ప్రాంజల జోడి గెలుపు | pranjala couple won the title | Sakshi
Sakshi News home page

ప్రాంజల జోడి గెలుపు

Published Mon, Jan 19 2015 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

ప్రాంజల జోడి గెలుపు

ప్రాంజల జోడి గెలుపు

సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-1 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియాలోని ట్రేరాల్గన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఆమెకు సింగిల్స్‌లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన బాలికల డబుల్స్ తొలి రౌండ్లో ప్రాంజల-జాన్లాన్ వీ (చైనా) జోడి 6-7 (4/7), 6-3, 11-9తో మయూక ఐకవా-చిహిరో మురమత్సు (జపాన్) జంటపై చెమటోడ్చి నెగ్గింది. అంతకుముందు జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో హైదరాబాదీ క్రీడాకారిణి 3-6, 2-6తో వుషుంగ్ జెంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement