కొందరికి ముక్కుని టచ్ చేయడం, లోపల పట్టి ఉన్నవాటిని తీయడం అనే బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అలవాటుగా అలా చేస్తూనే ఉంటారు. అవసరం ఉన్న లేకపోయినా అదే పనిగాముక్కుని టచ్ చేస్తూ లోపలి వేళ్లు పెట్టి క్లీన్ చేయడం వంటివి చేస్తారు. ఇది మంచిది కాదని ఇదే కరోనా ఈజీగా అటాక్ అయ్యేందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు శాస్తవేత్తలు. ఈ మేరకు నెదర్లాండ్స్‌లోని శాస్త్రవేత్తల బృందం తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో మనం కూడా కోవిడ్ సంబంధిత రోగులతో సన్నిహితంగా ఉంటే కరోనా అటాక్ అయ్యే అవకాశాలు మరింతగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ మేరకు శాస్త్రవేత్తలు ఆమ్‌స్టర్‌డామ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్స్‌లోని దాదాపు 219 మంది ఆరోగ్య కార్యకర్తలపై సర్వే చేయగా..సుమారు 84 శాతం మంది యాదృచ్ఛికంగానే ముక్కుని టచ్ చేయగా మిగిలినవారు అదే పనిగా ముక్కుని ముట్టుకుంటున్నట్లు తెలిపారు. ఇలా ముక్కుని టచ్ చేస్తూ లోపల వేలు పెట్టి తిప్పే వారికే ఈజీగా కరోనా సోకినట్లు తేలింది. అలాగే గోర్లు కొరకడం, కళ్లకు ధరించే అద్దాలను శుభ్రపరచకపోవడం, గడ్డంతో ఉండట తదితరాలే కరోనా అటాక్ కావడానికి ప్రధాన కారణం అని చెప్పడం లేదని చెప్పారు శాస్త్రవేత్తలు.
నిజానికి ఇలాంటి అలవాట్ల వల్ల క్రిములు, బ్యాక్టిరియా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. ఇక ముక్కుని చేతితో ముట్టుకోవడం, రంధ్రాల్లో పెట్టడం వల్ల సున్నితంగా ఉండే ముక్కు గోడలు దెబ్బతింటాయి. ఫలితంగా కోవిడ్ -19 సోకే అవకాశం పొంచి ఉంటుందని సూచించారు. ఇలాంటి అలావాట్లను దూరం చేసుకుంటే కరోనా మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు అటాక్ అవ్వకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారని పేర్కొంది శాస్త్రవేత్తల బృందం.
(చదవండి: ఆకాశ పండు గురించి విన్నారా! ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment