Pranjala
-
ప్రాంజల శుభారంభం
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాలోని బెన్‌డిగో పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 7–6 (7/1), 6–3తో యు చికారైషి (జపాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడుతున్న భారత నంబర్‌వన్ అంకిత రైనా తొలి రౌండ్లో 1–6, 1–6తో రొడియోనోవా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయింది. -
సానియా, ప్రాంజలకు ఐటీఎఫ్ ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తక్కువ ర్యాంకుల్లో ఉన్న టెన్నిస్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. జాతీయ క్రీడా సమాఖ్యల ద్వారా అర్హులైన ఆటగాళ్లకు ఈ సహాయ నిధిని అందిస్తామని చెప్పింది. సింగిల్స్‌లో 500–700 మధ్య... డబుల్స్‌లో 175–300 మధ్య ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను అర్హులుగా పేర్కొంది. ‘ఇదేం పెద్ద మొత్తం కాదు. ఒక్కో ఆటగాడికి 2000 డాలర్లు (రూ.1,51,100) లభించవచ్చు. జాతీయ సమాఖ్యలు అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అందజేస్తాయి’ అని ఐటీఎఫ్ ప్రకటించింది. దీని ప్రకారం 12 మంది భారత క్రీడాకారులు ఈ సహాయం పొందే వీలుంది. పురుషుల సింగిల్స్‌లో మనీశ్ కుమార్ (642 ర్యాంక్), అర్జున్ ఖడే (655)...డబుల్స్‌లో సాకేత్ మైనేని (180), విష్ణువర్ధన్ (199), అర్జున్ ఖడే (231), విజయ్ సుందర్ ప్రశాంత్ (300)... మహిళల సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ (606), సౌజన్య భవిశెట్టి (613), జీల్ దేశాయ్ (650), ప్రాంజల యడ్లపల్లి (664)... డబుల్స్‌లో రుతుజా భోస్లే (196), సానియా మీర్జా (226) ఈ సహాయం అందుకోనున్నారు. తక్కువ ర్యాంకుల్లో ఉన్న 800 మంది క్రీడాకారుల్ని ఆదుకునేందుకు ఏటీపీ, డబ్ల్యూటీఏ, గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆతిథ్య దేశాలు, అగ్రశ్రేణి క్రీడాకారులు కలిసి 60 లక్షల డాలర్ల (రూ. 45 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి. -
రన్నరప్ ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల రాణించింది. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ప్రాంజల 6–0, 1–6, 3–6తో రఖిమోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్స్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్–2019 ఆసియా పసిఫిక్ వైల్డ్‌కార్డ్ ప్లేఆఫ్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రాణిస్తోంది. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ప్రాంజల క్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ ప్రాంజల 6–2, 2–6, 7–6 (7/3)తో మనా అయుకవా (జపాన్)పై గెలుపొందింది. -
ప్రాంజలకు నిరాశ
ముంబై: తొలిసారి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఓపెన్ టోర్నీలో మెయిన్ డ్రాకు అర్హత సాధించిన హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. ముంబై ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆమె పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రపంచ 228వ ర్యాంకర్ ప్రాంజల 6–3, 5–7, 1–6తో ఐదో సీడ్ లక్‌సికా కుమ్‌ఖుమ్ (థాయ్‌లాండ్) చేతిలో 2 గంటల 13 నిమిషాల పాటు పోరాడి ఓడిపోయింది. ఇటీవలే వరుసగా రెండు ఐటీఎఫ్ (లాగోస్, నైజీరియా) టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచిన ప్రాంజల తొలిసెట్‌ను 6–3తో నెగ్గి... రెండో సెట్లోనూ ఒక దశలో 5–3తో నిలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకునేలా కనిపించింది. అయితే ఈ దశలో పుంజుకున్న థాయ్ క్రీడాకారిణి ప్రాంజల సర్వీస్‌ను బ్రేక్ చేసి 7–5తో సెట్‌ను గెలుచుకుని రేసులో నిలిచింది. మూడో సెట్లోనూ అదే ఆధిపత్యం ప్రదర్శించి గేమ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో కర్మన్ కౌర్(భారత్) 2–6, 4–6తో టాప్‌సీడ్ సెయ్‌సెయ్ జెంగ్ (చైనా) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది. -
విజేత ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల సర్క్యూట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల వరుసగా రెండో టైటిల్ సాధించింది. నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్‌లో ప్రాంజల విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రాంజల 6–1, 7–6 (7/2)తో టాప్ సీడ్, ప్రపంచ 142వ ర్యాంకర్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది. గంటా 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రెండో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నాలుగుసార్లు చొప్పున చేజార్చుకున్నారు. అయితే టైబ్రేక్‌లో ప్రాంజల పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గతవారం కూడా ఇదే వేదికపై జరిగిన టోర్నీలో క్యానీ పెరిన్నే ఓడించి ప్రాంజల తొలి టైటిల్ దక్కించుకుంది. -
ప్రాంజల సంచలనం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రొ సర్క్యూట్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్‌లో 19 ఏళ్ల ప్రాంజల విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 396వ ర్యాంకర్ ప్రాంజల 2–6, 7–5, 6–0తో ప్రపంచ 144వ ర్యాంకర్, టాప్ సీడ్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్)ను బోల్తా కొట్టించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2 గంటల 15 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల రెండు ఏస్‌లు సంధించడం తోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. గతేడాది ఈజిప్ట్‌లో జరిగిన షర్మ్ ఎల్ షేక్ ఓపెన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత ప్రాంజల ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే. -
ప్రాంజల జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డబుల్స్ కేటగిరీలో భారత్‌కు చెందిన రుతుజా భోసాలేతో జతకట్టిన ప్రాంజల టైటిల్‌ను గెలుచుకోగా... సింగిల్స్ విభాగంలో సెమీస్‌లో పరాజయం పాలైంది. థాయ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ ప్రాంజల–రుతుజ ద్వయం 2–6, 6–0, 10–6తో టాప్ సీడ్ బైన్స్ నయ్‌క్తా (ఆస్ట్రేలియా)–స్టెఫ్‌కోవా బార్బోరా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్రాంజల 3–6, 6–2, 2–6తో వాంగ్ జియు (చైనా) చేతిలో ఓటమి పాలైంది. -
ఫైనల్లో ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో ప్రాంజల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. స్పెయిన్‌లో గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల (భారత్)–రలుకా సెర్బన్ (రొమేనియా) ద్వయం 6–0, 6–4తో నాలుగోసీడ్ పొలీనా లేకినా (రష్యా)– ఇసాబెల్లా షినికోవా (బల్గేరియా) జంటపై గెలుపొందింది. -
ప్రాంజల ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్‌లో పరాజయం పాలైంది. గ్వాలియర్‌లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 3–6, 1–6తో ఐదోసీడ్ కర్మన్ కౌర్ థండి (భారత్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల (భారత్)–కరిన్ కెన్నెల్ (స్విట్జర్లాండ్) జోడీకి ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో సెమీస్‌కు చేరింది. నేడు జరిగే సెమీస్‌లో టాప్‌సీడ్ యానా సిజికోవా (రష్యా)–అనా వెసెలినోవిక్ (మాంటెనిగ్రో) జంటతో ప్రాంజల జోడీ తలపడుతుంది. -
ప్రాంజల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. గ్వాలియర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో రెండోరౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 6–4, 6–4తో సారా యాదవ్ (భారత్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన సౌజన్య భవిశెట్టి 3–6, 4–6తో కరిన్ కెన్నెల్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో అంకిత రైనాతో రిషిక సుంకర, ఎమిలీ వెబ్లీ స్మిత్ (బ్రిటన్)తో నిధి చిలుముల తలపడతారు. డబుల్స్ తొలిరౌండ్లో నటాషా–రిషిక సుంకర (భారత్) జంటతో ప్రాంజల (భారత్)–కరిన్ కెన్నెల్ (స్విట్జర్లాండ్) జోడీ తలపడుతుంది. -
భారత టెన్నిస్ జట్టులో ప్రాంజల
పుణే: ఆసియా ఓసియానియా గ్రూప్–1 ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు చోటు లభించింది. అంకిత రైనా, కర్మన్‌కౌర్, ప్రార్థన జట్టులోని మిగతా సభ్యులు. ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. 18 ఏళ్ల ప్రాంజల గతేడాది ఒక సింగిల్స్ టైటిల్‌తోపాటు నాలుగు డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది. -
ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల
గ్వాలియర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 6–2, 2–6, 7–5తో భారత్‌కే చెందిన నందిని శర్మపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి నిధి చిలుముల 6–4, 2–6, 4–6తో లులు రాడోవిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు గువహటిలో జరుగుతున్న ఇండియా ఫ్యూచర్స్–3 టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ రెండో రౌండ్లోకి చేరాడు. తొలి రౌండ్లో విష్ణు 6–3, 7–6 (7/3)తో జతిన్ దహియాపై గెలిచాడు. -
సెమీఫైనల్లో ప్రాంజల, దేదీప్య
ఫెనెస్టా టెన్నిస్ టోర్నీ న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారిణులు ప్రాంజల, సాయి దేదీప్య, షేక్ హుమేరా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన విష్ణువర్ధన్ కూడా సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు. గురువారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల 6-2, 6-1తో జెన్నిఫర్ లుఖమ్పై గెలుపొందగా, నిధి చిలుముల 7-6 (7/0), 3-6, 2-6తో రియా భాటియా చేతిలో పరాజయం పాలైంది. షర్మదా బాలు 7-5, 6-4తో వైదేహి చౌదరిపై గెలిచింది. అండర్-18 బాలికల క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షేక్ హుమేరా 7-6, 4-6, 7-5తో యమలపల్లి సహజపై, సారుు దేదీప్య 6-2, 6-3తో తనీషా కశ్యప్‌పై నెగ్గారు. లలిత దేవరకొండ 6-2, 6-1తో ఉర్మి పాండ్యను ఓడించింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో విష్ణు 6-2, 6-4తో దల్విందర్ సింగ్‌పై విజయం సాధించాడు. -
ప్రాంజల, శ్రీవైష్ణవి ముందంజ
ఐటీఎఫ్ టోర్నమెంట్ డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి శుభారంభం చేశారు. ఇక్కడి శాంతి టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రాంజల జోడి డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 3-6, 6-3, 6-3తో స్నేహాదేవి రెడ్డి (భారత్)పై, ఎనిమిదో సీడ్ శ్రీవైష్ణవి 6-1, 6-1తో సారాహ్ పాంగ్ (సింగపూర్)పై గెలిచారు. నాలుగో సీడ్ రిషిక సుంకర 6-3, 6-3తో వాసంతి షిండే (భారత్)పై నెగ్గగా, హైదరాబాద్ అమ్మాయి, ఐదో సీడ్ నిధి చిలుముల 7-5, 3-3తో రియా భాటియా (భారత్)పై అధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి వైదొలగింది. హైదరాబాద్‌కే చెందిన ఇస్కా అక్షర 3-6, 3-6తో నందిని శర్మ చేతిలో ఓడిపోగా... స్నేహ పడమట 3-6, 0-6తో ప్రేరణ బాంబ్రీ చేతిలో పరాజయం చవిచూశారు. శివిక బర్మన్ 6-2, 6-0 సాచి బెల్వాల్ (అమెరికా)పై నెగ్గింది. డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రాంజల-వన్షిక సాహ్ని (భారత్) 6-0, 2-6, 10-8తో అరంటా అండ్రడీ (భారత్)- కెరెన్ ష్లోమో (ఇజ్రాయెల్)పై గెలుపొందగా, సౌజన్య భవిషెట్టి-నిధి చిలుముల (హైదరాబాద్) 6-1, 2-6, 7-10తో ఇతీ మెహతా-రష్మీ (భారత్) చేతిలో ఓడింది. శ్వేత రాణా-వాసంతి షిండే 6-4, 3-3తో వరుణ్య-మౌళిక రామ్ (రిటైర్డ్‌హర్ట్)పై, రియా భాటియా-షరోన్ 6-0, 6-3తో శ్రీవైష్ణవి-తనీషా రోహిరాపై గెలిచారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల తొలి సారి ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె బరిలోకి దిగుతోంది. ఈ విభాగం ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. శనివారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రాంజల... దక్షిణాఫ్రికాకు చెందిన కేటీ పొలూటాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆమె రెండో రౌండ్లో టాప్ సీడ్ షిలిన్ గ్జు (చైనా) లేదా కేలా మెక్ఫీ (ఆస్ట్రేలియా)లలో ఒకరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ప్రాంజల జోడి గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-1 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియాలోని ట్రేరాల్గన్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో ఆమెకు సింగిల్స్‌లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన బాలికల డబుల్స్ తొలి రౌండ్లో ప్రాంజల-జాన్లాన్ వీ (చైనా) జోడి 6-7 (4/7), 6-3, 11-9తో మయూక ఐకవా-చిహిరో మురమత్సు (జపాన్) జంటపై చెమటోడ్చి నెగ్గింది. అంతకుముందు జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో హైదరాబాదీ క్రీడాకారిణి 3-6, 2-6తో వుషుంగ్ జెంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. -
జూనియర్ ‘రాకెట్’
చిన్నప్పటి చలాకీతనం ఆమెను టెన్నిస్ కోర్టు వైపు అడుగులు వేరుుంచింది. ఆరేళ్ల వయుసులోనే ప్రాంజలకు రాకెట్ మీద వునసైంది. ఇది గ్రహించిన తల్లిదండ్రులు ఆర్థికంగా భారవునిపించినా ఆ చిన్నారిని ప్రోత్సహించారు. దీనికి కోచ్ సంజయ్ ప్రోద్బలం తోడవడంతో ప్రాంజల సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్రతి టొర్నీలో తానేంటో రుజువు చేసుకుంది. ఆమె ఆటతీరుకు ఫిదా అరుున జీవీకే గ్రూప్ స్పాన్సర్‌గా వుుందుకొచ్చింది. అలా మొదలైన ప్రాంజల టెన్నిస్ జర్నీ ఇప్పుడు దేశవిదేశాల్లోని టెన్నిస్ కోర్టుల్లో దువుు్మరేపుతోంది. హైదరాబాద్ పేరుప్రఖ్యాతులు ఖండాంతరాలు చాటుతోంది. ఓ టోర్నీలో పాల్గొనడానికి ఈజిప్ట్‌కు బయుల్దేరేవుుందు ఈ జూనియుర్ రాకెట్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. నేను పుట్టింది గుంటూరులో అరుునా పెరిగింది వూత్రం హైదరాబాద్‌లోనే. పదిహేనేళ్ల కిందటే వూ కుటుంబం సిటీకి వచ్చి సెటిలైంది. నాన్న కిషోర్ బిజినెస్మెన్, అవ్ము వూధవి గృహిణి. నాకు టెన్నిస్ అంటే ఇష్టం. ఆరేళ్లున్నపుడు సంజయ్ టెన్నిస్ అకాడమీలో చేర్పించారు. కోచ్ సహకారంతో ఆట మీద ఆసక్తి ఇంకా పెరిగింది. ‘కష్టపడితే భవిష్యత్‌లో వుంచి క్రీడాకారిణి అవుతావు’ అన్న ఆయున వూటలు నన్ను ఆటకు వురింత దగ్గర చేశారుు. 2012 నుంచి ఐటీఎఫ్ జూనియుర్ టోర్నీలు ఆడటం మొదలుపెట్టాను. అదే టైంలో జీవీకే టెన్నిస్ అకాడమీ నా ప్రతిభను గుర్తించి చేయుూతనిచ్చింది. శిక్షణతో పాటు టోర్నమెంట్లలో పాల్గొనేందుకు స్పాన్సర్ చేస్తోంది. జీవీకే అకాడమీ కోచ్ ఇలియూస్ గౌస్ గైడ్ చేస్తున్నారు. ఆరు గంటల ప్రాక్టీస్.. క్రీడల్లో రాణించాలంటే ఫిట్నెస్ ప్రధానం. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే సావుర్థ్యం ఉండాలి. అందుకు తగ్గట్టే శారీరక వ్యాయూవుంతో పాటు వుంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, ఎనర్జీటిక్ డ్రింక్స్‌కు ప్రాధాన్యమిస్తాను. ప్రతి రోజూ ఉదయుం వుూడు గంటలు, సాయుంత్రం వుూడు గంటలు ప్రాక్టీస్ చేస్తుంటాను. టోర్నీ సవుయూల్లో ప్రత్యర్థుల బలాబలాలు, ఆటతీరు ఆధారంగా నా శైలిని వూర్చుకుంటాను. సిటీలో విక్టరీ.. నా కెరీర్లో ఇప్పటి వరకు 59 సింగిల్స్, 18 డబుల్స్ వ్యూచ్లలో విజయుం సాధించాను. ఈ ఏడాది 22 సింగిల్స్, ఆరు డబుల్స్‌లో విన్ అయ్యూను. గత జనవరిలో చంఢీగడ్‌లో జరిగిన ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్ -3 టోర్నీ విజయాన్ని నాకెంతో ఆనందాన్నిచ్చింది. నా కెరీర్లో నేను దక్కించుకున్న తొలి ట్రోఫి అది. జర్మనీలో బోహమ్, ఫ్రాంక్ఫర్ట్, బెర్లిన్, నెదర్లాండ్స్‌లోనూ గ్రేడ్-1, గ్రేడ్-2 టోర్నీల్లో పూర్తిస్థాయిలో రాణించలేకపోయాను. గతనెల చైనాలో జరిగిన టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్స్ వరకు వూత్రమే చేరుకున్నాను. అరుుతే హైదరాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ జూనియుర్ టోర్నీ అండర్-18 బాలికల సింగిల్స్ టైటిల్ దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈజిప్ట్ టోర్నీలో కూడా విజయుం సాధిస్తానన్న నవ్ముకం ఉంది. ఎప్పటికైనా గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడమే నా ల క్ష్యం. గోల్కొండ ఇష్టం.. టైం దొరికితే పుస్తకాలు చదువుతుంటాను. టీవీలో స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంటాను. ఫెడరర్, కిమ్ క్లియ్‌స్టర్స్ నాకు ఇష్టమైన క్రీడాకారులు. చిన్మయు విద్యాలయు నుంచి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యూను. అదే కళాశాలలో ఇంటర్లో జారుున్ అయ్యూను. హైదరాబాద్‌లో గోల్కొండ కోట అంటే చాలా ఇష్టం. - వాంకె శ్రీనివాస్