ప్రాంజల, శ్రీవైష్ణవి ముందంజ | pranjala and vaishnavi are in advance | Sakshi
Sakshi News home page

ప్రాంజల, శ్రీవైష్ణవి ముందంజ

Published Wed, Apr 1 2015 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

ప్రాంజల, శ్రీవైష్ణవి ముందంజ

ప్రాంజల, శ్రీవైష్ణవి ముందంజ

ఐటీఎఫ్ టోర్నమెంట్
డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో తెలుగమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి శుభారంభం చేశారు. ఇక్కడి శాంతి టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రాంజల జోడి డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రాంజల 3-6, 6-3, 6-3తో స్నేహాదేవి రెడ్డి (భారత్)పై, ఎనిమిదో సీడ్ శ్రీవైష్ణవి 6-1, 6-1తో సారాహ్ పాంగ్ (సింగపూర్)పై గెలిచారు.

నాలుగో సీడ్ రిషిక సుంకర 6-3, 6-3తో వాసంతి షిండే (భారత్)పై నెగ్గగా, హైదరాబాద్ అమ్మాయి, ఐదో సీడ్ నిధి చిలుముల 7-5, 3-3తో రియా భాటియా (భారత్)పై అధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి వైదొలగింది. హైదరాబాద్‌కే చెందిన ఇస్కా అక్షర 3-6, 3-6తో నందిని శర్మ చేతిలో ఓడిపోగా... స్నేహ పడమట 3-6, 0-6తో ప్రేరణ బాంబ్రీ చేతిలో పరాజయం చవిచూశారు. శివిక బర్మన్ 6-2, 6-0 సాచి బెల్వాల్ (అమెరికా)పై నెగ్గింది. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-వన్షిక సాహ్ని (భారత్) 6-0, 2-6, 10-8తో అరంటా అండ్రడీ (భారత్)- కెరెన్ ష్లోమో (ఇజ్రాయెల్)పై గెలుపొందగా, సౌజన్య భవిషెట్టి-నిధి చిలుముల (హైదరాబాద్) 6-1, 2-6, 7-10తో ఇతీ మెహతా-రష్మీ (భారత్) చేతిలో ఓడింది. శ్వేత రాణా-వాసంతి షిండే 6-4, 3-3తో వరుణ్య-మౌళిక రామ్ (రిటైర్డ్‌హర్ట్)పై, రియా భాటియా-షరోన్ 6-0, 6-3తో శ్రీవైష్ణవి-తనీషా రోహిరాపై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement