
సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్–2019 ఆసియా పసిఫిక్ వైల్డ్‌కార్డ్ ప్లేఆఫ్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రాణిస్తోంది. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ప్రాంజల క్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏడో సీడ్ ప్రాంజల 6–2, 2–6, 7–6 (7/3)తో మనా అయుకవా (జపాన్)పై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment