 2030 నాటికి దేశంలో సౌరశక్తి, గాలి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా 500 జీడబ్ల్యూ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అధునాతన పరికరాలు, సాంకేతికత కోసం చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీ ఎగుమతుల్లో చైనా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు ముదరడంతో పాటు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు చైనా యాప్‌లను నిషేధించింది. పెట్టుబడులపై కూడా డేగకన్ను వేస్తోంది ప్రభుత్వం. చైనీయులు భారత్‌లో రాకపోకలను కూడా కఠినతరం చేసింది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యంతో పాటు వ్యయాలు పెరిగిపోయేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
పత్తి విత్తనాల కొరత ?..మంత్రి తుమ్మల రియాక్షన్
-
నియోజకవర్గానికి రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా సర్పంచ్‌లకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అయితే సర్పంచ్ల పదవీకాలం నెలాఖరుతో ముగుస్తున్నందున అధికారులు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలసి సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద కేటాయించిన రూ.10 కోట్లలోంచి రూ. కోటి చొప్పున తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్త రిజర్వాయర్లన్నింటినీ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని.. తద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సరఫరా సులభమవుతుందని సీఎం తెలిపారు. గ్రామాల వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని, ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్‌ను సర్పంచులకే అప్పగించాలన్నారు. నీరురాని గ్రామాల సర్వే.. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు తాగునీరు అందట్లేదో సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని ఆవాసాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకొనేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు... స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్‌లను కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. రహదారులు లేని గ్రామాలకు తారురోడ్లు... రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించగా వాటన్నింటికీ తారురోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను అనుసంధానించి వాటిని పూర్తి చేయా లని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్ర నిధులు రాలేదు.. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచి్చనట్లు గత ప్రభుత్వం చెప్పుకోవడంతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ ప్రకటనలతో కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయన్నారు. ఇకపై వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. -
నేవీలో 10వేల మందికి పైగా సిబ్బంది కొరత
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో కీలక విభాగమైన భారత నావికాదళంలో సిబ్బంది కొరత భారీస్థాయిలో ఉంది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా శుక్రవారం పార్లమెంట్లో కేంద్రం తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. అక్టోబర్ 31వ తేదీ నాటికి నౌకాదళంలో మొత్తంగా 10,896 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆఫీసర్ ర్యాంక్ పోస్టులే 1,777 దాకా ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. -
విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగుతాయని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న గడ్డు పరిస్ధితుల కోసం ఇప్పుడే అప్రమత్తం కావాలని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ నెలాఖరు నాటికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా ఓ లేఖ పంపింది. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట డిమాండ్‌లో కొరత 23 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం తెలిచ్చింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోయాయని చెప్పింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 తరువాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిషేధించామని, పరిస్థితులు చక్కబడకపోవడంతో నిషేధాన్ని పక్కనపెట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు సాధాౄరణం కంటే తక్కువగా ఉన్నందున సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఆశించినంతగా లేనందున రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్షీణించాయని, దానివల్ల గత ఏడాది 45 గిగావాట్లుగా ఉన్న గరిష్ట హైడ్రో పవర్ ఉత్పత్తి ఈ ఏడాది 40 గిగావాట్ల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. పవన ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని, సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో రుతుపవనాల ఉపసంహరణతో జల, గాలి ఉత్పత్తి మరింత క్షీణిస్తుందని అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. థర్మల్ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో నడవకపోవడం వల్ల 12–14 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో లేదన్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అలాగే థర్మల్, సోలార్, విండ్ వంటి కొత్త యూనిట్లను త్వరితగతిన ప్రారంభించాలని కోరింది. విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు కుదుర్చుకోవాలని, స్వల్పకాలిక టెండర్ల ద్వారా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ ద్వారా సమకూర్చుకోవాలని సూచించింది. -
రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 99.6 శాతం సరఫరా
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏపీలోనే అధికంగా ఉందనడంలో వాస్తవం లేదని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ), డిస్కంలు స్పష్టం చేశాయి. ‘దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ కొరత అధికం’ శీర్షికతో ఆదివారం ఈనాడు ప్రచురించిన కథనాన్ని ఎస్ఎల్డీసీ, డిస్కంలు ఖండించాయి. 20 సూత్రాల అమలు కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2022–23 ఆ ర్థిక సంవత్సరం విద్యుత్ సరఫరా గణాంకాలను ఉటంకిస్తూ ఈనాడు వార్తా కథనం ప్రచురించింది. అయితే గత ఆ ర్థిక సంవత్సరం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, 0.04 శాతం మాత్రమే సరఫరాలో లోటు ఉందని, ఇది కూడా స్థానికంగా ఏర్పడిన సాంకేతిక ఇబ్బందుల వల్లేనని డిస్కంలు పేర్కొన్నాయి. ఎస్ఎల్డీసీ, డిస్కంలు ఏం చెప్పాయంటే.. ఏపీలో వాస్తవ కొరత 0.4 శాతమే కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం విద్యుత్ సరఫరాలో ఝార్ఖండ్ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. 2022–23 సంవత్సరంలో 20 సూత్రాల అమలు పథకంపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ డిమాండ్–సరఫరా గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రం మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 93 శాతం మాత్రమే విద్యుత్ సరఫరా చేయగలిగింది. నాగాలాండ్ డిమాండ్‌లో 94 శాతం సరఫరా చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో మొత్తం ఏడాదిలో 915 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. 892 మిలియన్ యూనిట్లు సరఫరా చేసింది. 24 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. దీంతో ఆ రాష్ట్రం 98 శాతం విద్యుత్ సరఫరా చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వార్షిక నివేదికలో పేర్కొంది. రాజస్థాన్‌లో గత ఆ ర్థిక సంవత్సరం 1,01,801 మిలియన్ యూనిట్ల డిమాండ్‌కు గాను.. 1,00,057 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసింది. అంటే 1,745 మిలియన్ యూనిట్ల సరఫరా లోటు ఏర్పడింది. మొత్తమ్మీద చూస్తే రాజస్థాన్ డిమాండ్‌లో 98 శాతం విద్యుత్ సరఫరా చేసింది. బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా మొత్తం వార్షిక విద్యుత్ డిమాండ్‌లో 98 శాతం మేరకు సరఫరా చేశాయి. కేంద్ర గణాంకాల ప్రకారం తెలంగాణలో 0.04 శాతం, కర్ణాటకలో 0.03 శాతం విద్యుత్ కొరత ఉంది. ఏపీలో కూడా వాస్తవ కొరత 0.4 శాతం మాత్రమే. విద్యుత్ డిమాండ్‌లో తెలంగాణ 99.96 శాతం, కర్ణాటక 99.97 శాతం, తమిళనాడు 99.93 శాతం, ఆంధ్రప్రదేశ్ 99.56 శాతం విద్యుత్ సరఫరా చేశాయి. -
అందనంత దూరాన ఆవాసం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ గృహాల కొరతను తీవ్రం చేస్తోంది. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో 1.9 కోట్ల గృహాల కొరత ఉంటే.. 2030 నాటికి ఇది 3.8 కోట్లుగా ఉండనుందని పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర గృహ, పట్టణ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. రాబోయే ఏడేళ్లలో ఏకంగా దాదాపు నాలుగు కోట్ల గృహాల కొరత ఏర్పడుతుందని పేర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశంలో దాదాపు 36 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 50 శాతానికి చేరుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తుండగా, నిపుణులు సైతం ఇదే అంచనా వేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తుండడమే పట్టణీకరణకు ప్రధాన కారణమని, గ్రామీణ ప్రాంతాల నుంచి సామాన్య జనం నగరాల బాట పడుతున్నారని చెబుతున్నారు. భూముల ధరలు,నిర్మాణ వ్యయం పెరగడంతో.. పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు అమాంతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి సొంతంగా ఓ గూడు దొరకడం గగనమవుతోంది. పట్టణాలు, నగరాల్లో వివాద రహిత భూములు లేకపోవడం, పెరుగుతున్న నిర్మాణ వ్యయం, ఆచరణ సాధ్యమైన రెంటల్ మార్కెట్ లేకపోవడం తదితర అంశాలు గృహాల కొరతకు కారణమవుతున్నాయి, అందరికీ అందుబాటు ధరలో గృహాలు ఉండేందుకు వీలుగా భూముల ధరలు, నిర్మాణ వ్యయం తగ్గేలా చర్యలు తీసుకోవడమేగాక, ఆర్థిక సహకారం కూడా అందిస్తే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని గృహ నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పట్టణాల్లో ఒకప్పుడు భారీగా స్థలాలు సేకరించిన పలు కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకుని రాలేకపోయాయి. అలాంటి స్థలాలను గృహ నిర్మాణ రంగానికి కేటాయిస్తే పరిస్థితులు మెరుగు అవుతాయని అంటున్నారు. సింగిల్ విండో పద్ధతి బెటర్.. రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు త్వరగా అనుమతులు రావడానికి వీలుగా సింగిల్ విండో పద్ధతిని కూడా అమలు చేయాలని అంటున్నారు. ప్రస్తుతం ‘రెరా’(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) అనుమతుల పేరిట కొంతవరకు అలాంటి వెసులుబాటు వచ్చినా.. అది భారీ ప్రాజెక్టులకు మాత్రమే ఉపయోగపడుతోంది. మధ్య, దిగువ తరగతులకు అనుకూలంగా గృహాల నిర్మాణానికి అవసరమైన లే అవుట్లు, ఇళ్ల నిర్మాణానికి సులువుగా అనుమతులు వచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అనుమతుల కోసం పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, సకాలంలో అనుమతులు రాక నిర్మాణ వ్యయం విపరీతంగా పెరగడం వల్ల కూడా పేదలకు గృహాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం, క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం కేవలం ఆర్థికంగా వెనుకబడిన, దిగువ ఆదాయ వర్గాలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయని, వీటిని మధ్యాదాయ వర్గాలకు కూడా వర్తింప చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మౌలిక సదుపాయాలూ సమస్యే.. గ్రామీణ ప్రాంతాల నుంచి 2030 నాటికి అదనంగా 8.33 కోట్ల మంది ప్రజలు నగరాలకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క గృహవసతే కాకుండా పరిశుభ్రమైన నీరు, ముగురునీటి పారుదల, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. పట్టణాలు, నగర జనాభాలో 17% మంది (అల్పాదాయ వర్గాలు) మురికివాడల్లోనే నివసిస్తున్నట్లు అంచనా. 71 శాతం ప్రజలకు భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. 60 శాతం ప్రజలకు ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ ఉంటే.. మరుగుదొడ్ల సౌకర్యం లేని మురికివాడలు సైతం ఉన్నాయి. గ్రామాల నుంచి నగరాలు, పట్టణాలకు వస్తున్న వారి ఆదాయాల్లో మార్పుల కారణంగా నివాస గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భూ సేకరణ వ్యయానికీప్రోత్సాహకాలు ఇవ్వాలి అందుబాటులో ఉండే గృహాలకు సంబంధించి నిర్మాణదారులను, కొనుగోలుదారులను ఇద్దరినీ ఆకర్షించేందుకు కేంద్రం పలు రాయితీలను ప్రకటించింది. పన్ను ప్రోత్సాహకాలతో డెవలపర్లను, వడ్డీ రాయితీలతో కొనుగోలుదారులను సంతృప్తి పరుస్తోంది. అయితే ప్రధాన నగరాల్లో ఈ ప్రాజెక్టులకు భూమి సేకరణ ప్రధాన సమస్యగా మారుతోంది. అందువల్ల కేంద్రం ఆయా ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ వ్యయాలపై కూడా ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. – అన్షుల్ జైన్, ఎండీ, కుష్మన్ వేక్ఫీల్డ్ ఇండియా మౌలిక వసతులు కల్పించాలి నగరంలో అందరికీ అందుబాటులో ఉండేలా గృహాలను నిర్మించాలంటే స్థలం కొరత ప్రధాన సమస్య. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అలా వెళ్లాలంటే శివారుల్లో ముందుగా రహదారులు, మంచినీరు, విద్యుత్ వంటి మౌలిక సదు పాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. హైదరాబాద్ డెవలపర్ల విషయానికొస్తే.. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు గ్రిడ్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేయాలి. అప్పుడే ఓఆర్ఆర్ పరిధిలో ఈ తరహా గృహాల నిర్మాణం ఊపందుకుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి. స్థానిక సంస్థల ఫీజులను తగ్గించాలి. – శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ నెరవేరని పీఎంఏవై లక్ష్యం పీఎంఏవై పథకం కింద 2015 నుంచి 2022 మధ్య మొత్తంగా 1.23 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు లబ్ది దారులకు అప్పగించింది అందులో సగమే. 61 లక్షల గృహాలను మాత్రమే అందించినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమీక్షలో బయటపడింది. వాస్తవానికి 1.07 కోట్ల గృహాల పనులు ప్రారంభించినా.. అన్నీ పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయినా మౌలిక సదుపాయాలు లేని కారణంగా 5.61 గృహాలను లబ్ది దారులకు అందించలేకపోవడం గమనార్హం. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల వాటాతో పాటు లబ్ధిదారుల వాటా కూడా ఉంటుంది. అయితే పలు రాష్ట్రాలు తమ వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీగుర్తించింది. -
మంచిర్యాల మాతాశిశు కేంద్రంలో వైద్యులు, వసతులు కరువు
-
పాకిస్తాన్లో అందినకాడికి దోపిడీ.. రూ.600 ఇంజక్షన్, 3 వేలు!
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో హృద్రోగులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండె రోగుల చికిత్సకు కావాల్సిన ముఖ్యమైన హెపారిన్ ఇంజక్షన్‌కు తీవ్రమైన కొరత ఏర్పడింది. దీంతో అక్కడి రోగులు చికిత్స పొందడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అయితే హెపారిన్ ఇంజక్షన్ సాధారణ ధర రూ.600 ఉన్నప్పటికీ, కొరత కారణంగా ధరను అమాంతంగా రూ.3 వేలకు పెంచి అక్రమంగా అమ్ముతున్నారని సదరు నివేదిక పేర్కొంది. అంతేగాక మందులు, వైద్య పరికరాల కొరతను కారణంగా వైద్యులు సర్జరీలు నిర్వహించడం లేదని వెల్లడించింది. మరోవైపు ఇంజక్షన్ ధరలను భారీగా పెంచడంతో పేద ప్రజలు వాటిని కొనడం అందని ద్రాక్షలాగా మారింది. రోగులు ఆస్పత్రుల్లో ఇబ్బందులు పడుతుండటంతో అక్కడి స్థానిక ఫార్మాస్యూటికల్ తయారీదారులు మందుల ఉత్పత్తిని వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా దేశపు ఔషధ తయారీ ఉత్పత్తిలో దాదాపు 95 శాతం ముడి సరుకులు పొరుగు దేశాలైన భారత్, చైనాల నుంచే దిగుమతి అవుతాయని గణాంకాలు పేర్కొన్నాయి. ఆర్థికంగా పరిస్థితులు దిగజారడంతో.. దాయాది దేశపు ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. చదవండి: 9 ఏళ్ల తర్వాత భారత్‌లో పర్యటించనున్న పాక్ మంత్రి.. ఎందుకంటే! -
చిప్‌ల కొరతతో ఉత్పత్తిపై ప్రభావం
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత ఇంకా కొనసాగుతూనే ఉందని, చిప్‌ల సరఫరాపైనా అనిశ్చితి నెలకొనే ఉందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సీఎఫ్‌వో అజయ్ సేఠ్ తెలిపారు. ఫలితంగా కార్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ విడిభాగాలతోనే గరిష్ట స్థాయిలో ఉత్పత్తిని పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోందని అజయ్ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో క్వార్టర్లో సరఫరా కొంత మెరుగుపడినప్పటికీ .. ఇంకా పరిస్థితి పూర్తిగా చక్కబడకపోవడంతో డిసెంబర్ క్వార్టర్లో మారుతీ 46,000 పైచిలుకు వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయింది. మూడో త్రైమాసికం ఆఖరు నాటికి మారుతీ దగ్గర 3.63 లక్షల వాహనాలకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీకి ఉన్న రెండు ప్లాంట్లకు (మానేసర్, గురుగ్రామ్) మొత్తం 15 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మరోవైపు, కొత్తగా ప్రవేశపెడుతున్న జిమ్నీ, ఫ్రాంక్స్ వాహనాల ద్వారా స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల విభాగంలో లీడర్‌గా ఎదగాలని భావిస్తున్నట్లు అజయ్ చెప్పారు. అటు అమ్మకాలపరంగా చూస్తే పరిశ్రమను మించే స్థాయిలోనే తమ సంస్థ విక్రయాల వృద్ధి ఉండగలదని భావిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతీ తెలిపారు. మూడో క్వార్టర్లో మారుతీ సుజుకీ ఇండియా మొత్తం 4,65,911 వాహనాలను విక్రయించింది. ఆదాయం రూ. 22,188 కోట్ల నుంచి రూ. 27,849 కోట్లకు, లాభం రెండు రెట్లు పెరిగి రూ. 2,351 కోట్లకు పెరిగింది. -
చైనా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు పైలట్ల కొరత
బీజింగ్: ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల (విమానవాహక నౌకల)పై నుంచి యుద్ధ విమానాలను నడపడంలో సుశిక్షితులైన పైలట్లు దొరక్క డ్రాగన్ దేశం తంటాలు పడుతోంది. విమానవాహక నౌకల కోసం తయారు చేసిన యుద్ధ విమానాలు ముఖ్యంగా జె–15 జెట్లు నడిపే అర్హులైన పైలట్ల డిమాండ్‌ను తీర్చేందుకు చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (పీఎల్ఏఎన్) శిక్షణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. మొదటి విమాన వాహక నౌక లియోనింగ్‌ను ప్రారంభించిన దశాబ్దం తర్వాత చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమం అనేక అవరోధాలను ఎదుర్కొంటోందని చైనా మిలటరీ మేగజీన్ ఆర్డినెన్స్ ఇండస్ట్రీ సైన్స్ టెక్నాలజీ తాజా కథనంలో తెలిపింది. గత వారం సముద్రంలో ట్రయల్స్ ప్రారంభించిన అత్యాధునిక మూడో విమాన వాహక నౌక ఫుజియాన్పై ఉండే 130 యుద్ధ విమానాలను నడిపేందుకు కనీసం 200 మంది క్వాలిఫైడ్ పైలట్లు అవసరం ఏర్పడిందని అందులో తెలిపింది. అంతేకాదు, అమెరికాతో సరితూగగల ఇలాంటి మరికొన్ని ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేసుకోవాలని చైనా ప్రణాళికలు వేస్తోంది. ‘అయితే, విమానాల డిజైనింగ్‌తోపాటు అందుకు తగ్గట్లుగా పైలట్లను తయారు చేసుకోవడం చాలా కష్టతరమైన అంశం. ఎందుకంటే ఇలాంటి కీలక సాంకేతిక అంశాలను మీతో ఎవరూ పంచుకోరు. ఎవరికి వారు వీటిని సొంతంగా సమకూర్చుకోవాల్సిందే’ అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. చైనా కనీసం ప్రతి రెండు నెలలకో యుద్ధ నౌకను రంగంలోకి దించుతూ తన నావికాశక్తిని వేగంగా ఆధునీకరిస్తోంది. పైలట్ల కొరతను అధిగమించేందుకు నేవీ అధికారులు ఎయిర్‌ఫోర్స్‌లోని అర్హులైన సిబ్బందికి బదులు హైస్కూల్ విద్య పూర్తి చేసిన 19 ఏళ్ల వారిని ఎంపిక చేస్తూ శిక్షణను వేగవంతం చేసినట్లు అధికార చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది. పలు సాంకేతిక అంశాల్లో అమెరికాతో పోలిస్తే చైనా పైలట్లు శిక్షణలో వెనుకబడినట్లే భావించాల్సి ఉంటుందని ఆర్డ్‌నెన్స్ ఇండస్ట్రీ సైన్స్ టెక్నాలజీ పత్రిక పేర్కొంది. -
ఊళ్లల్లో కనుమరుగవుతున్న మెకానిక్ దుకాణాలు.. అదే కారణమా!
సామర్లకోట(కాకినాడ జిల్లా): భార్యా పిల్లలతో ఏ శుభ కార్యానికో, వ్యాహ్యాళికో వెళ్తున్న వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనం ఏదో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. కనుచూపు మేరలో మెకానిక్ షాపులు లేవు. భార్య బిడ్డలను ఆటోలో చేరాల్సిన చోటుకు పంపి అతడి వాహనాన్ని తోసుకుంటూ ముందుకు కదిలాడు. రెండు మైళ్లు చెమటోడ్చి వెళ్లాక.. ఏవో చిన్న పరికరాలు పెట్టుకుని ఓ చిన్న బండికి మరమ్మతు చేస్తున్నాడు 60కి దగ్గరలో ఉన్న వ్యక్తి. అసలే గ్రామీణ వాతావరణం. ఆపై మొండిగా తిరిగే బళ్లు. నట్లు, బోల్టులు పట్టేశాయి. వాటిని విప్పడానికి అతని శక్తి చాలడం లేదు. సత్తువ ఉన్న సహాయకుడు ఉంటే కొంత వెసులుబాటు ఉండేది. అదీ లేదు. బండిని తోసుకు రావడంతో సోష వచ్చి అక్కడే కూలబడ్డాడు వెంకటేశ్వర్లు. ఎప్పటికైతే అప్పుడే అవుతుందని కూర్చున్నాడు. ఇదీ ప్రస్తుతం మెకానిక్ దుకాణాలు, వాహన చోదకుల పరిస్థితి. సామర్లకోట మండల పరిధిలో సుమారు 70 వరకు మోటారు సైకిల్ మెకానిక్ షాపులు ఉన్నాయి. వీటిలో 20 షాపుల్లో మాత్రమే హెల్పర్లు ఉండగా, మిగిలిన వాటిలో దుకాణ యజమానులే మరమ్మతులు చేస్తున్నారు. కాగా ఆ 50 మందిలో 30 మంది 50 ఏళ్లు దాటిన వారే. చేసే ఓపిక లేకపోతే ఇంట సేదతీరడం తప్ప మరో పని చేయలేని పరిస్థితి వారిది. గతంలో ఏ మెకానిక్ దుకాణం చూసినా ఇద్దరు, ముగ్గురు చిన్నారులు సహాయకులుగా ఉండి బళ్ల మరమ్మతులు నేర్చుకునేవారు. చురుకైనవారైతే ఏడాదిలోనే పని నేర్చేసుకుని వేరే దుకాణం పెట్టేసేవాడు. మళ్లీ అతడి దగ్గరకి సహాయకులు చేరిక.. ఇలా సాగేది. నేటి పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. బడి ఈడు పిల్లలు బడిలోకే వెళ్లాలి. పనిముట్లు పట్టరాదు అనే నినాదంతో ఏ చిన్నారీ బాల్యాన్ని బాదరబందీ బతుకులకు బలిచేయకూడదని, ఏ ఒక్కరైనా భావి భారత పౌరుడిగా జాతి ఔన్నత్యాన్ని నిలిపేలా తయారు కాకపోతాడా అనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దీంతో చిన్నారులు బడిబాట పడుతుంటే, సహాయకులు లేక, పని నేర్చుకునేవారు లేక మెకానిక్ దుకాణాలు కాలక్రమంలో అంతకంతకూ తగ్గిపోతున్నాయి. దీంతో వెంకటేశ్వర్లు లాంటి వాహన చోదకులకు అవస్థలు తప్పడం లేదు. ఏ చిన్న సమస్యకైనా సర్వీస్ సెంటర్‌కి వెళ్లాలంటే మరమ్మతు చార్జీతో పాటు అదనపు చార్జీలు వేసి చేటంత బిల్లు ఇస్తారు. గ్రామీణులు భరించలేని పరిస్థితి ఇది. వాహనం కొన్నప్పుడు ఇచ్చే ఫ్రీ సర్వీసులనే ఎవరూ చేయించుకోరు. నమ్మకస్తులైన సొంత మెకానిక్‌లతో సర్వీస్ చేయించుకుంటారు చాలామంది. పైగా సర్వీస్ సెంటర్లు కూడా దూరాభారం. వాహన చోదకుల సమస్యలకు ఆయా యాజమాన్యాలు సర్వీస్ సెంటర్లను గ్రామీణ స్థాయికి విస్తరించడం ఒకటే మార్గంగా కనిపిస్తోంది. వృత్తి విద్య శిక్షణ ఏర్పాటు చేయాలి.. ఇప్పటికే గృహ నిర్మాణ రంగంలో అనేక మందికి వృత్తి శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సు లో మోటారు సైకిలు మెకానిక్‌పై కూడా కోర్సును ఏర్పాటు చేయాలి. సర్టిఫికెట్ల ఆధారంగా ఆయా మోటారు సైకిల్ సంస్థల్లో చేరే వీలుంటుంది. ఆసక్తి ఉన్న వారు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. – ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోట హెల్పర్లు లేకపోతే షాపుల నిర్వహణ కష్టం సహాయకులు లేకపోతే మెకానిక్ షాపుల నిర్వహణ కష్టమే. గతంలో పిల్లలు పని నేర్చుకోడానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదైనా వృత్తి విద్యా కోర్సుల ద్వారా ప్రాథమిక విషయాలు తెలుసుకున్న వారు తమ అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారికీ, మాకూ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. – ఆండ్ర నూకరాజు, సీనియర్ మెకానిక్, సామర్లకోట -
వీరి సంపాదన నెలకు రూ.90 వేలకుపైనే.. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే..!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలులోని మద్దూర్ నగర్‌కు చెందిన షఫీ 1997లో ఐటీఐ పూర్తి చేసి ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడ్డాడు. అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పెద్ద ఆస్పత్రులకు ఎలక్ట్రికల్ వర్క్ కాంట్రాక్టుకు తీసుకుని బాగానే సంపాదిస్తున్నాడు. తనవద్ద ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న ఎంతోమంది కూడా సొంతంగా జీవనం సాగిస్తున్నారు. కానీ రెండు, మూడేళ్లుగా అతనికి ఎలక్ట్రీషియన్లు దొరకడం లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి మూడు బ్యాచ్‌లుగా పిలిపించుకుని వారితో పనిచేయిస్తున్నాడు. కారణం పనిచేసేవారు మన వద్ద క్రమంగా తగ్గిపోతుండటమే. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం! పట్టణీకరణ భారీగా పెరుగుతోంది. ఆస్పత్రులు, బ్యాంకులు, అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగంలో అభివృద్ధి జరుగుతోంది. కానీ వర్కర్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో భవన నిర్మాణ కార్మికులతో పాటు ఎలక్ట్రీషియన్లు, శానిటేషన్ వర్కర్లను(ఫిట్టర్లు) కూడా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ నుంచి తెప్పించుకుని పనులు చేస్తున్నారు. పై రెండు ఉదాహరణలు పరిశీలిస్తే ‘స్కిల్డ్ వర్కర్ల’ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కువ శాతం మంది విద్యార్థులు సూపర్ విజన్ జాబ్‌ల దిశగా అడుగులేస్తూ పని నేర్చుకునే ఐటీఐని పక్కన పడేస్తుండటం ఆందోళనకరం. గమనించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నియోజకవర్గానికో స్కిల్హబ్ ఏర్పాటు చేసి, వృత్తివిద్య పూర్తిచేసిన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా తీసుకుంది. టెక్నాలజీ విప్లవం వచ్చిన తర్వాత అధిక శాతం మంది స్మార్ట్ లైఫ్‌కు అలవాటుపడ్డారు. శారరీక శ్రమ లేని ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులు కూడా కోర్సులు ఎంపిక చేసుకుంటున్నారు. ‘మేం కష్టపడ్డాం. మా పిల్లలు అలా కాకూడదు. సుఖంగా బతకాలి’ అనే ధోరణితో తల్లిదండ్రులు వారి పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది డిగ్రీలు, పీజీలు, బీటెక్‌లు, ఎంబీఏ, ఎంసీఏ లాంటి చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఈ విభాగాల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడనివారు కొందరైతే, మంచి చదువులు అభ్యసించి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నవారి సంఖ్య ఎక్కువే. దీనికి కారణం బీటెక్, ఎంబీఏ, ఎంసీఏలు ‘సూపర్వైజింగ్’ ఉద్యోగాలు. దేశంలో ప్రభుత్వరంగం కంటే ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ప్రైవేటు కంపెనీలు ‘స్కిల్డ్ వర్కర్ల’నే రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఐటీఐ, డిప్లొమో చదివిన వారివైపు మక్కువ చూపుతున్నాయి. దీనికి కారణం ఈ విభాగాల్లోని వారు శారీరక శ్రమతో పనిచేయాలి. ఐటీఐలో 71.08 శాతం తక్కువ అడ్మిషన్లు ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెకానికల్ రంగాల్లో ఎక్కువగా ఐటీఐ చదివిన విద్యార్థులు ఉంటారు. కొంతకాలంగా ఐటీఐ చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికి కారణం ఈ చదువులు చదివితే వర్కర్లుగా పనిచేయాలి. ఇంజినీరింగ్ లాంటి చదువులు చదివితే కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగం చేయొచ్చనే దృక్పథం విద్యార్థుల్లో ఉండటమే. గత ఐదేళ్ల ఐటీఐ అడ్మిషన్లు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2018లో అందుబాటులో ఉన్న సీట్ల కంటే 23 శాతం తక్కువగా అడ్మిషన్లు నమోదైతే, 2019లో 28 శాతం, 2020లో 40.76 శాతం, 2021లో 39.76 శాతం తక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం 2022లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏకంగా 71.08 శాతం తక్కువగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలోని 17 ఐటీఐ కాలేజీల్లో 2012 సీట్లు ఉంటే కేవలం 713 మాత్రమే భర్తీ అయ్యాయి. నంద్యాల జిల్లాలో 21 కాలేజీల్లో 2,924 సీట్లు ఉంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 714 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే నంద్యాల జిల్లాలో 75.58 శాతం తక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయి. దీన్నిబట్టే ఐటీఐ చదువులపై విద్యార్థులు మక్కువ చూపడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే.. ఐటీఐ, డిప్లొమో చదువులు పూర్తి చేసిన స్కిల్డ్ వర్కర్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రులు, బ్యాంకులు, రియల్ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగంలో స్కిల్డ్ వర్కర్ల అవసరం భారీగా ఉండబోతోంది. ఎన్ఎస్డీసీ(నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే వచ్చే నాలుగేళ్లలో 41.41 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల అవసరం ఉండబోతోంది. అయితే ఏడాదికి 2.85 లక్షల మందే అందుబాటులో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా కియా, హుండాయి, మారుతి, హరీ మోటార్స్ లాంటి ఆటోమొబైల్‌తో పాటు అన్ని రంగాల్లో కూడా ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో నిపుణులైన వారికి ఉద్యోగ అవకాశాలున్నాయి. కారు, బైక్ మెకానిక్, నిర్మాణరంగంలో ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఇటీవల ఈ రంగాల్లో పని నేర్చుకునే ఆసక్తి తగ్గుతోంది. మెకానిక్ నుంచి ఎలక్ట్రికల్, ఫిట్టర్ల వరకూ అసిస్టెంట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎలక్ట్రిషియన్ ఒక ఇంటికి కరెంట్ పని చేస్తే 2–4 రోజుల్లో పూర్తవుతుంది. దీనికి రూ.15 వేల నుంచి రూ. 20 వేలు తీసుకుంటున్నారు. నెలలకు కనీసం 5 కొత్త ఇళ్లకు ఎలక్రికల్ పని చేస్తే రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. బైక్ మెకానిక్, ఫిట్టర్లు కూడా రోజూ కనీసం రూ.3వేలు తక్కువ లేకుండా సంపాదిస్తారు. అంటే వీరి సంపాదన కూడా నెలకు రూ.90 వేలకుపైనే. స్కిల్ డెవలప్మెంట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి విద్యార్థుల్లో వృతినైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. జిల్లాలో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీ నిర్మిస్తోంది. రెండు జిల్లాల్లో 14 నియోజకవర్గాల్లో స్కిల్‌హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 5 హబ్‌లు ఏర్పాటు చేశారు. పది, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు 45 రోజుల నుంచి 60 రోజులు పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చదువు మధ్యలోనే ఆపేసినవారు, నిరుద్యోగులు ఇక్కడ ‘స్కిల్’ మెరుగుపరుచుకుని ఉద్యోగం సంపాదించొచ్చు. నియోజకవర్గానికి ఒక స్కిల్హబ్ ఏర్పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్నూలు, ఎమ్మిగనూరులో రెండు సెంటర్లలో శిక్షణ ఇస్తున్నాం. డిగ్రీ, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వేర్వేరుగా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ తర్వాత వీరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. 24/7, వెబ్బ్లెండర్స్ లాంటి కంపెనీలతో సంప్రదింపులు జరిపాం. శిక్షణ పూర్తికాగానే ప్లేస్మెంట్లు ఇస్తాం. – శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్, స్కిల్‌డెవలప్‌మెంట్ -
టెలికం కంపెనీలకు ‘సిమ్’ పోటు.. ఈ– సిమ్ పంచాయితీ!
న్యూఢిల్లీ: టెలికం సేవల కంపెనీలు (ఆపరేటర్లు), మొబైల్ ఫోన్ల తయారీదారుల మధ్య పేచీ వచ్చింది. ఇదంతా సిమ్ కార్డులకు కొరత ఏర్పడడం వల్లే. కరోనా కారణంగా లాక్డౌన్లతో సెమీకండక్టర్ పరిశ్రమలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. రెండేళ్లయినా కానీ సెమీకండక్టర్ల కొరత ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను వేధిస్తోంది. ఇది టెలికం కంపెనీలనూ తాకింది. సిమ్‌కార్డుల సరఫరాలో కొరత నెలకొంది. అంతేకాదు, 2024కు ముందు సిమ్ల సరఫరా పరిస్థితి మెరుగుపడేలా లేదు. దీంతో రూ.10,000 అంతకుమించి విలువ చేసే అన్ని మొబైల్ ఫోన్లలో, ఫిజికల్ సిమ్ స్లాట్‌తోపాటు.. ఎలక్ట్రానిక్ సిమ్ (ఈ–సిమ్) ఉండేలా మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించాలని టెలికం ఆపరేటర్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు లేఖ రాసింది. కానీ, సీవోఏఐ డిమాండ్‌ను ఇండియన్ సెల్యులర్ ఎలక్ట్రానిక్స్ అసిసోయేషన్ (ఐసీఈఏ)ను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. సెల్యులర్ ఆపరేటర్లు కోరుతున్నట్టు మొబైల్ ఫోన్లలో ఈ–సిమ్ కార్డులను ప్రవేశపెట్టడం వాటి తయారీ వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది. అదనపు హార్డ్‌వేర్ అవసరంతోపాటు, డిజైన్లోనూ మార్పులు అవసరమవుతాయని వివరించింది. ధరలు పెరిగే ప్రమాదం.. ప్రస్తుతం ఈ–సిమ్ ఆప్షన్ ఖరీదైన ఫోన్లలోనే ఉంది. కేవలం 1–2 శాతం మంది చందాదారులే ఈ ఫోన్లను వినియోగిస్తున్నారు. రూ.10,000పైన ధర ఉండే ఫోన్లు మొత్తం ఫోన్ల విక్రయాల్లో 80 శాతంగా ఉన్నాయని ఐసీఈఏ అంటోంది. ఈ–సిమ్‌ను తప్పనిసరి చేస్తే భారత మార్కెట్లో అమ్ముడుపోయే ఫోన్ల కోసం ప్రత్యేక డిజైన్లు అవసరమవుతాయని పేర్కొంది. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ–సిమ్ తప్పనిసరి అనే ఆదేశాలేవీ లేవు. దీంతో భారత మార్కెట్లో విక్రయించే ఫోన్లను ఈ–సిమ్‌కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేయాల్సి వస్తుంది. ఫలితంగా మధ్య స్థాయి ఫోన్ల ధరలు పెరిగిపోతాయి. మొబైల్ ఫోన్ల మార్కెట్లో సగం రూ.10,000–20,000 బడ్జెట్‌లోనివే కావడం గమనార్హం. సిమ్‌కార్డులకు కొరత ఏర్పడడంతో వాటి ధరలు పెరిగాయన్నది సెల్యులర్ ఆపరేటర్ల మరో అభ్యంతరంగా ఉంది. దీన్ని కూడా ఐసీఈఏ వ్యతిరేకిస్తోంది. ‘‘సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా ఫర్వాలేదు. కానీ, ఈ–సిమ్ కోసం ఫోన్లో చేయాల్సిన హార్డ్‌వేర్ మార్పుల కోసం అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువే’’అన్నది ఐసీఈఏ వాదనగా ఉంది. అన్ని మొబైల్ ఫోన్లకు ఈ–సిమ్‌లను తప్పనిసరి చేసినట్టయితే అది మొబైల్ ఫోన్ల పరిశ్రమ వృద్ధిని దెబ్బతీస్తుందని, ఎగుమతుల పట్ల నెలకొన్న ఆశావాదాన్ని సైతం నీరుగారుస్తుందని అంటోంది. త్వరలో కుదురుకుంటుంది.. సిమ్‌కార్డుల కొరత సమస్య త్వరలోనే సమసిపోతుందని ఐసీఈఏ అంటోంది. వచ్చే 6–9 నెలల్లో సాధారణ పరిస్థితి ఏర్పడొచ్చని చెబుతోంది. కానీ, సిమ్ సరఫరాదారులతో సీవోఏఐ ఇదే విషయమై చేసిన సంప్రదింపుల ఆధారంగా చూస్తే.. సిమ్ కార్డుల సరఫరా 2024కు ముందు మెరుగయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. హైలైట్స్ ► సరఫరా సమస్యల కారణంగా సిమ్ కార్డుల ధర పెరిగిపోయింది: సీవోఏఐ ► సిమ్ కార్డుల ధర ఐదు రెట్లు పెరిగినా, హార్డ్‌వేర్‌లో ఈ–సిమ్ల కోసం చేయాల్సిన మార్పుల వల్ల అయ్యే వ్యయాలతో పోలిస్తే తక్కువే: ఐసీఈఏ ► ఈ–సిమ్ కార్డులతో సిమ్‌కార్డుల వ్యర్థాలను (నంబర్ పోర్టబులిటీ రూపంలో) నివారించొచ్చు: సీవోఏఐ ► 1–2 శాతం చందాదారులే ఈ సిమ్‌లను వాడుతున్నారు. అన్ని ఫోన్లకు తప్పనిసరి చేయొద్దు: ఐసీఈఏ ► సిమ్ కార్డుల సరఫరా 2024లోపు మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు: సీవోఏఐ ► 6–9 నెలల్లో సరఫరా సాధారణ స్థితికి వచ్చేస్తుంది: ఐసీఈఏ -
స్కూళ్లు తెరిచి రెండు నెలలు.. సర్దుబాటు తలనొప్పులు, పరిష్కారం?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలో మళ్ళీ సర్దుబాటు తలనొప్పులు మొదలయ్యాయి. స్కూళ్లు తెరిచి రెండు నెలలు దాటినా సబ్జెక్టు టీచర్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనిని భర్తీ చేయడానికి ఒక చోటు నుంచి మరో చోటుకు టీచర్లను సర్దుబాటు చేస్తున్నారు. ఫలితంగా అనేక స్కూళ్లలో బోధన కుంటుపడుతోందన్న విమర్శలొస్తు న్నాయి. ఈ సర్దు బాట్లన్నీ జిల్లాల పరిధిలోనే జరుగుతా యని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సర్దుబాటు చేయాల్సి వస్తోందని జిల్లాల అధికారులు చెబుతున్నారు. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులు మొదలు పెట్టినా, ఈ తరహా సర్దు బాట్లు ఏమిటని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తు న్నారు. ఉపాధ్యాయుల కొరతే ఈ సమస్యకు కారణ మని అధికారులు అంటున్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప కొత్త నియామకాలపై స్పష్టత రాదని, అప్పటి వరకూ సర్దు బాట్లు తప్పవని చెపుతున్నారు. విద్యా వాలంటీర్ల నియామకం లేక.. ఏటా విద్యా వలంటీర్లను తీసుకుని బోధన కార్యక్రమాలు చేపట్టేవాళ్లు. దీనివల్ల సమస్య తీవ్రత కొంత కనిపించేది కాదు. అయితే కరోనా వచ్చినప్పటినుంచి విద్యా వలంటీర్ల నియా మకం చేపట్టడం లేదు. ఫలితంగా సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత మరింత పెరిగింది. ఇటీవల సేకరించిన వివరాల ప్రకా రం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 5 వేల మంది సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. సెకండరీ గ్రేడ్ టీచర్లతో కలిపి 16,500 మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించారు. అయితే, ఈ సంఖ్య 19 వేల వరకూ ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ప్రమోషన్లు ఇస్తే పరిష్కారం పదోన్నతులు, బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఖాళీలను భర్తీ చేయడం లేదు. దీనివల్ల విదావ్యవస్థలో అనేక ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పలుమార్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. విధిలేక పోరాటానికి సిద్ధమయ్యాం. ఇప్పటికైనా సర్దుబాటు కాకుండా, శాశ్వత పరిష్కారం వైపు అడుగులేయాలి. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి) ప్రాథమిక విద్యపైనా ప్రభావం.. రాష్ట్రంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధన విష యంలో ప్రభుత్వం ఇప్పటికీ శ్రద్ధ పెట్టడం లేదని విమ ర్శలు వస్తున్నాయి. ఈ కేటగిరీలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయినట్లు ఇటీవల నివేదికలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఉపాధ్యాయుల కొరత తీర్చడం అటుంచి, ఉన్న టీచర్లను వేరే ప్రదేశాలకు సర్దుబాటు చేస్తు న్నారనే విమర్శలొస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఓ స్కూల్ ఉపాధ్యాయుడిని ఉన్నత పాఠశాలకు పంపారు. దీంతో ప్రాథమిక పాఠశాలలో బోధన కుంటుపడింది. ఆసిఫా బాద్‌లో 65 మందిని, నిర్మల్‌లో 110 మందిని, ఆదిలా బాద్‌లో 97 మందిని ఈ విధంగానే సర్దుబాటు చేశారు. -
మానవ వనరుల కొరత.. పేటెంట్లపై ప్రభావం!
న్యూఢిల్లీ: మానవ వనరులు, నిబంధనలను పాటించడానికి కష్టతరమైన పరిస్థితులే దేశీయంగా పేటెంట్ల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొంది. అత్యవసరంగా పేటెంట్ వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరంపై దీన్ని ఈఏసీ–పీఎం రూపొందించింది. భారత్‌లో ఇటీవలి కాలంలో దాఖలైన, మంజూరైన పేటెంట్ల సంఖ్య పెరిగినప్పటికీ .. అమెరికా, చైనా లాంటి వాటితో పోలిస్తే తక్కువగానే ఉందని ఇందులో పేర్కొంది. 2022 మార్చి ఆఖరు నాటికి పేటెంట్ ఆఫీసులో 860 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని.. చైనాలో ఈ సంఖ్య 13,704 కాగా అమెరికాలో 8,132గా ఉందని వివరించింది. చైనాలో సగటున పేటెంట్ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికి 20–21 నెలల సమయం పడుతుందని.. భారత్‌లో ఇందుకు 58 నెలలు పడుతోందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆఖరు నాటికి పేటెంటు కార్యాలయంలో కంట్రోలర్ స్థాయిలో 1.64 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. వచ్చే రెండేళ్లలో పేటెంట్ ఆఫీసులో ఉద్యోగుల సంఖ్య కనీసం 2,800కి పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
విశాఖలో పెట్రో కొరత!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తోంది. గత కొద్దికాలంలో డిమాండ్‌కు తగిన స్థాయిలో ఆయిల్ కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా కావడం లేదు. ఫలితంగా రోజులో కొద్ది సమయం పాటు కొన్ని పెట్రోలు బంకుల యాజమాన్యాలు షాపులను మూసివేస్తున్నాయి. ప్రధానంగా గత నెలలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో ఉత్పత్తి నిలిచి పోవడంతోనే సమస్య ప్రారంభమయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం రిఫైనరీలో కాస్తా ఉత్పత్తి యథావిధిగా ఇబ్బందులు లేకుండా సాగుతోంది. అయినప్పటికీ గత కొద్దికా లంగా ఏర్పడిన ఉత్పత్తి కొరతను తీర్చుకునేందుకు అనుగుణంగా బీపీసీఎల్, ఐవోసీలకు కోటా విధానాన్ని అమలు చేస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ వినియోగం ఆధారంగా కోటాను ఇవ్వడంతో పాటు బల్క్ వినియోగదారులకు ఆయిల్ అమ్మకాలను నిలిపి వేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో 260కి పైగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ రోజువారీ వినియోగం సగటున రోజువారీగా 17 లక్షల లీటర్ల నుంచి 18 లక్షల లీటర్లు ఉంటుందని అంచనా. అయితే, రోజువారీగా సరఫరా మాత్రం 16 లక్షల లీటర్ల నుంచి 17 లక్షల లీటర్ల మేర ఉంటుందని పెట్రోల్ డీలర్లు చెబుతున్నారు. బల్క్ వినియోగదారులకు సరఫరా నిలిచిపోవడంతో పాటు బల్క్ ధర కంటే రిటైల్ ధరనే తక్కువగా ఉండటంతో కొద్ది మంది బల్క్ వినియోగదారులు కాస్తా రిటైల్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు సరఫరా కాస్తా తగ్గిపోవడంతో పాటు బల్క్ వినియోగదారులు రిటైల్‌గా కొనుగోలు చేయడంతో బంకులకు సరఫరా అయిన ఆయిల్ నిల్వలు కాస్తా వెంటనే అయిపోతున్నాయి. ఫలితంగా కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తిరిగి ఆయిల్ సరఫరా అయ్యే వరకు బంకులను మూసేసుకుంటున్న పరిస్థితి ఏర్పడుతోంది. అయితే, క్రమంగా పరిస్థితి మెరుగుపడుతోందని, కొద్దిరోజుల్లోనే ఇబ్బందులు లేకుండా సరఫరా జరుగుతుందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. బల్క్ వినియోగదారులూ రిటైల్ గానే...! వాస్తవానికి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధానంగా బల్క్ వినియోగదారులందరూ ఐవోసీ నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో హెచ్‌పీసీఎల్‌కు మాత్రమే రిఫైనరీ ఉంది. ఫలితంగా అటు బీపీసీఎల్ కానీ ఇటు ఐవోసీ కానీ హెచ్‌పీసీఎల్ నుంచి మాత్రమే ఆయిల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు బల్క్ ధర కంటే రిటైల్ ధరనే చౌక. దీంతో డీలర్లు కాస్తా బల్క్ వినియోగదారులకు విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బల్క్ వినియోగదారులకు ఆయిల్‌ను సరఫరా చేయవద్దనే షరతును కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ విధించినట్టు తెలుస్తోంది. ఫలితంగా బల్క్ వినియోగదారులకు కాస్తా ఆయిల్ సరఫరా కావడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బల్క్ వినియోగదారులు కూడా రిటైల్‌గా వచ్చి ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరఫరా అయిన పెట్రోల్, డీజిల్ కాస్తా బంకులల్లో ఖాళీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయిల్ సరఫరా చేసేందుకు కోసం ఆయిల్ కంపెనీలకు పలువురు డీలర్లు అడ్వాన్స్‌లను చెల్లించడం పరిపాటి. అయితే, గత కొద్దికాలంగా అడ్వాన్స్‌లను చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఆయిల్ కంపెనీలు తేల్చిచెప్పినట్టు సమాచారం. డిసెంబర్ కోటాను బట్టే...! విశాఖ తీరంలో హెచ్‌పీసీఎల్‌కు రిఫైనరీ ఉంది. ఈ రిఫైనరీ విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రిఫైనరీ సామర్థ్యాన్ని ఏకంగా 15 ఎంఎంపీటీఏలకు పెంచాలని సంస్థ నిర్ణయించింది. ఈ రిఫైనరీ నుంచే హెచ్‌పీసీఎల్ బంకులతో పాటు బీపీసీఎల్, ఐవోసీ బంకులకు కూడా ఆయిల్ సరఫరా అవుతుంది. గత నెలలో హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఆయిల్ సరఫరాలో గత కొద్దికాలంగా ఇబ్బందులు తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం రిఫైనరీలో ఉత్పత్తి ప్రారంభమయ్యింది. అయినప్పటికీ కొద్దికాలం పాటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేసేందుకుగానూ డిసెంబర్ కోటాకు అనుగుణంగా సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు చెబుతున్నట్టు సమాచారం. ఇది కూడా బంకు యాజమాన్యాలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫలితంగా తమ వద్ద ఉన్న పెట్రోల్, డీజిల్ అయిపోయిన తర్వాత కొన్ని పెట్రోల్ బంకులు మూతవేసుకుంటున్నారు. -
కుమ్మక్కు ధోరణులతో పెను సవాళ్లు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, సరఫరాపరమైన అంతరాయాలకు దారి తీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కంపెనీలు కుమ్మక్కయ్యే ధోరణులను ఎదుర్కొనడం పెను సవాలుగా ఉండనుందని ఆమె తెలిపారు. దేశీయంగా డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఎగుమతులు కూడా చేసేంత స్థాయిలో భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని కొంత ఆందోళన వ్యక్తమవుతోందంటూ మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి, తూర్పు యూరప్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీలు, ముడి వస్తువుల కొరత నెలకొందని, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘వివిధ దశల్లో అవాంతరాలు వస్తున్నాయి. ఇవి నిజంగానే కోవిడ్ లేదా యుద్ధం వల్ల తలెత్తినవా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గుత్తాధిపత్యం లేదా రెండు సంస్థల ఆధిపత్యం వల్ల ధరలు పెరిగిపోవడం, సరఫరాపరమైన అంతరాయాలు కలగకుండా చూడాలి‘ అని మంత్రి సూచించారు. గత రెండేళ్లుగా సీసీఐ సవాళ్లను మరింత సానుకూలంగా అధిగమిస్తోందని ఆమె కితాబిచ్చారు. ‘సవాళ్లు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. కాబట్టి, ఇలాంటి వాటిని పరిష్కరించడంలో వెనుకబడి పోకుండా సీసీఐ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి‘ అని పేర్కొన్నారు. -
నిరుద్యోగుల్ని వేధిస్తున్న అకాడమీ పుస్తకాల కొరత
-
అన్నీ కొరతలే.. అద్భుతం: కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ పాలన వల్ల కొరత కొనసాగుతోందంటూ సోమవారం ఉదయం కేటీఆర్ ఓ ట్వీట్ వేశారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత, ఈ అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీకి విజన్ కొరత అంటూ ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. అంతేకాదు ఈ పాలన అద్భుతమంటూ వెటకారం ప్రదర్శించారు. ప్రధాని మోదీకి విజన్ లేకపోవడం వల్లే దేశానికి ఈ పరిస్థితి దాపురించిందన్న అర్థంతో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. సమకాలీన అంశాలను.. అది టైమింగ్‌లో అస్త్రాలుగా చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తుండడం విశేషం. బీజేపీ పాలనలో *బొగ్గు కొరత* కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత* పరిశ్రమలకు *కరెంట్ కొరత* యువతకు *ఉద్యోగాల కొరత* గ్రామాల్లో *ఉపాధి కొరత* రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత* అన్ని సమస్యలకు మూలం PM *మోడీకి విజన్ కొరత* NPA Govt’s amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF — KTR (@KTRTRS) May 2, 2022 చదవండి: చెప్పేది గాంధీ సూక్తులు.. కొలిచేది గాడ్సేను -
ఆరుగురితో విద్యుత్ ‘కోర్ కమిటీ’
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ సరఫరా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమలకు కూడా పరిమితులు తొలగించి, సాధారణ స్థితిలో విద్యుత్ సరఫరా చేయడానికి కృషిచేస్తోంది. దీన్లో భాగంగా బొగ్గు కొరత కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరతను అధిగమించడానికి చైర్మన్, ఐదుగురు సభ్యులతో కోర్ మేనేజ్మెంట్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి బి.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంధనశాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో జెన్కో డైరెక్టర్ (బొగ్గు), ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్), ట్రాన్స్‌కో డైరెక్టర్ (ఫైనాన్స్), ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సభ్యులుగా ఉంటారు. ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఈ కమిటీకి కూడా మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఫ్యూయెల్ సప్లై అగ్రిమెంట్స్ (ఎఫ్ఎస్ఏ) ప్రకారం బొగ్గును సక్రమంగా సరఫరాకు సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్ బొగ్గు క్షేత్రాలతో ఈ కమిటీ నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. కేంద్ర బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖలతో మాట్లాడి బొగ్గు రవాణా (ర్యాక్స్)లో పరిమితులను పరిష్కరించేందుకు కృషిచేస్తుంది. అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ఆర్థికశాఖకు నివేదిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలతో సమన్వయం చేస్తూ.. థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత బొగ్గు సరఫరా ఉండేలా చూస్తుంది. క్లిక్: బొండా ఉమ చిల్లర రౌడీ -
నన్ను క్షమించండి: శ్రీ లంక ప్రధాని
ఆర్థిక సంక్షోభంతో పరిస్థితులు చేజారిపోయిన వేళ.. శ్రీలంకలో నిరసనలు మిన్నంటాయి. ఆహార.. మందలు కొరత, నిత్యావసరాల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం అవినీతి విధానాల వల్లే ఇదంతా అంటూ ఆరోపిస్తూ.. దిగిపోవాలంటూ ప్రజా నిరసన పెల్లుబిక్కుతోంది. ఈ తరుణంలో ప్రధాని మహీంద రాజపక్స ఒక వీడియో విడుదల చేశాడు. ఆర్థిక సంక్షోభంతో పాటు తాజా పరిస్థితులపైనా దేశ పౌరులకు వివరణ ఇచ్చుకున్నాడు. శ్రీ లంక ప్రధాని మహీంద రాజపక్స.. సోమవారం జాతిని ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశాడు. రాజీనామా డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చల్లార్చే దిశగా ఆయన ప్రసంగం సాగింది. లంక తీవ్ర సంక్షోభానికి కారణాలేంటో చెప్పిన మహీంద రాజపక్స.. ప్రదర్శలను తక్షణమే విరమించాలని నిరసనకారుల్ని విజ్ఞప్తి చేశాడు. ‘‘కొవిడ్‌తో లంక ఆర్థిక స్థితి కుప్పకూలింది. క్షీణించిన విదేశీ నిల్వలు కారణంగానే.. ఆర్థిక సంక్షోభంలోకి దేశం కూరుకుపోయింది. మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే మన దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిసినప్పటికీ.. లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. అందుకే మన విదేశీ నిల్వలు క్షీణించాయి. అంతేగానీ.. ప్రభుత్వ విధానాలు, మా పాలన అందుకు కారణాలు కావు. మా పాలనలో అసలు అవినీతికి చోటే లేదు కూడా. గత ప్రభుత్వాలు కూడా దేశాన్ని అప్పుల్లోకి నెట్టాయి. కరోనా పరిస్థితులు ఆ అప్పుల్ని మరింత ఊబిలోకి లంకను నెట్టేశాయని చెప్పుకొచ్చారు మహీందా. ప్రజల కష్టాలు చూసి చాలా బాధపడుతున్నా. శ్రీ లంక ప్రజల్ని క్షమాపణ కోరుతున్నా అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నాడు మహీంద. ‘‘ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం 24 గంటలూ మా ప్రభుత్వం పని చేస్తోంది. మీరు(నిరనసకారుల్ని ఉద్దేశిస్తూ..) వీధుల్లో గడిపే ప్రతి నిమిషమూ దేశానికి డాలర్ ప్రవాహాన్ని దూరం చేస్తుంది. ఈ సమయంలో రాజకీయాలు వద్దన్నా.. ఎవరూ వినడం లేదు. దేశం పతనం కాకుండా రక్షించుకునేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలన్నా ఎవరూ స్పందించలేదు. మీరైనా సహనంతో మాకు సహకరించండి. అతికొద్దిరోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తాం’’ అని పేర్కొన్నాడు. స్నేహపూర్వక దేశాల నుండి సహాయం తీసుకునేటప్పుడు తాను దేశ సార్వభౌమత్వాన్ని త్యాగం చేయనని పేర్కొన్న రాజపక్సే.. ద్వీపం దేశం చాలా నిర్ణయాత్మక దశలో ఉందని అన్నారు. పనిలో పనిగా.. రైతులకు ఎరువుల సబ్సిడీని పునరుద్ధరిస్తానని శ్రీలంక ప్రధాని కీలక ప్రకటన చేశారు. చదవండి: మా వల్ల కాదు బాబోయ్.. లంకలో తీవ్ర ఉద్రిక్తతలు -
దేశంలో వంట నూనెల కొరత ఉండదు!
న్యూఢిల్లీ: దేశంలో వంట నూనెల కొరత ఉండబోదని ప్రభుత్వానికి పరిశ్రమ భరోసా ఇస్తోంది. దీనిపై ఆందోళన అక్కర్లేదని సూచిస్తోంది. వంట నూనెల సరఫరాల్లో ఎటువంటి సమస్యలూ లేకుండా తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రభుత్వానికి పరిశ్రమ హామీ ఇచ్చింది. రెండు నెలల్లో ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని వంట నూనెల పరిశ్రమ ప్రతినిధులు కేంద్ర ఆహార వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు హామీ ఇచ్చినట్లు శుక్రవారం ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. దీనితో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొద్దు తిరుగుడు పువ్వు నూనె భారీగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులు జరుగుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రి గోయల్ ఒక కీలక సమావేశం నిర్వహించి సన్‌ఫ్లవర్ ఆయిల్సహా వంటనూనెల సరఫరాలపై సమీక్ష జరిపారు. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) సెక్రటరీ జనరల్ ఎస్పీ కమ్రా, అదానీ విల్మర్, రుచీ సొయా, మోడీ న్యాచురల్స్సహా ప్రముఖ రిఫైనర్లు, దిగుమతిదారుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సన్‌ఫ్లవర్.. తగినంత లభ్యత! సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొరత లేదని సమావేశంలో పారిశ్రామిక ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. మార్చిలో డెలివరీ కోసం మొదటి షిప్మెంట్ 1.5 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ యుద్ధానికి ముందే ఉక్రెయిన్ నుండి బయలుదేరింది. త్వరలో ఈ షిప్మెంట్ (దిగుమతుల) భారత్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో ఒక నెలలో 18 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం జరగుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ వాటా దాదాపు 1.5–2 లక్షల టన్నులు. హార్డ్‌కోర్ వినియోగదారుల (కేవలం సన్‌ఫ్లవర్ వంట నూనె వినియోగించే వారు) డిమాండ్‌ను తీర్చడానికి లక్ష టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే అవసరం. దేశంలో పొద్దుతిరుగుడు నూనెకు ఆవాలు, సోయాబీన్ నూనెల రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖకు పరిశ్రమ తెలిపిందని ఆ వర్గాలు తెలిపాయి. దాదాపు 11 లక్షల టన్నుల కొత్త ఆవాల పంట రావడంతో వచ్చే 2–3 నెలల్లో దేశంలో సరఫరాలు తగిన స్థాయిలోనే ఉంటాయని భరోసాను ఇచ్చింది. భారతదేశం తన వంట నూనెల డిమాండ్‌లో 60 కంటే ఎక్కువ వాటా దిగుమతులదే కావడం గమనార్హం. తయారీని పెంచే మార్గాలు అన్వేషించండి: గోయల్ కాగా, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచే దిశగా తగిన మార్గాలు అన్వేషించాలని పరిశ్రమ వర్గాలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ పిలుపునిచ్చారు. అలాగే, టెక్నాలజీలో భారత్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దే క్రమంలో 10 పరిశోధన, అభివృద్ధి ల్యాబ్‌లను లేదా నవకల్పనల కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ప్రస్తుతం జీడీపీలో తయారీ రంగ వాటా 15 శాతం స్థాయిలో ఉంది. డీపీఐఐటీ వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. జీడీపీలో ఎగుమతుల వాటాను 25 శాతానికి పెంచడంపై కూడా పరిశ్రమ దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. సర్వీసుల ఎగుమతుల్లో టాప్ మూడు దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగడం, విదేశీ వాణిజ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు తోడ్పాటు అందించడం వంటి అంశాలపై కసరత్తు జరగాలని పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు దేశీ కంపెనీలు మద్దతునివ్వాలని గోయల్ చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంపై పలు దేశాల్లో ఆసక్తి నెలకొందని ఆయన తెలిపారు. -
ఇంటెల్‌కు షాక్.. శాంసంగ్ దెబ్బ మామూలుగా లేదు!
ఒకవైపు సెమీకండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ రంగం, డివైజ్ తయారీ రంగం ఘోరంగా దెబ్బ తిన్నాయి. కొత్త మోడల్స్ సంగతి ఏమోగానీ.. ప్రొడక్టివిటీని పెద్ద మొత్తంలో చేయలేకపోతున్నాయి. ఈ తరుణంలో ఈ గ్యాప్‌లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ దూసుకొచ్చింది. ఏకంగా చిప్ దిగ్గజం ‘ఇంటెల్’కు ఎసరు పెట్టి.. తొలి స్థానాన్ని అధిగమించింది. 2021లో లాజిక్ ఐసీ, మెమరీ చిప్ సెగ్మెంట్లలో ఉత్పత్తి అధికంగా జరగడంతో శాంసంగ్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీలో ఉపయోగించే డైనమిక్ ర్యాన్డమ్-యాక్సెస్ మెమరీ (DRAM), NAND ఫ్లాష్ మార్కెట్ ఫర్ఫార్మెన్స్ సైతం ఇంటెల్ కంటే మెరుగైన బిజినెస్ చేయడం విశేషం. వాస్తవానికి కిందటి ఏడాది రెండో త్రైమాసికం వద్దే ఇంటెల్‌ను శాంసంగ్ అధిగమించింది. అయితే అది కొన్ని విభాగాల్లో మాత్రమే కావడం గమనార్హం. ఇప్పుడు పూర్తి కేటగిరీల్లో ఇంటెల్‌ను శాంసంగ్ డామినేట్ చేసేసింది. స్మార్ట్‌ఫోన్ ఎస్వోసీ (సిస్టమ్ ఆన్ చిప్), జీపీయూ అమ్మకందారులు కూడా యాభై శాతం అధిక ఆదాయాన్ని చవిచూసినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. తద్వారా అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ ఇంటెల్‌ను.. దక్షిణ కొరియా శాంసంగ్ అన్నింటా అధిగమించినట్లయ్యింది. ఈ పోటీలో శాంసంగ్‌ను ఇంటెల్ ఇప్పట్లో అధిగమించకపోవచ్చనే భావిస్తున్నారు నిపుణులు. అదనంగా టాప్ 15 అమ్మకందారుల్లో.. 27 శాతం ఆదాయ వృద్ధిని గమనించినట్లు రీసెర్చ్ అనలిస్ట్ విలియమ్ లీ వెల్లడించారు. ఇదిలా ఉంటే చిప్ కొరత సమస్య 2023 వరకు తీరేది కాదని ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ చెప్తున్నారు. మరోవైపు చిప్ కొరతను క్యాష్ చేసుకునే ఉద్దేశంలో శాంసంగ్ ఉంది. సుమారు 17 బిలియన్ల డాలర్లతో సెమీకండక్టర్ కంపెనీని ఆస్టిన్ బయట నెలకొల్పుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత వార్త: చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్ -
లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా?
గ్లోబల్ లెవల్లో ఆటోమొబైల్ రంగం.. అందునా ఈవీ కేటగిరీలో ఆ రేంజ్ లాభాలు మరేయితర కంపెనీ సాధించలేదు. పైగా గడిచిన ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాదిలో యాభై శాతం అధికంగా వాహన ఉత్పత్తి సామర్థ్యం ఉందని ప్రకటించుకుంది కూడా. అయినప్పటికీ ఈ ఏడాదిలో కొత్త మోడల్ తేలేమని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. టెస్లా 2023 మొదటి భాగం(Q1) వరకు ఎలాంటి కొత్త మోడళ్లను రిలీజ్ చేయబోదని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రకటించారు. ప్రపంచ ఆటో రంగం ఎదుర్కొంటున్న చిప్ షార్టేజ్ ఇందుకు ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. దీంతో కిందటి ఏడాది వస్తుందని భావించిన సైబర్‌ట్రక్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. అంతేకాదు 25 వేల డాలర్ల చిన్న సైజు ఎలక్ట్రిక్ కారు విషయంలో సైతం ప్రయత్నాలు ముందుకెళ్లట్లేదని, అయినప్పటికీ కారును మార్కెట్లోకి తెచ్చి తీరతామని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం చెయిన్ సిస్టమ్ సప్లయ్ సమస్యను అధిగమించడం, ప్రపంచ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంపై టెస్లా తన దృష్టి సారిస్తుందని ఎలన్ మస్క్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించాడు. రాడికల్ సైబర్‌ట్రక్ తో పాటు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కారు సైతం ఆలస్యం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త వాహనాలను ప్రవేశపెడితే.. మొత్తం ఉత్పత్తిపైనే ప్రభావం పడుతుందని ఎలన్ మస్క్ చెప్తున్నారు. కొత్త మోడల్‌ను లాంచ్ చేయడానికి అదనపు వనరులను గనుక మళ్లిస్తే.. ఇతర మోడళ్లను ఉత్పత్తి చేసే సంస్థ సామర్థ్యం పరిమితం అవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎలన్ మస్క్ తెలిపారు. అయితే సైబర్‌ట్రక్, రోడ్స్టర్ల ఉత్పత్తికి మద్దతు ఇచ్చే సాధనాలను 2022లోనే మొదలుపెట్టాలనుకుంటున్నామని, వచ్చే ఏడాది నుంచి వాటి ఉత్పత్తిని ఆశిస్తున్నామని మస్క్ వివరణ ఇచ్చుకున్నారు. చదవండి: బాబోయ్ బూతు వీడియోలు.. టెస్లాకు కొత్త చిక్కులు! -
బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ
This Toyota Car Will Deliver After 4 Years: ఆ కారును బుక్ చేసుకున్నవాళ్లు డెలివరీ కోసం నాలుగేళ్లు ఎదురుచూడక తప్పదంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్ కార్ మేకర్ టయోటా స్పందించింది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ 300 కోసం ఎదురు చూడకతప్పదంటూ కొన్ని వెబ్ సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రచారం వాస్తవమని, వాహనదారులు మన్నించాలంటోంది టయోటా. నిజానికి ఈ మోడల్‌ను కిందటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, హై ఫీచర్లతో తీసుకొచ్చింది. 2022 మూడవ త్రైమాసికంలో మార్కెట్లోకి రావొచ్చని భావించారు. అయితే.. సెమీకండక్టర్ల కొరత వల్ల ఇప్పుడు బుక్ చేసుకున్నవాళ్లకు నాలుగేళ్ల దాకా వాహనం డెలివరీ చేయలేమని కంపెనీ తేల్చేసింది. హై ఫీచర్లు ఉండడంతో సెమీకండర్లు అధికంగా అవసరం పడుతోందని, అందుకే అవాంతరాలు ఎదురవుతున్నాయని, అయినా నాలుగేళ్లలోపే డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని టయోటా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ప్రభావం ఇతర మార్కెట్లపై పడనుంది. భారత మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్సీ300 ధర కోటిన్నర రూపాయలకు పైనే ఉండొచ్చని అంచనా. ఈ వెహికిల్ 10 శాతం తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇంజిన్‌పరంగా రెండు వేరియెంట్స్ లభించనున్నాయి. నిస్సాన్ పాట్రోల్, బెర్సిడెజ్ బెంజ్ జీఎస్, బీఎండబ్ల్యూ ఎక్స్ 6 మోడల్స్‌కు గట్టి పోటీగా దీనిని భావిస్తున్నారు. -
ఆటో అమ్మకాలపై చిప్ ఎఫెక్ట్
ముంబై: దేశీయ ఆటో తయారీ కంపెనీల డిసెంబర్ వాహన విక్రయ గణాంకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. గతేడాది చివరి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా కార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే డిసెంబర్లో ద్విచక్ర వాహన కంపెనీలైన హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. ఆర్థిక రికవరీతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ విభాగానికి చెందిన వోల్వో ఐషర్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం వాహన అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ► మారుతీ గతేడాది డిసెంబర్లో దేశీయంగా 1,23,016 వాహనాలను అమ్మింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో (2020) లో విక్రయించిన 1,40,754 యూనిట్లతో పోలిస్తే 13 % తక్కువ గా ఉంది. 2021లో 12.14 లక్షల యూనిట్లను విక్రయించింది. ► ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ 50% వృద్ధిని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్లో ఈ సంస్థ 23,545 కార్లను అమ్మగా.. 2021లో 35,299 యూనిట్లను అమ్మింది. దేశీయ ఆటో పరిశ్రమపై డిసెంబర్నూ సెమికండెక్టర్ల కొరత ప్రభావం కొనసాగింది. ప్రతికూలతల కంటే సానుకూలతలు ఎక్కువగా ఉండటంతో కొత్త ఏడాది అమ్మకాలపై ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నాము. అయితే ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, సెమికండెక్టర్ల కొరత సమస్యలు పరిశ్రమకు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి. శశాంక్ శ్రీవాస్తవ మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
128 మంది బాలురు.. బిగపట్టుకుని.. ఒకరి తరువాత ఒకరు
సాక్షి, వేములవాడ(కరీంనగర్): విద్య, వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ దిశగా పనులు కనబడడం లేదు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో మాత్రం ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కాక విద్యార్థులు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ఉదాహరణే వేములవాడ రూరల్ మండలంలోని 17 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు. ఇందులో ప్రధానంగా ఫాజుల్‌నగర్ మండల పరిషత్ పాఠశాలలో అసౌకర్యాల మధ్య పిల్లలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. 1వ తరగతి నుంచి ఐదోతరగతి వరకు 128 మంది పిల్లలు ఉన్నారు. వీరికి మూడు గదులు మాత్రమే ఉన్నాయి. రెండు గదులు చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో వాటిని వినియోగించడం లేదు. ఇక బాత్రూంల పరిస్థితి చెప్పనక్కర్లేదు. 128 మందికి ఒకే బాత్రూం ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టాల్సిందే. ఒకరు వెళ్లారంటే మిగితా వారు బిగపట్టుకుని వచ్చేవారి కోసం ఎదురుచూడాల్సిందే. ఇలా మండంలోని నమిలిగుండుపల్లి తదితర గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని చిన్నారుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ చైర్మన్లు కోరుతున్నారు. చదవండి: నాలుగు రోజుల్లో పెళ్లి.. యువకుడి అదృశ్యం -
మరీఘోరంగా టూ వీలర్స్ అమ్మకాలు
November 2021 Record Lowest wholesales In automobile industry Due To Chip Shortage: ఆటోమొబైల్ రంగంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక నెలలో ద్విచక్ర వాహనాలు రికార్డు స్థాయిలో తక్కువగా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లోనూ ఇదే ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. 2021 నవంబర్ నెల ఆటోమొబైల్ రంగానికి అచ్చి రాలేదు. ఓవైపు పండుగ సీజన్ కొనసాగినా.. ఊహించినంత వాహన అమ్మకాలు లేకపోవడం విశేషం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చురర్స్ (SIAM) నివేదికల ప్రకారం నవంబర్ నెలలో.. ప్యాసింజర్ వెహికిల్ అమ్మకాల మొత్తం 18.6 శాతం పడిపోయింది. అదే విధంగా టూ వీలర్స్ ఏకంగా 34 శాతం తగ్గింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ డౌన్‌ఫాల్ దారుణంగా నమోదు అయ్యింది. ►ప్యాసింజర్ వెహికిల్స్ ఈ నవంబర్‌లో 2, 15, 626 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 2, 64, 898గా ఉంది. ఇక ఉత్పత్తి కూడా 9.5 శాతం పడిపోయింది (2,94,596 యూనిట్ల నుంచి 2,66,552కి). ►టూ వీలర్స్ ఈ నవంబర్‌లో 10, 50, 616 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. కిందటి ఏడాది నవంబర్‌లో ఈ సంఖ్య 16 లక్షల యూనిట్లకు పైనే ఉంది. ఇక ఉత్పత్తి కూడా 29 శాతం పడిపోయి.. పదకొండేళ్ల తర్వాత పతనం నమోదు చేసుకుంది. 19, 36, 793 యూనిట్లకు గానూ 13, 67, 701 యూనిట్లను ఉత్పత్తి పడిపోయింది. ►ఇక త్రీ వీలర్స్ విషయానికొస్తే.. ఈ నవంబర్‌లో 6.64 శాతం క్షీణత కనిపిస్తోంది. 22, 471 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 24, 071 యూనిట్లుగా ఉంది. ఉత్పత్తి మాత్రం 6 శాతం పడిపోయింది. 65, 460 యూనిట్ల నుంచి 61, 451 యూనిట్లకు పడిపోయింది. పెరిగిన ఎగుమతి.. అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీలు అస్సలు తగ్గట్లేదు. మొత్తంగా ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే.. ప్యాసింజర్ వెహికిల్స్‌లో 15.5 శాతం పెరుగుదల (44, 265 యూనిట్లు), టూ వీలర్స్‌లో 9 శాతం (3, 56, 659 యూనిట్లు), త్రీ వీలర్స్‌లో 14 శాతం (42, 431 యూనిట్లు) ఎగుమతి శాతం పెరిగింది. కారణం.. సెమీ కండక్టర్ల కొరత. కరోనా సమయంలో చిప్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు మూతపడి.. ఈ ప్రభావం ఏడాది తర్వాత కూడా వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అయితే నవంబర్‌లో అదీ పండుగ సీజన్లో ఈ రేంజ్ ప్రతికూల ప్రభావం చూడడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి అని సియామ్(SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్తున్నారు. ముఖ్యంగా త్రీ వీలర్స్ అమ్మకాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారాయన. చదవండి: గూగుల్, యాపిల్‌ను తలదన్నే రేంజ్ ప్లాన్.. 17 బిలియన్ డాలర్లతో చిప్ ఫ్యాక్టరీ -
Omicron Variant: సిరంజీలకు కొరత..!
కరోనా రెండోవేవ్‌లో వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు హాహాకారాలు చేశాయి. టీకాలు పంపండి మహాప్రభో అంటూ కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఉత్పత్తి పెరిగి ఇప్పుడు సమృద్ధిగా టీకా డోసులు అందుబాటులోకి వచ్చేశాయని స్థిమిత పడుతుంటే మరో సమస్య వచ్చిపడింది. ఒమిక్రాన్ వేరియెంట్, జనవరి– ఫిబ్రవరి నెలల్లో థర్డ్‌వేవ్ పీక్స్‌కు చేరొచ్చనే వార్తలనేపథ్యంలో సిరంజీలకు తీవ్ర కొరత రానుంది. కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఏం జరిగింది? మూలిగే నక్కపై తాటిపండు ప్రపంచంలోనే అతిపెద్ద సిరంజీ ఉత్పత్తి సంస్థ హిందుస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైసెస్ (హెచ్ఎండీ) సంస్థకు హరియాణాలోని ఫరీదాబాద్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్–ఎస్సీఆర్ పరిధిలోకి వస్తుంది) శివార్లలో ఎనిమిది ఆటోమేటెడ్ ప్లాంట్లు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించట్లేదు కాబట్టి ఇందులో ప్రధాన ప్లాంట్‌తో సహా మూడింటిని మూసివేయాల్సిందిగా హరియాణా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. లేదంటే చట్టపరమైన చర్యలు చేపడతామని, ప్లాంట్లను సీల్ చేస్తామని హెచ్చరించింది. డీజిల్ జనరేటర్లతో ప్లాంట్లను నడుపుతున్నారని, ఇది కాలుష్యానికి కారణమవుతోందనేది పీసీబీ ఆక్షేపణ. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినపుడే తప్పితే తాము పెద్దగా డీజిల్ జనరేటర్లు ఉపయోగించట్లేదని పీసీబీకి వివరించినా... వారిని ఒప్పించలేకపోయామని హెచ్ఎండీ పేర్కొంది. దాంతో వీటిని హెచ్ఎండీ మూసివేసింది. ♦భారత్ అవసరాల్లో మూడింట రెండొంతులు హెచ్ఎండీయే తీరుస్తోంది. ♦ఏడాదికి హెచ్ఎండీ ఉత్పత్తి సామర్థ్యం. భారత్‌లో 20 పైచిలుకు సిరంజీ ఉత్పత్తి సంస్థలు ఉండగా... వీటి ఉమ్మడి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 50 కోట్లు. అంటే ఏడాదికి 600 కోట్లు. ఇందులో హెచ్ఎండీ ఒక్కటే 450 కోట్లు ఉత్పత్తి చేస్తోందంటే... దాంట్లో ఉత్పత్తి నిలిచిపోతే ఎదురయ్యే కొరతను అంచనా వేయవచ్చు. ♦ ప్రతిరోజూ ఈ సంస్థ ఉత్పత్తి చేసే సిరంజీల సంఖ్య 1.2 కోట్ల పైచిలుకే ♦మూడు ప్లాంట్ల మూసివేత కారణంగా రోజులు 80 లక్షల సిరంజీలు, 1.5 కోట్ల నీడిల్స్ ఉత్పత్తి నిలిచిపోతుందని హెచ్ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్‌నాథ్ తెలిపారు. ఈ లెక్కన కంపెనీ ఉత్పత్తిలో నెలకు 24 కోట్లు, ఏడాది 288 కోట్లు కోత పడుతుంది. దీంతో భారత్‌లో సిరంజీలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదముంది. ఫలితంగా కోవిడ్ వ్యాకినేషన్ కార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగే ఆస్కారం ఉంది. ♦ భారత్‌లో ప్రతి వ్యక్తికి సగటున ఏడాదికి 2.9 సిరంజీల వాడకం జరుగుతున్నట్లు 2018 లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం 350–400 కోట్ల సిరంజీలు ఏడాదికి మన వినియోగానికి కావాలి. ♦తమ గోదాముల్లో రెండురోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని, సోమవారం నుంచి దేశీయ అవసరాలకు సరఫరా చేసే స్టాక్‌లో భారీగా కోత పడుతుందని హెచ్ఎండీ తెలిపింది. ఎగుమతులపై నిషేధం పరిస్థితి తీవ్రతను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరు 9న సిరంజీల ఎగుమతులపై 3 నెలల నిషేధం విధించింది. 0.5 మిల్లీలీటర్లు, 1, 2, 3 ఎంఎల్ సిరంజీల ఎగుమతిని నిషేధించింది. కోవిడ్ వ్యాక్సిన్ డోసు 0.5 ఎంఎల్ మాత్రమే. వృ«థాను అరికట్టాలంటే 0.5–1 ఎంఎల్ సిరంజీల వాడకం ఉత్తమం. 143 కోట్లు: 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసిన సిరంజీల సంఖ్య. అమెరికా, చైనాలే ప్రపంచంలో రెండు అతిపెద్ద ఎగుమతుదారుల. ప్రపంచ సిరంజీల విపణిలో మన వాటా స్వల్పమే. తేడా ఏంటి? ఆటో డిజేబుల్ సిరంజీలను ఒకసారి ఉపయోగిస్తే... ఇందులోని సేఫ్టీ లాక్ బ్రేక్ అవుతుంది. సిరంజీలో వ్యాక్సిన్‌ను నింపాక సూది ఇవ్వడానికి పైనుంచి బొటనవేలితో నొక్కుతాం. రెండోసారి నొక్కేందుకు వీలులేని సిరంజీలు ఆటో డిసేబుల్‌లో మరోరకం. పునర్వినియోగానికి పనికిరావు. సంప్రదాయ డిస్పోజబుల్ సిరంజీలు అయితే... వాడిన వెంటనే నీడిల్ (సూది)ని కట్ చేసేసి నిర్దేశించిన చెత్తబుట్టలో పారవేయాలి. అలాకాకుండా మళ్లీ వినియోగిస్తే ఇన్ఫెక్షన్లు ఒకరినుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం (ఎన్డీఎంఏ) కింద సిరంజీలను అత్యావశ్యక వైద్య పరికరాలుగా ప్రకటించాలని (కోవిడ్–19 వ్యాక్సినేషన్ దృష్ట్యా) కోరుతూ హెచ్ఎండీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. తమ ప్లాంట్లలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉత్పత్తి జరిగేలా చూడాలని కోరింది. -
అనుకోని అతిథిలా వచ్చి..! మారుతి సుజుకిపై అనూహ్యమైన దెబ్బేసింది..!
కోవిడ్-19 రాకతో అనుకోని అతిథిలా వచ్చిన చిప్స్(సెమికండక్టర్స్) కొరత ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు భారీ నష్టాలనే మిగిల్చాయి. ఆయా కంపెనీల ఉత్పత్తి పడిపోవడంతో అమ్మకాల సంఖ్య భారీగా పడిపోయింది. చిప్స్ కొరతతో సతమతమవుతోన్న కంపెనీలో మారుతీ సుజుకీ కూడా చేరింది. చిప్స్ కొరతతో ఉత్పత్తి అంతంతే..! మారుతీ సుజుకీ ఈ ఏడాది నవంబర్‌లో మొత్తం 1,39,184 యూనిట్లను విక్రయించగా..గత ఏడాది నవంబర్ నెలలో 1,53,223 యూనిట్లను విక్రయించిన్నట్లు మారుతి సుజుకీ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్లోబల్ చిప్ కొరత కారణంగా ఉత్పత్తి మందగించడంతో అమ్మకాల్లో 9.16 శాతం తగ్గుదల వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ నెలలో ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వాహనాల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపిందని కంపెనీ పేర్కొంది.గత నెలలో జరిగిన మొత్తం అమ్మకాలలో... దేశీయ విక్రయాల సంఖ్య 113,017 యూనిట్లుగా ఉండగా, ఇతర ఓఈఎమ్లకు 4774 యూనిట్లును విక్రయించినట్లు మారుతి సుజుకీ తెలిపింది. చదవండి: దుమ్మురేపిన టాటా మోటార్స్..! కంపెనీకి కాసుల వర్షమే..! మినీ, కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో...అల్టో, ఎస్ ప్రెసో, బాలెనో, సెలెరియో, డిజైర్, ఈగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వాగనార్ వంటి కార్లపై పలు ఆఫర్లను కలిగి ఉన్న నవంబర్ 2021లో 74,492 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది నవంబర్ నెలలో 98,969 యూనిట్లను అమ్మకాలను జరిపింది. మొత్తంగా చూసుకుంటే ప్యాసింజర్ కార్ల విక్రయాలు 100,839 యూనిట్ల నుంచి 75,581 యూనిట్లుగా వరకు క్షీణించాయి. యుటిలిటీ వాహనాల విభాగంలో అమ్మకాలు పరవాలేదనిపించింది. ఎర్టిగా, జిప్సీ, ఎస్-క్రాస్ , విటారా బ్రెజ్జా, ఎక్స్ఎల్ఆర్తో సహా గత నెలలో 24,574 యూనిట్లను విక్రయించింది. మరోవైపు నాన్ కార్గో ప్యాసింజర్ ఈకో వ్యాన్ విక్రయాలు నవంబర్‌లో 9,571 యూనిట్లకు పడిపోయింది. గత ఏడాది క్రితం నవంబర్ నెలలో 11,183 యూనిట్లను మారుతి విక్రయించింది. చదవండి: వినియోగంలో లేని బ్యాంక్ అకౌంట్లు, మగ్గుతున్న రూ.26,697 కోట్లు -
షావోమీ కొంపముంచిన చిప్స్..! ఆ పొజిషన్ యాపిల్ కైవసం..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీకి మరో గట్టి దెబ్బ తగిలింది. క్యూ3 ఆదాయ విషయంలో సమీప ప్రత్యర్థి కంపెనీల నుంచి గట్టి పోటీతో పాటుగా చిప్స్ కొరత షావోమీ కొంపముంచింది. చిప్స్ కొరతతో షావోమీకి గట్టి దెబ్బ..! ప్రపంచవ్యాప్తంగా పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు, ఆటోమొబైల్ కంపెనీలను సెమికండక్టర్స్ (చిప్స్) కొరత తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో సతమతమవుతున్న కంపెనీల జాబితాలో షావోమీ కూడా నిలిచింది. చిప్స్ కొరత కారణంగా క్యూ3లో కంపెనీ వృద్ధి రేటు నెమ్మదించింది. చిప్ కొరత ఉన్నప్పటికీ, షావోమీ 2021లో దాదాపు 190 మిలియన్ స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 29 శాతం పెరిగిన కూడా యాపిల్ లాంటి కంపెనీలు షావోమీకు భారీ దెబ్బను వేశాయి. క్యూ3లో దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను జరిపిన షావోమీ అంచనాలను చేరుకోలేకపోయింది. రెండో స్థానం నుంచి ..! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్స్ కొరత, చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల తగ్గుదల కారణంగా...ప్రపంచంలోని టాప్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాలో షావోమీ రెండోస్ధానం నుంచి మూడో స్ధానానికి పడిపోయింది. తాజాగా యాపిల్ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్-13 రాకతో షావోమీ అమ్మకాలు ఒక్కింతా పడిపోయాయి. ఐఫోన్-13ను రిలీజ్ కావడంతో ఇతర ఐఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రేట్లు అమాంతం తగ్గాయి. దీంతో షావోమీ అంచనాలు తారుమారు అయ్యాయి. చదవండి: ఈవీ ఛార్జింగ్ సదుపాయాల కల్పన కోసం మెజెంటా భారీ పెట్టుబడులు -
ఓలాకు తప్పని పాట్లు..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..!
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్‌తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరత పలు ఆటోమొబైల్ కంపెనీలను తీవ్రంగా వేధిస్తూనే ఉంది. చిప్ కొరతతో సతమతమవుతున్న కంపెనీల్లో ఓలా ఎలక్ట్రిక్ కూడా చేరింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల డెలివరీ మరోసారి వాయిదా పడింది. డెలివరీ వాయిదా పడటంతో కొనుగోలుదారులకు మరోసారి నిరాశే ఎదురుకానుంది. చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..! డెలివరీ ఎప్పుడంటే..! ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల తొలి బ్యాచ్ డెలివరీ నవంబర్ 30న జరగాల్సి ఉండగా...అది కాస్త డిసెంబర్ 15కు వాయిదా పడింది. చిప్సెట్స్, ఎలక్ట్రానిక్స్ విడిభాగాల కొరత కారణంగా బైక్‌ల డెలివరీ మరోసారి వాయిదా పడింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రిబుక్ చేసుకొని పూర్తి అమౌంట్‌ను చెల్లించిన కొనుగోలుదారులకు డిసెంబర్ 31న డెలివరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షమాపణలు కోరిన ఓలా..! ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ బృందం , గ్లోబల్ సప్లై చైన్ల మధ్య శనివారం జరిగిన సమావేశంలో చిప్స్ , ఎలక్ట్రానిక్ విడిభాగాల డెలివరీ మరింత అధ్వాన్నంగా ఉండడంతో తొలి బ్యాచ్ స్కూటర్ల డెలివరీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డెలివరీ మరోసారి వాయిదా పడటంతో కొనుగోలుదారులకు కంపెనీ క్షమాపణలను చెప్పింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల 4జీ కనెక్టివిటీలో భాగంగా కంపెనీ క్వాలకమ్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చదవండి: గిన్నిస్ రికార్డు నెలకొల్పిన కియా ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలుసా? -
దళితుల ఆవేదన.. మృతదేహంతో కలెక్టరేట్‌కు
సాక్షి, మండ్య(కర్ణాటక): అణగారిన వర్గాలు తనువు చాలిస్తే అంత్యక్రియలకు శ్మశానం లేదనే ఆక్రోశంతో మండ్య తాలూకాలోని హుళ్ళెనహళ్ళి గ్రామస్తులు సోమవారం మృతదేహంతో ధర్నా చేశారు. గ్రామవాసి సిద్దాచార్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు చేయడానికి శ్మశానం లేకపోయింది. దీంతో బంధువులు, గ్రామస్తులు కలిసి శవాన్ని మండ్యకు తీసుకొచ్చి ఏకంగా కలెక్టరేట్ ముందు పెట్టుకొని ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో దళితుల చనిపోతే అంత్యక్రియలు చేయడానికి రుద్రభూమి లేదని వినతిపత్రం అందజేశారు. దీంతో కలెక్టర్ ఎస్.అశ్వతి, తహసీల్దార్‌తో కలిసి గ్రామానికి వెళ్ళి స్మశానస్థలి కోసం పరిశీలించారు. దాంతో గ్రామస్తులు శాంతించి శవాన్ని తీసుకొని వెళ్లారు. -
ఆపిల్ కొంపముంచిన చిప్స్...!
ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్స్(చిప్) కొరత పలు కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో పలు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. తాజాగా చిప్స్ కొరత ఆపిల్‌ను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపిల్‌కు భారీ దెబ్బ...! గత నెలలో ఆపిల్ ఐఫోన్13 స్మార్ట్ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.కాగా ఇప్పుడు సెమికండక్టర్ కొరత ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల తయారీపై పడనుంది. దీంతో ఆపిల్‌కు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. చిప్ కొరతతో సుమారు 10 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లపై తయారీ భారీ ప్రభావం పడనుంది. ఈ ఏడాది చివరినాటికి సుమారు 90 మిలియన్ల ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఉత్పతి చేయాలని ఆపిల్ భావించింది. ఆపిల్ చిప్స్‌ను అందిస్తోన్నబ్రాడ్కామ్, టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్ చిప్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి.దీంతో ఐఫోన్13 స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై భారీ ప్రభావమే చూపనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. చదవండి: సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..! ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే బెటర్...! ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే ఆపిల్‌పై చిప్స్ కొరత ప్రభావం తక్కువగా ఉన్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కరోనా కారణంగా టెక్ దిగ్గజం ఆపిల్‌తో సహా ఇతర టెక్ కంపెనీలకు అందించే ఫోన్ విడి భాగాల(కాంపోనెంట్స్)పై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఊహించిన దానికంటే చిప్ సెట్ల కొరత చాలా ఎక్కువ ఉందని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..! -
Coal Crisis: పెను సంక్షోభం..?
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందని ఉత్తరప్రదేశ్ నుంచి కేరళ వరకు వివిధ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఎదురవనుంది. రాజస్తాన్ ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో రోజుకి రెండు గంటలు, పల్లెల్లో రోజుకి నాలుగు గంటలు విద్యుత్ కోతలు విధిం చడం మొదలు పెట్టింది. కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి అందాల్సిన బొగ్గులో సగం కూడా రాజస్తాన్‌కి అందడం లేదు. పంజాబ్, జార్ఖండ్, మహా రాష్ట్రలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ సమస్యని తగ్గించి చూపించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డిస్కమ్‌లు యూనిట్‌కు రూ.20 పెట్టి మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిరోజుల వ్యవధిలోనే నాలుగింతలు ధర పెరిగింది. దేశంలో 66% మేరకు విద్యుత్ వినియోగం థర్మల్ విద్యుత్ కేంద్రాలపైనే ఆధారపడి ఉంది. సాధారణంగా ఈ కేంద్రాలలో 20 రోజుల వరకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంటాయి. కానీ ఇప్పుడు 70 వరకు కేంద్రాల్లో నాలుగు రోజులకి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 136 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 50% బొగ్గు సరఫరా కేంద్రానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) నుంచే జరుగుతుంది. కానీ నాలుగేళ్లుగా ఈ సంస్థ నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ వస్తోంది. 2016 నుంచి స్వదేశీ బొగ్గుపైనే ఆధారపడాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ సీఐఎల్‌లో బొగ్గు ఉత్పత్తి ఆశించిన దాని కంటే 70 లక్షల నుంచి కోటి టన్నుల మేరకు పడిపోతూ వస్తోంది. కొన్ని బొగ్గు గనుల్ని వేలం వేసి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కేంద్రం అప్పగిం చింది. వీటి ద్వారా 12–14 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ ప్రైవేటు సంస్థలు కూడా బొగ్గు వెలికితీయడంపై దృష్టి పెట్టకుండా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తక్కువగా ఉన్నప్పుడు దిగుమతులపై ఆధారపడ్డాయి. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు ఈ ఏడాది మొదట్లో టన్ను 75 డాలర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 270 డాలర్లకు చేరుకుంది. దీంతో బొగ్గును కొనలేక, ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచలేక చేతులెత్తేస్తున్నాయి. ఇదో సంధికాలం బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులతో వాతావరణం కలుషితమై గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకు దారి తీస్తూ ఉండడంతో చాలా దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడుతున్నాయి. భారత్ కూడా అదే బాటలో నడుస్తూ గ్రీన్ ఎనర్జీ పేరుతో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి ప్రోత్సహిస్తోంది. ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తోంది. దీంతో బొగ్గు గనుల అవసరాలకు అనుగుణంగా నిధుల్ని కేటాయించడం లేదు. అలాగని ప్రత్యామ్నాయ విధానాల ద్వారా విద్యుత్ డిమాండ్‌కి తగినంత ఉత్పత్తి జరగడం లేదు. ఫలితంగా సంక్షోభం ముంచుకొస్తోంది. కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. లెబనాన్‌లో గత వీకెండ్లో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చైనాలో కూడా విద్యుత్‌కి కొరత ఏర్పడడంతో కొత్తగా 90 బొగ్గు గనుల్లో తవ్వకాలు ప్రారంభించింది. యూరప్‌లో అధికంగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే ఉన్నాయి. అయితే చమురు ధరలు ఆకాశాన్నంటడంతో యూకేలో కూడా 15 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయని బ్రిటన్ మీడియా చెబుతోంది. ఇక యూరప్‌లో చమురు ధరలు ఏకంగా 400 శాతం పెరగడంతో త్వరలోనే అక్కడ కూడా చార్జీలు పెరగనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ వాతలు తప్పవా ? విద్యుత్ కోతలతో పాటు చార్జీలు పెరిగి ప్రజలకు వాతలు కూడా తప్పేలా లేదు. కొద్ది రోజుల క్రితం వరకు ఒక యూనిట్ విద్యుత్‌ని 5 రూపాయలు ఉంటే, ఇప్పుడు డిస్కమ్ కంపెనీలు 20 రూపాయలు చెల్లించి కొనే పరిస్థితి వచ్చేసింది. గత జనవరి నుంచి బొగ్గు ధరలు అమాంతంగా 300 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితి కేవలం భారత్‌లోనే కాదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితి కునారిల్లిపోయింది. దీంతో గ్యాస్ ఆధారితంగా పనిచేసే విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఫలితంగా విద్యుత్ చార్జీల మోత ఖాయమన్న ఆందోళనలు అంతటా వ్యక్తం అవుతున్నాయి. -
పండుగ సందడికి చిప్‌ల సెగ.. నో డిస్కౌంట్స్?
న్యూఢిల్లీ: పండుగ సీజన్ వస్తోందంటే చాలు ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్, మొబైల్స్ తదితర రంగాల సంస్థలు అమ్మకాలపై ఆశావహ అంచనాలతో ముందు నుంచే కాస్త ఉత్పత్తి పెంచుకుని, విక్రయాలకు సన్నాహాలు చేసుకుంటాయి. అటు కస్టమర్లు కూడా మంచి డిస్కౌంట్లు లభిస్తాయనే అంచనాలతో ఉంటారు. కానీ, కీలకమైన సెమీ కండక్టర్ చిప్‌ల కొరతతో ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. చిప్‌ల సరఫరాలో సమస్యల కారణంగా వివిధ ఉత్పత్తుల తయారీ పడిపోయింది. ఒక్క ఆటోమొబైల్ పరిశ్రమలోనే ఏకంగా 5 లక్షల పైచిలుకు ఆర్డర్లు పేరుకుపోయినట్లు అంచనా. సాధారణంగానైతే పండుగల సీజన్లో భారీ డిస్కౌంట్లు పొందే కొనుగోలుదారులు ప్రస్తుత సందర్భంలో మాత్రం మొబైల్ హ్యాండ్సెట్స్ మొదలుకుని టీవీలు, కార్ల దాకా మరింత ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కి తగ్గట్లుగా ఉత్పత్తులు అందుబాటులో లేకపోతుండటంతో ఆటోమోటివ్ షోరూమ్‌లలో ఉచిత ఆఫర్లు కనిపించడం లేదు. ‘బుకింగ్స్ లేదా ఎంక్వైరీలను బట్టి చూస్తే డిమాండ్ బాగానే ఉంది. కానీ సెమీకండక్టర్ల సమస్యతో ఈసారి దురదృష్టవశాత్తు సరఫరాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో బుకింగ్స్ పేరుకుపోతున్నాయి .. ఉత్పత్తుల సరఫరా ఆ స్థాయిలో ఉండటం లేదు‘ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘పరిశ్రమలో 4.5 లక్షల నుంచి 5 లక్షల దాకా పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయని అంచనా. మారుతీ సుజుకీ ఆర్డర్లే దాదాపు 2.15 లక్షల నుంచి 2.2 లక్షల యూనిట్ల దాకా ఉన్నాయి‘ అని ఆయన వివరించారు. గృహోపకరణాల నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, కార్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటి తయారీలోను సెమీకండక్టర్ చిప్‌లు కీలకంగా ఉంటున్నాయి. ఆగస్టు నుంచే..: చిప్‌ల కొరత, పెండింగ్ ఆర్డర్ల సమస్య అక్టోబర్‌లో కొత్తగా వచి్చంది కాదని.. ఆగస్టు నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని శ్రీవాస్తవ తెలిపారు. సరఫరాపరమైన పరిమితుల కారణంగా ఈసారి డిస్కౌంట్లు, బొనాంజా ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉండొచ్చని పేర్కొన్నారు. నవరాత్రులు, దీపావళి వంటి పండుగల సీజన్లో ఒక్కసారిగా పెరిగే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్లు సాధారణంగా 40 రోజులకు సరిపడ నిల్వలను అట్టే పెట్టుకుంటూ ఉంటారని.. కానీ ఈసారి ఇది 15 రోజుల కన్నా తక్కువ స్థాయిలోనే ఉందని శ్రీవాస్తవ వివరించారు. గతేడాది అక్టోబర్ 1 నాటికి డీలర్ల దగ్గర స్టాక్ నిల్వలు 3.35 లక్షల యూనిట్లుగా ఉండగా.. ఈసారి అక్టోబర్ 1న ఇది 1.75 లక్షల యూనిట్లకే పరిమితమైనట్లు అంచనా. సెప్టెంబర్ 1న నిల్వలు 2.25 లక్షల యూనిట్లుగా నమోదైయ్యాయి. విడిభాగాల సరఫరాదారులను సెమీ కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో.. ఇంజిన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు, కీ లెస్ ఎంట్రీ, ఏబీఎస్ సిస్టమ్స్ వంటి భాగాల సరఫరా తగ్గిపోయి వాహనాల తయారీ సంస్థలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. (చదవండి: Diwali Offers: స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్ ఉచితం...!) ఎల్రక్టానిక్స్ రేట్లకు రెక్కలు... ఇప్పటిదాకానైతే చిప్‌ల కొరత తక్షణ ప్రభావాలు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సరఫరాపై మరీ ఎక్కువగా లేకపోయినప్పటికీ.. కొత్త సంవత్సరంలో మాత్రం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఎల్రక్టానిక్స్, ఉపకరణాల తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. చిప్‌ల కొరతతో సరఫరా తగ్గి, అంతిమంగా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఈ ధోరణి కనిపిస్తోందని, దేశీ మార్కెట్లోను ఇది జరగవచ్చని బ్రగాంజా పేర్కొన్నారు. పండుగ సీజన్ తర్వాత దేశీయంగా తయారీ రంగంపై ప్రభావం కనిపించవచ్చని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ సీనియర్ అనలిస్ట్ ప్రాచిర్ సింగ్ అభిప్రాయపడ్డారు. గత కొన్ని నెలలుగా వివిధ ఉత్పత్తుల ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో కూడా ఈ ధోరణి కొనసాగవచ్చన్నారు. ధరలను ప్రత్యేకంగా పట్టించుకునే దేశీ మార్కెట్లో విడిభాగాల కొరతతో రేట్లు పెరుగుతూ పోతే .. అంతిమంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని సింగ్ చెప్పారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో టీవీల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉందని థామ్సన్, కొడక్, బ్లౌపంక్ వంటి బ్రాండ్లను విక్రయించే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. రాబోయే త్రైమాసికంలో ఉత్పత్తి 20–30 శాతం మేర మందగించవచ్చని, 2022 ఆఖరు దాకా ఇదే ధోరణి కొనసాగవచ్చని చెప్పారు. సరఫరా పడిపోవడంతో ఉత్పత్తుల రేట్లు పెరుగుతున్నాయన్నారు. గత త్రైమాసికంలోనే హై డెఫినిషన్, ఫుల్ డెఫినిషన్ టీవీల రేట్లు 35 శాతం దాకా పెరిగాయని.. వచ్చే త్రైమాసికంలో మరో 30 శాతం మేర పెరిగే అవకాశం ఉందని మార్వా పేర్కొన్నారు. (చదవండి: మెర్సిడెజ్ బెంజ్.. మేడిన్ ఇండియా.. ధర ఎంతంటే?) -
UK Bumper Offer : జీతం ఎంత కావాలంటే అంత ఇస్తాం
-
వైద్య సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వైద్యాన్ని చౌకగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సరైన సమయంలో వైద్యం అందించడాన్ని సైతం ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానికసంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్ రంగం సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం వైద్య కళాశాల స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. మహిళలకు సరైన ప్రోత్సాహం అందించాలి దేశంలో వైద్యం మరింత ఖరీదవుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ భారాన్ని మోయలేకపోతున్న విషయాన్ని ప్రతీ ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్నాతకోత్సవంలో పతకాలు అందుకున్న వారిలో ఎక్కువమంది యువతులు ఉండటాన్ని ప్రత్యేకంగా అభినందించిన వెంకయ్యనాయుడు... మహిళలకు సరైన ప్రోత్సాహాన్నందిస్తే ఏదైనా సాధించగలరనే దానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా వైద్యులు, వైద్య సిబ్బంది పోషించిన పాత్రను సమాజం ఎన్నటికీ మరిచిపోదన్నారు. అయితే దేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి మధ్య ఉన్న భారీ అంతరాన్ని తగ్గించేందుకు కృషి జరగాలని సూచించారు. వలసవాద విధానాలు విడనాడాలి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ, తత్సంబంధిత ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రానున్న రోజుల్లో ప్రతి రెవెన్యూ కేంద్రానికి ఒక సకల సౌకర్యాలున్న ఆసుపత్రి ఏర్పాటు జరగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. వైద్యరంగం అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఒకటన్న ఉపరాష్ట్రపతి, వైద్య విద్యార్థులు విధుల్లో చేరిన తర్వాత తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంలో, అక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో చొరవ తీసుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ కొన్ని వలసవాద విధానాలను కొనసాగించడంపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన విధానాలను, మన అలవాట్లను భారతీయీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. చట్టసభలు, విద్య, పరిపాలన, న్యాయ ఇలా అన్నిరంగాల్లోనూ భారతీయ విధానాలను అలవర్చుకోవాలన్నారు. న్యాయవ్యవస్థను జాతీయీకరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి: మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ -
పండుగ సీజన్‌పై ఆటో కంపెనీల ఆశలు
న్యూఢిల్లీ: చిప్‌ల కొరతతో సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్లో అమ్మకాలు మరింత మెరుగ్గానే ఉండవచ్చని ఆటోమొబైల్ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఓనంతో మొదలైన పండుగ సీజన్ నవంబర్‌లో దీపావళితో ముగియనుంది. ఇప్పటిదాకానైతే డిమాండ్ బాగానే ఉండటంతో, అక్టోబర్‌లో సీజన్ తారస్థాయికి చేరితే సన్నద్ధంగా ఉండటం కోసం డీలర్లకు సరఫరా పెంచేందుకు వాహన కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మారుతి సుజుకీ, టయోటా కిర్లోస్కర్ మోటర్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే డిమాండ్ గతేడాదితో పోలిస్తే మెరుగ్గానే ఉందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. బుకింగ్‌లు, ఎంక్వైరీలు, రిటైల్ విక్రయాలు గణనీయంగానే ఉంటున్నాయని.. సరఫరా తరఫునే కొన్ని సమస్యలు ఉండగా, వాటిని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. పండుగ సీజన్లో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగవచ్చని, ప్యాసింజర్ వాహనాల విభాగంలో వీటి అమ్మకాల వాటా సగం దాకా ఉండవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో వీజే నక్రా పేర్కొన్నారు. ఆరి్థక రికవరీ, వ్యక్తిగత రవాణా వాహనాల అవసరం పెరగడం, కొత్త వాహనాల ఆవిష్కరణ వంటి అంశాలతో రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత మెరుగుపడొచ్చని టయోటా కిర్లోస్కర్ మోటర్ అసోసియేట్ జీఎం వి సిగమణి తెలిపారు. -
అందీ అందకుండా... అమ్మా నాన్నా పిలుపు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అమ్మా..నాన్నా.. అనేది ఓ మధురమైన పిలుపు. అలా పిలిపించుకునేందుకు ప్రతిఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. కానీ కొందరికి ఆ ఆశ నెరవేరడం లేదు. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా అనేక జంటలు ఆ పిలుపునకు దూరం అవుతున్నాయి. పిల్లల కోసం తాపత్రయ పడుతూ ఆధునిక వైద్య విధానాలను అనుసరిస్తూ ప్రయత్నిస్తున్నా, కొందరికి ఫలితం దక్కడం లేదు. ఈ క్రమంలోనే అమ్మా, నాన్నలుగా అయ్యేందుకు, వృద్ధాప్యంలో అవసరమైన ఆసరా కోసం.. కొంద రు దత్తత బాట పడుతున్నారు. అయితే శిశు గృహ కేంద్రాల్లో పిల్లలు తక్కువగా ఉండటం, దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటంతో పిల్లల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అమ్మా, నాన్నా అని పిలిపించుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారికి ఈ పరిస్థితి ఆవేదనకు గురిచేస్తోంది. గతంలో సులువుగా దత్తత దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించేందుకు గతంలో తక్కువ సమయం పట్టేదని అధికారులు చెబుతున్నారు. ఇపుడు ఏడాది నుంచి రెండేళ్ల వరకు సమయం పడుతు న్న సందర్భాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. గతంలో జిల్లా స్థాయిలో వచ్చిన దరఖాస్తులను బట్టి జిల్లాల్లోని శిశు గృహ కేంద్రాల్లో ఉన్న పిల్లలను దత్తతకు ఇచ్చేవారు. అయితే 2015లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. రాష్ట్రం యూనిట్‌గా దత్తత ప్రక్రియను ఆన్లైన్ చేసింది. ఇందుకోసం సెంట్రల్ అడాప్షన్ రిసోర్సు అథారిటీ (కారా), స్టేట్ అడాప్షన్ రిసోర్సు అథారిటీలను (సారా) ఏర్పాటు చేసింది. దత్తత తీసుకోవాలనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సీరియల్ నంబర్ ప్రకారం, అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్యను బట్టి అవకాశం ఇస్తారు. ఆరో గ్యవంతమైన పిల్లలను మాత్రమే దత్తతకు ఇస్తారు. అయితే ఈ ప్రక్రియకు ఎక్కువ సమ యం పడుతోంది. ఈలోగా పిల్లలు పెద్ద వారు అవుతుండటంతో దత్తత తీసుకునేందుకు కొంతమంది నిరాకరిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. అబ్బాయే కావాలి.. దత్తత కోసం వచ్చే దరఖాస్తుల్లో అబ్బాయిలు కావాలనేవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లోని శిశు గృహ కేంద్రాల్లో 122 మంది పిల్లలు ఉంటే.. 683 మంది జంటలు తమకు పిల్లలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అందులో అబ్బాయి కావాలని దరఖాస్తు చేసుకున్నవారు 372 మంది కాగా.. అమ్మాయిలు కావాలని దరఖాస్తు చేసుకున్నవారు 288 మంది ఉన్నారు. ఎవరైనా పర్వాలేదని అన్నవారు కేవలం 30 మంది మాత్రమే ఉన్నారు. తగ్గిపోతున్న పిల్లల సంఖ్య ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, ప్రజల్లో వచ్చిన చైతన్యం, ప్రభుత్వ నిబంధనల కారణంగా శిశు గృహ కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. గతంలో అప్పుడే పుట్టిన బిడ్డను కూడా తీసుకునేవారు. వారికి డబ్బా పాలు తాగించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండడం లేదు. కొందరు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో నిబంధనల్లో మార్పులు చేశారు. పుట్టిన బిడ్డను పోషించలేని పరిస్థితుల్లో దత్తత ఇద్దామనుకున్నప్పుడు, తల్లి బిడ్డకు మూడు నెలలపాటు పాలు ఇవ్వాలని, అప్పుడే బిడ్డను తీసుకుంటామనే నిబంధన విధించారు. దీంతో మూడు నెలలు పాలు ఇవ్వడం వల్ల బిడ్డపై ప్రేమ పెరిగిన కొందరు మనసు మార్చుకుంటున్నారు. వారిని శిశు గృహ కేంద్రాలకు ఇవ్వడం లేదు. ఇక మారుమూల అటవీ ప్రాంతాల్లో అనాగరికత కారణంగా పిల్లలను కన్నా.. సాకలేక, పోషించలేక వదిలేసే ఘటనలు గతంలో ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో వారిలో పెరిగిన అవగాహన, ప్రభుత్వాలు తీసుకువచ్చిన చైతన్యం కారణంగా శిశు గృహాలకు ఇచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. 25 మందిని అనాథలుగా చేసిన కరోనా.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 25 మంది పిల్లలు కరోనా కారణంగా అనాథలుగా మారా రు. కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయినవారు కొందరైతే, గతంలో వేరే కారణాలతో తల్లి లేదా తండ్రి చనిపోయి.. కరోనా సమయంలో మిగిలినవారు చనిపోవడంతో మరికొందరు అనాథలుగా మారారు. ఇలాంటి పిల్లలు నల్లగొండలో ఆరుగురు, నిజామాబాద్‌లో 9 మంది, ఖమ్మంలో 10 మంది, మెదక్ జిల్లాలో నలుగురు ఉన్నారు. అయితే వీరెవరూ శిశు గృహ కేంద్రాల్లో లేరు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహకారంతో వారి బంధువుల ఇళ్లల్లోనే పెరుగుతున్నారు. వారి నిర్వహణ కోసం ఒక్కో శిశువుకు నెలకు రూ.2 వేల చొప్పున శిశు సంక్షేమ శాఖ ఆర్థిక సహకారం అందిస్తోంది. పిల్లలు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ ఉన్న పిల్లల సంఖ్య కంటే వారికోసం వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో దత్తతిచ్చేందుకు ఏడాదిన్నర సమయం పడుతోంది. గతంలో జిల్లా స్థాయిలోనే ఉండటం వల్ల త్వరగా ముగిసేది. ఇప్పుడు రాష్ట్రం యూనిట్‌గా ఆన్లైన్ కావడంతో ఆలస్యం అవుతోంది. – గణేశ్, బాలల పరిరక్షణ జిల్లా అధికారి, నల్లగొండ 18 నెలలు పట్టింది పాపను దత్తత తీసుకోవాలనుకుని ఆన్లైన్లో రిజిస్టర్ చేశాం. తర్వాత ప్రక్రియ అంతా ముగిసి పాపను తీసుకోవడానికి 18 నెలల సమయం పట్టింది. రెండేళ్ల లోపు పాప కావాలని అడిగాం. 5 నెలల శిశువును ఇచ్చారు. ఐదేళ్లు గడిచాయి. ప్రస్తుతం యూకేజీ చదువుతోంది. – ఖమ్మం నగరానికి చెందిన ఓ జంట 15 ఏళ్లయినా పిల్లలు లేకపోవడంతో మాకు వివాహమై 15 ఏళ్లు గడిచింది. అయినా పిల్లలు కాలేదు. దీంతో దత్తత తీసుకునేందుకు ‘కారా’లో దరఖాస్తు చేసుకున్నా. అదృçష్టంకొద్దీ అమ్మాయి లభించింది. పిల్లలు లేరనే బాధ తప్పింది. – శ్రీనివాస్, వరంగల్ మాకు ఏడాదిలో పాప లభించింది సంతానం లేకపోవడంతో 2015లో రెండేళ్ల లోపు పాప కావాలని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం. ఏడాది సమయం తర్వాత ఐదు నెలల పాప లభించింది. – శ్రీనివాస్, సరస్వతి, నిజామాబాద్ -
పర్సనల్ కంప్యూటర్లు ప్రియం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిప్సెట్ కొరత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) విభాగంపై స్పష్టంగా కనపడుతోంది. ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పని విధానం కారణంగా డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ సరఫరా ఆ స్థాయిలో జరగడం లేదు. ఇదే అదనుగా తయారీ కంపెనీలు ధరలను 50 శాతంపైగా పెంచాయి. లో ఎండ్ మోడళ్ల ఉత్పత్తిని దాదాపు నిలిపివేశాయి. రూ.50,000లోపు ధరలో ల్యాప్‌టాప్‌లు దొరకట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఆల్ ఇన్ వన్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏప్రిల్–జూన్ కాలంలో దేశవ్యాప్తంగా 32 లక్షల యూనిట్ల పీసీలు అమ్ముడైనట్టు సమాచారం. నిలిచిపోయిన సరఫరా.. ల్యాప్‌టాప్స్‌లో కొన్ని నెలల క్రితం వరకు రూ.17–25 వేల ధరల శ్రేణి వాటా 70 శాతం దాకా ఉండేది. రూ.26–40 వేల ధరల విభాగం 20 శాతం, రూ.40 వేలపైన ధరల్లో లభించే హై ఎండ్ మోడళ్ల వాటా 10 శాతం నమోదయ్యేది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. మార్కెట్ అంతా హై ఎండ్ మోడళ్లతోనే నిండిపోయింది. వీటికి కూడా 40–50 శాతం కొరత ఉంది. ఇక లో ఎండ్ మోడళ్లు అయితే కానరావడం లేదు. 100 శాతం నగదు ఇచ్చి కొనేందుకు వినియోగదార్లు సిద్ధపడ్డా పీసీ దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితి పరిశ్రమలో ఇదే తొలిసారి అని ఐటీ మాల్ ఎండీ అహ్మద్ తెలిపారు. లో ఎండ్ ల్యాప్టాప్స్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. పేరుతోపాటు ధర కూడా.. కంపెనీలు ఎప్పటికప్పుడు మోడళ్ల పేరు మారుస్తున్నాయి. కొత్త స్టాక్ వచ్చిందంటే మోడల్ పేరు మారుతోంది. అంతేకాదు ఫీచర్లు మారకపోయినా ధరలను సవరిస్తున్నాయి. చిప్సెట్ కొరతను అడ్డుపెట్టుకుని పూర్తిగా హై ఎండ్ మోడళ్లవైపే మొగ్గు చూపుతున్నాయంటే కంపెనీలు ఏ స్థాయిలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయో అవగతమవుతోంది. కనీస ధరలు ల్యాప్‌టాప్ రూ.18 వేలది కాస్తా రూ.30 వేలకు చేరింది. హై ఎండ్‌లోనూ ధర 20 శాతంపైగా అధికమైంది. డెస్క్‌టాప్ రూ.25 వేల నుంచి రూ.38 వేలకు, ఆల్ ఇన్ వన్ రూ.30 వేల నుంచి రూ.43 వేలు అయింది. ప్రింటర్ల విషయంలో ఇంక్జెట్ రూ.2 వేల నుంచి రూ.4,500లు, లేజర్‌జెట్ రూ.9 వేలది కాస్తా రూ.16 వేలపైమాటే ఉంది. ధర పెరిగినా ప్రింటర్లు దొరకడం లేదు. -
Corona Vaccine: టీకా కటకట
వనస్థలిపురానికి చెందిన డి.నర్సింగ్‌రావు మే 27న కోవాగ్జిన్ టీకా మొదటి డోసు తీసుకున్నాడు. 4 నుంచి 6 వారాల గడువులో రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. దీంతో కొన్ని రోజులుగా టీకా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడా దొరకలేదు. ఈ నెల 15న ఆఫీసుకు సెలవు పెట్టి స్థానిక ప్రాంతీయ ఆస్పత్రి సమీపంలోని టీకా కేంద్రం వద్ద క్యూలైన్లో నిల్చున్నాడు. సిబ్బంది పరిమిత సంఖ్యలోనే టోకెన్లు ఇవ్వడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. టీకా కేంద్రాల కోసం గాలిస్తూ నాగోల్ సమీపంలోని మరో కేంద్రానికి వెళ్లగా.. అక్కడా పెద్ద క్యూ కన్పించింది. చివరకు కొత్తపేట్‌లోని ఓ కేంద్రం వద్ద సాయంత్రం వరకు వేచి చూసి, ఆరు వారాల గరిష్ట గడువు ముగిసిన వారం రోజుల తర్వాత రెండో డోసు టీకా పొందాడు. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ టీకాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అర్హులు మొదటిడోసు కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెల్లువెత్తుతు న్నారు. మరోవైపు మొదటి డోసు అనంతరం గడువులోగా రెండో డోసు వేయించుకునేందుకు వస్తున్న వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటున్నారు. మొ త్తం మీద రాష్ట్రంలోని పలు వ్యాక్సినేషన్ కేంద్రాలకు గత నాలుగైదు రోజులుగా జనాల తాకిడి తీవ్రంగా పెరగ్గా.. వచ్చిన వారందరికీ టీకాలు వేయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రధానంగా వేస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఏది వేసుకోవాలన్నా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా కోవాగ్జిన్ టీకాలకు తీవ్ర కొరత ఏర్పడింది. 1,035 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రస్తుతం రాష్ట్రంలో 1,035 కేంద్రాల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 958 కేంద్రాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తూ ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తోంది. మరో 77 కేంద్రాలను ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తూ ఫీజులు తీసుకుని వ్యాక్సిన్ అందిస్తున్నాయి. రాష్ట్రంలో మే నెలలో టీకాల పంపిణీ ఊపందుకోగా.. కోవాగ్జిన్ టీకాలు తీసుకున్న వారంతా ఇప్పుడు రెండోడోసు కోసం దిక్కులు చూస్తున్నారు. కేంద్రం నుంచి పరిమితంగానే వ్యాక్సిన్లు అందుతుండడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్లకు పంపిణీలో ఇబ్బందులు వస్తున్నాయి. రెండో డోసుకు డిమాండ్ ప్రస్తుతం రెండో డోసు టీకాకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో రోజుకు సగటున 1.5 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేస్తుండగా.. మొదటి, రెండో డోసుల నిష్పత్తి 40:60 శాతంగా ఉంటోంది. ప్రస్తుతం కోవీషీల్డ్ టీకాల కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు 1,31,47,311 టీకాలు రాష్ట్రంలో ఇప్పటివరకు 1,31,47,311 టీకా డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు 1,08,32,712 తీసుకోగా, రెండోడోసు కింద 23,14,599 పంపిణీ చేశారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల్లో 1,06,08,692 డోసులను రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఉచితంగా పంపిణీ చేయగా, 25,38,619 డోసులు ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేశారు. స్లాట్ బుకింగ్ లేక.. వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం మొదట్లో కోవిన్ యాప్, వెబ్‌సైట్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. టీకాలు పొందాలనుకున్న వారు యాప్‌లో ఆధార్ నంబర్, ఇతర వివరాలను ఎంట్రీ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. దీంతో పరిమిత సంఖ్యలో టీకాల పంపిణీకి వీలుండేది. కానీ ప్రస్తుతం యాప్, వెబ్సైట్లో స్లాట్ బుకింగ్‌లు కేవలం ప్రైవేటు కేంద్రాలకే పరిమితమయ్యాయి. టీకా కోసం నేరుగా కేంద్రాల వద్దకే వెళ్లొచ్చునని కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు నేరుగా వివరాలను సమర్పించి టీకా డోసులు పొందుతున్నారు. ఈ కారణంగా చాలాచోట్ల వ్యాక్సినేషన్ కేంద్రాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. స్పష్టమైన గడువు, డోసు తీసుకున్న తర్వాత ఎన్నిరోజులు పూర్తయ్యాయి అనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా క్యూలైన్లో వచ్చిన వారికి టీకాలు ఇసున్నారనే విమర్శలున్నాయి. దీంతో కొందరికి గడువు దాటినా టీకాలు అం దకపోగా.. మరికొందరు ముందుగానే టీకాలు పొందుతున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద అంతా గందరగోళంగా ఉంటోంది. -
సోయా విత్తనానికి.. మహారాష్ట్రకు పరుగులు
సాక్షి, హైదరాబాద్: సోయాబీన్ విత్తనం కోసం రైతులు మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. పెద్ద ఎత్తున విత్తన కొరత ఏర్పడటంతో ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత ధరైతే అంతకు కొంటున్నారు. ఎన్నడూ లేని విధంగా సోయాబీన్ విత్తనాన్ని ఈసారి వ్యవసాయ శాఖ సరఫరా చేయలేకపోయింది. ఫలితంగా రైతులకు విత్తనం దొరకలేదు.. రాయితీ కూడా అందలేదు. దీన్ని అదనుగా తీసుకొని వ్యాపారులు, దళారులు దగా చేస్తున్నారు. దీంతో సోయాబీన్ సాగు చేసే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్రమేంటంటే వ్యవసాయ శాఖకు విత్తనం దొరక్క పోగా, వ్యాపారులకు మాత్రం అది అందుబాటులో ఉంటోంది. నాలుగున్నర లక్షల ఎకరాల్లో సాగు... తెలంగాణలో ఈసారి వానాకాలం సీజన్లో సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.50 లక్షల ఎకరాలు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో ఇప్పటివరకు 18,112 (4 శాతం) ఎకరాల్లో సాగు చేశారని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు సోయాను సాగు చేస్తారు. రాష్ట్రానికి అవసరమైన సోయా విత్తనాల్లో 1.20 లక్షల క్వింటాళ్ల వరకు ప్రతీ ఏడాది ప్రభుత్వమే సమకూర్చుతుంది. కొన్ని రకాల వెరైటీ విత్తనాలను రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తారు. ఈసారి ఇతర రాష్ట్రాల్లోనూ అధిక వర్షాలతో సోయా విత్తన పంట దెబ్బతిన్నది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ సోయా విత్తనం ఇతర ప్రాంతాలకు విక్రయించకూడదని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించడంతో తెలంగాణ వ్యవసాయశాఖ చేతులెత్తేసింది. టెండర్లు వేసినా కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో రైతులే సమకూర్చు కోవాలని, లేకుంటే ప్రత్యామ్నాయంగా పత్తి, కంది వంటి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. ఆ పంటకే అలవాటు పడటంతో చాలామంది రైతులు సోయాబీన్ విత్తనాల కోసం మహారాష్ట్రకు పరుగులు తీస్తున్నారు. సబ్సిడీ లేకపోవడంతో.. గతేడాది సోయా విత్తనాలు క్వింటాలుకు రూ. 6,645 ఉండగా, రూ. 2,701 సబ్సిడీ వచ్చేది. రూ.3,944 రైతు తన వాటాగా చెల్లించేవాడు. ఎకరానికి 30 కిలోల వరకు విత్తనాలు విత్తుకునేవారు. 30 కిలోల బస్తాను సబ్సిడీపై రైతులకు అందించేవారు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేయకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు విత్తనాల ధర రూ. 13 వేల వరకు ఉంది. 27 కిలోల బస్తా ధర రూ.3,500 వరకు చెల్లించి రైతులు కొంటున్నారు. నానా తిప్పలు పడ్డాను నేను 16 ఎకరాలు సోయా సాగు చేస్తున్నాను. ఇక్కడ సోయా విత్తనాలు సరఫరా చేయకపోవడంతో నాందేడ్ నుంచి తెచ్చుకు న్నా. బస్తా (30 కిలోలు) రూ.3,300 చొప్పున కొన్నాను. విత్తనాలు కొనుగోలు చేసేందుకే నానా తిప్పలు పడ్డాను. తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్రలో రెట్టింపు ధరకు దొరికాయి. ప్రభుత్వమే సబ్సిడీపై ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. – చిద్రపు అశోక్, ఖాజాపూర్, నిజామాబాద్ విత్తనాలకే రూ.25వేలు ఖర్చు.. నేను 5 ఎకరాల్లో సోయాబీన్ వేశా. ప్రతిసారి ప్రభుత్వమిచ్చే సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేసేవాన్ని. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు ధరలు పెంచేశారు. ఏడు బస్తాల సోయా విత్తనాలను కొనుగోలు చేశాను. ఒక్కో బస్తా రూ. 3,600లకు తెచ్చి విత్తుకున్నాను. విత్తనాల కోసమే రూ. 25 వేలు వెచ్చించాల్సి వచ్చింది. --- కుంట రంజిత్‌రెడ్డి, నల్లవెల్లి, నిజామాబాద్ -
కరోనా టెస్టులకు గండం.. చేతులెత్తేసిన కంపెనీ
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలోని కొంద రు అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కరోనా పరీక్షలు చేసే టెస్టింగ్ కిట్లకు కొరత ఏర్పడటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికే అనేకచోట్ల కొద్దిమందికే పరీక్షలు చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లోనైతే ఈ రోజుకు ఇంతేనని చెప్పి పంపుతున్నారు. కొరత నేపథ్యంలో వైద్యాధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కిట్ల నిల్వ అయిపోయే వరకు నిద్రపోయారా అంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు చేపట్టే విషయంపై సర్కారు సమాలోచనలు చేస్తోంది. అత్యవసరంగా లక్షన్నర కిట్లు రెగ్యులర్‌గా అవసరానికి తగినట్లుగా సరఫరా చేయాల్సిన కంపెనీ చేతులెత్తేసింది. మహారాష్ట్ర సహా దేశంలో కరోనా విజృంభణ పెరగడంతో కంపెనీ ఆయా ప్రాంతాలకు కిట్లను తరలిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఒకేసారి అధికంగా కిట్లను సరఫరా చేయలేమంది. ఢిల్లీలో లాక్డౌన్ విధించడంతో అక్కడ ఉత్పత్తి, సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో ఆ ప్రభావం రాష్ట్రంలో కిట్ల కొరతకు దారితీసిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బుధవారం వరకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద కేవలం లక్షలోపు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు, లక్షన్నర లోపు ఆర్టీపీసీఆర్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గురువారం నుంచి కరోనా పరీక్షలు సజావుగా జరిగే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై లక్షన్నర కిట్లను కొనుగోలు చేశారు. ఈ కిట్లు బుధవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటాయనీ, గురువారం అన్ని పరీక్ష కేంద్రాలకు కిట్లను పంపిస్తామని అధికారులు తెలిపారు. అయితే రెండ్రోజులు ఎలాగోలా నెట్టుకొస్తారు తర్వాత ఏంటి పరిస్థితి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మూడు నెలలకు సరిపోయేలా... కరోనా పరీక్షలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం నెలకొనడంతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. పరీక్షలు యథావిధిగా కొనసాగించేందుకు తక్షణం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. అలాగే మూడు నెలలకు సరిపోయేలా ఒకేసారి కిట్లను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు 90 లక్షల కిట్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం తాజాగా పరిపాలనా అనుమతి ఇచ్చింది. దీంతో నూతన టెండర్‌కు వెళ్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
85 రోజుల్లో 10,12,84,282 డోసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ చెప్పారు. దేశంలో కేవలం 85 రోజుల్లో 10 కోట్ల కరోనా టీకా డోసులు ఇచ్చామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో భారత్ చేరిందన్నారు. 10 కోట్ల డోసులు ఇవ్వడానికి యూకేలో 89 రోజులు, చైనాలో 102 రోజులు పట్టిందని గుర్తుచేశారు. ఇండియాలో ప్రస్తుతం రోజువారీగా సగటున 38,93,288 డోసులను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల వరకూ దేశంలో 10,12,84,282 డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. -
కరోనా ఉధృతి: ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూ వణుకు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రలో కరోనా ఉధృతి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. మరోవైపు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో వ్యాక్సిన్లు అయిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం 14 లక్షల వ్యాక్సిన్ మోతాదులు ఉన్నాయని, ఇవి రాబోయే మూడు రోజులకు సరిపోతాయని వెల్లడించారు. దీనిపై కేంద్రానికి సమాచారం అందించామని, వారానికి 40 లక్షల టీకాలు కావాలని కేంద్రాన్ని కోరామని మంత్రి తెలిపారు. (అంబానీ కుమారుడు సంచలన వ్యాఖ్యలు) కేంద్రం మాకు టీకాలు ఇవ్వడం లేదని చెప్పలేం గానీ, వ్యాక్సిన్ల పంపిణీ వేగం నెమ్మదిగా ఉందని వ్యాఖ్యానించారు. చాలా వ్యాక్సిన్ కేంద్రాలలో తగినంత వ్యాక్సిన్లు లేవు. వ్యాక్సిన్లు లేక ప్రజలను తిరిగి పంపించాల్సి వస్తోందన్నారు. 20-40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి తప్పనిసరిగా ప్రాధాన్యతపై టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని రాజేష్ తోపే తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని, ఏడు టన్నులకు పైగా ఆక్సిజన్ వినియోగిస్తున్నామని ఆరోగ్య మంత్రి చెప్పారు. దీంతోపాటు సమీప రాష్ట్రాల నుండి ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరామనీ, అవసరమైతే, ఆక్సిజన్‌ను ఉపయోగించే పరిశ్రమలను మూసివేస్తాం కాని వైద్య ఆక్సిజన్ సరఫరాను ప్రభావితం కానివ్వమని టోప్ ప్రకటించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు దాదాపు 82 లక్షల మందికి టీకాలు వేయగా, మహారాష్ట్రకు 1.06 కోట్ల మోతాదు లభించిందని, అందులో 88 లక్షల మోతాదులను వాడగా, వృధా మూడు శాతం వద్ద ఉందని మంగళవారం ఒక అధికారిక ప్రకటలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో మంగళవారం రోజు 55,469 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,13,354 కు, మరణాలు 56,330 కు చేరుకున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ముంబైలో కొత్తగా 10,040 కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. -
భవిష్యత్‌లో ఇసుక దొరకదా!?
ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణరంగం ప్రస్తుతం తీవ్ర ఇసుక కొరతను ఎదుర్కొంటోంది. భవిష్యత్‌లో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇసుక నిల్వల్లో పనికొచ్చేది మాత్రం కొంతే ఉంటుందని, ఆ ఇసుక నిల్వలు వేగంగా అడుగంటి పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా వినియోగించే సహజ వనరుల్లో నీరు తర్వాత స్థానం ఇసుకదే. షాపింగ్ మాల్స్, ఆఫీస్‌లు, అపార్ట్మెంట్లు.. ఇలా ఒకటేమిటి ఏది నిర్మించాలన్నా ఇసుక ప్రధాన ముడిసరుకు. అంతేకాదు స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ల నుంచి కిటీకీల గ్లాస్‌ల తయారీ వరకూ.. కంప్యూటర్లలో చిప్స్ నుంచి ఇంట్లో వినియోగించే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులోనూ ఇసుక మరో అవతారం సిలికా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సరాసరి 50 బిలియన్ టన్నుల ఇసుక వినియోగం ఉంటుందని లెక్కతేల్చారు. పట్టణీకరణతోనే ముప్పు.. మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పట్టణీకరణ జరుగుతుండటమే ఇసుక కొరతకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి ఏటా లక్షలాది మంది పట్టణాల బాట పడుతున్నారు. 1950 నుంచి ఇప్పటి వరకూ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా పట్టణాల్లో నాలుగురెట్ల జనాభా పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న 4.2 బిలియన్ల జనాభాకు వచ్చే మూడు దశాబ్దాల్లో మరో 2.5 బిలియన్ల జనాభా తోడవుతుందని ఐరాస అంచనా వేసింది. వీళ్లందరికి మౌలిక సదుపాయాలు కల్పించే నిర్మాణాల్లో భారీ ఎత్తున ఇసుక వినియోగించాల్సి ఉంటుంది. భారతదేశంలో అయితే 2000 సంవత్సరం నుంచి ఏటా ఇసుక వినియోగం మూడు రెట్లు పెరుగుతూ వస్తోంది. 20వ శతాబ్దం మొత్తంలో అమెరికా వినియోగించినంత ఇసుక ఈ ఒక్క దశాబ్దంలోనే చైనా వాడేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఆకాశ హార్మ్యాలను నిర్మించే దుబాయ్ ఇప్పటికే ఆస్ట్రేలియా నుంచి ఇసుకను దిగుమతి చేసుకుంటోంది. తీరంలో పర్యావరణానికి ముప్పు.. సముద్రంలో ఇసుక తవ్వకంతో కెన్యా, పర్షియన్ గల్ఫ్, ఫ్లోరిడా తీరంలోని అత్యంత విలువైన కోరల్ రీఫ్స్‌కు ముప్పు ముంచుకొచ్చింది. ఇసుక తవ్వకంతో ఏర్పడ్డ బురద వల్ల సముద్రంలో సహజ వాతావరణంలో బతికే జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అలాగే నదుల్లో ఇసుక మైనింగ్‌తో నీటి జీవులు ఊపిరాడక చనిపోతున్నాయి. క్వాలిటీ సిలికా మైనింగ్ కోసం ఏటా వేలాది ఎకరాల అడవులను నరికేస్తున్నారు. ఇసుక మైనింగ్ వల్ల వియత్నాంలోని మెకాంగ్ డెల్టా మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. కంబోడియా, లావోస్‌లో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల నదుల గట్లు దెబ్బతిని పొలాలు, ఇళ్లు ఆ నదుల్లో కలసిపోతున్నాయి. అయెయార్వాడీ నదిలో ఇసుక తవ్వకం వల్ల తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని మయన్మార్ రైతులు వాపోతున్నారు. శాండ్ మైనింగ్‌తో 2000వ సంవత్సరంలో తైవాన్‌లో ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఆ తర్వాత ఏడాది కూడా ఇలాంటి తవ్వకాలతో పోర్చుగల్‌లో బ్రిడ్జి కూలడం వల్ల బస్సులో వెళ్తున్న 70 మంది మృత్యువాత పడ్డారు. కృత్రిమ ఇసుక దీవులు ఉన్న స్థలం చాలకపోవడంతో సింగపూర్ గడిచిన 40 ఏళ్లలో 130 చదరపు మైళ్ల మేర సముద్రాన్ని ఇసుకతో నింపి ఇళ్లు నిర్మించింది. దీని కోసం ఇతర దేశాల నుంచి భారీగా ఇసుకను దిగుమతి చేసుకుంది. ఇలాగే దుబాయ్‌తో పాటు ఇతర దేశాలు కూడా సముద్రంలో నయా నగరాలను ఇసుకతో నిర్మిస్తున్నాయి. ఓ డచ్ పరిశోధన బృందం లెక్కల ప్రకారం 1985 నుంచి ఇప్పటి వరకూ వివిధ దేశాలు ఇసుక వినియోగించి తీరంలో 13,563 చదరపు కిలోమీటర్ల మేర కృతిమ భూమిని సృష్టించాయి. ప్రత్యామ్నాయమే దారి.. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక వినియోగాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. కాంక్రీట్‌లో ఇతర ముడిసరుకులను వినియోగించడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఫ్లైయాష్, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బూడిద, ఆయిల్ పామ్ పొట్టు, ఊక తదితరాలను ఇసుకకు ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు. రీసైకిల్ కాంక్రీట్‌ను మరింత సమర్థంగా ఉపయోగించడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే నదుల్లో మైనింగ్‌కు స్వస్తిపలికారు. ఇతర దేశాలు దీనిని అనుసరించడం కష్టమైనా.. నదులకు జరిగే నష్టాన్ని నివారించడానికి నిర్మాణ రంగం ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాలని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. – ఏపీ సెంట్రల్ డెస్క్ -
‘మత్తు’ డాక్టర్లు కావలెను
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మత్తు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడు అనస్తీషియా వైద్యుల పోస్టులు ఉండగా ఒక్కరే అందుబాటులో ఉన్నారు. మిగిలిన ఆరుపోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖానాపూర్ సీహెచ్‌సీతో పాటు భైంసా ఏరియా ఆస్పత్రిలో మత్తు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సకాలంలో ఆపరేషన్లు చేయలేక వైద్యులు అవస్థలు పడుతున్నారు. శస్త్ర చికిత్స చేయాలంటే మత్తుమందు ఇచ్చే వైద్యుడు అందుబాటులో ఉండాల్సిందే. ఆపరేషన్ థియేటర్లో సర్జన్‌తో పాటు అనస్తీషియా వైద్యుడు తప్పనిసరి. వ్యాధి తీవ్రత, రోగి, ఆరోగ్య పరిస్థితిని బట్టి మత్తుమందు ఇస్తారు. మత్తు ఎక్కడ ఇవ్వాలనేది అనస్తీషియనే నిర్ణయిస్తాడు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మాత్రమే ఇద్దరు వైద్యులు ఉన్నారు. ఇందులో ఒకరు ఒక వారం పాటు ప్రసూతి ఆస్పత్రిలో కూడా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 21 మందికి ఆరుగురు మాత్రమే జిల్లా వ్యాప్తంగా మొత్తం 21 అనస్తీషియా వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే పని చేస్తున్నారు. జిల్లాలో కీలకమైంది జిల్లా ఆసుపత్రి, ప్రసూతి ఆసుపత్రి. జిల్లా ఆస్పత్రి, బైంసా ఏరియా ఆసుపత్రుల్లో సివిల్ సర్జన్‌తో పాటు డిప్యూటీ సివిల్ సర్జన్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టులు ఉండాలి. కానీ ఇక్కడ ఇద్దరు మాత్రమే అసిస్టెంట్ సివిల్ సర్జన్ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో మరో అనస్తీషియా పోస్ట్ ఖాళీగా ఉంది. జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఏడుగురికి ఒక అసిస్టెంట్ సివిల్ సర్జన్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఖానాపూర్ సీహెచ్‌సీలో మూడు అనస్తీసియా పోస్టులకుగానూ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రులు నిర్మిస్తున్న ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు నిర్మిస్తున్నా, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నా పోస్టుల భర్తీపై సర్కారు దృష్టి సారించకపోవడంతో రోగులకు సరైన వైద్యసేవలు అందడం లేదు. వైద్యుల కొరతతో ఇబ్బందులు జిల్లాలోని ప్రసూతి ఆస్పత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు 4,676 ప్రసవాలు జరిగాయి. ఇందులో 3,688 సిజేరియన్లు, 988 సాధారణ కాన్పులు. జిల్లా ఆసుపత్రిలో గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు దాదాపు 2,150 ఆపరేషన్లు చేశారు. గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్లు 1089, గత మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకు బైంసా ఏరియా ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు 2643. కానీ అనస్తీషియా వైద్యులు సరిపడా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఏరియా ఆస్పత్రిలో ఈ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిన నియమించడానికి నోటిఫికేషన్ వేసినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో అనస్తీషియా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. అయినా ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో ఖాళీగా ఉన్న అనస్తీసియా పోస్టు కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. – దేవేందర్‌రెడ్డి, డీసీహెచ్ఎస్ -
డ్రైవింగ్ లైసెన్స్.. తప్పదు వెయిటింగ్!
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. వాహనదారులకు పోస్టు ద్వారా అందజేయాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీ కార్డులు గత రెండు నెలలుగా నిలిచిపోయాయి. కార్డుల కొరత కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షకు పైగా వినియోగదారులు స్మార్ట్‌కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొని, డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు సకాలంలో స్మార్ట్ కార్డులు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద రూ.వేలల్లో జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. రవాణాశాఖ నిబంధనల మేరకు వినియోగదారులు ఎలాంటి పౌర సేవల కోసమైనా ముందే ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లిస్తారు. సర్వీస్ చార్జీలతో పాటు, పోస్టల్ చార్జీలను కూడా ఆర్టీఏ ఖాతాలో జమ చేస్తారు. ఇలా సర్వీసు చార్జీల రూపంలోనే ఒక్క హైదరాబాద్ నుంచి ఏటా రూ.100 కోట్ల మేర ప్రజలు చెల్లిస్తారు. కానీ రవాణాశాఖ అందజేసే పౌరసేవల్లో మాత్రం పారదర్శకత లోపించడం గమనార్హం. స్మార్టు కార్డులను తయారు చేసి, అందజేసే కాంట్రాక్ట్ సంస్థలకు సుమారు రూ.18 కోట్ల మేర బకాయీలు చెల్లించకపోవడం వల్లనే 2 నెలలుగా కార్డుల ప్రింటింగ్, పంపిణీని ఆ సంస్థలు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో రవాణాశాఖ అధికారులు తాజాగా మరో సంస్థతో ఒప్పందానికి చర్యలు చేపట్టారు. కానీ ఈ ఒప్పందం ఏర్పడి కార్డులు తయారు చేసి అందజేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇప్పటికిప్పుడు పంపిణీ చేపట్టినా వినియోగదారులకు చేరేందుకు మరో 15 రోజులకు పైగా సమయం పట్టవచ్చునని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. (పాపికొండలు.. పర్యటనకు వెళ్తారా?) సందట్లో సడేమియా.. గత 3 సంవత్సరాలుగా స్మార్ట్‌కార్డుల కొరత వెంటాడుతూనే ఉంది. వాహనదారులు నెలలతరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో కార్డులు పరిమితంగా ఉన్న సందర్భాల్లో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ రూ.200 నుంచి రూ.300లకు కార్డు చొప్పున విక్రయిస్తున్నారు. కార్డుల కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ‘నిబంధనల ప్రకారం అన్ని రకాల ఫీజులు, పోస్టల్ చార్జీలు చెల్లించిన తరువాత కూడా ఆర్టీఏ సిబ్బందికి డబ్బులిస్తే తప్ప కార్డులు రావడం లేదని’ టోలిచౌకికి చెందిన అనిల్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది దళారులే కార్డుల కొరతను సాకుగా చూపుతూ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు చోట్ల ఇదే ఒక దందాగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: వ్యాక్సిన్‌పై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు) -
కొబ్బరి చెట్టెక్కి మరీ చెప్పిన మంత్రి..
కొలంబో: స్వార్థపూరిత ప్రస్తుత రాజకీయాలలో ప్రజా సమస్యలపై పోరాడే రాజకీయ నాయకులు చాలా తక్కువ. కానీ శ్రీలంకకు చెందిన ఓ మంత్రి చేసిన పని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీలంక ప్రజలు కొబ్బరి వ్యాపారంపై విపరీతంగా ఆధారపడుతుంటారు. అయితే ప్రస్తుతం దేశంలో 70 కోట్ల కొబ్బరి చెట్ల కొరత ఉందని, ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వానికి గట్టిగా వినిపించేందుకే తాను కొబ్బరి చెట్టు ఎక్కినట్లు మంత్రి అరుందికా ఫెర్నాండో తెలిపారు. దేశంలో పారిశ్రామిక అవసరాల భారీగా కొబ్బరిని వినియోగిస్తున్నారని తెలిపారు. కొబ్బరికి అధిక డిమాండ్ తీర్చేందుకు ప్రభుత్వ ఖాళీ స్థలాలలో కొబ్బరి చెట్లను పెంచాలని పేర్కొన్నారు. కాగా కొబ్బరి కొరతను తీర్చేందకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అరుందికా ఫెర్నాండో తెలిపారు. మరోవైపు కొబ్బరి కొరతను అధిగమించేందుకు మంత్రి ఫెర్నాండో తీసుకుంటున్న చర్యలు హర్షనీయమని సామాజిక విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కోవిడ్-19 : మందుల కొరతకు చెక్
ముంబై : కరోనా వైరస్ రోగులకు సిఫార్సు చేసే ఔషధాల కొరతను నివారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మందుల కొనుగోలుకు అవసరమైన నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మందులను కొనాలంటే ప్రజలు ఇప్పుడు తమ ఆధార్ కార్డు, కోవిడ్-19 పరీక్ష సర్టిఫికెట్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను తప్పనిసరిగా అందచేయాలని అధికారులు వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా 2.38 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులున్న మహారాష్ట్రలో కరోనా చికిత్సకు వాడే రెమిడిసివిర్, టొసిలిజుమబ్ వంటి మందులు అందుబాటులో లేవని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ వద్ద మందుల నిల్వలు సరిపడా ఉన్నా డిమాండ్ విపరీతంగా పెరగుతుండటంతో వీటికి కొరత ఏర్పడిందని రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్లో ఈ మందులు అమ్ముతున్నారనే ఫిర్యాదులు అందాయని, బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కరోనా ఔషధాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, మందులపై అదనంగా ఎవరైనా వసూలు చేస్తే ప్రభుత్వ హెల్ప్‌లైన్‌ను సంప్రదిస్తే తాము చర్యలు చేపడతామని చెప్పారు. తీవ్ర లక్షణాలతో బాధపడే కోవిడ్-19 రోగులకు అత్యవసర వినియోగం కింద రెమిడిసివిర్‌ను వాడేందుకు ఐసీఎంఆర్ అనుమతించింది. చదవండి : 3 రోజుల్లోనే లక్ష కేసులు -
చుక్కల్లో కోవిడ్-19 ఔషధం ధర..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ చికిత్సలో కీలక ఔషధంగా భావిస్తున్న యాంటీవైరల్ డ్రగ్ రెమిడిసివిర్ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఔషధం లభ్యత అరకొరగా ఉన్నా కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ఢిల్లీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. రెమిడిసివిర్ కొరత కారణంగా ఇతర నగరాల నుంచి రోగులు అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. రెమిడిసివిర్ మందుకు డిమాండ్ అధికంగా ఉండటం, పరిమిత సరఫరాలతో కొరత ఏర్పడిందని డాక్టర్లు చెబుతున్నారు. మధ్యస్థ లక్షణాలతో బాధపడే కోవిడ్-19 రోగులకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఔషధాన్ని వాడేందుకు జూన్ 13న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండంతో డాక్టర్లు రెమిడిసివిర్‌ను సిఫార్సు చేస్తున్నారు. అయితే సరఫరాలు మాత్రం ఆ స్ధాయిలో పెరగకపోవడంతో ఈ ఔషధానికి కొరత ఏర్పడింది. ఈ ఔషధాన్ని రోగులు ఇంజెక్షన్ రూపంలో ఆరు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషదం పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్‌కు జూన్ 1న భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) రెమిడిసివిర్ దిగుమతులకు అనుమతించింది. భారత్‌లో ఈ ఔషధ తయారీకి హెటెరో, సిప్లా, మైలాన్లకు లైసెన్స్ ఉండగా జుబిలియంట్, జైదూస్ సహా మరికొన్ని సంస్ధలు డీజీసీఐ అనుమతుల కోసం వేచిచూస్తున్నాయి.రెమిడిసివిర్ పేటెంట్ కలిగిన గిలియాడ్ సైన్సెస్తోనీ సంస్ధలన్నీ భారత్‌లో రెమిడిసివిర్ తయారీ కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రస్తుతం హెటెరో సంస్థ ఢిల్లీలో రెమిడిసివిర్‌ను వయల్‌కు రూ 5400 చొప్పున సరఫరా చేస్తోంది. మరో రెండు కంపెనీల నుంచి సరఫరాలు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుండటంతో రెమిడిసివిర్ కొరతను అధిగమించవచ్చని ఢిల్లీ ఔషధ నియంత్రణ విభాగానికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, ఈ వారాంతంలో రెమిడివిర్ డ్రగ్‌ను సిప్లా మార్కెట్లోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ డ్రగ్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు హెటెరో ఫార్మకు రెమిడిసివిర్ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. మరోవైపు కీలక ఔషధాల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలని డీసీజీఐ ఆయా రాష్ట్రాల ఔషధ నియంత్రణ అధికారులకు లేఖలు రాసింది. ఢిల్లీకి చెందిన అభయ్ శ్రీవాస్తవ్ కోవిడ్-19తో బాధపడే తన మిత్రుడి తల్లి (84)కి అవసరమైన రెమిడిసివిర్ కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో ఈ మందు లభించకపోవడంతో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రెమిడిసివిర్‌ను బాధిత కుటుంబం సమకూర్చిందని శ్రీవాస్తవ్ చెప్పుకొచ్చారు. ఫార్మసీల్లోనూ ఈ డ్రగ్ దొరకడం లేదని దీనికోసం తాము ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం రూ 65,000కు ఈ మెడిసిన్‌ను అందిస్తామని ఎవరో హామీ ఇచ్చారని చెప్పారు. ముంబైలో తన సోదరుడు రెమిడిసివిర్‌ను కొనుగోలు చేసి తమకు కొరియర్ ద్వారా పంపించాడని తెలిపారు. మరోవైపు ఈ ఔషధం దొరక్క ఇబ్బందులు పడినవారి జాబితాలో జర్నలిస్టులూ ఉన్నారు. జర్నలిస్ట్ సమర్థ్ బన్సల్ తన నాయనమ్మ కోసం ఈ ఔషధం కోసం ప్రయత్నించగా ఒక్కో వయల్‌కు రూ 30,000 వరకూ కొటేషన్లు వచ్చాయని వాపోయారు. ఆస్పత్రి ఫార్మసీలో ఈ మందు అందుబాటులో లేకపోవడంతో ఇతరత్రా విచారించగా ఢిల్లీ హోల్‌సేల్ మార్కెట్ నుంచి అత్యధిక ధరను కోట్ చేశారని చెప్పుకొచ్చారు. చివరికి కోల్‌కతా నుంచి రెమిడిసివిర్‌ను తెప్పించుకున్నామని చెప్పారు. చదవండి : కరోనాకు కొత్త చికిత్స -
సరుకులు లేవు.. సరఫరా చాలదు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచే కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లకు సరుకు రవాణా క్లిష్టతరంగా మారింది. డిమాండ్ మేరకు నిత్యావసరాలు సరఫరా లేకపోవడం, గోదాముల్లో సరుకుల రవాణాకు, ప్యాకేజింగ్‌కు సిబ్బంది కొరత ఉండటంతో నిల్వలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని చాలా సూపర్మార్కెట్లలో ఖాళీ ర్యాంకులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రోజువారీ అవసరాల్లో ప్రధానంగా వాడే ఉప్మా, ఇడ్లీ రవ్వలతో పాటు, టీ, కాఫీ పొడి, కారం, చక్కెర, పసుపు, నూనెలు, గోధుమపిండి వంటి సరుకులతో పాటు డిటర్జెంట్లు, హ్యాండ్‌వాష్‌లు, న్యాప్కిన్లు, డైపర్ల సరఫరా తగ్గడంతో వీటికి కొరత ఏర్పడుతోంది. డిమాండ్‌కు తగ్గట్లు లేని సరఫరా.. లాక్డౌన్ నేపథ్యంలో వినియోగదారులు పెద్ద ఎత్తున అవసరాలకు మించి కొనుగోళ్లు చేశారు. సాధారణంగా వారానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసే అలవాటుకు భిన్నంగా కొందరు ముందుగానే పెద్దమొత్తంలో సరుకులను కొనుగోళ్లు చేశారు. దీంతో అవి నిండుకున్నాయని కిరాణా వర్తకులు తెలిపారు. ‘రాష్ట్రానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి శనగపప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్తాన్ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలు వస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సరుకులు తెచ్చే వాహనాలకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్దే ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దానికి తోడు ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి తీవ్రంగా ఉండటంతో లారీ డ్రైవర్లు, క్లీనర్లు రవాణాకు ముందుకు రావడం లేదు. కొన్ని సరుకు రవాణా వాహనాలు వస్తున్నా, అవి అనేక చోట్ల చెక్‌పోస్టులు దాటాల్సి రావడంతో ఒక్క రోజులో వచ్చే వాటికి రెండున్నర రోజుల గడువుపడుతోంది’అని బేగంబజార్‌కు చెందిన వర్తకులు తెలిపారు. అదీగాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కిరణా దుకాణాలు, సూపర్ మార్కెట్లకు సరుకులు సరఫరా చేసే బేగంబజార్ మార్కెట్లో రద్దీని నివారించేందుకు విడతల వారీగా దుకాణాలు తెరుస్తున్నారు. పప్పులు సరఫరా చేసే దుకాణం ఒక రోజు తెరిస్తే, మళ్లీ అది తెరిచే వంతు నాలుగు రోజులకు గానీ రావట్లేదు. దీంతోనూ తగినంత సరుకుల సరఫరా అనుకున్నంత జరగడం లేదని తెలుస్తోంది. ఇక సూపర్మార్కెట్ల గోదాముల్లో కొంత నిల్వలు ఉంటున్నా, వాటిని ప్యాకేజింగ్ చేసేందుకు సిబ్బంది రావడం లేదని మరికొందరు వ్యాపారులు చెబుతున్నారు.ప్యాకేజీ పనులకు గతంలో 30, 35 మంది కార్మికులతో చేపట్టే చోట ప్రస్తుతం ఐదుగురికి మించి లేకపోవడంతో స్టాక్‌ను మార్కెట్లకు తీసుకురావడం సైతం ఇబ్బందిగా మారిందని బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సూపర్ మార్కెట్ మేనేజర్ ఒకరు వెల్లడించారు. దీంతో తమ మార్కెట్‌కు వచ్చే వారు సగం సరుకులే కొనుగోలు చేసి వెళుతున్నారని వెల్లడించారు. -
కరోనా: చప్పట్లు కాదు అవి ఇవ్వండి!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స చేస్తోన్న వైద్య సిబ్బందికి అవసరమైన చేతుల గ్లౌజులు, ముఖ మాస్కులు, మొత్తం శరీరాన్ని కవర్ చేసే బాడీ సూట్లు అందుబాటులో లేవు. సకాలంలో ప్రభుత్వాధికారులు స్పందించక పోవడం, వాటి ఉత్పత్తి ఉత్తర్వులలో అవకతవకలు చోటు చేసుకోవడంతో వైద్య సిబ్బంది వీటి కొరతను ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు. వైద్య సిబ్బంది ధరించే వివిధ రకాల మాస్క్‌లను ‘పర్సనల్ ప్రొటెక్షన్ ఇక్వీప్‌మెంట్ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) లేదా పీపీఈ అని వ్యవహరిస్తారు. (కరోనా: లాక్డౌన్ అంటే..) కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఇవి ప్రతి దేశంలోని వైద్య సిబ్బందికి అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో జనవరి 1వ తేదీన మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఆ మరుసటి రోజే పీపీఈ ఉత్పత్తుల ఎగుమతిని నిషేధిస్తూ ప్రభుత్తం నిర్ణయం తీసుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెలన్నర రోజులు గడచిపోయినప్పటికీ తమ సభ్యులైన ఉత్పత్తిదారులకు వీటి ఉత్పత్తుల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని దేశవ్యాప్తంగా పీపీఈలను ఉత్పత్తి చేస్తోన్న దాదాపు 150 కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తోన్న రెండు సంఘాల్లో ఒక సంఘం అధ్యక్షులు ఆరోపించారు. (కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడి మృతి) ఈ మాస్క్‌ల ఉత్పత్తిదారులతో కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ మార్చి 18వ తేదీన ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి మార్చి 8వ తేదీన జారి చేసిన ఆదేశాల మేరకు జౌళి శాఖ ఏర్మాటు చేసిన ఆ సమావేశానికి వైద్యశాఖ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. సమావేశానికి పలువురు పీపీఈ ఉత్పత్తిదారులతోపాటు వారికి ప్రాతినిథ్యం వహిస్తోన్న రెండు సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పీపీలను సమీకరించే బాధ్యతను ఆ సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్‌కు అప్పగించారు. 7.25 లక్షల ఓవరాల్ బాడీ సూట్లు, 60 లక్షల ఎన్–95 మాస్క్‌లు, కోటీ మూడు లేయర్ల క్లినికల్ మాస్క్‌లు అవసరమని నాటి సమావేశంలో వైద్యశాఖ ప్రతినిధులు తెలిపారు. అప్పటికే అత్యంత ఖరీదైనా ఫుల్ బాడీ సూట్లతోపాటు 10.5 లక్షల ఎన్ మాస్క్‌లు, పది లక్షల మూడు లేయర్ల మాస్క్‌ల ఉత్పత్తి కోసం ప్రైవేటు కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆ సమావేశంలో హెచ్ఎల్ఎల్ అధికారులు తెలిపారు. దానిపై పీపీఈ ఉత్పత్తి కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ‘ప్రివెంటీవ్ వియర్ మానుఫ్యాక్చరర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ చైర్మన్ డాక్టర్ సంజీవ్ రెల్హాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ సభ్యుల్లో ఒకరికి కూడా ఈ ఉత్పత్తి ఉత్తర్వులు అందలేదని ఆయన మీడియాతో చెప్పారు. ఉత్పత్తి ఆర్డర్లు ఎవరికి అందలేదంటూ మార్చి 21వ తేదీన ఓ ఆంగ్ల పత్రిక ఓ వార్తను ప్రచురించడంతో ఆ రోజు మధ్యాహ్నం అత్యవసరంగా 80 వేల పీస్‌లు కావాలంటూ తమ అసోసియేషన్ సభ్యులైన 14 కంపెనీలకు హెచ్‌ఎన్‌ఎల్ నుంచి ఈ మెయిల్స్ ద్వారా ఉత్తర్వులు అందాయని డాక్టర్ సంజీవ్ వివరించారు. (మీ పిల్లలను ఇలా చదివించండి) అదేరోజు సాయంత్రం మూడు టెండర్ డాక్యుమెంట్లు హెచ్ఎల్ఎల్ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. మొదటి డాక్యుమెంట్లో మార్చి 5వ తేదీన టెండర్లు పిలిచినట్లు మార్చి 16న టెండర్లు ముగుస్తున్నట్లు, రెండో డాక్యుమెంట్లో 16వ తేదీన టెండర్ ముగింపును మార్చి 20 వరకు పొడిగిస్తున్నట్లు, మూడవ డాక్యుమెంట్లో టెండర్ ముగింపును మార్చి 25కు పెంచుతున్నట్లు మార్చారు. అసలు ఈ టెండర్ల గురించే తమకు తెలియదని రోజుకు ఫుల్ బాడీ లేదా కవరాల్ మాస్క్‌లను ఉత్పత్తిచేసే సామర్థ్యం కలిగిన ‘మెడిక్లిన్’ పీపీఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ స్మితా షా ఆరోపించారు. ఇదే విషయమై హెచ్ఎల్ఎల్ డైరెక్టర్ టీ. రాజశేఖర్‌ను మీడియా సంప్రతించగా, కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి పర్యవేక్షణలో తాము 24 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తున్నామని ఆయన సమాధానం ఇచ్చారు. అంతకుమించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై స్పందించేందుకు ఆరోగ్య శాఖ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. ఏదేమైనా దేశంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా పీపీఈలు ముఖ్యంగా ఫుల్ బాడీ సూట్లు అందుబాటులో లేవని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే జరిగే నష్టాన్ని అంచనా కూడా వేయలేం! (కరోనా ఎఫెక్ట్: బాధ్యత లేని మనుషులు) -
ఊరికి యూరియా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణం గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 3,4 రోజుల్లోనే డిమాండ్‌కు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందచేయాలన్నారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న నిల్వలను రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించాలన్నారు. స్టాకు పాయింట్లలో పెట్టకుండా నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువులు అందించడంపై శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా డిమాండ్‌పై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడటానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించడంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను పెద్ద మొత్తంలో తెప్పించలేదు. గత నాలుగేళ్లలో ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నులకు కాస్త అటుఇటుగా యూరియా అవసరం పడింది. ఈసారి ఆగస్టు చివరికే 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడటంతోపాటు పంటల విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా వ్యవసాయశాఖ ముందుజాగ్రత్తగా వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ పెట్టింది. ఆ యూరియా షిప్పుల ద్వారా రావడంలో ఆలస్యం జరిగిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. అయితే పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని యూరియాను వెంటనే తెప్పించి గ్రామాలకు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. 3 వేల లారీల ద్వారా పోర్టుల్లోని యూరియా... ఐడీఎల్, ఇఫ్కో, సీఐఎల్, క్రిబ్కో, ఎన్ఎఫ్ఎల్ కంపెనీల ద్వారా వచ్చిన దాదాపు 1.15 లక్షల టన్నుల యూరియా ప్రస్తుతం విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం, న్యూ మంగుళూరు నౌకాశ్రయాలకు చేరింది. అక్కడి నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరాల్సి ఉంది. అయితే సాధారణ పద్ధతుల్లో యూరియా రవాణా జరిగితే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియాను త్వరగా తెప్పించడానికి ఏర్పాట్లు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, చీఫ్ ఫ్లీట్ ట్రాఫిక్ మేనేజర్ నాగ్యాతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వివిధ పోర్టుల్లోని యూరియా స్టాకును వెంటనే తెలంగాణ జిల్లాలకు తరలించడానికి 25 ప్రత్యేక గూడ్సు రైళ్లను కేటాయించాలని కోరారు. జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, సనత్‌నగర్, ఖమ్మం, కొత్తగూడెం, జడ్చర్ల, తిమ్మాపూర్ తదితర రైల్వే స్టేషన్లకు యూరియా నేరుగా పంపాలని కోరారు. ఇందుకు రైల్వే అధికారులు అంగీకరించారు. ప్రభుత్వం కోరినట్లు శుక్రవారమే గూడ్సు రైళ్లు కేటాయిస్తామని చెప్పారు. గూడ్సు రైళ్లలో వేగంగా స్టాక్ లోడ్ చేసే పనిని పర్యవేక్షించడానికి ఒక్కో పోర్టుకు ఒక్కో వ్యవసాయశాఖాధికారిని పంపాలని సీఎం ఆదేశించారు. రైల్వే స్టేషన్లకు స్టాక్ చేరుకోగానే అక్కడ లారీలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ కూడా వ్యవసాయాధికారులను నియమించాలన్నారు. రైల్వే స్టేషన్ల నుంచి మండలాలు, గ్రామాలకు నేరుగా యూరియా పంపాలని, కావాల్సిన లారీలను రైల్వేస్టేషన్ల వద్ద సిద్ధంగా ఉంచాలని రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మను ఆదేశించారు. వివిధ పోర్టుల్లో ఉన్న యూరియాను తక్షణమే రాష్ట్రానికి రప్పించడానికి రైళ్లతోపాటు 3 వేల లారీలను వాడాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని లారీలను వెంటనే పోర్టులకు పంపాలని చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్ని నానితో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. గంగవరం పోర్టు నుంచి వీలైనన్ని ఎక్కువ లారీల ద్వారా యూరియా పంపించే పనిలో సహకరించాలని కోరారు. ఏపీలో వీలైనన్ని ఎక్కువ లారీలను సేకరించి యూరియాను తెలంగాణకు పంపుతామని నాని హామీ ఇచ్చారు. పోర్టుల నుంచి నేరుగా రైల్వే స్టేషన్ల ద్వారా వచ్చే యూరియాను మళ్లీ స్టాక్ పాయింట్లకు తీసుకువెళ్లకుండా ఏ మండలంలో ఎంత డిమాండ్ ఉందో ముందే నిర్ధారించి నేరుగా పంపాలని, ఈ పనిని పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. 3–4 రోజుల్లోనే లక్ష టన్నులు అందాలి... మొత్తంగా మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు లక్ష టన్నుల యూరియా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందాలని, యూరియా కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి తొలగిపోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ పోర్టుల్లోని యూరియాను తెలంగాణకు రప్పించే పనిని ప్రగతి భవన్‌లోనే ఉండి పర్యవేక్షించాలని వ్యవసాయ, రవాణాశాఖ మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, అధికారులకు నిర్దేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రగతి భవన్ నుంచే వారు రైల్వే అధికారులతో, లారీ యాజమానుల సంఘాలతో, వివిధ కంపెనీలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు కావాల్సిన యూరియా అందే వరకు విశ్రమించవద్దని, రేయింబవళ్లు పర్యవేక్షించి, సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, పార్థసారధి, సునీల్‌శర్మ, వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోశ్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. యూరియా తెప్పించేందుకు పర్యవేక్షణ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు మంత్రులు, అధికారులు ప్రగతి భవన్ నుంచి యూరియాను తెప్పించే పనులను పర్యవేక్షిస్తున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులను ప్రగతి భవన్‌కు పిలిపించారు. వారి ద్వారా రైల్వే శాఖకు రేక్స్ కోసం ఇండెంట్ పెట్టించారు. తక్షణం వివిధ పోర్టులకు 25 రేక్స్ పంపడానికి రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో రేక్ (గూడ్సు రైలు) ద్వారా 2,600 టన్నులు యూరియా రానుంది. కేవలం రైళ్ల ద్వారానే దాదాపు 60 వేల టన్నుల యూరియా 2–3 రోజుల్లో ఆయా జిల్లాలకు చేరుకోనుంది. అదే సమయంలో దాదాపు 4 వేల లారీల ద్వారా కూడా యూరియా వివిధ మండలాలకు చేరుకోనుంది. మొత్తం యూరియా 3–4 రోజుల్లో గ్రామాలకు చేరుతుందని, రైతులు కాస్త ఓపికగా ఉండాలని మంత్రులు సూచించారు. యూరియా కొరతను ఆసరా చేసుకొని ఎవరైనా ధరను పెంచి విక్రయించే అవకాశం ఉందని, రైతులు మోసపోవద్దని చెప్పారు. రైతులకు కావాల్సిన యూరియా అంతా ఆయా మండలాలకు చేరుకుంటుందని, 3–4 రోజుల్లో సమస్య పూర్తిగా తొలగిపోతుందని మంత్రులు భరోసా ఇచ్చారు. -
నిల్వలు నిల్
సాక్షి, సిటీబ్యూరో: వంద రూపాయల విలువైన నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఏర్పడింది. రెండు మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రూ.100 స్టాంప్‌ల విక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్లో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ ధర రెండు నుంచి మూడు రేట్లు అధికంగా పలుకుతోంది. నాసిక్ ముద్రణాలయం నుంచి స్టాంప్‌ల సరఫరా నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డిపోల్లో నిల్వలు లేకుండా పోయాయి. ఫలితంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెవెన్యూ స్టాంపుల కొరత తీవ్రంగా నెలకొంది. స్థిరాస్తి క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్, ఇతరత్రా లావాదేవీలకు అధికంగా రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను అధికంగా వినియోగిస్తారు. దీంతో డిమాండ్ అధికంగా ఉంటోంది. రూ.20, రూ.50ల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు సరఫరా విరివిగా ఉన్నప్పటికి రూ.100 స్టాంప్ పేపర్లపై దస్తావేజుదారులు అధికంగా ఆసక్తి కనబరుస్తారు. గత మూడు నెలలుగా వీటి సరఫరా లేకపోవడంతో మార్కెట్లో కొంత పాత స్టాక్‌కు డిమాండ్ పెరిగినట్లయింది. నాసిక్‌లోనే ముద్రణ.. మహారాష్ట్రలోని నాసిక్ ముద్రణాలయంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లు, రెవెన్యూ స్టాంపులు ముద్రిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఈ ముద్రణాలయం నుంచి వీటిని కొనుగోలు చేస్తోంది. నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను తెప్పిస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ల ఇండెంట్ ప్రకారం వాటిని సరఫరా చేస్తోంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ నుంచి స్టాక్ తెప్పించిన ప్రతిసారీ ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగితా జిల్లా రిజిస్టార్, పోస్టల్ శాఖలకు సరఫరా చేస్తోంది. జిల్లా రిజిస్టార్ ఆఫీస్ కూడా స్టాంప్ డిపోలో కొంత స్టాక్ రిజర్వ్డ్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఇండెంట్ డిమాండ్ మేరకు పంపిణీ చేస్తోంది. స్టాక్ ముగియక ముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. ఇండెంట్‌కు స్టాక్ సరఫరా కాకపోవడంతో రిజర్వ్డ్ నిల్వలు సైతం పూర్తిగా వినియోగించినట్లు తెలుస్తోంది. సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు.. పోస్టాఫీసులకు సైతం రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల సరఫరా నిలిచిపోయింది. వాస్తవంగా మూడేళ్లక్రితం పోస్టాఫీసుల ద్వారా కూడా నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో పోస్టల్ శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పదం మేరకు కమిషన్‌పై జ్యుడీషియల్ స్టాంప్‌లను పోస్టాఫీసుల్లో విక్రయాలకు సిద్ధమైంది. జనరల్ పోస్టాఫీసులు ప్రతి మూణ్నెల్లకోసారి ఇండెంట్ పెట్టి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను కొనుగోలు చేస్తూ వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖకు నాసిక్ నుంచి ఇండెంట్వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని సర్కిల్ స్టాంప్ డిపోకు అందిస్తోంది. అక్కడి నుంచి ప్రధాన పోస్టాఫీసుల డిమాండ్ మేరకు సరఫరా అవుతోంది. ప్రధాన పోస్టాఫీసుల నుంచి సబ్ పోస్టాఫీసులకు అక్కడి నుంచి కిందిæ పోస్టాఫీసులకు సరఫరా అవుతాయి. గత మూడు నెలల నుంచి సరఫరా లేకపోవడంతో రూ.100 స్టాంప్లకు కొరత ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో మాత్రం వ్యాపారులు పాత స్టాక్‌తో సొమ్ము చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాత్రం రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌ల కోసం ఇండెంట్ పెట్టామని ఇంకా స్టాక్ రాలేదని స్పష్టం చేస్తున్నారు. స్టాక్ లేదంటున్నారు... సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల స్టాక్ లేదంటున్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుకు ఇండెంట్ పెట్టినా సరఫరా కాలేదంటున్నారు. స్థిరాస్తి నమోదు అధికంగా రూ. 100 స్టాంప్‌లు అధికంగా వినియోగంలోకి వస్తాయి. దస్తావేజుదారులు సైతం ఎక్కువగా మొగ్గు చూపుతారు. రూ.50 పత్రాలపై దస్తావేజులు చేయించేందుకు అసక్తి కనబర్చరు. దీంతో తీవ్ర కొరతగా ఉంది. వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లను తెప్పించాలి. – అర్జున్, స్టాంప్ అండ్ వెండర్, కొత్తపేట -
కదలని చక్రం లారీ డ్రైవర్ల కొరత
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: లారీడ్రైవర్.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉద్యోగం.. మోటార్ ఫీల్డ్‌పై ఆసక్తితో చాలా మంది ఇటుగా వెళ్లేవారు. లారీలపై క్లీనర్లుగా పనిచేస్తూ డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్‌లు పొంది గొప్పగా భావించేవారు. లారీ డ్రైవర్ అనేమాట స్టేటస్ సింబల్‌గా కూడా ఉండేది. మోటారు పరిశ్రమ, లారీ పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జిల్లాలో వేలాది కుటుంబాలు జీవించేవి. నాలుగు టైర్ల లారీల నుంచి పది టైర్ల లారీల వరకు పరిశ్రమ విస్తరించినా, టైర్లు పెరిగినంత సులభంగా ఈ పరిశ్రమలో అభివృద్ధి చోటుచేసుకోలేదు. పాత రోజుల్లో డ్రైవర్‌గా లారీ ఎక్కాలంటే పెద్ద సిఫారసు ఉండాలి. ముందుగా మెకానిక్ షెడ్లో వర్కర్‌గా చేరాలి. తర్వాత లారీ మీద క్లీనర్‌గా పనిచేయాలి. డ్రైవర్‌ను గురూ అంటూ మచ్చిక చేసుకోవాలి. తర్వాత డ్రైవర్‌గా మారాలి. ఇదంతా గతం. రానురాను పరిస్థితులు మారడంతో లారీ డ్రైవర్ల కొరత ఈ రంగంలో కనిపిస్తోంది. లారీ డ్రైవర్లుగా పనిచేసేందుకు ఎవరూ మక్కువ చూపకపోవడంతో డ్రైవర్లకు డిమాండ్ పెరిగింది. డ్రైవింగ్ కళాశాల ఏర్పాటు డ్రైవర్ల సమస్యను ముందుగానే ఊహించిన లారీ యజమానుల సంఘం డ్రైవర్ల శిక్షణ కోసం డ్రైవింగ్ కళాశాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ సీటు కావాలన్నా సిఫార్సులతోనే వచ్చేది. ప్ర స్తుతం బతిమాలినా ఎవరూ డ్రైవర్లుగా కళాశాలకు వెళ్లని పరిస్థితి నెలకొంది. 20 శాతం మంది మాత్రమే.. జిల్లాలో ఒక్క తాడేపల్లిగూడెంలో వెయ్యి లారీలకు పైగా ఉన్నాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, నిడదవోలు, చింతలపూడి వంటి ప్రాంతాల్లో మరో వెయ్యికి పైగా లారీలు ఉన్నాయి. వీటిని నడపడానికి కేవలం అందుబాటులో 20 శాతం మంది మాత్రమే డ్రైవర్లు ఉన్నారు. ఇతర రాష్ట్రాల డ్రైవర్లే దిక్కు చేపలు, ఇతర సరుకులను తీసుకువెళ్లే నేషనల్ పర్మిట్ లారీల్లో ఎక్కువగా పనిచేసేది అసోం, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందిన డ్రైవర్లు. డ్రైవర్ ఉద్యో గం ఒడుదుడుకులతో కూడుకుంది కావడం, శారీరక శ్రమ ఉండటం, మా రుతున్న పరిస్థితులు, డ్రైవర్ అంటే సమాజంలో గుర్తింపు లేకపోవడం డ్రైవర్లు తగ్గడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆదాయం వస్తున్నా.. ఆదరణ సున్నా.. డ్రైవర్‌గా పనిచేస్తే నెలకు జీతం, బేటా, కమీషన్లు అన్నీ కలిపి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం ఉంటుంది. దూర ప్రాంతాలకు టిప్పులకు వెళితే డ్యూటీ దిగే సమయానికి రూ.20 వేలకు పైగా మిగులుతుంది. అసోం, కోల్‌కత, ఒడిసా, బిహార్ వంటి రాష్ట్రాలకు చేపలు, కోడిగుడ్లు లోడులు తీసుకువెళితే రూ.లక్ష కిరాయిలో ఫిక్స్‌డ్‌గా డ్రైవర్‌కు రూ.30 వేల వరకు ముట్టచెబుతున్న సందర్భాలు ఉన్నాయి. ఖర్చులు తడిసిమోపెడు లారీకి థర్డ్ పార్టీ ఇన్సూ్యరెన్స్గా రూ.45 వేలు కట్టాలి. మరమ్మతులు పెరిగాయి. ఆపరేటర్‌కు గుర్తింపులేదు. ఇలా ఖర్చులు పెరిగిపోవడంతో డ్రైవర్లు దొరక్క ఓనర్ కమ్ డ్రైవర్ వ్యవస్థగా లారీ పరిశ్రమ మారిపోయింది. యజమానులే డ్రైవర్లుగా లారీలను నడుపుతున్నారు. పరిశ్రమ నుంచి భారీ స్థాయిలో ఆదాయాలు ప్రభుత్వాలకు సమకూరుతున్నా.. వ్యవస్థలో కష్టాలు గురించి పట్టించుకునేవారు లేరు. కునారిల్లుతున్న ఈ పరిశ్రమలో డ్రైవర్‌గా చేరడానికి చాలా మందికి ఇష్టం లేకపోవడమే డ్రైవర్ల కొరతకు కారణంగా కనిపిస్తోంది. చేతి చమురు వదులుతుంది పది టైర్ల లారీకి ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.80 వేలు ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది. కిరాయిలు, ఖర్చులు, టోల్గేట్లు ఇలా ఖర్చులు మోతతో ఇబ్బందులు పడుతున్నాం. మిగిలిదే ఏమీ ఉండటం లేదు. లారీలు తిప్పలేకపోతున్నాం. ఇంటికి పట్టుకుని వెళ్లేది ఏమీ ఉండటం లేదు. మాకు చేతి చమురు వదులుతుంది. అరకొర జీతాలతో లారీలపై పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. –ఎస్.రాజారావు, లారీ డ్రైవర్, తాడేపల్లిగూడెం -
ఏ పూలు తేవాలి నీ పూజకు!
విభూధీశుడికి విరులు కరువయ్యాయి. అరకొర పుష్పాలు, మాలలే దిక్కయ్యాయి. ఏడాదిగా నిత్యకైంకర్యాలు ఆలస్యమవుతున్నాయి. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తనకు వీలున్నప్పుడే కొన్ని పూలను సరఫరాచేసి చేతులు దులుపుకుంటున్నారు. అవికూడా నాసిరకంగా ఉంటున్నాయి. ఆలయానికి చేరేలోపే వాడిపోయి కళావిహీనంగా మారుతున్నాయి. వీటినే స్వామి, అమ్మవార్లకు అలంకరిస్తున్నారు. నిత్యకైంకర్యాలు అతికష్టంమీద నెట్టుకొస్తున్నారు. ముక్కంటీశునికి ఎదురవుతున్న పూల కష్టాలపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్.. సాక్షి, తిరుపతి/శ్రీకాళహస్తి: శైవక్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి నిత్యం 20వేల నుంచి 30 వేల మంది భక్తుల వరకు స్వామి, అమ్మవార్లతో పాటు అనుబంధ ఆలయాల్లోను పూజలు చేసుకుంటుంటారు. ప్రధాన ఆలయంతో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయాలు మరో 17 ఉన్నాయి. ప్రధాన ఆలయంలోని పరివార దేవతలతో పాటు అనుబంధ ఆలయాల్లో ఉన్న స్వామి, అమ్మవార్లకు నిత్యం వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ నాలుగు కాలాల్లో అభిషేకానంతర పూజలు నిర్వహిస్తుంటారు. ఉదయం 5 గం, 6గం, 9గం, సాయంత్రం ఓసారి స్వామి అమ్మవార్లకు అభిషేకానంతర పూజలు చేస్తారు. టెండరుకు పోటీ.. పూజలకు టోపీ ప్రధాన ముక్కంటి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలకు వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన పూలమాలలు సరఫరా చేసేందుకు ప్రతి ఏటా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం టెండర్లు పిలుస్తుంది. అందులో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టెండర్ని టీడీపీ నాయకుడు శ్రీకాళహస్తీశ్వర ట్రస్టుబోర్డు సభ్యుడు సిద్దులయ్య తన భార్య పేరున దక్కించుకున్నారు. ఈ టెండర్ని కూడా ఇతరులకు ఎవరికీ దక్కకుండా పోటీపడి దక్కించుకున్నారు. టెండరు దక్కించుకునేందుకు పోటీపడ్డ కాంట్రాక్టరు స్వామి, అమ్మవార్లకు పూల మాలలు సరఫరా చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అర్చకులు, ఆలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఆలయంలోని స్వామి, అమ్మవార్లతో పాటు పరివార దేవతలు ఉంటారు. శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా మరో 17 ఆలయాలు ఉన్నాయి. స్వామి, అమ్మవార్లకు రోజుకు 8 మాలలు, పరివార దేవతలకు 20 మాలలు సరఫరా చేయాలి. అనుబంధ ఆలయాల్లో ఉన్న స్వామి, అమ్మవార్లకు మరో 47 పూల మాలలను సరఫరా చేయాల్సి ఉంది. టెండరు దక్కించుకున్నాక ధరలతో నిమిత్తం లేకుండా స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో తయారు చేసిన పూలమాలలను సరఫరా చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్‌ది. అరకొర సరఫరా.. వేళకు రాని పూలు పుష్పమాలలు సరఫరా చేస్తానని టెండరు దక్కించుకున్న టీడీపీ నేత వేళకు అవసరమైనన్ని మాలలు సరఫరా చేయడం లేదు. స్వామి, అమ్మవార్లకు నాలుగు కాలాల్లో అభిషేకానంతరం పూజలు నిర్వహిస్తుండడంతో అరగంటకు ముందే పువ్వులు ఆలయానికి చేరవేయాలి. ప్రధాన ఆలయంలో మొత్తం 28 మాలలు సరఫరా చేయాలి. అనుబంధ ఆలయాలకు మరో 47 పూలమాలు సరఫరా చేయాల్సి ఉంది. వేకుజామున 5 గంటలకు మొదటి కాల అభిషేక పూజ ప్రారంభిస్తుండడంతో అరగంట ముందే పూలమాలలు అందుబాటులో ఉండాలి. అయితే కాంట్రాక్టరు రకరకాల కారణాలతో ఒకరోజు 5.30 గంటలకు, మరో రోజు 6 గంటల సమయానికి పూల మాలలు సరఫరా చేస్తున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు చెబుతున్నారు. దీంతో స్వామి అమ్మవార్ల పూజ ఆలస్యం అవుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సరఫరా చేస్తున్న పూల మాలలు కూడా ఒక్కోసారి తక్కువ ఇచ్చి పంపుతున్నట్లు తెలిసింది. వరదరాజస్వామి ఆలయానికి ఆరు మాలలు ఇవ్వాల్సి ఉంటే ఆదివారం కేవలం నాలుగు పూల మాలలు సరఫరా చేశారు. ముత్యాలమ్మగుడికి నాలుగు మాలలు ఇవ్వాల్సి ఉంటే కేవలం రెండే మాలలు ఇచ్చి వెళ్లినట్లు నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలా శ్రీకాళహస్తీశ్వరాలయంతో పాటు అనుబంధ ఆలయాలకు తరచూ ఇదే తరహాలో కాంట్రాక్టరు పూలమాలలు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యమైన పువ్వులకు మంగళం గతంలో మంచి సువాసన వెదజల్లే వివిధ రకాల పువ్వులతో మాలలు తయారుచేసేవారు. టీడీపీ నేతలు టెండర్లు దక్కించుకుంది మొదలు నాణ్యమైన పువ్వులు కరవయ్యాయి. ప్రస్తుతం బంతి పూలతో పాటు కాగితాల పూలు, హైబ్రిడ్ పూలతో మాలలు తయారుచేస్తున్నారు. అందులోనూ రబ్బరు ఆకులు అధికంగా ఉండే విధంగా చూసుకుంటున్నారు. మాలకు మూడు భాగాల్లో ఎక్కువగా రబ్బరు ఆకులు అధికంగా పెట్టి మధ్యలో సాదాసీదా పూలతో మాలను తయారుచేసి ఇచ్చేస్తున్నారు. పోటీలు పడి టెండర్లు దక్కించుకుని స్వామి, అమ్మవార్లకు పూలమాలలు సరఫరా చేయకుండా వ్యవహరిస్తున్న కాంట్రాక్టరు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు, అర్చకులు నోరుమెదపడం లేదని ప్రచారం జరుగుతోంది. పూల మాలలు సరఫరా సరిగా లేదు ఆలయానికి పూలు సరఫరా కాట్రాక్టర్ సరిగా పూలు అందిచడం లేదనేది నిజమే. అయితే ఈ విషమై పలుమార్లు కాట్రాక్టర్కు మెమోలు ఇచ్చాం. బిల్లులో కోత విధించాం. తక్కువకు కోట్ చెయ్యడం వల్లనే అతనికి పూల కాంట్రాక్టు దక్కింది. ఇదేవిధంగా పూలు సరఫరా చెయకుంటే కాట్రాక్టర్పై తప్పక చర్యలు తీసుకుంటాం.– రామస్వామి, ఈఓ, శ్రీకాళహస్తీశ్వరాలయం. -
ఇరుకు.. బెరుకు..!
ఖమ్మంమయూరిసెంటర్: అద్దె భవనాలు.. అసంపూర్తి నిర్మాణాలు.. అరకొర సౌకర్యాలు.. కరువైన ఆట స్థలాలు.. ఇలా నెట్టుకొస్తున్నాయి జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలు. సొంత భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. పలు సమస్యల కారణంగా నిర్మాణాలు పూర్తి కాలేదు. అద్దె భవనాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఒకింత అసౌకర్యానికి గురవుతున్నారు. ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న కేంద్రాలకు భయం భయంగా వెళుతూ ఇబ్బంది పడుతున్నారు. కొందరు కేంద్రాలకు వెళ్లకుండానే పౌష్టికాహారం ఇళ్లకు తీసుకెళ్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలోని 7 ప్రాజెక్టుల కింద మొత్తం 1,896 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో ప్రధాన కేంద్రాలు 1,605, ఉప కేంద్రాలు 291 ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడేళ్ల పిల్లలు 39,864, 3 నుంచి ఆరేళ్ల మధ్య పిల్లలు 30,991 మంది ఉండగా.. గర్భిణులు, బాలింతలు 19,583 మంది ఉన్నారు. 1,896 అంగన్వాడీ కేంద్రాలకుగాను.. 869 కేంద్రాలకే సొంత భవనాలున్నాయి. మిగిలిన కేంద్రాలన్నీ అద్దె భవనాల్లో.. అరకొర సౌకర్యాల మధ్య నడుస్తున్నాయి. ఇలా నిర్వహించడం వల్ల అనుకూలంగా ఉండడం లేదంటూ..పిల్లల తల్లిదండ్రులు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతోచాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించేందుకు ఆసక్తి చూపించడం లేదు. పక్కా భవనాలు లేక ఇబ్బందులు.. అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణతో అనేక సమస్యలు నెలకొన్నాయి. జిల్లాలో మొత్తం 1,896 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వాటిలో 869 కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 510 కేంద్రాల్లో ఆయా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో ఒక గది తీసుకొని కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఇక 517 కేంద్రాలు అద్దె భవనాల్లో అసౌకర్యాల నడుమ నడుస్తున్నాయి. ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నప్పటికీ వాటిని అందించే కేంద్రాల్లో మాత్రం సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. పిల్లలకు పౌష్టికాహారంతోపాటు చదువు చెప్పడం.. ఆటలు ఆడించడం.. నిద్రపుచ్చడం వంటివి చేయాల్సి ఉంది. అయితే అద్దె భవనాల్లోనే అత్యధిక కేంద్రాలను నిర్వహిస్తుండడంతో నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. అర్బన్ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు భవనం చుట్టుపక్కల ఖాళీ ప్రదేశం లేకపోవడం, చిన్నచిన్న ఇరుకు గదులు కావడంతో పిల్లలు ఉండలేని పరిస్థితి నెలకొంది. మంచినీరు కూడా దొరకని పరిస్థితి. నీటి వసతి లేక ఆయాలు కేంద్రం బయటకు వెళ్లి నీటిని తేవాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రెండు మూడు రోజులకోసారి నీటిని పట్టుకొని నిల్వ చేసుకుని వాడాల్సి వస్తోందని ఆయాలు వాపోతున్నారు. భవనాలు మంజూరైనా.. జిల్లాలో అద్దె భవనాల్లో నిర్వహించే అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ నిర్మాణాలకు మోక్షం కలగడం లేదు. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాల అవరణలో నిర్వహించాలని, ఆవరణలోనే కేంద్ర భవనాన్ని నిర్మించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం సైతం ప్రాథమిక పాఠశాలల్లోనే అంగన్వాడీ కేంద్రాలను నిర్మించాలని సూచించి, ఉపాధిహామీ కింద కొన్ని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ద్వారా మరికొన్ని నిధులను విడుదల చేసింది. అయితే పలు కారణాలతో పాఠశాలల్లో భవనాలను నిర్మించలేకపోతున్నారు. విద్యా శాఖ అధికారులు అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు పాఠశాలల్లో స్థలాలను చూపించకపోవడంతో భవన నిర్మాణాలు ముందుకు సాగట్లేదు. కాగా.. పాలేరు నియోజకవర్గంలో ఏళ్ల కిందటే 89 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు అధికారులు స్థలం చూపించడం, నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులను మంజూరు చేసినప్పటికీ వాటి నిర్మాణం ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. స్థలం కోసం ఎదురుచూసిన అధికారులకు భవన నిర్మాణ పనులు ప్రారంభిద్దాం అనుకునే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో నియోజకవర్గంలో ఒకటి రెండు భవనాలు మినహా మిగతా భవనాల నిర్మాణం ఆగిపోయింది. ఇకనైనా అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. భవనాలు మంజూరయ్యాయి.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. స్థలం కోసం స్థానిక ప్రాథమిక పాఠశాలలకు లేఖలు పెట్టాం. పాలేరు నియోజకవర్గంలో 89 భవనాలు మంజూరు కాగా.. వాటన్నింటికీ స్థల సేకరణ చేశాం. త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేస్తాం. మధిర నియోజకవర్గంలో 100 భవనాలు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే స్థల సేకరణ జరిగింది. మిగిలిన వాటికి కూడా త్వరలోనే స్థలాన్ని చూసి నిర్మిస్తాం. వేదాంత భవనాలు నిర్మించేందుకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటిని త్వరలోనే నిర్మిస్తాం. ఎన్నికల కోడ్ వల్ల భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ -
‘కృత్రిమ మేధ’లో నిపుణులు కొరత!
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ (ఏఐ) రంగాన్ని నిపుణుల కొరత వేధిస్తోంది. మధ్య, సీనియర్ స్థాయిలో నిపుణుల కొరత మరీ అధికంగా ఉండటంతో ఈ స్థాయి పోస్టులు దాదాపు 4,000 వరకూ ఖాళీగానే ఉన్నట్లు ఒక సర్వేలో వెల్లడయ్యింది. గడిచిన ఏడాదికాలంలో ఈ పరిశ్రమ 30 శాతం వృద్ధి చెంది 230 మిలియన్ డాలర్లకు చేరినప్పటికీ.. నిపుణుల లేమి మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్, ఆన్లైన్ విద్యా సంస్థ గ్రేట్ లెర్నింగ్‌లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. గత 12 నెలలుగా పోస్టుల ఖాళీ అలానే కొనసాగుతున్నట్లు సర్వే సంస్థలు తెలిపాయి. ఈ పరిశ్రమ కనీసం ఐదేళ్ల అనుభవం కలిగిన వారి కోసం చూస్తుండగా.. మూడేళ్ల అనుభవం కలిగిన వారు మాత్రమే ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న 57 శాతం సంస్థలు వెల్లడించాయి. ఏఐపై పెరుగుతున్న ఆసక్తి.. సప్లై–డిమాండ్‌కి మధ్య భారీ అంతరం ఉన్న కారణంగా ఇతర రంగాలకు చెందిన నిపుణులు కృత్రిమ మేధ వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫైనా న్స్, హెల్త్ కేర్, ఈ–కామర్స్ రంగాలకు చెందిన ఇంజి నీర్లు ఏఐ వైపు చూస్తున్నారు. వచ్చే కొద్దికాలంలోనే ఈ తరహా మార్పులు మరీ ఎక్కువగా ఉండనున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక సంస్థలు ఎటువంటి వారిని ఎక్కువగా చూస్తున్నాయన్న విషయానికొస్తే.. మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, న్యూరల్ నెట్వర్క్, అనలిటిక్స్, పాట్రన్ రికగ్నిషన్‌లకు అధిక ప్రాధాన్యం ఉంది. ప్రారంభ జీతం రూ.6 లక్షలు దాదాపు 40 శాతం కృత్రిమ మేధ వృత్తి నిపుణులు ప్రారంభస్థాయిలోనే ఉన్నారు. వీరి సగటు వార్షిక వేతనం రూ.6 లక్షలుగా ఉంది. మధ్య, సీనియర్ స్థాయిలో 4 శాతం ఉద్యోగులు మాత్రం ఏకంగా రూ.50 లక్షల జీతం అందుకుంటూ ఈ పరిశ్రమలోని డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నారు. మధ్య స్థాయి సగటు జీతం రూ.14.3 లక్షలు. నగరాల పరంగా ముంబైలోని సంస్థలు అత్యధికంగా రూ.15.6 లక్షల సగటు జీతాన్ని ఇస్తుండగా.. ఆ తరువాత స్థానంలో బెంగళూరు ఉంది. ఈ నగర సంస్థలు రూ.14.5 లక్షలు చెల్లిస్తుండగా.. చెన్నై కంపెనీలు అతి తక్కువగా రూ.10.4 లక్షల సగటు వార్షిక జీతాన్ని చెల్లిస్తున్నాయి. -
పీపీల కొరతతో విచారణకు విఘాతం
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని క్రిమినల్ కోర్టుల్లో తగినంత మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ) లేకపోవడం నేర విచారణ ప్రక్రియకు విఘాతంగా మారుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మూడు నాలుగు కోర్టులకు ఇన్‌చార్జీలుగా నియమిస్తుండటం వల్ల పీపీలపై పనిభారం పెరిగి కేసుల విచారణపై ప్రతికూల ప్రభావం పడుతోందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న క్రిమినల్ కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టుల్లో క్రిమినల్ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి తగినంత మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడమేనని గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ వ్యవహారాన్ని సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా సిద్ధం చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఓ నోట్ పంపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల నిందితుల హక్కులను పరిరక్షించడం సాధ్యం కావడం లేదని ప్రధాన న్యాయమూర్తి తన నోట్లో పేర్కొన్నారు. నిందితుల హక్కుల ఉల్లంఘన జరగకూడదంటే కేసుల సత్వర పరిష్కారం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం వల్ల పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడమే కాకుండా, కేసుల విచారణలో నాణ్యత కూడా దెబ్బతింటోందని ఆయన తన నోట్లో ఆందోళన వ్యక్తం చేశారు. సీజే నోట్‌తో హైకోర్టు రిజిస్ట్రీ పీపీల కొరత వ్యవహారంపై వేర్వేరుగా రెండు వ్యాజ్యాలను సిద్ధం చేసింది. ఒక దానిలో తెలంగాణ, మరొక దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. ఈ రెండు వ్యాజ్యాలపై గత వారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం వల్ల కింది కోర్టుల్లో కేసుల విచారణపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది. వీలైనంత త్వరగా పీపీల కొరత తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ధర్మాసనం, ఈ దిశగా ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
రెరాతో కార్మికుల కొరత!
సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)తో స్థిరాస్తి రంగానికి జరిగే ప్రయోజనం సంగతి కాసేపు పక్కన పెడితే.. కార్మికుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. నిర్మాణంలో నాణ్యత అనేది రెరాలో ప్రధానమైన అంశం. ఇందుకోసం నాణ్యమైన నిర్మాణ సామగ్రితో పాటూ నైపుణ్యమున్న లేబర్స్ అవసరమే. కార్మికుల కొరత కారణంగా పెద్ద ప్రాజెక్ట్‌లకు సమస్య అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న నిర్మాణ గడువు.. నగరంలో చాలా మంది డెవలపర్లు రెరాలోని ఐదేళ్ల వారంటీ నిబంధనకు భయపడి నిర్మాణ గడువును పెంచుతున్నారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. గతంలో 50 ఫ్లాట్లుండే అపార్ట్మెంట్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తే.. ఇప్పుడదే అపార్ట్‌మెంట్‌ను మూడేళ్లలో పూర్తవుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే ఇచ్చిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయని పక్షంలో జరిమానాలు, జైలు శిక్షలున్నాయి. గతంలో అయితే నిర్మాణం కాస్త ఆలస్యమైనా సరే కొనుగోలుదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చు. కానీ, రెరాలో పప్పులేవీ ఉడకవని.. ఎవరైనా కొనుగోలుదారులు రెరా అథారిటీని సంప్రదిస్తే అసలుకే మోసం వస్తుందని ఆయన వివరించారు. టెక్నాలజీ కీలకం.. నాణ్యమైన కాంట్రాక్టర్స్ కొరత పరిశ్రమలో తీవ్రంగా ఉందని.. దీంతో చాలా మంది డెవలపర్లు గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారని సీబీఆర్ఈ దక్షిణాసియా చైర్మన్ అన్షుమన్ మేగజైన్ తెలిపారు. ఇదే అంతర్జాతీయ నిర్మాణ సంస్థలకు దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలను కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో నిర్మాణ రంగంలో టెక్నాలజీ కీలకంగా మారుతుందన్నారు. టెక్నాలజీ వినియోగించే కంపెనీలకు ప్రభుత్వం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించాలని సూచించారు. ఉక్కు నిర్మాణాలను నిర్మిస్తే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ టెండర్ల మీద ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఉక్కు నిర్మాణాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు పరిశ్రమ వర్గాలతో పాటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. 30 శాతం కార్మికుల కొరత.. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న నిర్మాణ కార్మికులు ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందినవారే. ఆయా ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వంటి కార్మికుల కొరత సుమారు 30 శాతం దాకా ఉంది. గ్రామీణ, పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది కార్మికులుండగా.. ఇందులో నైపుణ్యమున్న కార్మికులు 2 కోట్ల లోపే. సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్ల కొరత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 6.42 లక్షల మంది సివిల్ ఇంజనీర్లు, 65 వేల మంది ఆర్కిటెక్ట్‌లు, 18 వేల మంది ప్లంబర్లు అందుబాటులో ఉన్నారు. -
పది లక్షల మందికి 19 మంది జడ్జీలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి పది లక్షల మందికి సరాసరిన 19 మంది చొప్పున జడ్జీలున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. దిగువ కోర్టుల్లోని ఐదు వేల మందితోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 6వేల మంది జడ్జీల కొరత ఉందని స్పష్టం చేసింది. పార్లమెంట్లో చర్చ కోసం రూపొందించిన ఈ నివేదికను న్యాయ శాఖ ఈ ఏడాది మార్చిలో తయారు చేసింది. దీని ప్రకారం దేశంలో జడ్జీలు– ప్రజల నిష్పత్తి 10,00,000:19.49గా ఉంది. దిగువ కోర్టుల్లో 5,748, హైకోర్టుల్లో 406 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ కోర్టుల్లో ఆమోదిత సిబ్బంది సంఖ్య 22,474 కాగా ప్రస్తుతం 16,726 మందే పనిచేస్తున్నారు. అలాగే, హైకోర్టుల్లో 1079 గాను ప్రస్తుతం 673 మంది సిబ్బందే ఉన్నారు. సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులకు గాను 25 మంది ఉన్నారు. ప్రతి పది లక్షల మంది ప్రజలకు 50 మంది జడ్జీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని 1987లోనే న్యాయ కమిషన్ ప్రతిపాదించగా ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదని 2016లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జీల పోస్టుల్లో ఖాళీల కారణంగా దేశ వ్యాప్తంగా జిల్లా, దిగువ స్థాయి కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 2.76 కోట్లకు చేరిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇటీవల తెలిపారు. -
రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరత
సాక్షి, హైదరాబాద్: రోగులకోసం ఉపయోగించే మెడికల్ ఆక్సిజన్‌కు కొరత ఏర్పడటంతో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు, ప్రైవేటు ఆస్పత్రుల యాజ మాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కొన్ని ఆస్ప త్రులు శస్త్రచికిత్సలు కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఐసీయూల్లో ఉన్న రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగురోజుల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోయింది. నిత్యం సరఫరాచేసే కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో వరంగల్ ఎంజీఎం ఆçస్పత్రితోసహా పలు ప్రభుత్వ ఆసుపత్రులు అత్యవసర శస్త్రచికిత్సలు మినహా మిగిలిన ఆపరేషన్లను వాయి దా వేసుకున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆçస్పత్రులు మాత్రం బెంగళూరు నుంచి తెప్పించుకున్నాయి. గత ఏడాది గోరఖ్‌పూర్ బీఆర్టీ ఆçస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో వందకుపైగా చిన్నారులు మృతిచెందిన ఘటన ఇంకా మరవకముందే, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వైద్యవర్గాల్లో కలకలంరేపింది. సర్జరీ సమయంలో, ఐసీయూ ట్రీట్మెంట్, ఇన్హలేషన్ థెరపీకోసం ద్రవరూప ఆక్సిజన్‌ను వాడుతున్నారు. అంతేకాకుండా ఆస్తమా, బ్రాంకైటీస్ రోగులకోసం ద్రవరూప ఆక్సిజన్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు ద్రవరూప ఆక్సిజన్‌ను తయారుచేసి సిలిండర్లలో నింపి సరఫరా చేస్తుంటాయి. రాష్ట్రంలో 2 అంతర్జాతీయ సంస్థలు డీలర్ల ద్వారా సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. ఆయా సంస్థల్లో తలెత్తిన లోపంవల్ల ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలుస్తోంది. మొత్తానికి 2 రోజుల తర్వాత సరఫరా పునరుద్ధరించటంతో వైద్యవర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
తుపాకీ లేని ఖాకీ
బొమ్మనహళ్లి: ప్రజా భద్రతను చూసే పోలీసులు లాఠీలతోనే దుండగులను ఎదుర్కోవాల్సి వస్తోంది. హోంశాఖకు ఏటా వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌ను కేటాయిస్తున్నా మౌలికమైన ఆయుధాల కొరత నాలుగో సింహాన్ని నిస్తేజం చేస్తోంది. నేరస్థులు, ఉగ్రవాదుల నుంచి ప్రజల ధన,మాన, ప్రాణాలను రక్షించడానికి ఎన్నో పరీక్షలు నిర్వహించి నెలల పాటు శిక్షణనిచ్చి పోలీసులను నియమించే ప్రభుత్వాలు వారికి ఆయుధాలను ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్య ధోరణిని వదులుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం చిల్లర దొంగల నుంచి ఉగ్రవాదుల వరకు అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉండగా, వారిని ఎదుర్కొనాల్సిన పోలీసులు మాత్రం దశాబ్దాల కాలం నాటి తుపాకులతోనే నెట్టుకొస్తున్నారు. కానిస్టేబుళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రాత్రి వేళల్లో గస్తీలో పాల్గొనే కానిస్టేబుళ్లు కేవలం లాఠీలతో విధులు నిర్వర్తిస్తుండడంతో దొంగలు నిర్భీతిగా దాడులకు తెగబడుతున్నారు. బెంగళూరు నగరంలో కూడా దొంగలు, అసాంఘిక ముఠాలు పోలీసులపై దాడులకు తెగబడ్డ ఘటనలు కోకొల్లలు. ఇంత జరుగుతున్నా పోలీసులకు కొత్త ఆయుధాలు అందించి శాఖలో ఆయుధాల కొరతను నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకర పరిణామం. కాగ్ నివేదికలో చేదు నిజాలు రాష్ట్ర పోలీసుశాఖలో ఆయుధాల కొరతపై గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందో కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. సంకీర్ణ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందంటూ కాగ్ స్పష్టం చేసింది. చాలా స్టేషన్లలో కావాల్సినంత మందుగుండు ఉంది, తుపాకులే లేవు, కొన్నిచోట్ల తుపాకులు ఉన్నాయి, అందుకు తగిన మందుగుండు అందుబాటులో లేదు. ♦ 2012లో రాష్ట్రంలోని చాలా పోలీస్స్టేషన్లలో ఏకే– 47 తదితర ఆయుధాల కొరత మరింత తీవ్రంగా ఉంది. ♦ ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తప్పనిసరిగాఉండాల్సిన 0.303 ట్రంకెటేడ్ రైఫిల్‌ల కొరత 72 శాతం ఉండగా 2017 మార్చ్ నెలఖారు నాటికి కూడా ఆయుధాల కొరత శాతం అంతే ఉన్నట్లు కాగ్ నివేదికలో బహిర్గతమైంది. ♦ ఆయుధాలు ఉన్న 18 పోలీస్స్టేషన్లలో అందుకు సరిపడా మందుగుండు సామగ్రి లేకపోవడంతో ఆయుధాలన్నింటినీ స్టోర్‌రూమ్‌లలో పడేశారు. పలు పీఎస్‌లలో మందుగుండు కాలవ్యవధి ముగియడంతో బెంగళూరులోని సీఏఆర్,మైసూరు నగరంలోని డీఏఆర్ కేంద్రాల్లో అటకెక్కించారు. ఇంటెలిజెన్స్ విభాగ ఏడీజీపీ, కేఎస్ఆర్పీ, యాదగిరి, తుమకూరు తదితర 18 పోలీసు కేంద్రాల్లో భారీగా నిల్వ చేసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఏళ్లతరబడి వృథాగా ఉంటోంది. ప్రస్తుతం కొత్తగా పోలీసుశాఖలో చేరిన పోలీసు అధికారులు,సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ ఇవ్వడానికి కూడా ఆయుధాలు లేనంతగా ఆయుధాల కొరత సమస్య పరిణమించిందని పోలీసు వర్గాల సమాచారం. దీంతో చేతిలో సరైన ఆయుధాలు లేక పోవడంతో రాత్రివేళల్లో విధులు నిర్వర్తించడానికి పోలీసులు వెనుకడుగేస్తున్నారు. శిక్షణ లేక చిలుము కాగ్ నివేదికల ప్రకారం ఎనిమిది జిల్లాల్లోని 21 పోలీస్స్టేషన్ల సీఐ, ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లకు 9 ఎంఎం గన్లు ఇచ్చారు. అయితే ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుళ్లకు అందించిన గన్లను అధికారులు స్టేషన్లలోని స్టోర్‌రూమ్‌లలో భద్రపరిచారు. సంవత్సరాల తరబడి స్టోర్ రూమ్‌లలో భద్రపరచిన గన్లను ఎప్పుడు కూడా వాడకపోవడం, కనీసం అప్పుడప్పుడు శుభ్రం కూడా చేయక తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. ఆయుధాల కొరత లేదు: డీసీఎం పరమేశ్వర్ రాష్ట్రంలోని హోం శాఖలో ఎలాంటి ఆయుధాల కోరత లేదని, సీఏజీ ఇచ్చిన నివేదికను చాలా సీరియస్‌గా తిసుకోవడం జరుగుతుందని హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర్ అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ డీసీఎం ఆర్.అశోక్ మాట్లాడుతూ. పోలీసు సిబ్బందికి ఆయుధాల కొరతపై కాగ్ నివేదిక మీద చర్చించి ప్రభుత్వానికి సలహాలను ఇస్తామని తెలిపారు. -
నో స్టాక్!
అనంతపురం సెంట్రల్: ఎప్పుడూ కళకళలాడే మద్యం షాపులు.. వెలవెలబోతున్నాయి. హుషారుగా వైన్స్ షాపునకు వెళ్లే మద్యం ప్రియులు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. గోదాముల నుంచి సరఫరా లేకపోవడంతో జిల్లాలో ఏ మద్యం దుకాణంలో చూసినా ‘‘నో స్టాక్’’ బోర్డులే కనిపిస్తున్నాయి. జిల్లాలో 245 మద్యం దుకాణాలు, 20 పైచిలుకు బార్లుండగా...అన్ని చోట్లా మద్యం కొరత ఏర్పడింది. మద్యం దుకాణాదారులు డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ స్టాకు మాత్రం సరఫరా కావడం లేదు. పదిరోజుల నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. మద్యం విక్రయాలను ఆన్లైన్ చేసిన ప్రభుత్వం..ఈ బాధ్యతలను ‘‘సీ–టెల్’’ కంపెనీకి అప్పగించింది. అయితే సదరు కంపెనీకి ప్రభుత్వం దాదాపు రూ.80 కోట్ల వరకూ బకాయి పడినట్లు తెలుస్తోంది. అందువల్లే ఆ కంపెనీ 10 రోజులుగా మద్యం సరఫరా నిలిపివేసింది. దీంతో వైన్స్‌లకు మద్యం సరఫరా కాకా..అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వ్యాపారం కూడా భారీగా పడిపోయింది. మద్యం దుకాణాదారులకుఎదురుదెబ్బ లక్షలాది రూపాయాలు పోసి మద్యం దుకాణాలను దక్కించుకున్న షాపుల యజమానులు ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. కమీషన్ తగ్గించడం వల్ల తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని గతంలోనే ఆందోళనలు చేపట్టారు. వారం రోజుల పాటు మద్యం దుకాణాలు కూడా బంద్ చేశారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. తాజాగా ఆన్లైన్ విధానం తీసుకొచ్చి.. సదరు కంపెనీలకు డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా మద్యం దుకాణాదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదేస్థాయిలో మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తమకు నచ్చిన బ్రాండ్ దొరక్కపోవడంతో పలు షాపులకుతిరిగి తెచ్చుకుంటున్నారు. గురు, శుక్రవారాల్లో ఆ మాత్రం స్టాక్ కూడా ఉండదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. తీవ్రంగా నష్టపోతున్నాం టెండర్లలో మద్యం షాపుల తీసుకొని తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రోజుకు ఒక్కో షాపు నుంచి రూ. 20 వేలకు పైగా నష్టపోతున్నాం. ప్రభుత్వానికి మేము చెల్లించిన డబ్బులు వెనక్కి ఇస్తే మద్యం షాపులు వదలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. – రామలింగారెడ్డి, సింధూర వైన్స్, మద్యం యజమానులఅసోసియేషన్ నాయకులు -
దేశ రక్షణకు జవాన్ల కొరత..!
సాక్షి, న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో సైనికులు కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నట్లు బుధవారం లోక్‌సభలో రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. మూడు విభాగాల్లో( రక్షణ, నావీ, ఎయిర్‌ఫోర్స్) కలిపి 9096 మంది అధికారుల కొరత ఉన్నట్లు రక్షణ శాఖ సహాయక మంత్రి సుభాష్ భోమ్రే లోక్‌సభలో తెలిపారు. సభలో ఓ ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అత్యధికంగా రక్షణశాఖలో 7298 మంది సైనికుల కొరత ఉన్నట్లు వెల్లడించారు. నావీలో 1606, ఎయిర్‌ఫోర్స్‌లో 192 మంది అధికారుల కొరత ఉన్నట్లు మంత్రి తెలిపారు. రక్షణశాఖలో అధికారికంగా ఉండాల్సిన సంఖ్య 49933కి గాను, 42635 మంది ఉన్నారు. నావీలో 11352 అధికారులకు 9746 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 12392కి గాను 12584 మంది ఉన్నట్లు తెలిపారు. జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో ఇటు చైనా, అటు పాకిస్తాన్‌తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో త్రివిధ దళాలను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. రక్షణశాఖలో పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడటంపై ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తోంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని రక్షణ శాఖను బలోపేతం చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. -
సర్దుబాటుకు ససేమిరా !
ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత నివారించేందుకు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయులను అవస్థల్లోకి నెట్టింది. ప్రస్తుతం ఒక ప్రాంతంలో సెటిలైన వారిని ప్రభుత్వ సౌలభ్యం కోసం ఉన్నఫళంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు నూతన బాధ్యతల్లో చేరగా.. మిగిలిన వారు చేరేందుకు ససేమిరా అంటున్నారు. సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను తాత్కాలికంగా నివారించాలని ప్రభుత్వం, విద్యాశాఖ తలచింది. ఈ నేపథ్యంలో పని సర్దుబాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నేటి వరకు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి మరికొన్ని రోజుల వ్యవధి పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీఈవో పూల్‌లో 20 మంది మిగులు ఉపాధ్యాయులున్నా వారిని ఇతర స్థానాలకు సర్దుబాటు చేయకుండా అలానే ఉంచారు. డీఈవోపై ఒత్తిడి... జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో 73 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 40 మంది మాత్రం అతికష్టం మీద సర్దుబాటు చేసినట్లు సమాచారం. మిగిలిన 33 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్దుబాటుకు సుముఖంగా లేని ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. తమకు అనుకూలమైన రాజకీయ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈఓపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో డీఈఓ సైతం ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో తప్పకుండా చేరాలని, చేరని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్యల భయంతో వెనకడుగు... ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకించేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఓ ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అయ్యవార్లకు ప్రభుత్వం నిర్ణయించిన కాలపరిమితి అనంతరమే బదిలీలు ఉంటాయి. అలా కాదని తమకు ఇష్టమైన ప్రదేశాలకు బదిలీ కోరితే అందుకు అనుమతించరు. అలాంటి తరుణంలో ప్రభుత్వం, విద్యాశాఖకు ఇష్టమైనప్పుడు మాత్రం ఇలాంటి పద్ధతికి తెర తీయడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియ తాత్కాలికమే అని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. వివిధ పాఠశాలలకు సర్దుబాటు అయ్యే ఉపాధ్యాయులు 2018–19 విద్యా సంవత్సరం ముగిసేవరకు మాత్రమే ఆయా పాఠశాలల్లో కొనసాగుతారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తిరిగి గత పాఠశాలలకు వచ్చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై స్పష్టత కరువైంది. ఒక వేళ ఇప్పుడు నోటిఫికేషన్ వెలువరించినా.. పరీక్షల నిర్వహణ, ఉద్యోగాలకు ఎంపిక చేయాలంటే కనీసం ఆరు నెలల వ్యవధి తప్పనిసరి. తర్వాత కొద్ది కాలానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్దుబాటుకు వెళ్లిన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు తప్పనిసరిగా కొనసాగాల్సి అవసరం ఉంది. రవాణా ఖర్చులు సైతం తడిసి మోపెడు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న నివాసం నుంచి కేటాయించిన పాఠశాలకు వెళ్లాలంటే చార్జీల రూపంలో అదనపు ఖర్చులు తప్పవు. ఈ కారణాల దృష్ట్యా సర్దుబాటుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లు వస్తే పూర్వ స్కూల్‌కే... ఒక వేళ సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు మధ్యలోనే వారు పనిచేసిన పూర్వ పాఠశాలలకు వచ్చేయాల్సి ఉంటుంది. లేదా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తే సర్దుబాటు ప్రక్రియ ద్వారా వేర్వేరు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గత పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన జారీ చేస్తే జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ కొలువుల్లో 30 శాతం మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 70 శాతం ఉపాధ్యాయ కొలువులను పదోన్నతుల ద్వారా కల్పిస్తారు. ప్రస్తుతం ఈ రెండు పద్ధతులు అమలయ్యే సూచనలు ఇప్పట్లో అగుపించడం లేదు. ప్రశ్నార్థకంగా యూపీ పాఠశాలలు... విద్యార్థికి క్షేత్ర స్థాయిలో మెరుగైన విద్య అందితే ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత విద్యాశాఖ చర్యలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. క్షేత్ర స్థాయిలో బోధించే ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు కేటాయిస్తే యూపీ పాఠశాలల్లో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు ప్రక్రియ ద్వారా ఉపాధ్యాలను నియమించడం కాకుండా ఆయా స్థానాల్లో విద్యావలంటీర్లను నియమించాలన్న డిమాండ్ నెలకొంది. దీని ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టే ప్రక్రియకు ఉపక్రమించడం దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వేధిస్తున్న చిన్నబాస్ల కొరత
అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో కీలకమైన డీఎస్పీల పోస్టింగుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలలు గడుస్తున్నా ఖాళీ స్థానాలకు ఖాళీగా ఉన్న డీఎస్పీ స్థానాలకు పోస్టింగ్ ఇవ్వడం లేదు. ఓవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో దీని ప్రభావం శాంతి భద్రతలపై పడనుంది. జిల్లాలో పోలీసుశాఖ శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు డీఎస్పీ స్థానాలు ఉన్నాయి. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి డీఎస్పీ స్థానాలు ఉన్నాయి. పోలీసుశాఖలో శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో జిల్లా ఎస్పీ తర్వాత డీఎస్పీలే కీలకం. సబ్‌డివిజనల్ స్థాయిలో శాంతిభద్రతలు సజావుగా సాగాలన్నా.. సిబ్బంది సక్రమంగా పనిచేయాలన్నా డీఎస్పీల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. అంతటి కీలకమైన స్థానాలు వెనువెంటనే భర్తీకి నోచుకోవడం లేదు. కీలకమైన స్థానాలకు కూడా డీఎస్పీలు ఉండటం లేదు. ప్రస్తుతం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ –1 డీఎస్పీ, తాడిపత్రి డీఎస్పీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొన్నటి వరకూ కీలకమైన తాడిపత్రి, ధర్మవరం డీఎస్పీ స్థానాలు ఖాళీగా ఉండేవి. ధర్మవరం డీఎస్పీ పోస్టు దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొచ్చారు. డీఎస్పీ వేణుగోపాల్ ఉద్యోగవిరమణ తర్వాత పుట్టపర్తి డీఎస్పీ రమావర్మ ఇన్చార్జ్ బాధ్యతలు నెట్టుకొచ్చారు. ఇటీవల స్పెషల్ డీఎస్పీ శ్రీనివాసులు కళ్యాణదుర్గం డీఎస్పీగా బదిలీ కావడంతో అక్కడున్న వెంకటరమణను ధర్మవరానికి నియమించారు. దీంతో అత్యంత కీలకమైన స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ పోస్టు ఖాళీగా ఏర్పడింది. అలాగే తాడిపత్రి డీఎస్పీ స్థానం కూడా ఖాళీగా ఉండి దాదాపు ఏడాది కావస్తోంది. ప్రస్తుతం సూపర్ న్యూమొరీ డీఎస్పీ అయిన ఎస్సీ, ఎస్టీ సెల్–2 డీఎస్పీ విజయ్‌కుమార్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా సూపర్ న్యూమొరీ డీఎస్పీలకు లా అండ్ ఆర్డర్ పోస్టింగులు ఇవ్వడం లేదు. కానీ జిల్లాలో మరో గత్యంతరం లేక సూపర్ న్యూమొరీ డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకూ ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మహబూబ్‌బాషాకు అప్పగించారు. అనివార్య కారణాల వల్ల తప్పించి మరో డీఎస్పీ విజయ్‌కుమార్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. త్వరలో మరో రెండు స్థానాలు ఖాళీ : ప్రస్తుతం ఈ పరిస్థితి ఉంటే త్వరలో మరో రెండు డీఎస్పీ స్థానాలు ఖాళీ ఏర్పడనున్నాయి. ఇటీవల పెనుకొండ డీఎస్పీ ఖరీముల్లాషరీఫ్, గుంతకల్లు డీఎస్పీ శ్రీధర్‌కు అడిషనల్ ఏఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో వీరికి పోస్టింగ్ కల్పించే అవకాశముంది. దీంతో ఈ రెండు స్థానాలు కూడా ఖాళీ ఏర్పడనున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కొత్త డీఎస్పీలు నియమించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. డీఎస్పీల కొరత ప్రభావం శాంతిభద్రతలపై పడుతోంది. పోలీస్‌బాస్ అయిన ఎస్పీపై అదనపు భారం పడుతోంది. డీఎస్పీలేని ప్రాంతాలపై నిరంతరం నిఘా పెడుతున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో నేటికీ మట్కా, పేకాట, బెట్టింగ్ తగ్గుముఖం పట్టలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ తాడిపత్రి ప్రాంత వాసులు కావడం గమనార్హం. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ కొండసాని సురేష్‌రెడ్డితో సహా పదుల సంఖ్యలో తాడిపత్రి ప్రాంతానికి చెందిన వారిని జిల్లా పోలీసులు పలు సందర్భాల్లో అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. దీనికంతటికీ కారణం స్థానికంగా రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మవరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనేక సందర్భాల్లో శాంతి భధ్రతలకు విఘాతం ఏర్పడేలా అక్కడి పోలీసులు వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలు సందర్భాల్లో ప్రతిపక్షపార్టీ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎస్పీ కొరత ప్రభావం శాంతిభద్రతలపై పడే అవకాశముంది. కనుక కీలకమైన స్థానాలకు డీఎస్పీలు భర్తీ చేయడం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో నూతన డీఎస్పీలు : జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ పోలీసుశాఖలో త్వరలో నూతన డీఎస్పీలుగా పలువురికి పదోన్నతులు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం పనిచేస్తున్న సూపర్న్యూమొరీ డీఎస్పీలకు రెగ్యులర్ డీఎస్పీలు పోస్టింగ్‌లు రానున్నాయి. వీరితో పాటు మరికొందరికీ డీఎస్పీలుగా పదోన్నతులు రానున్నాయి. అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు పొందిన వారు వెళ్లిపోతే రంగంలోకి నూతన డీఎస్పీలు రానున్నారు. కనుక త్వరలోఅన్ని స్థానాలకు రెగ్యులర్ డీఎస్పీలు నియమితులవుతారు. కావున ఇబ్బందులు ఉండవు -
9,000 మందికో వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ప్రభుత్వ వైద్యుల కొరత వేధిస్తోంది. వైద్యారోగ్య రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా సిబ్బంది నియామకంపై దృష్టి సారించకపోవడంతో వైద్యుల కొరత తీరడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రతి 1,000 మందికి ఓ ప్రభుత్వ వైద్యుడు ఉండాలి. కానీ తెలంగాణలో 9,343 మందికి ఓ వైద్యుడు ఉన్నాడు. మొత్తంగా రాష్ట్రంలో 4,123 మందే సర్కారు వైద్యులున్నారు. వీరుగాకుండా 201 మంది దంత వైద్యులున్నారు. అంటే ప్రతి 1.91 లక్షల మందికి ఓ దంత వైద్యుడన్నమాట. కేంద్రం ఇటీవల విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మానవ వనరుల నివేదిక–2018 ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. వైద్యుల విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోల్చినా రాష్ట్రం వెనుకబడి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. సిక్కింలో ప్రతి 2,437 మందికి, మిజోరంలో 2,358 మందికి ఓ వైద్యుడున్నట్లు వెల్లడించింది. తమిళనాడుతో పోలిస్తే మాత్రం తెలంగాణ ముందుంది. అక్కడ 9,544 మందికి ఓ వైద్యుడున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే 10,189 మందికి ఓ వైద్యుడున్నాడు. బిహార్ రాష్ట్రం అత్యంత వెనుకబడి ఉంది. అక్కడ 28,391 మందికి ఓ ప్రభుత్వ వైద్యుడున్నాడు. అదే అమెరికాలో ప్రతి 200 మందికి ఓ వైద్యుడు ఉన్నాడు. నియామకాల్లేవు.. కొత్త పోస్టుల్లేవు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టాక ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 13 శాతం పెరిగాయి. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య 2,21,530 ప్రసవాలు జరగ్గా.. ‘కిట్’ప్రవేశపెట్టాక తొలి ఏడాదిలో 3,07,497 ప్రసవాలు జరిగాయి. మరోవైపు డయాలసిస్ యూనిట్లు కూడా నెలకొల్పుతున్నారు. ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. త్వరలో ‘కంటి వెలుగు’కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఓవైపు ఇలాంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నా మరోవైపు వైద్య సిబ్బంది ఖాళీల భర్తీ కానీ, కొత్త పోస్టుల మంజూరుగానీ జరగడం లేదు. రెండ్రోజుల క్రితం ఏరియా, సామాజిక, జిల్లా ఆస్పత్రుల కోసం 919 మంది స్పెషలిస్టు వైద్యుల భర్తీ జరిగింది. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. 5 వేల పోస్టులు ఖాళీ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 1,318 మంజూరు వైద్యుల పోస్టులుండగా 294 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) 226 మంజూరు వైద్య పోస్టులుంటే 197 మందే ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీల్లో 1,666 స్టాఫ్ నర్సులకుగాను కేవలం 1453 మందే ఉన్నారు. సీహెచ్‌సీల్లో 71 రేడియోగ్రాఫర్స్‌కు 28 మందే పని చేస్తున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో 928 ఫార్మసిస్టులకు 691 మంది ఉండగా.. వాటిల్లో 765 లేబరేటరీ టెక్నీషియన్ల పోస్టులకు 566 మంది పని చేస్తున్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అవి పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేకపోతున్నాయని ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల ఖాళీలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల 1,000 వరకు పోస్టులు భర్తీ చేయడంతో ఖాళీల సంఖ్య 5 వేలకు తగ్గింది. 12 శాతం మందే సర్కారుకు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపించడం లేదన్న ఆరోపణలున్నాయి. కేవలం 12 శాతం మందే ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి వస్తున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో తక్కువ వేతనం, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, తక్కువ పోస్టులే ఇందుకు కారణమని కేంద్రం విశ్లేషించింది. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ వేతనాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. కేరళలో బోధనేతర అసిస్టెంట్ సర్జన్‌కు రూ.లక్ష, సివిల్ సర్జన్‌కు రూ. 1.80 లక్షలు వేతనాలిస్తుంటే.. తమిళనాడులో అదే కేటగిరీకి రూ. 90 వేలు, రూ. లక్షన్నర చొప్పున ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం రూ. 65 వేలు, రూ. లక్ష ఇస్తున్నారు. బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో వైద్యుల బేసిక్ శాలరీలో 25 శాతం గ్రామీణ అలవెన్సు ఇస్తుంటే తెలంగాణలో రూ. 2 వేలు ఇస్తున్నారు. పోస్టుమార్టం అలవెన్సు పంజాబ్‌లో ఒక్కో కేసుకు రూ. 1,000.. కేరళ, తమిళనాడుల్లో రూ. 600 చొప్పున ఇస్తుండగా రాష్ట్రంలో ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇక 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాలు నిర్ణీత సమయంలోనే పదోన్నతులు ఇస్తున్నాయి. తెలంగాణ, పశ్చిమబెంగాల్, అస్సాంలలో అలా జరగడం లేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి కూడా వైద్యులు విముఖత చూపిస్తున్నారు. –––––––––––––––––––––––––––––––––––– వివిధ రాష్ట్రాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్యుడికి జనాభా ––––––––––––––––––––––––––––––––––––– రాష్ట్రం జనాభా ––––––––––––––––––––––––––––––––––– 1) తెలంగాణ 9,343 2) ఆంధ్రప్రదేశ్ 10,189 3) అరుణాచల్‌ప్రదేశ్ 2,417 4) అస్సాం 5,395 5) బీహార్ 28,391 6)చత్తీస్‌గఢ్ 15,916 7) గోవా 3,883 8) గుజరాత్ 11,475 9) హరియాణా 10,189 10) జమ్మూ కశ్మీర్ 3,060 11) కర్ణాటక 13,556 12) కేరళ 6,810 13) మహారాష్ట్ర 16,996 14) మణిపూర్ 2,358 15) పంజాబ్ 9,817 16) రాజస్థాన్ 10,976 17) తమిళనాడు 9,544 18) త్రిపుర 3,038 19) ఉత్తరప్రదేశ్ 19,962 20) పశ్చిమబెంగాల్ 10,411 -
బోధనకు యాతన
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనకు ఆటంకంగా మారింది. సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులతో భర్తీ చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రతి నెలా పదవీ విరమణలతో ఖాళీ అవుతున్న పోస్టుల్ని ఎప్పటికప్పుడు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ జిల్లాలో గత 15 నెలలుగా నిలిచిపోవడంతో ఉపాధ్యాయ ఖాళీలు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల పరిధిలో 561 పోస్టులు, ప్రాథమిక పాఠశాలల పరిధిలో 63 ప్రధానోపాధ్యాయ, 33 ఎస్జీటీ పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పాటు ఉన్నత పాఠశాలల్లో 23 ప్ర«ధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి సర్వీసు రూల్స్ సాకుతో బ్రేక్ ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు ప్రభావంతో ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన విభేదాలతో న్యాయస్థానాల్లో ఉన్న కేసులను సాకుగా చూపుతున్న ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియ చేటప్టడం లేదు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకోవడంతో నేటికీ పూర్తిస్థాయిలో విద్యా బోధన జరగడం లేదు. సైన్స్, సోషల్, మాథ్స్ సబ్జెక్టులతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషా సబ్జెక్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోర్టు తదుపరి ఉత్తర్వులకు లోబడి అడ్‌హక్ పద్ధతిలో పదోన్నతులు కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నారు. ఐదు ఎడ్యుకేషన్ డివిజన్లలో టీచర్ల కొరత జిల్లాలోని గుంటూరు, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి డివిజన్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత నెలకొంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని పాఠశాలల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయి. గతంలో జరిగిన పదోన్నతుల కౌన్సెలింగ్‌లో పల్నాడు ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు గుంటూరు, తెనాలి, బాపట్ల డివిజన్లలోని పాఠశాలలకు రావడంతో అక్కడ ఖాళీలు పేరుకుపోయాయి. ఉదాహరణకు బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు జెడ్పీ హైస్కూల్లో గణితం బోధించేందుకు ఉపాధ్యాయుడే లేరు. వెల్దుర్తి మండలం, నూజెండ్ల, ఈపూరు మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలు పేరుకుపోయాయి. బోధనకు తీవ్ర ఆటంకం సర్వీసు రూల్స్ అమల్లో నెలకొన్న వివాదాలతో పదోన్నతులు చేపట్టకపోవడం సరికాదు. విద్యా బోధనకు తీవ్ర ఆటంకంగా మారడంతో అడ్‌హక్ పద్ధతిలో అయినా పదోన్నతులు చేపట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు ప్రారంభమైన పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలి.వి.వి.శ్రీనివాసరావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు -
వరదొచ్చే దాకా వణుకే!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి, కృష్ణా ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను కోల్పోయి నిర్జీవంగా మారాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్నాయి. కృష్ణా బేసిన్ ఎగువన కర్ణాటక ప్రాజెక్టులు సైతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవడం, అవి నిండితే కానీ దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండే అవకాశం లేకపోవడంతో ఇక ఆశలన్నీ వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో కనీసం 200 టీఎంసీల మేర నీటి నిల్వలు వస్తేకానీ దిగువన తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు పెరిగే అవకాశాల్లేవు. ఈ పరిస్థితి రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. గణనీయంగా పడిపోయిన మట్టాలు కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఎగువ కర్ణాటకలో గతేడాది కాస్త ఆలస్యంగా సెప్టెంబర్, అక్టోబర్‌లో భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నిండినా ఖరీఫ్, రబీలో అక్కడ గణనీయమైన సాగు జరిగింది. దీంతో ఆ మూ డు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 267 టీఎంసీల నిల్వ కు గానూ కేవలం 45 టీఎంసీల నీటి లభ్యతే ఉంది. 222 టీఎంసీల కొరత ఉంది. గతేడాది ఇదే సమయంలో ఉన్న నిల్వలతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 10 టీఎంసీలు తక్కువగా ఉంది. ఎగువన సుమారు 200 టీఎంసీల మేర నీరు చేరాకే దిగువకు నీరొచ్చే అవకాశాలుంటాయి. అందుకు రెండు నెలలకన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర పరిధిలోని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 370 టీఎంసీల మేర నీటి కొరత ఉంది. ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో వినియోగించగల నీటి నిల్వలు 10 టీఎంసీలలోపే ఉన్నాయి. ఆ నీరు ఇరు రాష్ట్రాలకు ఆగస్టు వరకు తాగునీటి అవసరాలను తీర్చడం అనుమానమే. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చే వరదలపైనే రాష్ట్ర ప్రాజెక్టుల కింద తాగు, సాగు అవసరాలు ఆధారపడి ఉండనున్నాయి. ఒకవేళ జూన్, జూలైలో మంచి వర్షాలు కురిసినా రాష్ట్ర ప్రాజెక్టుల్లో చేరే నీటిలో సుమారు 50 నుంచి 60 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్ అవసరాలకు వినియోగిస్తారు. మొత్తంగా సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఖరీఫ్ ఆయకట్టుపై స్పష్టత వచ్చే అవకాశాల్లేవు. ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరకుంటే ఆ ప్రభావం సాగర్, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా పరిధిలోని 11 లక్షల ఎకరాల ఆయకట్టుపై పడే ప్రమాదం ఉంది. ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ 160.72 టీఎంసీల నీటి కొరత ఉంది. ఇక్కడ జూలై నుంచే కొంతమేర ప్రవాహాలు కొనసాగితే తాగునీటి వరకు ఇబ్బంది ఉండదు. సకాలంలో నీరు రాకుంటే గతేడాది మాదిరే తాగునీటికి కటకట ఏర్పడనుంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీల్లో) ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ ప్రస్తుత నిల్వ జూరాల 9.65 3.66 శ్రీశైలం 215.81 28.86 సాగర్ 312.05 135.09 ఆల్మట్టి 129.72 22.57 నారాయణపూర్ 37.64 19.73 తుంగభ్రద 100.86 3.81 గోదావరిలో ఇలా.. సింగూర్ 29.91 7.66 నిజాంసాగర్ 17.80 2.48 ఎస్సారెస్పీ 90.31 6.64 ఎల్ఎండీ 24.07 3.66 కడెం 7.60 2.89 ఎల్లంపల్లి 20.18 5.82 -
గిట్లయితే చదువెట్ల..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత యథావిధిగానే ఉంది. పాఠశాలలు తెరిచే నాటికి కొత్త ఉపాధ్యాయులు వస్తారనుకున్నా.. వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) నిర్వహించినా.. ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఈ విద్యా సంవత్సరం కూడా విద్యా వలంటీర్లతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొంది. విద్యా సంవత్సరం మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న 1,211 ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసే విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత ఏడాది పలుచోట్ల ప్రధానోపాధ్యాయులతోపాటు ఆయా సబ్జెక్టుల టీచర్లు లేకపోవడంతో ఫలితాల్లో వెనుకబడాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆ ప్రభావం పదో తరగతి ఫలితాలపై పడింది. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు అనేక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏళ్లతరబడి ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడం, ఆయా పాఠశాలల విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టులను బోధించే పూర్తిస్థాయి ఉపాధ్యాయులు లేకపోవడమే పదో తరగతి ఫలితాలు తగ్గడానికి కారణమైందని విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆయా పోస్టులను భర్తీ చేయాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కావడంతో విద్యార్థులకు విద్యాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఖాళీలివే.. జిల్లావ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలుపుకుని 586 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఎస్జీటీలు 208, సోషల్ 117, బయాలజీ 52 మంది ఉపాధ్యాయులు కావాల్సి ఉంది. అలాగే గ్రేడ్–2 హెచ్ఎంలు 36, గణితం 21, ఫిజిక్స్ 3, ఇంగ్లిష్ 20, తెలుగు 30, హిందీ 11, ఉర్దూ 2, పీడీ, పీఈటీ పోస్టులు 13, లాంగ్వేజి పండిట్ తెలుగు 11, లాంగ్వేజి పండిట్ హిందీ 7, పీడీఎం పోస్టులు 15, ఎల్ఎఫ్ఎల్ పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి. ఒకే ఉపాధ్యాయుడు.. రెండు పాఠశాలలు.. జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యా వలంటీర్లను నియమించి పాఠాలు చెప్పించినప్పటికీ సరైన ఫలితం కనిపించలేదు. మరికొన్నిచోట్ల ఒకే సబ్జెక్టు బోధిస్తున్న ఉపాధ్యాయుడు తన లీజర్(ఖాళీ) సమయంలో మరో పాఠశాలకు వెళ్లి అదే సబ్జెక్టును బోధించారు. ఒకే ఉపాధ్యాయుడు రెండు చోట్లకు వెళ్లడంతో అక్కడ కూడా సరైన ఫలితాలు రాబట్టలేకపోయారు. ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠశాలకే పరిమితమైతే ఫలితాలు బాగా వస్తాయని పేర్కొంటున్నారు. కానీ.. దానిని ఆచరణలో చూపడం లేదు. అనుభవం లేని విద్యా వలంటీర్లను వివిధ పాఠశాలల్లో నియమిస్తూ ఫలితాలు అందుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఖాళీలున్న పాఠశాలల్లో ఎస్జీటీ తదితర పోస్టులను భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ ఏడాదీ వీవీలే.. విద్యా సంవత్సరం పునః ప్రారంభమవుతున్న తరుణంలో ఇప్పటివరకు ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఖాళీగా ఉన్న సబ్జెక్టులకు సంబంధించి విద్యా వలంటీర్లను నియమించే అవకాశం ఉంది. ఆ దశగా విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉంటే అందుకు తగిన రీతిలో బోధన జరిగే వీలుంటుంది. అలా కాకుండా విద్యా వలంటీర్లను నియమించడంతో విద్యార్థులు కూడా ఆయా సబ్జెక్టులపై అంతగా శ్రద్ధ చూపరని పలువురు పేర్కొంటున్నారు. ఆదేశాలు రాలేదు.. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఇతర పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అప్పటివరకు గతంలో మాదిరిగానే విద్యా వలంటీర్లతోపాటు ఉన్న ఉపాధ్యాయులను ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేసి విద్యాబోధన కొనసాగిస్తాం. గతంలో ఈ వ్యవహారంలో కొన్ని తప్పిదాలు జరిగాయి. అటువంటివి పునరావృతం కాకుండా ఈ ఏడాది పకడ్బందీ చర్యలు చేపట్టాం. – మదన్మోహన్, డీఈఓ -
మందుల్లేవ్!
ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు రామచంద్ర, విజయమ్మ. వీరిది కదిరి. కూలికెళితేనే పూటగడిచేది. ఈనెల 18న తమ ఆరేళ్ల కూతురు రేవతికి జబ్బు చేయడంతో సర్వజనాస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. పరీక్షించిన వైద్యులు షుగర్ ఉందని తెలిపారు. రోజూ షుగర్ పరీక్ష చేసి ఇన్సులిన్ ఇవ్వాలని చెప్పారు. మొదట్లో ఐవీ ఫ్లూయిడ్స్ లేకపోవడంతో ప్రైవేట్‌గా రూ.700 కొనుగోలు చేశారు. ఇక షుగర్ టెస్ట్ కోసం ఉపయోగించే స్ట్రిప్స్ కూడా ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో రామచంద్ర, విజయమ్మ దంపతులు రూ.800 వెచ్చించి ప్రైవేట్‌గా కొనుగోలు చేశారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మందులు, ఖర్చులకు రూ.3,500 వరకు ఖర్చు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు తమ ఆదాయం రూ.8 వేలు మాత్రమేనని, ఇంకా ఇద్దరు పిల్లలున్నారని, నెలకు రూ.3500 ఖర్చు చేయాల్సి వస్తే తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. ఎప్పటికప్పుడు అప్రమత్తమై రోగులకు మందులందించేలా చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. కాటన్ మొదలు కొని ఐవీ ఫ్లూయిడ్స్, క్యాన్లా, 2సీసీ సిరంజీలు, సెఫిగ్జెమ్, ఆంపిసిల్లిన్, సిఫ్ట్రోఫ్లాక్సిన్, సీపీఎం, విటమిన్ సిరప్లు, షుగర్ స్ట్రిప్స్ లేవు. రెండు నెలలుగా ఇదే దయనీయమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రోగుల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నా.. అది మాటలకే పరిమితమవుతోంది. కాటన్‌కూ కటకట.. రోగులకు ఫస్ట్ ఎయిడ్, ఇంజెక్షన్స్ వేయడం మొదలుకుని ప్రతి పనికీ కాటన్ (దూది) తప్పనిసరి. అటువంటి కాటన్ సరఫరా ఆగిపోయింది. చిన్నపిల్లల వార్డు, లేబర్, గైనిక్, ఆర్థో, మెడిసిన్ తదితర వార్డులో కాటన్ లేకపోవడంతో వైద్యులు, స్టాఫ్‌నర్సులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులకు కాటన్‌ను బయటి నుంచి తెప్పించే దారుణమైన పరిస్థితి నెలకొంది. గర్భిణుల అవస్థలు ఆస్పత్రిలో ప్రసవం చేయించుకునే గర్భిణులు రూ.వేలు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఐవీ సెట్ల నుంచి సెర్విప్రిమ్ జెల్లాంటివి బయట తెచ్చుకుంటున్నారు. సెర్విప్రిమ్జెల్ అనే మందు కాన్పు త్వరగా అయ్యేందుకు ఉపయోగిస్తారు. ఈ జెల్ ప్రైవేట్‌గా రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఆస్పత్రిలో రోజూ 30 ప్రసవాలు జరుగుతాయి. అందులో 20 సాధారణ ప్రసవాలు జరుగుతాయి. సాధారణ ప్రసవాలకు జెల్ తప్పనిసరి. కానీ స్టాఫ్‌నర్సులు ఇండెంట్ పెడుతున్నా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోవడం లేదు. మూలుగుతున్న నిధులు సర్వజనాస్పత్రిలో ఎమర్జెన్సీగా మందులు కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు నిధులు ఉన్నట్లు తెల్సింది. అత్యవసరానికి ఈ డబ్బులు వినియోగించవచ్చు. ఆస్పత్రి యాజమాన్యం ఇండెంట్ పెట్టామని చెబుతున్నా... రోజూ రూ.5 వేలు కొనే సౌలభ్యం ఉంది. ఇందులోనుంచైనా కాటన్ కొనుగోలు చేయవచ్చు. కానీ అటువంటి పరిస్థితి లేదు. పోస్టునేటర్ వార్డులో అడ్మిషన్లో ఉన్న ఈమె చెన్నంపల్లికి చెందిన పర్వీన. మూడ్రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎస్ఎన్సీయూలోని వైద్యులు పరీక్షించి మూడు రకాల మందులు ప్రైవేట్‌గా తెచ్చుకోవాలని రాశారు. ఎందుకని ప్రశ్నిస్తే ఆస్పత్రికి మందులు సరఫరా కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇలా ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది కొరత వాస్తవమే ఆస్పత్రిలో మార్చి నుంచి మందుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పటికే మందుల కోసం ఇండెంట్ పెట్టారు. విజయవాడ నుంచి సరఫరా కావాల్సి ఉంది. – డాక్టర్ వెంకటేశ్వర రావు,ఇన్చార్జ్ సూపరింటెండెంట్