Maria Sharapova
-
దిగ్గజ టెన్నిస్ కోచ్ అస్తమయం
ఆండ్రీ ఆగస్సీ, మరియా షరపోవా లాంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన దిగ్గజ టెన్నిస్ కోచ్ నిక్ బొల్లెట్టిరి(91) కన్నుమూశాడు. ఈ విషయాన్ని ఆయన స్థాపించిన ఐఎంజీ అకాడమీ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. వయో బారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిక్ బొల్లెట్టిరి తుది శ్వాస విడిచినట్లు ఐఎంజీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న టెన్నిస్ మాజీ క్రీడాకారులు ఆయనకు సంతాపం తెలిపారు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఐటీఎఫ్) నిక్ బొల్లెట్టిరికి నివాళి అర్పించింది. ఇక టెన్నిస్ ఆటగాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా నిక్ బొల్లెట్టిరి 1978లో ఫ్లోరిడా వేదికగా ఐఎంజీ అకాడమీ(IMG Academy) స్థాపించాడు. ఈ అకాడమీలో ఆండ్రీ అగస్సీ, మరియా షరపోవాల, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, బొరిస్ బెకర్ లాంటి దిగ్గజాలు శిక్షణ తీసుకున్నారు. టాప్-10లో కొనసాగిన ఆటగాళ్లంతా ఏదో ఒక సమయలో బొల్లెట్టిరి దగ్గర శిక్షణ తీసుకున్నవారే కావడం విశేషం. Nick Bollettieri, the legendary tennis coach and founder of Nick Bollettieri Tennis Academy, which served as the foundation for today’s IMG Academy, has passed away. He was 91 years old. 💙🤍 🔗: https://t.co/vvFnYHowKc pic.twitter.com/zJYem2SvF6 — IMG Academy (@IMGAcademy) December 5, 2022 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘టెన్నిస్ స్టార్’.. ఫొటో వైరల్
Maria Sharapova Welcomes Son: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తల్లయ్యారు. పండంటి బాబుకు ఆమె జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా శుక్రవారం అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడి పేరు థియోడర్ అని షరపోవా వెల్లడించారు. కాగా 35 ఏళ్ల ఈ రష్యన్ బ్యూటీ షరపోవా.. బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు 2020లో తమకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ జంట జూలై 1న తమ తొలి సంతానానికి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘మా కుటుంబానికి అత్యంత అందమైన.. ఎంతో గొప్పదైన బహుమతి లభించింది.. థియోడర్’’ అంటూ తమకు కుమారుడు జన్మించిన విషయాన్ని షరపోవా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో తమ చిన్నారి పాపాయితో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇక తన కెరీర్లో మారియా షరపోవా ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. పదిహేడేళ్ల వయసులో 2004లో తన తొలి వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆమె.. 2006లో యూఎస్ ఓపెన్, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. సుదీర్ఘ కెరీర్‌కు 2020లో ఆటకు వీడ్కోలు పలికిన షరపోవా ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని, మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Maria Sharapova (@mariasharapova) చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే, నెదర్లాండ్స్ -
తల్లికాబోతున్న ‘టెన్నిస్ స్టార్’..
రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. త్వరలోనే తాను తల్లికాబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు.. ‘‘అమూల్యమైన సరికొత్త ఆరంభాలు!!’’ అంటూ తాను గర్భవతినన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బీచ్‌లో నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేసి తల్లి కాబోతున్న అనుభూతులను పదిలం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా తన కెరీర్లో ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన షరపోవా.. 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘మరో ఉన్నత శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నాను. టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నా’’ అంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక షరపోవా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్‌తో ఆమె రిలేషన్షిప్లో ఉన్నారు. ఇక వీరిద్దరు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. View this post on Instagram A post shared by Maria Sharapova (@mariasharapova) -
షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్, క్రిమినల్ కేసులు.. ఏం జరిగింది?
రష్యన్ టెన్నిస్ దిగ్గజం మరియా షరపోవాతో పాటు ఫార్ములావన్ మాజీ చాంపియన్ మైకెల్ షుమాకర్‌లపై గుర్గావ్ పోలీస్ స్టేషన్లో చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని చత్తార్పూర్ మినీఫామ్కు చెందిన షఫాలీ అగర్వాల్ అనే మహిళ ఫిర్యాదు మేరకు గుర్గావ్ పోలీసులు షరపోవా, షుమాకర్ సహా 11 మంది వ్యాపారులపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షఫాలీ అగర్వాల్ మాట్లాడుతూ.. రియల్టెక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమని మోసం చేసిందని తెలిపారు. సెక్టార్ 73లోని షరపోవా ప్రాజెక్ట్ పేరిట షుమాకర్ టవర్స అపార్టమెంట్లో ఒక ఫ్లాట్ కోసం కంపెనీ ప్రతినిధులు సుమారు రూ.80 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. 2016లో ఫ్లాట్‌ను అందిస్తామని నమ్మించి ఇంతవరకు మాకు అందించలేదని తెలిపారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగలేదని.. జాతీయ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించగా.. వారిపై క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదు చేయమని కోర్టు వెల్లడించిందని పేర్కొన్నారు. కాగా 2016లో సదరు కంపెనీకి షరపోవా, షుమాకర్‌లు అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు కంపెనీ ప్రతినిధులతో కలిసి షరపోవా, షుమాకర్‌లు డిన్నర్ పార్టీల్లో పాల్గొన్నట్లు తేలింది. ఫార్ములావన్‌లో మెర్సిడెస్కు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన మైకెల్ షుమాకర్ ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచాడు. ప్రస్తుత చాంపియన్ లుయీస్ హామిల్టన్ కూడా ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌షిప్‌ను గెలిచాడు. ఇక షుమాకర్ రికార్డులు పరిశీలిస్తే.. 2012లో రిటైర్ అయ్యేవరకు 91 విజయాలు, 155 ఫోడియమ్స్, 1566 కెరీర్ పాయింట్లు, 68 పోల్ పోజిషన్స్, 77 ఫాస్టెస్ట్ లాప్స్ అందుకున్నాడు. ఇక మహిళల టెన్నిస్ విభాగంలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరచుకుంది. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన షరపోవా.. టెన్నిస్‌లో అందాల రాణిగా నిలిచింది. 2001-2020 మధ్య ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడంతో పాటు 18 ఏళ్ల వయసులోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2005లో 21 వారాలపాటు షరపోవా మహిళల టెన్నిస్ నెంబర్‌వన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఇక కెరీర్ గ్రాండ్‌స్లామ్(యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్) అందుకున్న క్రీడాకారిణిగా షరపోవా చరిత్ర సృష్టించింది. చదవండి: PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు -
టెన్నిస్ చరిత్రలో పెనుసంచలనం
US Open 2021 Winner Emma Raducanu: టెన్నిస్ చరిత్రలో పెనుసంచలనం చోటు చేసుకుంది. యూఎస్ ఓపెన్ ఫైనల్లో పద్దెనిమిదేళ్ల ఎమ్మా రెడుకాను విజేతగా ఆవిర్భవించింది. ఈ బ్రిటిష్ టెన్నిస్ సెన్సేషన్.. 19 ఏళ్ల కెనడా ప్లేయర్ లేలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. న్యూయార్క్‌లోని కరోనా పార్క్ ‘అర్థర్ ఆషే స్టేడియం’లో భారత కాలమానం ప్రకారం.. శనివారం అర్ధరాత్రి దాటాక(ఆదివారం ఉదయం) US Open 2021 మహిళల ఫైనల్ మ్యాచ్ జరిగింది. సెట్ కూడా ఓడిపోకుండా టీనేజర్ ఎమ్మా రెడుకాను మ్యాచ్‌పై పట్టు సాధించి గెలుపును ఖాతాలో వేసుకుంది. అత్యంత చిన్నవయస్సులోనే గ్రాండ్‌స్లామ్ వేటలో ఫైనల్లో విజేతగా ఆవిర్భవించింది. అంతేకాదు ఈ గ్రాండ్ విక్టరీతో తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గతంలో మరియా షరపోవా(17 ఏళ్ల వయసులో వింబుల్డన్ విజేత- 2004) తర్వాత ఏదేని ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఈ రికార్డు సాధించిన టీనేజర్‌గా గుర్తింపు ఇప్పుడు ఎమ్మా ఘనత దక్కించుకుంది. Hanging out with ESPN 😎📺 pic.twitter.com/QpIX2TgDvs — US Open Tennis (@usopen) September 12, 2021 కాగా, ఎమ్మా రెడుకాను కెరీర్లో ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ విజయాలేవీ లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆమె సక్సెస్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే బ్రిటిష్ ప్లేయర్ వర్జీనియా వేడ్ 1977లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తర్వాత ఇప్పుడు.. ఎమ్మా రెడుకాను ఈ ఘనత సాధించింది. Emma lifts the trophy for the fans outside Arthur Ashe stadium #EmmaRaducanu #USOpen2021 pic.twitter.com/8FwLeB4le4 — Sarah Gough (@sarahgoughy) September 11, 2021 చదవండి: స్వర్ణ పతక విజేతను ఓడించి.. ఫైనల్లో జొకోవిచ్ -
నాటి రాళ్లు నేటి పూలు.. మన్నించు మారియా!
ఆరేళ్ల క్రితం.. ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని టెన్నిస్ తార మారియా షరపోవా అన్నందుకు ఆగ్రహించిన సచిన్ అభిమానులు ఇప్పుడు ఆ షరపోవాకే.. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు నీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని ఆమె ఫేస్బుక్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఆమెకు లైకుల మీద లైకులు కొడుతున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విదేశీ ప్రముఖుల్ని హెచ్చరిస్తూ.. ‘ఇది మా సొంత విషయం’ అని సచిన్ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా రైతు ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు తమ మెడకు ఉరి వంటివి కనుక వాటిని రద్దు చేయాలని రైతుల డిమాండ్. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఎన్ని విడతలుగా చర్చలు జరిగినా ఒక ఫలవంతమైన ముగింపు రావడం లేదు. ఈలోపు వివిధ కారణాల వల్ల కనీసం 170 మంది ఉద్యమ రైతులు మరణించారని వస్తున్న వార్తలతో ప్రపంచం నలుమూలల నుంచి రైతుల డిమాండ్‌కు ట్వీట్ల ద్వారా మద్దతు లభిస్తోంది. స్వీడన్ నుంచి పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, బార్బడోస్ పాప్ గాయని రిహాన్నా వంటివారు రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. విదేశీ సానుభూతి పరులకు వ్యతిరేకం గా పెట్టిన ట్వీట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది. ‘భారత్ తన సార్వభౌమాధికారం విషయంలో రాజీకి రానవసరం లేదు. బయటి శక్తులు వీక్షకులుగా ఉండొచ్చు కానీ, భాగస్వాములు కాదగరు’ అని థన్‌బర్గ్, రిహాన్నాలను ఉద్దేశించే సచిన్ ఆ ట్వీట్ పెట్టారు. ∙∙ నిప్పు జ్వాల గాలి దిశను బట్టి వ్యాíపిస్తుంది. ఆగ్రహ జ్వాల ఎటువైపు అధాటున మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు. సచిన్‌ను ‘క్రికెట్ దేవుడు’ అని ఆరాధించిన ఆయన అభిమానులు.. రైతులకు మద్దతు ఇస్తున్న విదేశీయుల్ని సచిన్ ‘హద్దుల్లో ఉండండి’ అని అర్థం వచ్చేలా హెచ్చరించినందుకు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన నేరుగా లేదు. పరోక్షంగా ఉంది. పరోక్షంగా ఉన్నప్పటికీ శక్తిమంతంగా ఉంది. రష్యన్ టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ‘సచిన్ ఎవరో నాకు తెలియదు’ అని అన్నందుకు ఆగ్రహోదగ్రులైన భారతీయులు, ముఖ్యంగా మలయాళీలు షరపోవా ఫేస్బుక్ వాల్‌పై కూర్చొని ఆనాడు ఆమెను అనరాని మాటలు అన్నారు. చాలావరకు అవి భారతీయ భాషల్లో ఉన్నాయి కనుకు షరపోవాకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇంగ్లిష్‌లో ఉన్న కామెంట్స్నైనా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని ఇప్పుడు అదే సచిన్ అభిమానులు.. అదే షరపోవా ఫేస్ బుక్ వాల్ మీదకు వెళ్లి ఆమెకు సారీ చెబుతున్నారు. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు మీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. ఒకరైతే.. ‘మారియా, ఇండియా రండి. నా రెస్టారెంట్లో మీ కోసం ప్రత్యేకంగా షవర్మా, కుళిమంతీ (బిర్యానీ) చేయించి పెడతాను’ అని ఆమెను ఆహ్వానించారు. నాడు మారియాపై పడిన రాళ్లే, ఇప్పుడు పూలుగా మారుతున్నాయి. ‘డియర్ మారియా, వి ఆర్ సారీ. సచిన్‌కి సపోర్ట్ చేస్తూ ఆనాడు మీపై సైబర్ అటాక్ చేసినందుకు బాధపడుతున్నాం’ అని ఒకరు; ‘మారియా, ఆరోజు నాకు పరిణతి లోపించింది. సచిన్ తెలియదు అన్నందుకు నిన్ను నానా మాటలు అన్నాను. నన్ను క్షమించు’ అని ఇంకొకరు పోస్టు పెట్టారు. ఒక మహిళ అయితే.. ‘సారీ సిస్టర్, యువర్స్ ట్రూలీ’ అంటూ షరపోవాకు లైకుల మీద లైకులు కొట్టారు. ఈ ప్రేమ జ్వాల అంతకంతకూ పెరిగిపోయి, సచిన్ ఉండే ముంబై మీదుగా రైతులు పోరాడుతున్న ఢిల్లీ వరకు వ్యాపించేలా మారియాపై పూల వర్షం కురుస్తోంది. ఆ పూల వానను రైతుల పోరాటానికి ఆశీస్సులనే అనుకోవాలి. రిహాన్నా, గ్రెటా థన్‌బర్గ్ -
చిన్న రహస్యమంటూ అసలు విషయం చెప్పిన మారియా
మాస్కో: రష్యా మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తన అభిమానులకు క్రిస్మస్, న్యూయర్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ గిల్కెస్ను త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు. ఇటీవల టెన్నిస్‌కు గూడ్‌బై చెప్పిన మారియా శనివారం తన బాయ్ఫ్రేండ్తో కలిసి ఉన్న ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ఇది చిన్న రహస్యం. మేము కలిసిన మొదటి రోజు నుంచే ఒకే చెబూతూనే ఉన్నాను. ఇతడు అలెగ్జాండర్ గిల్కెస్ కదా’ అంటూ తన ప్రేమ రహస్యాన్ని బయటపెట్టారు. (చదవండి: టెన్నిస్‌కు గుడ్‌బై: షరపోవా భావోద్వేగం) ఇక మారియా పోస్టుకు బాయ్‌ఫ్రెండ్ గిల్కెస్ ఇలా సమాధానం ఇస్తూ.. ‘ఒకే చెప్పి నన్ను చాలా చాలా సంతోషమైన అబ్బాయిని చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ మారియాతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నాడు. కాగా మారియా రష్యా వ్యాపారవేత్త అయిన అలెగ్జాండర్ గిల్కెస్‌తో ప్రేమలో ఉన్నట్లు 2018లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా నిలిచిన మారియా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్మెంట్ ప్రకటించారు. 32 ఏళ్లకే 28 ఏళ్ల తన టెన్నిస్ ఆటకు ముగింపు పలకడంతో ఆమె అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. View this post on Instagram A post shared by Maria Sharapova (@mariasharapova) -
షరపోవా.. అన్‌స్టాపబుల్
అన్‌స్టాపబుల్ : మై లైఫ్ సో ఫార్.. అని రెండున్నరేళ్ల క్రితం మారియా షరపోవా తన బయోగ్రఫీ రాసుకున్నారు. ఆపలేని ఎదుగుదల.. అని. ఆ పుస్తకం బయటికి రావడానికి కొద్దినెలల ముందే.. పదిహేను నెలల నిషేధం తర్వాత ఆమె మళ్లీ టెన్నిస్‌లోకి వచ్చారు. రెండేళ్లు ఆడారు. అంతలోనే మళ్లీ రెండు రోజుల క్రితం రిటైర్మెంట్ని ప్రకటించారు. ఆమెను ఎవరూ ఆపలేదు. ఆమే ఆగిపోయారు. అంతమాత్రాన ఆమె ‘అన్‌స్టాపబుల్’ కాకుండా పోరు. టెన్నిస్‌లో రాణించడానికి షరపోవా ఎంత కష్టపడ్డారో.. టెన్నిస్ తర్వాత లైఫ్‌లోనూ ఎదగడానికి అంతగా కృషి చేస్తారని అంచనా వెయ్యడానికి ఆమె కెరీర్‌లోని మలుపులే కొలమానాలు. షరపోవా క్యాండీ సుగర్‌పోవా అనే క్యాండీ ఒకటి ఉంది. అది అమెరికాలో దొరుకుతుంది. పిల్లలకు ఎంతో ఇష్టమైనది. ఫన్నీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే స్వీట్‌గా ఉంటుంది. క్యాండీల వ్యాపారి జెఫ్ రూబిన్.. షరపోవా పేరు మీదే, ఆమెతో కలిసి సుగర్‌పోవా క్యాండీని సృష్టించాడు. దాని అమ్మకాలపై వచ్చే డబ్బు ‘షరపోవా చారిటీ’కి వెళుతుంది. ఒక సందర్భంలోనైతే షరపోవా తన పేరును సుగర్పోవాగా మార్చుకోవాలని కూడా అనుకున్నారు! అంతగా ఆ ప్రాడెక్ట్ ఇమేజ్ పెరిగిపోయింది. షరపోవా ప్రాక్టీస్ ఆరవ యేట మాస్కోలోని మార్టినా నవ్రతిలోవా నడుపుతున్న టెన్నిస్ క్లినిక్‌లో చేరడం షరపోవా కెరీర్‌ను మలుపుతిప్పింది. మార్టినా ఈ చిన్నారిని ఫ్లారిడాలోని ఐ.ఎం.జి.అకాడమీకి రికమండ్ చేసింది! ఆండ్రీ అగస్సీ, మోనికా సెలెస్, అన్నా కోర్నికోవా లాంటి టెన్నిస్ దిగ్గజాలు ట్రైనింగ్ తీసుకున్న అకాడమీ అది. కానీ షరపోవా తండ్రి దగ్గర డబ్బుల్లేవు. అప్పు చేయాలి. డబ్బైతే అప్పు చేయగలడు కానీ, ఇంగ్లీషులో మాట్లాడలేడు కదా! ఇంట్లో ఎవ్వరికీ ఇంగ్లిష్ రాదు. ఆ భయంతో ఏడాది తాత్సారం చేసి ధైర్యం చేశాడు. మరోవైపు వీసా నిబంధనలు తండ్రీ కూతుళ్లను మాత్రమే యు.ఎస్.లోకి రానిచ్చాయి. తల్లి ఎలీనా రెండేళ్ల పాటు భర్తకు, కూతురికి దూరంగా రష్యాలోనే ఉండిపోవలసి వచ్చింది. షరపోవా, ఆమె తండ్రి తొలిసారి ఆమెరికాలో అడుగుపెట్టేనాటికి వాళ్ల దగ్గరున్న డబ్బు 700 డాలర్లు. ఇప్పటి లెక్కల్లో సుమారు 47 వేల రూపాయలు. వాటిని జాగ్రత్తగా వాడుకుంటూనే ఫ్లారిడాలో ఇళ్లల్లో పాత్రలు కడగడం వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టాడు తండ్రి. తర్వాతి ఏడాదికల్లా అకాడమీ ప్రవేశానికి అర్హమైన తొమ్మిదేళ్ల వయసు రాగానే కూతుర్ని ఐ.ఎం.జి.లో చేర్చాడు. ఇక షరపోవాకి ట్యూషన్ ఫీజు, ఇంత సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ అకాడమీవే. అలా కెరీర్‌తో పాటు, షరపోవా జీవితం కూడా యు.ఎస్.తో ముడిపడిపోయాయి. ఆటల్లోనే కాదు, చారిటీల్లో కూడా ఆమె పెద్ద సెలబ్రిటీ అయ్యారు. షరపోవా ‘తప్పు’ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు ఆమె ఒంట్లో ‘మెల్డోనియం’ అనే మందు బయటపడింది. అదేమీ నిషేధించిన ఔషధం కాదు. అప్పటికి పదేళ్లుగా ఆమె తన ఆరోగ్యం కోసం తనకు తెలియకుండానే మెల్డోనియం కలిసి ఉన్న మెడిసిన్‌ని వాడుతున్నారు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కొత్తగా విడుదల చేసిన నిషేధిత ఔషధాలలో దానిని కూడా చేర్చడంతో షరపోవా దోషి కావలసి వచ్చింది! అందుకు పడిన శిక్ష ఆట నుంచి పదిహేను నెలల బ్యాన్! షరపోవా ఆట షరపోవా రష్యన్ ప్రొఫెషనల్ ప్లేయర్. ఇరవై ఐదేళ్లుగా యు.ఎస్.లో ఉంటున్నారు. ఒలింపిక్ మెడలిస్ట్. టెన్నిస్ కోర్టులో గర్జించే సింహం. 6 అడుగుల 2 అంగుళాల ఎల్తైన మనిషి. ఆమెకు మాత్రమే ప్రత్యేకమైన ఆ స్వింగింగ్ వ్యాలీలు ప్రత్యర్థుల గుంyð ల్ని కిందికి జారుస్తాయి. ఒక ఆట గెలిచినప్పుడు షరపోవా వెంటనే తర్వాతి ఆటకు ప్రాక్టీస్ మొదలు పెడతారు! ఆటలో ఓడిపోయినప్పుడు ఆ ప్రెజర్ నుంచి బయట పడడానికి షాపింగ్‌కి వెళతారు! షరపోవా ‘రీబర్’ సోవియెట్ యూనియన్‌లో చెర్నోబిల్ అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఏడాదికి న్యాగన్ పట్టణంలో షరపోవా పుట్టింది. ఆ పట్టణం చెర్నోబిల్ దుర్ఘటన జరిగిన ప్రిప్యత్ పట్టణానికి 3,500 కి.మీ. దూరంలో ఉంటుంది. చెర్నోబిల్ ప్రమాద ప్రభావం పడకుండా ఉండేందుకు షరపోవా తల్లిదండ్రులు ప్రిప్యత్ నుంచి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా వెళ్లిన తర్వాతే బిడ్డను కనాలని నిర్ణయించుకుని న్యాగన్‌లో తలదాచుకున్నారు. చెర్నోబిల్ ప్రమాదం 1986 ఏప్రిల్ 26న జరిగింది. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ అదే రోజున నిషేధం తర్వాత షరపోవా తన ‘రీబర్త్’ టెన్నిస్‌ను ఆడారు. షరపోవా స్నేహం పద్దెనిమిదవ యేటే టెన్నిస్‌లో ఆమె వరల్డ్ నెం.1 ర్యాంకులోకి వచ్చేశారు. ఆదే ఏడాది 18వ బర్త్‌డే పార్టీలో అమెరికన్ పాప్ రాక్ బ్యాండ్ మెరూన్ 5 సింగర్ ఆడమ్ లెవీన్ ఆమెకు పరిచయం అయ్యాడు. తర్వాత అమెరికన్ టెలివిజన్ ప్రొడ్యూజర్ చార్లీ ఎబర్సోల్ ఆమె జీవితంలోకి వచ్చాడు. తర్వాత స్లొవేనియా బాస్కెట్‌బాల్ ప్లేయర్ సషా ఉజాసిక్, తర్వాత బల్గేరియన్ టెన్నిస్ ప్లేయర్ గ్రిగర్ దిమిత్రోవ్. ప్రస్తుతం ఆమె బాయ్‌ఫ్రెండ్ అలెగ్జాండర్ గిల్కెస్. షరపోవా రిటైర్మెంట్ని ప్రకటించినప్పుడు ఆమె కెరీర్‌ను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. షరపోవా రాకెట్ షరపోవాకు రెండేళ్ల వయసులో ఆమె కుటుంబం సోచ్ సిటీకి మారింది. అక్కడ ఆమె తండ్రికి అలెగ్జాండర్ కఫెల్నికోవ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలెగ్జాండర్ తన పద్నాలుగేళ్ల కొడుకు ఎవ్‌జెనీకి టెన్నిస్‌లో శిక్షణ ఇప్పిస్తున్నప్పుడు వారి పరిచయం జరిగింది. తర్వాత రెండేళ్లకు తండ్రితో పాటు ఆట చూడడానికి వచ్చిన షరపోవాను చూసి ముచ్చట పడి ఆ చిన్నారికి కూడా ఓ టెన్నిస్ రాకెట్ కొనిచ్చాడు అలెగ్జాండర్. అదే తొలిసారి షరపోవా రాకెట్ పట్టుకోవడం. లోకల్ పార్క్‌లో చాలాకాలం పాటు ఆ రాకెట్‌తోనే ఆడింది. తర్వాత రష్యన్ కోచ్ యూరి యట్కిన్ దగ్గర టెన్నిస్ పాఠాలు నేర్చుకుంది. తొలి ఆటలోనే షరపోవాలోని అతి ప్రత్యేకమైన ‘హ్యాండ్–ఐ కోఆర్డినేషన్’ని గమనించాడు కోచ్. షరపోవా కోపం కోపంగా ఉన్నప్పుడు షరపోవా రాకెట్‌తో లాగిపెట్టి టెన్నిస్ బంతిని కొడతారు. అవతల ఎవరూ ఉండరు. ప్రాక్టీస్ వాల్‌ను పిడిగుద్దులు గుద్దినట్టుగా బంతిని వాల్ పైకి ఈడ్చి కొడుతూనే ఉంటారు. ఊరికినే తనకు కోపం రాదు. వస్తే ఊరికే ఉండిపోదు. కోపం తీర్చుకుంటుంది. ఎదురుగా ఉన్న గోడల్ని బంతులతో పగలగొడుతుంటారు. షరపోవా యోగా పదిహేను నెలల నిషేధంలో షరపోవా యోగా, ధ్యానం సాధన చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చేరారు. మంచి మంచి బుక్స్ చదివారు. బయోగ్రఫీ రాశారు. బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆట నుంచి బ్యాన్ అవగానే చాలామందే చికాకు పరిచారు ఆమెను. మొదటగా డేవిడ్ హెగర్టీ! ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఆమె బ్యాన్ నిర్ణయం అతడిదే. ఇంకా.. సాటి ప్లేయర్లు జాన్ మెకెన్రో, ప్యాట్ క్యాష్, జెన్నిఫర్ కాప్రియాటీ, సెరెనా విలియమ్స్, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్, ఆండీ ముర్రే, నొవాక్ జకోవిక్.. తలో మాటా అన్నారు. ‘ఇలా చేసిందంటే నమ్మలేక పోతున్నాం’ అని ఒకరు, ‘తన టైటిళ్లనీ వెనక్కు తీసేసుకోవాలి’ అని ఒకరు, ‘సారీ చెప్పినా ఒప్పుకోవద్దని ఒకరు’... తలో రాయి విసిరారు. షరపోవా ఎవరికీ సారీ చెప్పలేదు. వీళ్లందర్నీ క్షమించేయడానికి బాక్సింగ్ కన్నా, ధ్యానం ఆమెకు ఎక్కువ ఉపయోగపడింది. షరపోవా బాల్యం బాల్యం నుంచి దూరంగా వచ్చేస్తున్నకొద్దీ, బాల్యం ఆమె దగ్గరగా రావడం షరపోవా జీవితంలోని ఒక విశేషం. చిన్నపిల్ల నవ్వు, చిన్నపిల్ల వెక్కిరింపు ఇవెక్కడికీ పోలేదు. ఆమె దగ్గర చిన్నప్పటి స్టాంప్ కలెక్షన్ ఇంకా పోగవుతూనే ఉంది. చిన్నప్పటి ఆమె జ్ఞాపకాల సుగంధ పరిమళం స్టెల్లా మెకార్ట్నీ ఎప్పుడూ ఆమెను అంటుకునే ఉంటుంది! పిప్పీ లాంగ్‌స్టాకింగ్ బుక్స్ కూడా ఇంకా చదువుతూనే ఉన్నారు షరపోవా. పిప్పీ లాంగ్‌స్టాకింగ్ అనేది స్వీడిష్ రచయిత్రి ఆస్ట్రిడ్ లిండ్‌గ్రెన్ నవలల్లోని ఒక అమ్మాయి క్యారెక్టర్. పిప్పీ జుట్టు ఎర్రగా ఉంటుంది. రెండు జడలు ఉంటాయి. స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగిల్ హ్యాండ్‌తో తన గుర్రాన్ని అదుపు చేస్తుంటుంది. చురుగ్గా ఉంటుంది. ఎప్పుడేం చేస్తుందో చెప్పలేనంత ఎగై్జటింగ్‌గా ఉంటుంది. ఆ పాత్రలో తనను తను చూసుకున్నట్లుంది షరపోవా. అందుకే పిప్పీ అంటే అంతిష్టం. మిగతా పిల్లల సాహిత్యాన్ని కూడా ఆసక్తిగా చదువుతుంది. -
షరపోవా నిష్క్రమణ
ఏ ఆరంభానికైనా ముగింపు తప్పదు. తన ఆటతో టెన్నిస్‌ను శాసించి, ఆ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షరపోవా కూడా తన ఇరవై ఎనిమిదేళ్ల ఆటకు గుడ్‌బై చెబుతున్నట్టు బుధవారం ప్రకటించింది. నాలుగేళ్లక్రితం షరపోవా అతి ముఖ్యమైన ప్రకటన చేస్తారని ఆమె ప్రతినిధి ప్రకటించినప్పుడే నిష్క్రమణపై అంచనాలు వెలువడ్డాయి. ఎందుకంటే అప్పటికే భుజానికి ఏర్పడిన గాయం ఆమెకు ప్రతిబంధకమైంది. దాన్ని బేఖాతరు చేసి విజయాలు సాధిస్తున్నా మును పటి ఉరవడి మందగించిందన్న అసంతృప్తి అభిమానుల్లో ఉండేది. కానీ ఎవరి ఊహకూ అంద కుండా డోపింగ్ వివాదంలో తాను తాత్కాలికంగా నిష్క్రమిస్తున్నానని షరపోవా ప్రకటించి అందర్నీ దిగ్భ్రాంతి పరిచింది. అటు తర్వాత 15 నెలల సస్పెన్షన్ ముగిసి, మళ్లీ టెన్నిస్ బ్యాట్ పట్టుకున్నా, ఒకటీ అరా విజయాలు సాధించినా పాత గాయాలు ఆమెను వెన్నాడుతూనే వచ్చాయి. 2008 మొదలు ఆమె తన భుజానికి తగిలిన గాయానికి తరచు శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సివచ్చింది. ఒకపక్క ఆడుతూనే నెలల తరబడి ఫిజియో థెరపీలు తీసుకోవాల్సివచ్చింది. బరిలో దిగడానికి అర గంట ముందు ప్రత్యేక థెరపీ తప్పనిసరయ్యేది. కానీ ఇవన్నీ ఆమెను పాత షరపోవాగా మార్చ లేక పోయాయి. 2004లో అప్పటికే దిగ్గజంగా వున్న సెరెనా విలియమ్స్‌తో తలపడి çపదిహేడేళ్ల వయ సులో వింబుల్డన్ ఫైనల్‌ను చేజిక్కించుకున్న షరపోవా, అదే సెరెనాతో నిరుడు 6–1, 6–1 తేడాతో ఓడిపోక తప్పలేదు. ఇక నిష్క్రమించడం మంచిదని అప్పుడే ఆమె నిర్ణయించుకుని వుంటుంది. షరపోవాలాంటివారు ఏ రంగంలోనైనా అరుదుగా వుంటారు. ఆరేళ్ల వయసులోనే అమ్మకు దూరంగా ఉండాల్సిరావడం, స్వస్థలమైన రష్యాను వదిలి వేల కిలోమీటర్ల దూరంలోని అమెరికాకు శిక్షణ కోసం పయనం కావడం సాధారణం కాదు. అమెరికాలోని ఫ్లారిడాలో తన టెన్నిస్ బడిలో ఆండ్రీ అగస్సీ, వీనస్ విలియమ్స్, సెరినా విలియమ్స్, మోనికా సెలెస్, అన్నా కోర్నికోవా, మార్టినా హింగిస్ వంటి ఉద్దండుల్ని సృష్టించిన నిక్ బొలెట్టిరీయే షరపోవాను కూడా చేర్చుకుని మంచి శిక్షణనందించాడు. భవిష్యత్తు గ్రాండ్ స్లామ్ విజేతగా తీర్చిదిద్దాడు. సరదా ఆటలతో కాలక్షేపం చేయాల్సిన లేత వయసులో తోటిపిల్లల్ని తన ప్రత్యర్థులుగా పరిగణించడం, ఓడించాలనుకోవడం షరపోవా అలవాటు చేసుకుంది. గెలుపు తప్ప మరిదేన్నీ కోరుకోని జీవితం ఆమెకు ప్రత్యర్థులనే కాదు... శత్రువుల్ని కూడా ఇచ్చింది. 2016లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిందని రుజువు కావడంతో షరపోవాపై నిషేధాస్త్రం ప్రయోగించినప్పుడు ఆ రంగంలోని వారినుంచి తగిన సానుభూతి లభిం చకపోవడానికి ఇదొక కారణం. కానీ ఈ రంగమే షరపోవాకు కావలిసినంత కీర్తిప్రతిష్టల్ని ఆర్జించి పెట్టింది. కోట్లాదిమంది అభిమానుల్ని సాధించిపెట్టింది. ఆమె సాధించిన విజయాలు చిన్నవి కాదు. వింబుల్డన్ సింగిల్స్ గెల్చుకున్నాక వరసగా యూఎస్ ఓపెన్(2006), ఆస్ట్రేలియన్ ఓపెన్(2008) చేజిక్కించుకుంది. 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఆమె సొంతమైంది. షరపోవా దూకుడు ఒక్క టెన్నిస్‌కే పరిమితం కాలేదు. వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి విజయాలు అందుకుంది. ఆమె వ్యాపార సామ్రాజ్యం విలువ 1,200 కోట్ల డాలర్ల పైమాటేనని రెండేళ్లక్రితం ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. రష్యాలోని సైబీరియాలో చిన్నపాటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టి టీనేజ్లోనే వరస విజయాలతో ప్రత్యర్థుల్ని హడలెత్తించిన షరపోవా తన ఆటతో టెన్నిస్ రంగానికే వన్నె తెచ్చింది. తర్వాత కాలంలో ఆటలో మాత్రమే కాదు... ఆట వెలుపల కూడా ఆమె సంచలనంగా మారింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నైక్, పోర్షే, ఎవియాన్ వంటి అనేకానేక సంస్థలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఎన్నో మేగజీన్ల ముఖపత్రాలను అలంకరించింది. ఇలాంటి సమయంలో ఆమెపై డోపింగ్ ఆరోపణలొచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. క్రీడా రంగ దిగ్గజాలుగా ఉన్నవారెందరో అడపా దడపా పట్టుబడుతున్నా షరపోవాను ఎవరూ అలా ఊహించలేకపోయారు. తాను చాన్నాళ్లుగా వాడుతున్న మందు నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో చేరిందని తెలియక వాడి దోషినయ్యానని ఇచ్చిన సంజాయిషీ ఎవరినీ సంతృప్తిపరచలేదు. ఎందుకంటే ఆ ఔషధం వాడితే అనర్హత వేటు పడుతుందని అంతకు ముందునుంచే క్రీడా సంస్థలు హెచ్చరిస్తూ వచ్చాయి. వ్యక్తి మాత్రులుగా ఉన్నవారికి ఆ సంగతి తెలియలేదంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ షరపోవా కోసం ప్రత్యేక బృందం ఉండి పనిచేస్తుంటుంది. ఆమెపై ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా వ్యాఖ్యానిస్తున్నారో, టెన్నిస్ రంగంలో జరుగుతున్న పరిణామాలేమిటో, నియమ నిబంధనల్లో ఎటువంటి మార్పులు కావాలన్న డిమాండ్లు వస్తున్నాయో, ఏమేరకు అవి మారాయో ఆ బృందం ఎప్పటికప్పుడు ఆమెకు తెలియజేస్తూ ఉంటుంది. ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో పనిచేయడం, ఆ క్రమంలో ఎదురయ్యే అవరోధాలను అధి గమించడానికి నిరంతరం ప్రయత్నించడం వంటివి గెలుపును గ్యారెంటీ చేస్తాయి. షరపోవా అలాంటి అడ్డంకులెన్నిటినో ఎదుర్కొంది. కేవలం 700 డాలర్ల సొమ్ముతో అమెరికాలో తండ్రితో పాటు అడుగిడిన ఆమె ఈ రంగంలో మిగిలినవారికన్నా మిన్న కావడానికి తనలోని ఏకాగ్రత, పట్టుదల, ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే గుణం దోహదపడ్డాయి. అయితే వచ్చిపడుతున్న వరస విజయాలు చూపును మసకబార్చకూడదు. గత నెలలో మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియాలో ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఆమెకు సంప్రాప్తించిన అపజయం షరపోవా ర్యాంక్‌ను 373కు నెట్టేసింది. సవాళ్లు ఛేదించే క్రమంలోనో, ఫలానా వారిని మించిపోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవడంలోనో ఆమె తప్పటడుగులు వేసివుండొచ్చు. కానీ బరిలో దిగిన ప్రతిసారీ షరపోవా చూపిన ప్రతిభాపాటవాలు, విన్యాసాలు ఆమెను ఎప్పటికీ మరిచిపోనీయవు. ఏ రంగంలోనైనా రాణించాలనుకునేవారికి షర పోవా జీవితం అధ్యయనం చేయదగ్గ మహత్తర గ్రంథం. -
అందం అల్విదా చెప్పింది
ఆటతో పాటు అందం కూడా కలిసి నడిచే మహిళల టెన్నిస్‌లో ఒక శకం ముగిసింది. 16 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించిన రష్యన్ బ్యూటీ మారియా షరపోవా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గినా... వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించినా... తన అందంతోనే ఎక్కువగా ఆకర్షించిన ఈ బుట్టబొమ్మ తన రాకెట్‌ను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. తన పేరుతో పెట్టిన క్యాండీ ‘షుగర్‌పోవా’లాగే ఎన్నో తీపి జ్ఞాపకాలను పదిలపర్చుకొని వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించింది. పారిస్: రష్యా టెన్నిస్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్‌వన్ మారియా షరపోవా ఆట నుంచి తప్పుకుంది. ‘టెన్నిస్–నేను గుడ్‌బై చెబుతున్నా’ అంటూ ప్రకటించింది. నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గిన అతి కొద్ది మంది ప్లేయర్లలో ఆమె కూడా ఉండటం విశేషం. 32 ఏళ్ల షరపోవా కొన్నేళ్లుగా వరుస గాయాలతో సతమతమవుతోంది. కోలుకొని అప్పుడప్పుడూ బరిలోకి దిగుతున్నా ఫలితాలు అన్నీ ప్రతికూలంగా వచ్చాయి. ఒకప్పుడు వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన ఆమె ఇప్పుడు 373వ ర్యాంక్‌కు పడిపోయింది. దాంతో ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో పుట్టినా... ఏడేళ్ల వయసులోనే ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లిపోయింది. ఆటలో మాత్రం రష్యాకు ప్రాతినిధ్యం వహించడాన్ని షరపోవా కొనసాగించింది. 2004 వింబుల్డన్ ఫైనల్లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ను ఓడించి 17 ఏళ్ల వయసులోనే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ భామ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆమె చక్కటి ఆటకు అందం తోడై అత్యంత పాపులర్ ప్లేయర్‌గా షరపోవాకు గుర్తింపు తెచ్చి పెట్టాయి. వరుసగా 11 ఏళ్ల పాటు అత్యధిక ఆర్జన ఉన్న మహిళా క్రీడాకారిణిగా ‘ఫోర్బ్స్’ జాబితాలో నిలిచింది. 28 ఏళ్ల ఆట, 5 గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత గుడ్‌బై చెబుతున్నా. వేరే రంగంలో పోటీ పడి మరింత ఎత్తుకు ఎదిగే సత్తా నాలో ఇంకా ఉంది. నేను నా జీవితాన్ని టెన్నిస్‌కు ఇస్తే టెన్నిస్ నాకు జీవితాన్ని ఇచ్చింది. ఎంతగా శ్రమిస్తే అంత గొప్ప ఫలితాలు సాధించవచ్చని నేను నమ్మా. గతం గురించో, భవిష్యత్తు గురించో అతిగా ఆలోచించకుండా వర్తమానంలో కష్టపడటం వల్లే ఈ విజయాలు దక్కాయనేది నా భావన. టెన్నిస్ కోర్టుకు సంబంధించి అన్ని జ్ఞాపకాలూ పదిలంగా నా మనసులో ఉంటాయి. అవి కోల్పోతున్న బాధ నాకూ ఉంది. టెన్నిస్ అనేది నాకు శిఖరంలాంటిది. అక్కడికి చేరే క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసినా ఒక్కసారిగా పైకి ఎక్కిన తర్వాత వచ్చే ఆనందమే వేరు. ఇక ముందు కూడా జీవితంలో కొత్త లక్ష్యాలు పెట్టుకొని శ్రమిస్తా. మరిన్ని విజయాలు అందుకున్నా. –వీడ్కోలు సందేశంలో షరపోవా మొత్తం గెలిచిన మ్యాచ్‌లు: 645 మొత్తం ఓడిన మ్యాచ్‌లు: 171 కెరీర్లో సాధించిన ప్రైజ్‌మనీ: 3,87,77,962 డాలర్లు (రూ. 277 కోట్ల 76 లక్షలు) షరపోవా సాధించిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్: 5 (2004–వింబుల్డన్; యూఎస్ ఓపెన్–2006; ఆస్ట్రేలియన్ ఓపెన్–2008; ఫ్రెంచ్ ఓపెన్–2012, 2014) కెరీర్లో నెగ్గిన సింగిల్స్ టైటిల్స్ సంఖ్య: 36 అత్యుత్తమ ర్యాంకింగ్ (ఆగస్టు 22, 2005): 1 ప్రొఫెషనల్‌గా మారిన ఏడాది: 2001 ప్రస్తుత ర్యాంక్: 373 కెరీర్లో నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగిన వారాలు: 21 -
టెన్నిస్‌కు గుడ్‌బై: షరపోవా భావోద్వేగం
మాస్కో: రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఆటకు గుడ్‌బై చెప్పారు. క్రీడా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ స్టార్ ప్లేయర్.. బుధవారం రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు... ‘‘28 ఏళ్ల తర్వాత.. ఐదు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన నేను... ప్రస్తుతం మరో శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీపడబోతున్నాను. టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నా’’ అని షరపోవా తన నిర్ణయాన్ని వెల్లడించారు. కాగా గతంలో టెన్నిస్ నెంబర్ 1 ర్యాంకర్‌గా వెలుగొందిన షరపోవా ప్రస్తుతం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నారు. పదహారేళ్ల క్రితం టీనేజర్‌గా కోర్టులో అడుగుపెట్టి వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించి మహిళల టెన్నిస్‌లో మెరుపుతీగలా దూసుకొచ్చిన ఆమె... ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 373వ స్థానంలో ఉన్నారు. ఈ క్రమంలో 32 ఏళ్ల వయస్సులో బుధవారం ఆమె ఆటకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా.. ‘‘టెన్నిస్‌కు నా జీవితాన్ని ధారపోశాను. అదే విధంగా టెన్నిస్ నాకు జీవితాన్నిచ్చింది. ఇక నుంచి ప్రతిరోజూ నేను దానిని మిస్సవుతాను. ట్రెయినింగ్, రోజూ వారీ దినచర్య అంతా మారిపోతుంది. నిద్రలేచిన తర్వాత.. కుడికాలు ముందు.. ఎడమ కాలు పెట్టి షూలేసులు కట్టుకోవడం.. మొదటి బాల్‌ను కొట్టే ముందు కోర్టు గేటును మూసివేయడం... నా టీం అంతటినీ మొత్తం మిస్సవుతాను. నా కోచ్‌లను కూడా. మా నాన్నతో కలిసి కోర్టు బెంచ్ మీద కూర్చునే క్షణాలు అన్నీ మిస్సవుతాను. ఓడినా.. గెలిచినా.. పరిచయం ఉన్నా లేకపోయినా... ఇచ్చిపుచ్చుకునే షేక్హ్యాండ్లు, వెన్నుతట్టి ఆటలో నన్ను ప్రోత్సహించిన వారిని మిస్సవుతాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. టెన్నిస్ ఓ పర్వతంలా కనిపిస్తోంది. నా దారి అంతా లోయలు, మలుపులతో నిండి ఉంది. అయితేనేం.. శిఖరం అంచు నుంచి చూస్తే అపురూపమైన ఘట్టాలు ఎన్నో కనిపిస్తున్నాయి’’అంటూ షరపోవా భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram Tennis showed me the world—and it showed me what I was made of. It’s how I tested myself and how I measured my growth. And so in whatever I might choose for my next chapter, my next mountain, I’ll still be pushing. I’ll still be climbing. I’ll still be growing. Tennis—I’m saying goodbye. A post shared by Maria Sharapova (@mariasharapova) on Feb 26, 2020 at 5:19am PST -
అయ్యో షరపోవా!
పూర్వ వైభవం కోసం తపిస్తున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా కెరీర్ మళ్లీ గాడిన పడే అవకాశం కనిపించడంలేదు. ఆమె ప్రస్తుత ర్యాంక్ ప్రకారమైతే నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం లేకపోయినా... గత రికార్డును పరిగణనలోకి తీసుకొని నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ రూపంలో నేరుగా ఆడే అవకాశం ఇచ్చారు. కానీ ఈ మాజీ చాంపియన్, మాజీ ప్రపంచ నంబర్‌వన్ దీనిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన 32 ఏళ్ల షరపోవా ఆ్రస్టేలియన్ ఓపెన్‌లోనూ మొదటి రౌండ్‌ను దాటలేకపోయింది. ఫలితంగా కెరీర్లో తొలిసారి వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో తొలి రౌండ్లోనే ఓడిపోయి భవిష్యత్‌పై తుది నిర్ణయం తీసుకునే రోజు సమీపంలోనే ఉందని సంకేతాలు పంపించింది. మెల్బోర్న్: పదహారేళ్ల క్రితం టీనేజర్‌గా వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించి మహిళల టెన్నిస్‌లో మెరుపుతీగలా దూసుకొచ్చిన రష్యా స్టార్ మరియా షరపోవా కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది. ‘వైల్డ్ కార్డు’తో ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అడుగుపెట్టిన షరపోవా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 20వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయే షియా)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 145వ ర్యాంకర్ షరపోవా 3–6, 4–6తో ఓడిపోయింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసింది. 2008 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, 2007, 2012, 2015 రన్నరప్ అయిన షరపోవా తన సర్వీస్ ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ ను రెండుసార్లు బ్రేక్ చేసింది. గతేడాది ఈ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన షరపోవా ఈసారి తొలి రౌండ్లోనే వెనుదిరగడంతో ఫిబ్రవరి 3న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె 350వ స్థానానికి పడిపోయే అవకాశముంది. రెండో రౌండ్లో ప్లిస్కోవా... మహిళల సింగిల్స్ ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్), తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్), పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), మాజీ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. 12వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్) మాత్రం తొలి రౌండ్లో ఓడింది. ప్లిస్కోవా 6–1, 7–5తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)పై, హలెప్ 7–6, (7/5), 6–1తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)పై, స్వితోలినా 6–4, 7–5తో కేటీ బుల్టర్ (బ్రిటన్)పై, బెన్సిచ్ 6–3, 7–5తో ష్మెద్లోవా (స్లొవేకియా)పై, కికి బెర్టెన్స్ 6–1, 6–4తో ఇరీనా బేగూ (రొమేనియా)పై, కీస్ 6–3, 6–1తో కసత్కినా (రష్యా)పై, కెర్బర్ 6–2, 6–2తో కొకియారెటో (ఇటలీ)పై గెలిచారు. కొంటా 4–6, 2–6తో ఆన్స్ జెబెయుర్ (ట్యూనిíÙయా) చేతిలో ఓటమి పాలైంది. మెద్వదేవ్, థీమ్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. తొలి రౌండ్లో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–2, 6–3, 6–0తో డెలియన్ (బొలీవియా)పై అలవోకగా నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–3, 4–6, 6–4, 6–2తో టియాఫో (అమెరికా)పై, ఐదో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 6–3, 7–5, 6–2తో మనారినో (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 7–6 (7/4), 6–3తో సెచినాటో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. 15వ సీడ్, 2014 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), పదో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్), 11వ సీడ్ గాఫిన్ (బెల్జియం), 12వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ప్రజ్నేశ్‌కు నిరాశ ‘లక్కీ లూజర్’గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ తొలి రౌండ్లో ఓడిపోయాడు. ప్రపంచ 144వ ర్యాంకర్ తత్సుమ ఇటో (జపాన్)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 122వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 4–6, 2–6, 5–7తో ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 90 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 43 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
షరపోవాకు వైల్డ్ కార్డు
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నేరుగా ఆడేందుకు ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఈ టోర్నీ మాజీ విజేత మరియా షరపోవాకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. గాయం కారణంగా గతేడాది ఈ రష్యా స్టార్ ఎక్కువ కాలం ఆటకు దూరమైంది. దాంతో ఆమె ర్యాంక్ 147కు పడిపోయింది. ఫలితంగా ర్యాంక్ ప్రకారం ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో 32 ఏళ్ల షరపోవాకు మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కలేదు. అయితే ఈ టోరీ్నలో ఆమె గత రికార్డును పరిగణనలోకి తీసుకొని నిర్వాహకులు వైల్డ్ కార్డు ద్వారా నేరుగా మెయిన్ ‘డ్రా’లో స్థానం కలి్పంచారు. 2003లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడిన షరపోవా 2008లో చాంపియన్‌గా నిలిచింది. 2007, 2012, 2015లలో ఫైనల్లో ఓడి రన్నరప్ ట్రోఫీ అందుకుంది. ‘ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనుండటం ఎంతో ప్రత్యేకం. ఈ టోరీ్నలో నాకెన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయి. ఒకసారి విజేతగా నిలిచాను. మూడుసార్లు ఫైనల్లో ఓడాను. మరోసారి ఇక్కడ ఆడే అవకాశం ఇచి్చనందుకు సంతోషంగా ఉంది’ అని షరపోవా వ్యాఖ్యానించింది. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు షరపోవా దూరం
పారిస్: త్వరలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి మాజీ చాంపియన్, రష్యన్ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా వైదొలిగారు. కొన్ని వారాల క్రితం భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షరపోవా ఇంకా పూర్తిగా కోలుకోపోవడంతో టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు షరపోవా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నేను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభతరం కాదు’ అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఓవరాల్‌గా ఐదు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన షరపోవా.. రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. 2012,14 సంవత్పరాల్లో షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఏ టోర్నీలోనూ షరపోవా పాల్గొనలేదు. ఫిబ్రవరి నెలలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆమె తిరిగి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్నారు షరపోవా. మే 26వ తేదీ నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. -
షరపోవాను ఓడించిన క్రికెటర్!
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ మారియా షరపోవా (రష్యా) కథ ముగిసింది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో క్రికెటర్ కమ్ టెన్నిస్ స్టార్ ఆష్‌బార్టీ (ఆస్ట్రేలియా)ఈ రష్యాస్టార్ను మట్టికరిపించింది. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో ఆష్‌బార్టీ విజయం సాధించింది. ఈ విజయంతో 22 ఏళ్ల ఆష్‌బార్టీ తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 2014లో టెన్నిస్‌కు విరామం ఇచ్చి అనూహ్యంగా క్రికెట్ ఆడిన ఆష్‌బార్టీ.. మహిళల బిగ్‌బాష్‌లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిథ్యం ఇచ్చింది. టెన్నిస్ రాకెట్ వదిలి బ్యాట్ పట్టుకున్నఈ యంగ్ లేడీ క్రికెట్లోనూ అదరగొట్టింది. లీగ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే 29 బంతుల్లో 37 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టుకున్న ఆష్‌బార్టీ గతేడాదే కెరీర్ బెస్ట్ 15వ ర్యాంకును సొంత చేసుకుంది. ఇక తాజాగా ఐదు గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన టెన్నిస్ దిగ్గజం షరపోవాను మట్టికరిపించి ఔరా అనిపించింది. కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్ చేరింది. The most famous victory of her young career. Congratulations, @ashbar96 👏👏👏#AusOpen pic.twitter.com/MEvPFeKZc7 — #AusOpen (@AustralianOpen) January 20, 2019 -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం..!
కాన్బెర్రా: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలన జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రీక్వార్టర్స్‌లో దిగ్గజ క్రీడాకారిణి మరియా షరపోవా అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో నయాసంచలనం ఆష్‌బార్టీ సంచలన విజయం నమోదు చేశారు. ఆదివారం ఇక్కడి మెల్బోర్న్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆష్‌బార్టీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి ఆష్‌బార్టీ క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. ఈ దశాబ్దాంలో తొలిసారి అస్ట్రేలియన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. 22 ఏళ్ల ఆష్‌బార్టీ 5సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన షరపోవాను ఓడించడం విశేషం. -
వొజ్నియాకి ఔట్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కరోలైన్ వొజ్నియాకి కథ ముగిసింది. మాజీ విజేత షరపోవా (రష్యా) కీలకదశలో పైచేయి సాధించి వొజ్నియాకిని బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మాజీ నంబర్‌వన్, 30వ సీడ్ షరపోవా 6–4, 4–6, 6–3తో మూడో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్)పై గెలిచింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 2008 చాంపియన్ షరపోవా ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ రష్యా స్టార్ వొజ్నియాకి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి ఫలితాన్ని శాసించింది. రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కెర్బర్ 6–1, 6–0తో కింబర్లీ బిరెల్ (ఆ స్ట్రేలియా)పై, స్లోన్ స్టీఫెన్స్ 7–6 (8/6), 7–6 (7/5)తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై, క్విటోవా 6–1, 6–4తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై నెగ్గారు. 11వ సీడ్ సబలెంకా (బెలారస్) 3–6, 2–6తో అనిస్మోవా (అమెరికా) చేతిలో... 19వ సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 2–6తో డానియెలా (అమెరికా) చేతిలో ఓడిపోయారు. ఫెడరర్, నాదల్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మూడో రౌండ్లో ఫెడరర్ 6–2, 7–5, 6–2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, నాదల్ 6–1, 6–2, 6–4తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 4–6, 3–6, 6–1, 7–6 (10/8), 6–3తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై శ్రమించి నెగ్గగా... పదో సీడ్ కరెన్ ఖచనోవ్ (రష్యా) 4–6, 5–7, 4–6తో బటిస్టా అగుట్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. -
ఫ్రెంచ్ ఓపెన్: షరపోవా ‘ఖేల్’ ఖతం
పారిస్ : ఎన్నో ఆశలతో ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్, మాజీ చాంపియన్ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. మూడో సీడ్, స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజాతో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6-2,6-1 తేడాతో పరాజయం పాలైంది. వరుస సెట్లలో షరపోవాపై ముగురుజా సునాయస విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ భుజం కండరాలు పట్టేయడంతో షరపోవాకు వాకోవర్ ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్ ఆడకుండానే షరపోవా క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన విషయం తెలిసింది. హలెప్ హవా.. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... ఎంతోకాలంగా ఊరిస్తోన్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న సిమోనా హలెప్ తన హవా కొనసాగిస్తోంది. జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్తో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో హలెప్ 6-2(2/7), 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ఇక హలెప్ సెమీ ఫైనల్లో స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజాతో తలపడనుంది. -
ఫ్రెంచ్ ఓపెన్ : ఆడకుండానే వైదొలిగిన పులి
పారిస్/రొనాల్డ్ గారోస్ : బిడ్డకు పాలిచ్చి వచ్చిన పులి సెరెనా. బోనులోంచి బయటికి వచ్చిన చిరుత షరపోవా. ఇద్దరిలో ఆకలి ఉంది. బరిలో ఆహారం ఉంది. ఇదొక యుగాంతపు ఆట అని, ఉమెన్స్ టెన్నిస్‌లో ఈరోజు ధూమ్స్ డే అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం నాలుగో రౌండ్లో భాగంగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, రష్యా స్టార్ మారియా షరపోవాల మధ్య ఉత్కంఠగా సాగుతుందనుకున్న మ్యాచ్ జరగనేలేదు. సెరెనా భుజ కండరాల గాయంతో మ్యాచ్‌కు ముందే తప్పుకోవడంతో షరపోవా ఆడకుండానే గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో రష్యా స్టార్ ముగురుజ(స్పెయిన్), లెసియా సురెంకో (ఉక్రెయిన్)ల్లో ఒకరితో తలపడనుంది. సెరెనా ఆవేదన.. ‘దురదృష్టవశాత్తు భుజ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఆడలేను. ఇది చాలా కష్టంగా ఉంది. మారియాతో పోటీని ఎప్పుడు ఇష్టపడుతాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధేస్తుంది. నా కూతురు, కుటుంబానికి దూరంగా ఉంటూ సాధన చేశాను. ఈ పరిస్థితి చాలా కఠినంగా ఉంది.’అని సెరెనా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆదివారం జరిగిన ఉమెన్ డబుల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్ అండ్రెజా క్లెపాక్(స్లోవేనియా)-మరియా జోస్ మార్టినెజ్(ఇటలీ) చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చదవండి: పులి.. చిరుత -
నాదల్ దూకుడు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన మారియా షరపోవా మరో టైటిల్ వేటలో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఆమె మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 7–5, 6–4 స్కోరుతో డోనా వెకిక్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో షరపోవా, చెక్ రిపబ్లిక్కు చెందిన ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవాతో తలపడుతుంది. 2016 చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) కూడా అలవోకగా గెలిచింది. రెండో రౌండ్లో ఆమె 6–4, 6–4తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)ను ఓడించింది. గతంలో రెండు సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన సిమోనా హలెప్ (రొమేనియా) 6–3, 6–1తో టేలర్ టౌన్సెండ్ (యూఎస్ఏ)ను ఓడించి ముందుకు దూసుకెళ్లింది. మూడోరౌండ్లో సెరెనా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీ బర్తితో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో 36 ఏళ్ల సెరెనా 3–6, 6–3, 6–4తో విజయం సాధించింది. సిలిచ్, థీమ్ శ్రమించి...: పురుషుల వరల్డ్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా తనదైన శైలిలో చెలరేగి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో నాదల్ 6–2, 6–1, 6–1తో అర్జెంటీనా కుర్రాడు గిడో పెలాను చిత్తుగా ఓడించాడు. మూడో సీడ్ సిలిచ్ మాత్రం తీవ్రంగా శ్రమించాడు. రెండో రౌండ్లో అతను 6–2, 6–2, 6–7 (3/7), 7–5తో క్వాలిఫయర్ ఆటగాడు హ్యూబర్ట్ హర్కజ్ (పోలండ్)పై విజయం సాధించాడు. ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 6–3, 6–2తో జూలియన్ బెన్నెట్ (ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా) 6–2, 2–6, 6–4, 6–4తో స్టెఫెనోస్ స్టిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. రెండో రౌండ్లో యూకీ–శరణ్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ జోడి 6–3, 7–5, 6–4 స్కోరుతో ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–çపురవ్ రాజా (భారత్) జంటను ఓడించింది. రెండో రౌండ్లో బాంబ్రీ–శరణ్ ద్వయం ఒలివర్ మరాక్–మేట్ పావిక్‌తో తలపడతారు. -
రాఫెల్ నాదలే మహా గొప్ప...
రోమ్: టెన్నిస్ ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేట్ ఎవరంటే ప్రస్తుతానికి అందరూ ఠక్కున చెప్పే పేరు రోజర్ ఫెడరర్. కానీ... మహిళల మాజీ నం.1 మరియా షరపోవా మాత్రం రాఫెల్ నాదల్ అంటోంది. ఈ మేరకు ఆమె సోమవారం ట్విట్టర్లో పెట్టిన వీడియో వివాదాస్పదమైంది. ఇటాలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా నాదల్‌తో కలిసి ఇక్కడ సాధనలో పాల్గొంటున్న షరపోవా... ‘కోర్టులో రెండు నిమిషాల సాధనలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (జీవోఏటీ) ఆటగాడి ముందు తేలిపోయాను’ అంటూ పోస్ట్ చేసింది. ఇందులో ‘మట్టి కోర్టులపై గ్రేటెస్ట్ ఆటగాడు’ అని నొక్కి చెప్పకపోవడంతో... ఫెడరర్ అభిమానులకు మరోలా అనిపించింది. గెలిచిన 16 గ్రాండ్‌స్లామ్స్‌లో పది మట్టి కోర్టులపై ఆడే ఫ్రెంచ్ ఓపెనే కాగా... నాదల్ గ్రేటెస్ట్ ఎలా అవుతాడంటూ వారు మండిపడ్డారు. ఇది ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చకు దారి తీసింది. మరోవైపు కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఫెడరర్ ఖాతాలో ఒక ఫ్రెంచ్ ఓపెన్ కూడా ఉంది. ముఖాముఖిలో మాత్రం ఫెడరర్‌పై నాదల్ (23–15)దే పైచేయి కావడం విశేషం. -
షరపోవా అవుట్
మెల్బోర్న్: సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నో ఆశలతో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో అడుగుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవాకు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మూడో రౌండ్ పోరులో షరపోవా 1-6, 3-6 తేడాతో జర్మనీ స్టార్ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ చేతిలో పరాజయం పాలైంది. ఏకపక్షంగా సాగిన పోరులో షరపోవా అంచనాలను అందుకోలేక ఓటమి పాలైంది. తొలి సెట్‌ను సునాయాసంగా కోల్పోయిన షరపోవా.. రెండో సెట్లో కాస్త పోరాడింది. కాగా, కెర్బర్ ధాటికి తలవంచిన షరపోవా టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. తొలి రెండు రౌండ్లలో ఆకట్టుకున్న షరపోవా.. మూడో రౌండ్ అడ్డంకిని మాత్రం అధిగమించలేకపోయింది. కెర్బర్ రూపంలో బలమైన ప్రత్యర్థి ముందు షరపోవా అనుభవం సరిపోలేదు. దాంతో వరుస సెట్లను కోల్పోయిన షరపోవా టోర్నీ నుంచి వైదొలిగింది. 2016లో నిషేధిత ఉత్ర్పేరకాలు వాడిన కారణంగా షరపోవాపై 15 నెలల నిషేధం పడిన సంగతి తెలిసిందే. -
నన్నుపెళ్లి చేసుకుంటావా.?
ఇస్తాంబుల్: రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవాకు వింత అనుభవం ఎదురైంది. ఈ మాజీ నెం1 ర్యాంకర్ మ్యాచ్ ఆడుతుండగా ఓ అభిమాని పెళ్లి ప్రపోజల్ చేశాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం స్టేడియంలో ఉన్న వారందరికీ నవ్వులు పూయించింది. ఐదు గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న షరపోవా.. వచ్చే గ్రాండ్‌స్లామ్ సీజన్ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇస్తాంబుల్‌లోని సినాన్ ఎర్దేం హాల్లో స్థానిక ప్లేయర్ కాగ్ల బైకుకాకేతో మ్యాచ్ ఆడుతుండగా ఈ సంఘటన జరిగింది. అప్పుడే బాల్ సర్వ్ చేయడానికి సిద్ధమవుతున్న షరపోవాను 'మరియా... నన్ను పెళ్లి చేసుకుంటావా' అని ఓ అభిమాని రష్యన్ భాషలో గట్టిగా అరిచాడు. దీనికి ఏమాత్రం విసుగు చెందని షరపోవా ఓ రెండు క్షణాలు ఆలోచించి...'ఏమో!' అని సమాధానమిచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
షరపోవాకు అభిమాని పెళ్లి ప్రపోజల్
-
షరపోవాపై భారత్‌లో కేసు నమెదు.
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాపై మోసం, నేరపూరిత కుట్ర అభియోగాల కింద గూర్గావ్లో కేసు నమోదైంది. హోంస్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ 2012లో బాలెట్ బై షరపోవా పేరుతో విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించేందుకు భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించింది. ఈ కంపెనీకి షరపోవా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. ఈ అపార్ట్మెంట్లో టెన్నిస్ అకాడమీ, క్లబ్ హౌస్, హెలీప్యాడ్ కూడా ఉంటుందని అప్పట్లో నిర్వాహకులు ప్రకటించడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. 2013లో ఒప్పందాలు కుదుర్చుకున్నా.. 2016లోపు నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటివరకు కనీసం నిర్మాణాలు కూడా మొదలుకాకపోవడంతో కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి యజమానులకు అనుగుణంగా ప్రత్యేకమైన, భిన్నమైన ఇండ్లను అందించడమే తమ లక్ష్యమని షరపోవా చెబుతున్నట్లు కంపెనీ వెబ్సైట్లో రాశారని, ,అందుకే ఈ కేసులో ఆమె హస్తం కూడా ఉందని న్యాయవాది పీయూష్ సింగ్ ఆరోపించారు. ఇక మాజీ వరల్డ్ నెం1 టెన్నిస్ ర్యాంకరైన షరపోవా 2015లో ఫోర్బ్స్ కథనం మేరకు 23 మిలియన్ల డాలర్లను ప్రచారకర్తగా ఆర్జించింది.