పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన మారియా షరపోవా మరో టైటిల్ వేటలో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఆమె మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 7–5, 6–4 స్కోరుతో డోనా వెకిక్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో షరపోవా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవాతో తలపడుతుంది. 2016 చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) కూడా అలవోకగా గెలిచింది. రెండో రౌండ్‌లో ఆమె 6–4, 6–4తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)ను ఓడించింది. గతంలో రెండు సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన సిమోనా హలెప్ (రొమేనియా) 6–3, 6–1తో టేలర్ టౌన్‌సెండ్ (యూఎస్‌ఏ)ను ఓడించి ముందుకు దూసుకెళ్లింది.
మూడోరౌండ్‌లో సెరెనా
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీ బర్తితో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్‌లో 36 ఏళ్ల సెరెనా 3–6, 6–3, 6–4తో విజయం సాధించింది.
సిలిచ్, థీమ్ శ్రమించి...: పురుషుల వరల్డ్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా తనదైన శైలిలో చెలరేగి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్‌లో నాదల్ 6–2, 6–1, 6–1తో అర్జెంటీనా కుర్రాడు గిడో పెలాను చిత్తుగా ఓడించాడు. మూడో సీడ్ సిలిచ్ మాత్రం తీవ్రంగా శ్రమించాడు. రెండో రౌండ్‌లో అతను 6–2, 6–2, 6–7 (3/7), 7–5తో క్వాలిఫయర్ ఆటగాడు హ్యూబర్ట్ హర్కజ్ (పోలండ్)పై విజయం సాధించాడు. ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 6–3, 6–2తో జూలియన్ బెన్నెట్ (ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా) 6–2, 2–6, 6–4, 6–4తో స్టెఫెనోస్ స్టిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు.
రెండో రౌండ్‌లో యూకీ–శరణ్
పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జంట రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ జోడి 6–3, 7–5, 6–4 స్కోరుతో ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–çపురవ్ రాజా (భారత్) జంటను ఓడించింది. రెండో రౌండ్‌లో బాంబ్రీ–శరణ్ ద్వయం ఒలివర్ మరాక్–మేట్ పావిక్‌తో తలపడతారు.
నాదల్ దూకుడు
Published Fri, Jun 1 2018 1:45 AM | Last Updated on Fri, Jun 1 2018 1:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment