6’2’’ బుల్లెట్టు..! | Maria sharapova launched 6'2'' bullet bike | Sakshi
Sakshi News home page

6’2’’ బుల్లెట్టు..!

Jan 16 2014 1:43 AM | Updated on Sep 2 2017 2:38 AM

6’2’’ బుల్లెట్టు..!

6’2’’ బుల్లెట్టు..!

పుట్టుకతోనే అందం, శ్రమ, నైపుణ్యంతో ఆట... ఈ రెండింటి ప్రభావంతో ఆదాయం... వీటన్నింటి ఫలితంగా విపరీతమైన క్రేజ్. ఇది మారియా షరపోవా జీవితం.

పుట్టుకతోనే అందం, శ్రమ, నైపుణ్యంతో ఆట... ఈ రెండింటి ప్రభావంతో ఆదాయం... వీటన్నింటి ఫలితంగా విపరీతమైన క్రేజ్. ఇది మారియా షరపోవా జీవితం. అంతర్జాతీయ స్థాయిలో యువత అత్యధికంగా అభిమానించే సెలబ్రిటీగా గుర్తింపు పొందింది షరపోవా. యూత్ స్టైల్ ఐకాన్లుగా గుర్తించిన వారిలో షరపోవా ప్రముఖ స్థానంలో ఉందని తాజాగా ఒక అధ్యయనం తేల్చింది. డెయిలీ మెయిల్‌లో ప్రచురితమైన ఒక సర్వేలో షరపోవాను యువత కలల రాణిగా అభివర్ణించారు.

ముఖ్యంగా మెట్రోయువత షరపోవా హైట్‌కు ఆమె స్టైల్‌కు ఫ్లాట్ అయ్యిందన్నారు. టెన్నిస్ కోర్ట్‌లో మారియా హావభావాలకు ఆకర్షితులవుతున్నవారు కూడా ఎంతోమంది ఉన్నారు.  ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక ఫోర్బ్స్ కూడా షరపోవాను ఆఫ్‌కోర్ట్ అందాల వనితగా గుర్తించింది. ఈ ఆరడుగుల రెండు అంగుళాల బుల్లెట్టు అభిమానుల గుండెల్లోకి తోసుకుపోతోందని ధ్రువీకరించింది.

 వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్స్‌లో ఒక్కోసారి ఒక్కో రకమైన అప్పియరెన్స్ ఇస్తుంటుంది షరపోవా. గ్రాస్ కోర్ట్‌కు, ఎర్రమట్టి కోర్టులకు అనుగుణంగా స్కర్ట్స్‌ను మార్చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఆఫ్ కోర్ట్‌లో ఒక మోడల్‌గా విజృంభిస్తూ యూరప్‌లోని ప్రముఖ మోడళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

 ఆమె ఆటలో సాధిస్తున్న విజయాలకు తిరుగులేదు. ఆటకు సంబంధించిన ఫ్యాన్సూ ఉన్నారు. ఆమె అందానికి ఫిదా అయిపోతున్నవారూ ఉన్నారు! ఇక ఆదాయం విషయంలోనైతే గత తొమ్మిదేళ్లుగా టాప్ పొజిషన్‌లో ఉంది మారియా. 2005 నుంచి 2013 వరకూ ప్రతియేటా ఫోర్బ్స్ జాబితాలో తొలిస్థానంలో నిలిచి కొత్త రికార్డును స్థాపించింది.  

 గత యేడాది 176 కోట్ల రూపాయల ఆదాయంతో అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న మహిళా క్రీడాకారిణుల్లో టాప్ పొజిషన్‌లో నిలిచింది మారియా. దీన్ని బట్టి ఆట, అందం, ఆదాయం... ఈ మూడు విషయాల్లోనూ తిరుగులేని యువతి ఎవరైనా ఉన్నారంటే అది షరపోవా మాత్రమేనని చెప్పవచ్చు. అసలు లాన్ టెన్నిస్‌లో రష్యన్ భామలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వెనుకటికి అన్నా కౌర్నికోవా, ఇప్పుడు షరపోవా వారెవ్వా అనిపిస్తున్నారు. కౌర్నికోవా అయితే ఆట కన్నా ఇతర విషయాల్లో ఎక్కువ ప్రతిభను చూపించగా... షరపోవా మాత్రం ఆటతో పాటు అన్ని రంగాల్లోనూ ధీటుగా రాణిస్తోంది! యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement