జూనియర్ ‘రాకెట్’ | Pranjala has proved to Junior Tennis rocket | Sakshi
Sakshi News home page

జూనియర్ ‘రాకెట్’

Published Tue, Sep 9 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

జూనియర్ ‘రాకెట్’

జూనియర్ ‘రాకెట్’

చిన్నప్పటి చలాకీతనం ఆమెను టెన్నిస్ కోర్టు వైపు అడుగులు వేరుుంచింది. ఆరేళ్ల వయుసులోనే ప్రాంజలకు రాకెట్ మీద వునసైంది. ఇది గ్రహించిన తల్లిదండ్రులు ఆర్థికంగా భారవునిపించినా ఆ చిన్నారిని ప్రోత్సహించారు. దీనికి కోచ్ సంజయ్ ప్రోద్బలం తోడవడంతో ప్రాంజల సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్రతి టొర్నీలో తానేంటో రుజువు చేసుకుంది. ఆమె ఆటతీరుకు ఫిదా అరుున జీవీకే గ్రూప్ స్పాన్సర్‌గా వుుందుకొచ్చింది. అలా మొదలైన ప్రాంజల టెన్నిస్ జర్నీ ఇప్పుడు దేశవిదేశాల్లోని టెన్నిస్ కోర్టుల్లో దువుు్మరేపుతోంది. హైదరాబాద్ పేరుప్రఖ్యాతులు ఖండాంతరాలు చాటుతోంది. ఓ టోర్నీలో పాల్గొనడానికి ఈజిప్ట్‌కు బయుల్దేరేవుుందు ఈ జూనియుర్ రాకెట్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది.
 
 నేను పుట్టింది గుంటూరులో అరుునా పెరిగింది వూత్రం హైదరాబాద్‌లోనే. పదిహేనేళ్ల కిందటే వూ కుటుంబం సిటీకి వచ్చి సెటిలైంది. నాన్న కిషోర్ బిజినెస్‌మెన్, అవ్ము వూధవి గృహిణి. నాకు టెన్నిస్ అంటే ఇష్టం. ఆరేళ్లున్నపుడు సంజయ్ టెన్నిస్ అకాడమీలో చేర్పించారు. కోచ్ సహకారంతో ఆట మీద ఆసక్తి ఇంకా పెరిగింది. ‘కష్టపడితే భవిష్యత్‌లో వుంచి క్రీడాకారిణి అవుతావు’ అన్న ఆయున వూటలు నన్ను ఆటకు వురింత దగ్గర చేశారుు. 2012 నుంచి ఐటీఎఫ్ జూనియుర్ టోర్నీలు ఆడటం మొదలుపెట్టాను. అదే టైంలో జీవీకే టెన్నిస్ అకాడమీ నా ప్రతిభను గుర్తించి చేయుూతనిచ్చింది. శిక్షణతో పాటు టోర్నమెంట్లలో పాల్గొనేందుకు స్పాన్సర్ చేస్తోంది. జీవీకే అకాడమీ కోచ్ ఇలియూస్ గౌస్ గైడ్ చేస్తున్నారు.
 
 ఆరు గంటల ప్రాక్టీస్..
 క్రీడల్లో రాణించాలంటే ఫిట్‌నెస్ ప్రధానం. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే సావుర్థ్యం ఉండాలి. అందుకు తగ్గట్టే శారీరక వ్యాయూవుంతో పాటు వుంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, ఎనర్జీటిక్ డ్రింక్స్‌కు ప్రాధాన్యమిస్తాను. ప్రతి రోజూ ఉదయుం వుూడు గంటలు, సాయుంత్రం వుూడు గంటలు ప్రాక్టీస్ చేస్తుంటాను. టోర్నీ సవుయూల్లో ప్రత్యర్థుల బలాబలాలు, ఆటతీరు ఆధారంగా నా శైలిని వూర్చుకుంటాను.
 
 సిటీలో విక్టరీ..
 నా కెరీర్‌లో ఇప్పటి వరకు 59 సింగిల్స్, 18 డబుల్స్ వ్యూచ్‌లలో విజయుం సాధించాను. ఈ ఏడాది 22 సింగిల్స్, ఆరు డబుల్స్‌లో విన్ అయ్యూను. గత జనవరిలో చంఢీగడ్‌లో జరిగిన ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్ -3 టోర్నీ విజయాన్ని నాకెంతో ఆనందాన్నిచ్చింది. నా కెరీర్‌లో నేను దక్కించుకున్న తొలి ట్రోఫి అది. జర్మనీలో బోహమ్, ఫ్రాంక్‌ఫర్ట్, బెర్లిన్, నెదర్లాండ్స్‌లోనూ గ్రేడ్-1, గ్రేడ్-2 టోర్నీల్లో పూర్తిస్థాయిలో రాణించలేకపోయాను. గతనెల చైనాలో జరిగిన టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్స్ వరకు వూత్రమే చేరుకున్నాను. అరుుతే హైదరాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ జూనియుర్ టోర్నీ అండర్-18 బాలికల సింగిల్స్ టైటిల్ దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈజిప్ట్ టోర్నీలో కూడా విజయుం సాధిస్తానన్న నవ్ముకం ఉంది. ఎప్పటికైనా గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడమే నా ల క్ష్యం.
 
 గోల్కొండ ఇష్టం..
 టైం దొరికితే పుస్తకాలు చదువుతుంటాను. టీవీలో స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంటాను. ఫెడరర్, కిమ్ క్లియ్‌స్టర్స్ నాకు ఇష్టమైన క్రీడాకారులు. చిన్మయు విద్యాలయు నుంచి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యూను. అదే కళాశాలలో ఇంటర్‌లో జారుున్ అయ్యూను. హైదరాబాద్‌లో గోల్కొండ కోట అంటే చాలా ఇష్టం.
 - వాంకె శ్రీనివాస్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement