ఆండ్రీ ఆగస్సీ, మరియా షరపోవా లాంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన దిగ్గజ టెన్నిస్ కోచ్ నిక్ బొల్లెట్టిరి(91) కన్నుమూశాడు. ఈ విషయాన్ని ఆయన స్థాపించిన ఐఎంజీ అకాడమీ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. వయో బారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిక్ బొల్లెట్టిరి తుది శ్వాస విడిచినట్లు ఐఎంజీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న టెన్నిస్ మాజీ క్రీడాకారులు ఆయనకు సంతాపం తెలిపారు.
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఐటీఎఫ్) నిక్ బొల్లెట్టిరికి నివాళి అర్పించింది. ఇక టెన్నిస్ ఆటగాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా నిక్ బొల్లెట్టిరి 1978లో ఫ్లోరిడా వేదికగా ఐఎంజీ అకాడమీ(IMG Academy) స్థాపించాడు. ఈ అకాడమీలో ఆండ్రీ అగస్సీ, మరియా షరపోవాల, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, బొరిస్ బెకర్ లాంటి దిగ్గజాలు శిక్షణ తీసుకున్నారు. టాప్-10లో కొనసాగిన ఆటగాళ్లంతా ఏదో ఒక సమయలో బొల్లెట్టిరి దగ్గర శిక్షణ తీసుకున్నవారే కావడం విశేషం.
Nick Bollettieri, the legendary tennis coach and founder of Nick Bollettieri Tennis Academy, which served as the foundation for today’s IMG Academy, has passed away.
— IMG Academy (@IMGAcademy) December 5, 2022
He was 91 years old. 💙🤍
🔗: https://t.co/vvFnYHowKc pic.twitter.com/zJYem2SvF6
Comments
Please login to add a commentAdd a comment