
రామన్నపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పత్తితీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చౌటుప్పల్, చిట్యాల మండలాల్లోని జాతీయ రహదారి వెంటగల గ్రామాల్లో పత్తి తీయడానికి కూలీలు హైదరాబాద్‌లోని హయత్‌నగర్ నుంచి వస్తున్నారు.
సోమవారం చద్దిమూటలు పట్టుకొని చౌటుప్పల్ బస్టాండ్‌లో బస్సు దిగిన కూలీలను ‘సాక్షి’పలకరించగా.. పత్తి తీయడానికి వచ్చామని చెప్పారు. కిలోకు రూ.16 చొప్పున రైతులు కూలీ చెల్లిస్తున్నారని, రోజుకు 50 నుంచి 80 కిలోల వరకు పత్తి తీయడం ద్వారా రూ.800 నుంచి రూ.1,200 వరకు గిట్టుబాటవుతుందని వారు తెలిపారు. బస్టాండ్ నుంచి పత్తి చేను వరకు రైతులే ఆటోలలో తీసుకువెళ్లి తిరిగి తీసుకొస్తున్నారని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment