Tennis court
-
కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు!
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ దూసుకెళ్తున్నాడు. కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిలే లక్ష్యంగా సాగుతున్న జొకోవిచ్ వింబుల్డన్‌లో 14వ సారి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 2021 సెమీఫైనలిస్ట్, ప్రపంచ 18వ ర్యాంకర్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 7–6 (8/6), 7–6 (8/6), 5–7, 6–4తో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. కాగా మ్యాచ్‌లో రెండో సెట్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హుర్కాజ్ సర్వీస్ చేసి డ్రాప్ షాట్ ఆడాడు. దీంతో బంతి జొకోవిచ్ నెట్ దగ్గర్లోనే పడేలా కనిపించింది. ఒక్క పాయింట్ కూడా వదలకూడదన్న ఉద్దేశంతో జొకోవిచ్ వేగంగా పరిగెత్తుకొచ్చి బాడీ బాగా స్ట్రెచ్ చేస్తూ షాట్ ఆడాడు. అయితే ఇదే సమయంలో బాడీ కంట్రోల్ కోల్పోయిన జొకోవిచ్ ఒక్కసారిగా నెట్‌పై పడిపోయాడు. అదృష్టవశాత్తూ జొకోకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే జొకోవిచ్ చర్య తన ప్రత్యర్థి హుర్కాజ్తో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచింది. హుర్కాజ్ జొకోవిచ్ దగ్గరికి వెళ్లి అతన్ని పైకి లేపి జాగ్రత్త చెప్పి కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. కాగా జొకోవిచ్‌కు ఇది వింబుల్డన్‌లో వందో మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్ ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు జరిగింది. టోర్నీ నిబంధనల ప్రకారం రాత్రి 11 గంటల వరకే ఆటను కొనసాగించాలి. ఆదివారం రెండు సెట్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు.సోమవారం ఆటను కొనసాగించగా... మూడో సెట్‌ను హుర్కాజ్ గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్లో జొకోవిచ్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఏడో గేమ్‌లో హుర్కాజ్ సర్విస్‌ను బ్రేక్ చేసి ఎనిమిదో గేమ్‌లో తన సర్విస్‌ను కాపాడుకొని 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ తన సర్విస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. వింబుల్డన్ టోర్నీ చరిత్రలో జొకోవిచ్‌కిది 90వ విజయం కావడం విశేషం. Djokovic went for it 😅 #Wimbledon pic.twitter.com/q05cHyJJBt — SportsCenter (@SportsCenter) July 9, 2023 చదవండి: MS Dhoni Reaction To Fan: 'భయ్యా.. నొప్పి ఎలా ఉంది?'.. ధోని రియాక్షన్ వైరల్ #LakshyaSen: చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్ -
టెన్నిస్ కోర్ట్ లాకర్లలో కోట్ల సంపద
యశవంతపుర: బెంగళూరులోని బౌరింగ్ ఇన్స్టిట్యూట్ (టెన్నిస్ కోర్ట్) పాలకమండలి కార్యాలయంలో క్రీడాకారులు టెన్నిస్ సామగ్రి, దుస్తులు దాచుకునే లాకర్లలో రూ.100 కోట్లకు పైగా విలువైన సొత్తు బయటపడింది. ఇది బెంగళూరులో స్థిరపడిన రాజస్తానీ పారిశ్రామికవేత్త, ఫైనాన్షియర్, ప్రెస్టీజ్ కంపెనీ భాగస్వామి అయిన అవినాశ్ అమరలాల్కు చెందినదిగా గుర్తించారు. బెంగళూరులో టైర్ల షోరూంను నడుపుతున్న అవినాశ్ ఏడాది క్రితం ఇక్కడ మూడు లాకర్లను తీసుకుని వాటిల్లో రూ.3.60 కోట్ల నగదు, రూ.7.8 కోట్ల విలువైన వజ్రాలు, 650 గ్రాముల బంగారు బిస్కెట్లు, రూ.80 లక్షల విలువైన వాచీలు, రూ.100 కోట్ల ఆస్తి పత్రాలు, రూ.కోటి విలువైన చెక్కులను దాచాడు. ఎందుకు బద్దలు కొట్టారు? టెన్నిస్ కోర్టు అధికారులు లాకర్ గదుల నవీకరణలో భాగంగా అవినాశ్‌కు చెందిన మూడు లాకర్లను బద్దలు కొట్టి చూడగా ఈ సొత్తు బయట పడింది. విషయం బయటకు పొక్కకుండా చేస్తే రూ.5 కోట్లు ఇస్తామంటూ బౌరింగ్ క్లబ్ కార్యదర్శి ప్రకాశ్‌కు కొందరు వ్యక్తులు ఆశ చూపారు. అయితే, ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఇది తమ పరిధిలోని విషయం కాదని ఖాకీలు చెప్పడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలిపారు. వారు వచ్చి సొత్తును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అవినాశ్ ఎందుకు స్పందించలేదు? పక్షం రోజుల క్రితం టెన్నిస్ కోర్టు యాజమాన్యం ఇచ్చిన నోటీసులకు అవినాశ్ స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత సొత్తును ఇక్కడే ఎందుకు దాచారనే అంశంపైన కూడా ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. అవినాశ్ అమరలాల్ ప్రెస్టీజ్ గ్రూప్‌లో భాగస్వామి. ఈయనకు ఫైనాన్షియర్‌గా బెంగళూరులో పెద్ద పేరుంది. బడా బాబులు, సంస్థలకు 30 శాతం వడ్డీపై అప్పులిచ్చేవాడు. -
పోలా.. అదిరిపోలా..!
హైదరాబాద్: ఇలాంటి టెన్నిస్ కోర్టు మీరెక్కడైనా చూశారా? సముద్ర గర్భంలో పైన చేపలు తిరుగుతుంటే.. కిందన క్రీడాకారులు టెన్నిస్ ఆడుతుంటే.. చూడ్డానికి బాగుంటుంది కదూ.. ఇదే ఆలోచన పోలండ్‌కు చెందిన డిజైనర్ కొటాలాకు వచ్చినట్లుంది. దీంతో దుబాయ్ సముద్రగర్భంలో నిర్మించేందుకు వీలుగా ఈ టెన్నిస్ కోర్టు డిజైన్‌ను రూపొందించాడు. తన కలను సాకారం చేసుకునేందుకు పెట్టుబడి పెట్టేవారి కోసం ఎదురుచూస్తున్నాడు. చూడ్డానికి బాగానే ఉంది కానీ.. దీనికి చాలా ఖర్చవుతుందని, భారీ చేపలు వంటివి తిరగడం వల్ల క్రీడాకారుల ఏకాగ్రత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. -
బ్రూమ్.. బ్రూమ్..
సానియా మీర్జా టెన్నిస్ కోర్టు దాటి క్లీనింగ్ వైపు వచ్చింది. రాకెట్‌కు బదులుగా చేతిలో చీపురును అందుకుంది. ప్రధాని మోదీ పిలుపునకు స్పందించి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో తానూ భాగమైంది. తన తండ్రి, సోదరి, సన్నిహితులతో కలిసి గురువారం జూబ్లీహిల్స్ సమీపంలోని ఒక రోడ్డును శుభ్రం చేసింది. సానియా పేరును అనిల్ అంబానీ నామినేట్ చేయగా...ఇప్పుడు సానియా మరో 9 మందిని నామినేట్ చేసింది. వీరిలో క్రీడాకారులతో పాటు నటులు షారుఖ్, రామ్‌చరణ్, మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. -
జూనియర్ ‘రాకెట్’
చిన్నప్పటి చలాకీతనం ఆమెను టెన్నిస్ కోర్టు వైపు అడుగులు వేరుుంచింది. ఆరేళ్ల వయుసులోనే ప్రాంజలకు రాకెట్ మీద వునసైంది. ఇది గ్రహించిన తల్లిదండ్రులు ఆర్థికంగా భారవునిపించినా ఆ చిన్నారిని ప్రోత్సహించారు. దీనికి కోచ్ సంజయ్ ప్రోద్బలం తోడవడంతో ప్రాంజల సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్రతి టొర్నీలో తానేంటో రుజువు చేసుకుంది. ఆమె ఆటతీరుకు ఫిదా అరుున జీవీకే గ్రూప్ స్పాన్సర్‌గా వుుందుకొచ్చింది. అలా మొదలైన ప్రాంజల టెన్నిస్ జర్నీ ఇప్పుడు దేశవిదేశాల్లోని టెన్నిస్ కోర్టుల్లో దువుు్మరేపుతోంది. హైదరాబాద్ పేరుప్రఖ్యాతులు ఖండాంతరాలు చాటుతోంది. ఓ టోర్నీలో పాల్గొనడానికి ఈజిప్ట్‌కు బయుల్దేరేవుుందు ఈ జూనియుర్ రాకెట్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. నేను పుట్టింది గుంటూరులో అరుునా పెరిగింది వూత్రం హైదరాబాద్‌లోనే. పదిహేనేళ్ల కిందటే వూ కుటుంబం సిటీకి వచ్చి సెటిలైంది. నాన్న కిషోర్ బిజినెస్మెన్, అవ్ము వూధవి గృహిణి. నాకు టెన్నిస్ అంటే ఇష్టం. ఆరేళ్లున్నపుడు సంజయ్ టెన్నిస్ అకాడమీలో చేర్పించారు. కోచ్ సహకారంతో ఆట మీద ఆసక్తి ఇంకా పెరిగింది. ‘కష్టపడితే భవిష్యత్‌లో వుంచి క్రీడాకారిణి అవుతావు’ అన్న ఆయున వూటలు నన్ను ఆటకు వురింత దగ్గర చేశారుు. 2012 నుంచి ఐటీఎఫ్ జూనియుర్ టోర్నీలు ఆడటం మొదలుపెట్టాను. అదే టైంలో జీవీకే టెన్నిస్ అకాడమీ నా ప్రతిభను గుర్తించి చేయుూతనిచ్చింది. శిక్షణతో పాటు టోర్నమెంట్లలో పాల్గొనేందుకు స్పాన్సర్ చేస్తోంది. జీవీకే అకాడమీ కోచ్ ఇలియూస్ గౌస్ గైడ్ చేస్తున్నారు. ఆరు గంటల ప్రాక్టీస్.. క్రీడల్లో రాణించాలంటే ఫిట్నెస్ ప్రధానం. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే సావుర్థ్యం ఉండాలి. అందుకు తగ్గట్టే శారీరక వ్యాయూవుంతో పాటు వుంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, ఎనర్జీటిక్ డ్రింక్స్‌కు ప్రాధాన్యమిస్తాను. ప్రతి రోజూ ఉదయుం వుూడు గంటలు, సాయుంత్రం వుూడు గంటలు ప్రాక్టీస్ చేస్తుంటాను. టోర్నీ సవుయూల్లో ప్రత్యర్థుల బలాబలాలు, ఆటతీరు ఆధారంగా నా శైలిని వూర్చుకుంటాను. సిటీలో విక్టరీ.. నా కెరీర్లో ఇప్పటి వరకు 59 సింగిల్స్, 18 డబుల్స్ వ్యూచ్లలో విజయుం సాధించాను. ఈ ఏడాది 22 సింగిల్స్, ఆరు డబుల్స్‌లో విన్ అయ్యూను. గత జనవరిలో చంఢీగడ్‌లో జరిగిన ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్ -3 టోర్నీ విజయాన్ని నాకెంతో ఆనందాన్నిచ్చింది. నా కెరీర్లో నేను దక్కించుకున్న తొలి ట్రోఫి అది. జర్మనీలో బోహమ్, ఫ్రాంక్ఫర్ట్, బెర్లిన్, నెదర్లాండ్స్‌లోనూ గ్రేడ్-1, గ్రేడ్-2 టోర్నీల్లో పూర్తిస్థాయిలో రాణించలేకపోయాను. గతనెల చైనాలో జరిగిన టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్స్ వరకు వూత్రమే చేరుకున్నాను. అరుుతే హైదరాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ జూనియుర్ టోర్నీ అండర్-18 బాలికల సింగిల్స్ టైటిల్ దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈజిప్ట్ టోర్నీలో కూడా విజయుం సాధిస్తానన్న నవ్ముకం ఉంది. ఎప్పటికైనా గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడమే నా ల క్ష్యం. గోల్కొండ ఇష్టం.. టైం దొరికితే పుస్తకాలు చదువుతుంటాను. టీవీలో స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంటాను. ఫెడరర్, కిమ్ క్లియ్‌స్టర్స్ నాకు ఇష్టమైన క్రీడాకారులు. చిన్మయు విద్యాలయు నుంచి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యూను. అదే కళాశాలలో ఇంటర్లో జారుున్ అయ్యూను. హైదరాబాద్‌లో గోల్కొండ కోట అంటే చాలా ఇష్టం. - వాంకె శ్రీనివాస్ -
శ్రీవత్స, మహక్ జైన్లకు టాప్ సీడింగ్
4 నుంచి ఆసియా జూనియర్స్ ఈవెంట్ రాష్ట్రంలో తొలిసారి ఇండోర్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఇండోర్ టెన్నిస్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. నగర శివారులోని లియోనియా రిసార్ట్స్‌లో అధునాతన ప్రమాణాలతో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టుల్లో ఇండోర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సోమవారం నుంచి జరిగే ఆసియా జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్(అండర్-14)లో... మొత్తం పది దేశాల క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నీలో హైదరాబాదీ క్రీడాకారులు శ్రీవత్స రాతకొండ, మహక్ జైన్లకు టాప్ సీడింగ్ కేటాయించారు. బాలికల విభాగంలో మహక్ జైన్‌తో పాటు తెలుగమ్మాయిలు సాయిదేదీప్య, శివాని అమినేనిలు వరుసగా రెండు, మూడో సీడ్లుగా బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రానికి చెందిన మరో అమ్మాయి శ్రీవల్లి రష్మికకు ఏడో సీడింగ్ దక్కింది. బాలుర సింగిల్స్‌లో శ్రీవత్స టాప్ సీడ్‌కాగా, మాచెర్ల తీర్థ శశాంక్ 8వ సీడ్‌గా పోటీపడతాడు. 16 మంది క్వాలిఫయర్లు బాలబాలికల విభాగాల్లో మొత్తం 128 మంది క్రీడాకారులు మెయిన్ డ్రా ఈవెంట్లో పాల్గొంటారు. వీరిలో 16 మంది క్వాలిఫయర్లుంటారు. క్వాలిఫయింగ్ ఈవెంట్ ద్వారా 8 మంది చొప్పున బాలబాలికలు మెయిన్ డ్రా పోటీలకు అర్హత సంపాదిస్తారు. ఈ నెల 4న మొదలయ్యే ఈ టోర్నీ 9న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సోమవారం జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ లాన్ టెన్నిస్ సంఘం (టీఎల్‌టీఏ) సౌజన్యంతో డీఆర్సీ స్పోర్ట్స్ ఫౌండేషన్, ఫినిక్స్ లైవ్ సంస్థలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి. -
6’2’’ బుల్లెట్టు..!
పుట్టుకతోనే అందం, శ్రమ, నైపుణ్యంతో ఆట... ఈ రెండింటి ప్రభావంతో ఆదాయం... వీటన్నింటి ఫలితంగా విపరీతమైన క్రేజ్. ఇది మారియా షరపోవా జీవితం. అంతర్జాతీయ స్థాయిలో యువత అత్యధికంగా అభిమానించే సెలబ్రిటీగా గుర్తింపు పొందింది షరపోవా. యూత్ స్టైల్ ఐకాన్లుగా గుర్తించిన వారిలో షరపోవా ప్రముఖ స్థానంలో ఉందని తాజాగా ఒక అధ్యయనం తేల్చింది. డెయిలీ మెయిల్లో ప్రచురితమైన ఒక సర్వేలో షరపోవాను యువత కలల రాణిగా అభివర్ణించారు. ముఖ్యంగా మెట్రోయువత షరపోవా హైట్‌కు ఆమె స్టైల్‌కు ఫ్లాట్ అయ్యిందన్నారు. టెన్నిస్ కోర్ట్‌లో మారియా హావభావాలకు ఆకర్షితులవుతున్నవారు కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక ఫోర్బ్స్ కూడా షరపోవాను ఆఫ్కోర్ట్ అందాల వనితగా గుర్తించింది. ఈ ఆరడుగుల రెండు అంగుళాల బుల్లెట్టు అభిమానుల గుండెల్లోకి తోసుకుపోతోందని ధ్రువీకరించింది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్స్‌లో ఒక్కోసారి ఒక్కో రకమైన అప్పియరెన్స్ ఇస్తుంటుంది షరపోవా. గ్రాస్ కోర్ట్‌కు, ఎర్రమట్టి కోర్టులకు అనుగుణంగా స్కర్ట్స్‌ను మార్చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఆఫ్ కోర్ట్‌లో ఒక మోడల్‌గా విజృంభిస్తూ యూరప్‌లోని ప్రముఖ మోడళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఆమె ఆటలో సాధిస్తున్న విజయాలకు తిరుగులేదు. ఆటకు సంబంధించిన ఫ్యాన్సూ ఉన్నారు. ఆమె అందానికి ఫిదా అయిపోతున్నవారూ ఉన్నారు! ఇక ఆదాయం విషయంలోనైతే గత తొమ్మిదేళ్లుగా టాప్ పొజిషన్లో ఉంది మారియా. 2005 నుంచి 2013 వరకూ ప్రతియేటా ఫోర్బ్స్ జాబితాలో తొలిస్థానంలో నిలిచి కొత్త రికార్డును స్థాపించింది. గత యేడాది 176 కోట్ల రూపాయల ఆదాయంతో అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న మహిళా క్రీడాకారిణుల్లో టాప్ పొజిషన్లో నిలిచింది మారియా. దీన్ని బట్టి ఆట, అందం, ఆదాయం... ఈ మూడు విషయాల్లోనూ తిరుగులేని యువతి ఎవరైనా ఉన్నారంటే అది షరపోవా మాత్రమేనని చెప్పవచ్చు. అసలు లాన్ టెన్నిస్‌లో రష్యన్ భామలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వెనుకటికి అన్నా కౌర్నికోవా, ఇప్పుడు షరపోవా వారెవ్వా అనిపిస్తున్నారు. కౌర్నికోవా అయితే ఆట కన్నా ఇతర విషయాల్లో ఎక్కువ ప్రతిభను చూపించగా... షరపోవా మాత్రం ఆటతో పాటు అన్ని రంగాల్లోనూ ధీటుగా రాణిస్తోంది! యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. -
హెచ్‌సీయూలో టెన్నిస్ కోర్టు ప్రారంభం
సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్తగా టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. సిటీలోనే తొలిసారిగా రూ.23 లక్షల వ్యయంతో ఎనిమిది లేయర్ల సింథటిక్ ఆక్రాలిక్ టెన్నిస్ కోర్టును క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. వీసీ రామకృష్ణ రామస్వామి ఈ కోర్టును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ అర్హత గల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా అమలుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ కె.వి.రాజశేఖర్ మాట్లాడుతూ మొదటి దశలో ప్రధాన క్యాంపస్‌లో, రెండవ దశలో సౌత్ క్యాంపస్‌లో టెన్నిస్ కోర్టుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్ బాస్కెట్ బాల్ , బీచ్ వాలీబాల్, ఏరోబిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియత్రణ అధికారి వెంకటేశ్వరరావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ కిషోర్, పీఈటీలు శ్యామ్సన్, కృపాకర్ పాల్గొన్నారు.