సెమీఫైనల్లో ప్రాంజల, దేదీప్య | pranjula, dedeepya enters in fenesta tennis tourny | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో ప్రాంజల, దేదీప్య

Published Fri, Oct 7 2016 10:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

pranjula, dedeepya enters in fenesta tennis tourny

ఫెనెస్టా టెన్నిస్ టోర్నీ


 
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారిణులు ప్రాంజల, సాయి దేదీప్య, షేక్ హుమేరా సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన విష్ణువర్ధన్ కూడా సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు. గురువారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల 6-2, 6-1తో జెన్నిఫర్ లుఖమ్‌పై గెలుపొందగా, నిధి చిలుముల 7-6 (7/0), 3-6, 2-6తో రియా భాటియా చేతిలో పరాజయం పాలైంది. షర్మదా బాలు 7-5, 6-4తో వైదేహి చౌదరిపై గెలిచింది.

 

అండర్-18 బాలికల క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ షేక్ హుమేరా 7-6, 4-6, 7-5తో యమలపల్లి సహజపై, సారుు దేదీప్య 6-2, 6-3తో తనీషా కశ్యప్‌పై నెగ్గారు. లలిత దేవరకొండ 6-2, 6-1తో ఉర్మి పాండ్యను ఓడించింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో విష్ణు 6-2, 6-4తో దల్విందర్ సింగ్‌పై విజయం సాధించాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement