picking
-
పత్తి తీసే యంత్రం రెడీ!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో వరి తర్వాత ముఖ్యమైనది పత్తి. వర్షాధారంగా గానీ, ఆరుతడి పంటగా గానీ దాదాపు 113 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నప్పటికీ పత్తి తీయటానికి ఉపయోగపడే యంత్రం లేదు. మార్కెట్లో కనీసం ఒక్క హార్వెస్టర్ కూడా అందుబాటులో లేని ముఖ్యమైన పంట ఏదైనా ఉందంటే అది పత్తి మాత్రమే. రైతులు పత్తి తీతకు పూర్తిగా కూలీలపైనే ఆధారపడాల్సి రావటం, సీజన్లో రైతులందరికీ ఒకేసారి పత్తి తీసే అవసరం ఉండటంతో వారు అనేక కష్టాలు ఎదుర్కోక తప్పటం లేదు.కాటన్ హార్వెస్టర్ రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (సీఐఏఈ)లో వ్యవసాయ యాంత్రీకరణ విభాగాధిపతి వి.పి.చౌదరి తీపి కబురు చెప్పారు. ట్రాక్టర్‌కు జోడించి పత్తి తీసే యంత్రంపై తమ పరిశోధన కొలిక్కి వస్తోందని, త్వరలో ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చౌదరి ‘సాక్షి సాగుబడి’ తో చెప్పారు.పత్తి తీతలో 95% సామర్థ్యంట్రాక్టర్కు జోడించి నడిపించే బ్రష్ టైప్ కాటన్ హార్వెస్టర్ పొలంలోని 95 శాతం పత్తిని సమర్థవంతంగా తీయగలుగుతోందని చౌదరి చెప్పారు. ఒక హెక్టారు పత్తి పొలంలో దూదిని పూర్తిగా తీయటానికి 1,560 గంటల మానవ శ్రమ అవసరమవుతోందని శాస్త్రవేత్తల అంచనా. ఒక మనిషి నిమిషానికి ఒకటిన్నర (1.58) మొక్కల నుంచి దూదిని తీస్తుంటే, తాము రూపొందించిన యంత్రం 70 మొక్కల నుంచి దూదిని తీస్తోందన్నారు.మనిషి గంటకు 4.92 కిలోల గింజల పత్తిని తీస్తుంటే, ఈ యంత్రం 150–217 కిలోలు తీస్తోందని తెలిపారు. అయితే పత్తి మొక్కల నుంచి దూదిని తీసే క్రమంలో 28 శాతం వరకు ఆకులు, రెమ్మలు తదితర చెత్త కూడా పత్తికి అంటుకొని వస్తోందన్నారు. ఈ యంత్రానికి ప్రీ క్లీనర్లను అమర్చటం ద్వారా చెత్తను 10–12 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. ప్రొటోటైప్ యంత్రాన్ని సిద్ధం చేసి టెక్నాలజీని కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని చౌదరి వెల్లడించారు. దీని ధర మార్కెట్లో రూ.5 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు.అనువైన వంగడాల లేమి!పత్తి తీసే యంత్రం సిద్ధమైనంత మాత్రాన సమస్య తీరిపోదు. మిషీన్ హార్వెస్టింగ్‌కు అనువైన పత్తి వంగడాలు మన దగ్గర లేకపోవటం మరో ప్రధాన ప్రతిబంధకం. విదేశాల్లో పండించే పత్తి రకాలు యంత్రం వినియోగానికి అనువుగా ఉంటాయని చౌదరి వివరించారు. మొక్కకు ఒకే కొమ్మ (సింగిల్ షూట్) పెరుగుతుందని, అన్ని కాయలూ ఒకేసారి పక్వానికి వస్తాయన్నారు. అయితే, దేశంలో సాగయ్యే పత్తి మొక్కలకు అనేక కొమ్మలు వస్తాయని తెలిపారు.కాయలన్నీ ఒకేసారి పక్వానికి రావు.. పగలవని, అందుకే నాలుగైదు దఫాలుగా పత్తి తీయాల్సి వస్తోందని వివరించారు. కాయలన్నీ ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడాన్ని రూపొందించడానికి నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. యంత్రంతో పత్తి తీయటానికి కొద్ది రోజుల ముందే పత్తి మొక్కల ఆకులను రాల్చేందుకు డీఫోలియంట్ రసాయనాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. దూదితో పాటు వచ్చే చెత్త శాతాన్ని తగ్గించటంలో ఇది కూడా కీలకమని చౌదరి చెప్పారు. -
పత్తి తీతకు పట్నం కూలీలు
రామన్నపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పత్తితీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో కూలీలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. చౌటుప్పల్, చిట్యాల మండలాల్లోని జాతీయ రహదారి వెంటగల గ్రామాల్లో పత్తి తీయడానికి కూలీలు హైదరాబాద్‌లోని హయత్‌నగర్ నుంచి వస్తున్నారు. సోమవారం చద్దిమూటలు పట్టుకొని చౌటుప్పల్ బస్టాండ్‌లో బస్సు దిగిన కూలీలను ‘సాక్షి’పలకరించగా.. పత్తి తీయడానికి వచ్చామని చెప్పారు. కిలోకు రూ.16 చొప్పున రైతులు కూలీ చెల్లిస్తున్నారని, రోజుకు 50 నుంచి 80 కిలోల వరకు పత్తి తీయడం ద్వారా రూ.800 నుంచి రూ.1,200 వరకు గిట్టుబాటవుతుందని వారు తెలిపారు. బస్టాండ్ నుంచి పత్తి చేను వరకు రైతులే ఆటోలలో తీసుకువెళ్లి తిరిగి తీసుకొస్తున్నారని వారు తెలిపారు. -
ఆ అలవాటే కరోనా అటాక్ అవ్వడానికి ప్రధాన కారణమా?
కొందరికి ముక్కుని టచ్ చేయడం, లోపల పట్టి ఉన్నవాటిని తీయడం అనే బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అలవాటుగా అలా చేస్తూనే ఉంటారు. అవసరం ఉన్న లేకపోయినా అదే పనిగాముక్కుని టచ్ చేస్తూ లోపలి వేళ్లు పెట్టి క్లీన్ చేయడం వంటివి చేస్తారు. ఇది మంచిది కాదని ఇదే కరోనా ఈజీగా అటాక్ అయ్యేందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు శాస్తవేత్తలు. ఈ మేరకు నెదర్లాండ్స్‌లోని శాస్త్రవేత్తల బృందం తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో మనం కూడా కోవిడ్ సంబంధిత రోగులతో సన్నిహితంగా ఉంటే కరోనా అటాక్ అయ్యే అవకాశాలు మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్స్‌లోని దాదాపు 219 మంది ఆరోగ్య కార్యకర్తలపై సర్వే చేయగా..సుమారు 84 శాతం మంది యాదృచ్ఛికంగానే ముక్కుని టచ్ చేయగా మిగిలినవారు అదే పనిగా ముక్కుని ముట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇలా ముక్కుని టచ్ చేస్తూ లోపల వేలు పెట్టి తిప్పే వారికే ఈజీగా కరోనా సోకినట్లు తేలింది. అలాగే గోర్లు కొరకడం, కళ్లకు ధరించే అద్దాలను శుభ్రపరచకపోవడం, గడ్డంతో ఉండట తదితరాలే కరోనా అటాక్ కావడానికి ప్రధాన కారణం అని చెప్పడం లేదని చెప్పారు శాస్త్రవేత్తలు. నిజానికి ఇలాంటి అలవాట్ల వల్ల క్రిములు, బ్యాక్టిరియా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఇక ముక్కుని చేతితో ముట్టుకోవడం, రంధ్రాల్లో పెట్టడం వల్ల సున్నితంగా ఉండే ముక్కు గోడలు దెబ్బతింటాయి. ఫలితంగా కోవిడ్ -19 సోకే అవకాశం పొంచి ఉంటుందని సూచించారు. ఇలాంటి అలావాట్లను దూరం చేసుకుంటే కరోనా మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు అటాక్ అవ్వకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారని పేర్కొంది శాస్త్రవేత్తల బృందం. (చదవండి: ఆకాశ పండు గురించి విన్నారా! ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!) -
ప్రాంజల, శ్రీవైష్ణవి ముందంజ
ఐటీఎఫ్ టోర్నమెంట్ డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి శుభారంభం చేశారు. ఇక్కడి శాంతి టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రాంజల జోడి డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 3-6, 6-3, 6-3తో స్నేహాదేవి రెడ్డి (భారత్)పై, ఎనిమిదో సీడ్ శ్రీవైష్ణవి 6-1, 6-1తో సారాహ్ పాంగ్ (సింగపూర్)పై గెలిచారు. నాలుగో సీడ్ రిషిక సుంకర 6-3, 6-3తో వాసంతి షిండే (భారత్)పై నెగ్గగా, హైదరాబాద్ అమ్మాయి, ఐదో సీడ్ నిధి చిలుముల 7-5, 3-3తో రియా భాటియా (భారత్)పై అధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి వైదొలగింది. హైదరాబాద్‌కే చెందిన ఇస్కా అక్షర 3-6, 3-6తో నందిని శర్మ చేతిలో ఓడిపోగా... స్నేహ పడమట 3-6, 0-6తో ప్రేరణ బాంబ్రీ చేతిలో పరాజయం చవిచూశారు. శివిక బర్మన్ 6-2, 6-0 సాచి బెల్వాల్ (అమెరికా)పై నెగ్గింది. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-వన్షిక సాహ్ని (భారత్) 6-0, 2-6, 10-8తో అరంటా అండ్రడీ (భారత్)- కెరెన్ ష్లోమో (ఇజ్రాయెల్)పై గెలుపొందగా, సౌజన్య భవిషెట్టి-నిధి చిలుముల (హైదరాబాద్) 6-1, 2-6, 7-10తో ఇతీ మెహతా-రష్మీ (భారత్) చేతిలో ఓడింది. శ్వేత రాణా-వాసంతి షిండే 6-4, 3-3తో వరుణ్య-మౌళిక రామ్ (రిటైర్డ్‌హర్ట్)పై, రియా భాటియా-షరోన్ 6-0, 6-3తో శ్రీవైష్ణవి-తనీషా రోహిరాపై గెలిచారు.