International Tennis Federation
-
మెయిన్ ‘డ్రా’కు సహజ అర్హత
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ100 బోనితా స్ప్రింగ్స్ ఓపెన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి సహజ యామలపల్లి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ప్రపంచ 309వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో క్రిస్టినా రోస్కా (అమెరికా)పై గెలిచింది. హైదరాబాద్‌కే చెందిన శ్రీవల్లి రషి్మక మెయిన్ ‘డ్రా’కు చేరుకోలేకపోయింది. చివరి రౌండ్లో రషి్మక 4–6, 4–6తో విక్టోరియా (అమెరికా) చేతిలో ఓడిపోయింది. -
సింగిల్స్ క్వార్టర్స్‌లో రష్మిక... డబుల్స్ సెమీస్‌లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి, డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... సహజ యామలపల్లి సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి, డబుల్స్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రష్మిక 6–1, 2–6, 6–1తో మర్వాయోవా (స్లొవేకియా)పై గెలిచింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–3, 6–4తో అకీకో ఒమాయి–మె యామగుచి (జపాన్) జోడీపై నెగ్గింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సహజ 1–6, 4–6తో మనన్‌చాయ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ–జీల్ దేశాయ్ (భారత్) జోడీ 6–1, 6–2తో సౌమ్య (భారత్)–మె హసెగావ (జపాన్) జంటపై గెలిచింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక , సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్ లో రష్మిక 6–3, 1–0తో టాప్ సీడ్ ఇరీనా మరియా (రొమేనియా)పై ... సహజ 6–3, 6–1తో జీల్ దేశాయ్‌పై గెలిచారు. రష్మికతో మ్యాచ్‌లో రెండో సెట్ మధ్యలో గాయంతో ఇరీనా వైదొలిగింది. -
సెమీస్‌లో వైదేహి–రష్మిక జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండోర్‌లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 6–2, 6–1తో మూడో సీడ్ కరోల్ మొనెట్ (ఫ్రాన్స్) –యషీనా (రష్యా) జంటపై నెగ్గింది. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక ద్వయం ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. -
రష్మిక అలవోక విజయం
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోరీ ్న లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–1, 6–3తో నాలుగో సీడ్ హిరోకో కవాటా (జపాన్)పై గెలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఎనిమిది ఏస్‌లు సంధించడం విశేషం. -
దిగ్గజ టెన్నిస్ కోచ్ అస్తమయం
ఆండ్రీ ఆగస్సీ, మరియా షరపోవా లాంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన దిగ్గజ టెన్నిస్ కోచ్ నిక్ బొల్లెట్టిరి(91) కన్నుమూశాడు. ఈ విషయాన్ని ఆయన స్థాపించిన ఐఎంజీ అకాడమీ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. వయో బారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిక్ బొల్లెట్టిరి తుది శ్వాస విడిచినట్లు ఐఎంజీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న టెన్నిస్ మాజీ క్రీడాకారులు ఆయనకు సంతాపం తెలిపారు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య(ఐటీఎఫ్) నిక్ బొల్లెట్టిరికి నివాళి అర్పించింది. ఇక టెన్నిస్ ఆటగాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా నిక్ బొల్లెట్టిరి 1978లో ఫ్లోరిడా వేదికగా ఐఎంజీ అకాడమీ(IMG Academy) స్థాపించాడు. ఈ అకాడమీలో ఆండ్రీ అగస్సీ, మరియా షరపోవాల, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్, బొరిస్ బెకర్ లాంటి దిగ్గజాలు శిక్షణ తీసుకున్నారు. టాప్-10లో కొనసాగిన ఆటగాళ్లంతా ఏదో ఒక సమయలో బొల్లెట్టిరి దగ్గర శిక్షణ తీసుకున్నవారే కావడం విశేషం. Nick Bollettieri, the legendary tennis coach and founder of Nick Bollettieri Tennis Academy, which served as the foundation for today’s IMG Academy, has passed away. He was 91 years old. 💙🤍 🔗: https://t.co/vvFnYHowKc pic.twitter.com/zJYem2SvF6 — IMG Academy (@IMGAcademy) December 5, 2022 -
ఐటీఎఫ్ టోర్నీ సింగిల్స్ చాంపియన్ సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి విజేతగా అవతరించింది. నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి, మూడో సీడ్ ఎమిలీ సీబోల్డ్ (జర్మనీ) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సహజను విజేతగా ప్రకటించారు. సహజ కెరీర్లో ఇదే తొలి ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. -
నాలుగు రోజుల పాటు సోషల్ మీడియాను బహిష్కరించిన ‘ఫిఫా’
లండన్: తమ ఆటగాళ్లపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ద్వేషపూరిత కామెంట్లపై ఆగ్రహించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా), యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్), అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్)లు నాలుగు రోజుల పాటు తమ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం అర్ధరాత్రి 11.59 నిమిషాల వరకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది. ఈ విధంగానైనా ఆటగాళ్లపై ఆకతాయిలు చేసే అసభ్యకర కామెంట్లు ఆగుతాయని యూఈఎఫ్ఏ అధ్యక్షుడు అలెగ్జాండర్ ఎఫెరిన్ ఆకాంక్షించాడు. ఇకపై ఆటగాళ్లపై చేసే ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఉపేక్షించేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు, ప్రీమియర్‌షిప్ రగ్బీ, లాన్ టెన్నిస్ సంఘం నాలుగు రోజుల బహిష్కరణకు మద్దతు తెలిపాయి. -
ఫైనల్లో సౌజన్య జంట
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య బవిశెట్టి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సౌజన్య–ప్రార్థన తొంబారే (భారత్) జోడీ 7–6 (9/7), 3–6, 10–8తో యువరాణి బెనర్జీ–వైదేహి చౌదరీ (భారత్) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో పియా లవ్రిచ్ (స్లొవేనియా)–అడ్రియెన్ నాగీ (హంగేరి)లతో సౌజన్య–ప్రార్థన తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. హుమేరా 4–6, 6–4, 3–6తో జీల్ దేశాయ్ (భారత్) చేతిలో ఓడిపోయింది. -
‘చాంపియన్’ రాకెట్
ఏడాది క్రితం ఆ అమ్మాయి ఆటను వదిలేయడానికి సిద్ధమైంది! దేశంలోని ఎంతో మంది టెన్నిస్ క్రీడాకారుల్లాగే ఆర్థిక పరమైన సమస్యలు కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాలనే ఆలోచనకు కారణంగా నిలిచాయి. అయితే మరొక్క ప్రయత్నం అంటూ మైదానంలో నిలబడిన ఆమెకు ‘డబుల్’ జాతీయ చాంపియన్ రూపంలో ప్రతిఫలం దక్కింది. దానికి కొనసాగింపుగా భారత సీనియర్ జట్టులో చోటు లభించడం కూడా ఆమె శ్రమకు దక్కిన గుర్తింపు. రాకెట్ పడేయాలన్న ఆలోచనను పక్కన పెట్టి మరింత గొప్ప ప్రదర్శన ఇచ్చేందుకు ఇవి ఆమెకు స్ఫూర్తినిచ్చాయి. ఇకపై మరిన్ని విజయాలు సాధిస్తానంటున్న ఆ టెన్నిస్ క్రీడాకారిణి సౌజన్య బవిశెట్టి. భారత ఫెడ్ కప్ జట్టులో రిజర్వ్ క్రీడాకారిణిగా ఆమె ఎంపికైంది. సాక్షి, హైదరాబాద్ భారత్ తరఫున అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో అనేక మంది అమ్మాయిలు నిలకడగా రాణిస్తూ విజయాలు సాధిస్తున్నారు. వారిలో సౌజన్య బవిశెట్టి కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత అక్టోబరులో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇదే టోర్నీలో డబుల్స్ విభాగంలో కూడా టైటిల్ సాధించడం విశేషం. నాలుగుసార్లు జాతీయ చాంపియన్ అయిన ప్రేరణా బాంబ్రీని సౌజన్య ఫైనల్లో ఓడించడం విశేషం. అదే ఆమెకు భారత ఫెడ్ కప్ జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా కూడా చోటు కల్పించింది. ఆసియా–ఓసియానియా గ్రూప్‌లో భాగంగా దుబాయ్ లో మార్చి 3 నుంచి జరిగే పోరులో భారత జట్టు తలపడుతుంది. దీని కోసం సౌజన్య ప్రస్తుతం సన్నద్ధమవుతోంది. ఐటీఎఫ్‌లో విజయాలు... సౌజన్య స్వస్థలం కర్నూలు. ఆమె సోదరి అంజలి టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె స్ఫూర్తితో రాకెట్ పట్టిన సౌజన్య ప్రతిభను చూసి కోచ్‌లు ప్రోత్సహించారు. దాంతో హైదరాబాద్‌లో శిక్షణ కొనసాగించిన సౌజన్య వేగంగా దూసుకుపోయింది. ఇంటర్ యూనివర్సిటీ పోటీల నుంచి జాతీయ క్రీడల వరకు పలు పతకాలు సొంతం చేసుకుంది. ముందుగా ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్ విజయాలతో మొదలు పెట్టి సీనియర్ విభాగంలో మంచి విజయాలు సాధించింది. ఐటీఎఫ్ కెరీర్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో కలిపి 26 ఏళ్ల సౌజన్య ఇప్పటి వరకు 11 టైటిల్స్ సాధించింది. మరో 5 టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో రెండు టైటిల్స్ గెలుచుకోవడంతో పాటు ఇటీవల జరిగిన దక్షిణాసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. గ్రాండ్‌స్లామ్‌లో పాల్గొనే లక్ష్యంతో... ఎడంచేతి వాటం ప్లేయర్ అయిన సౌజన్య బలం ఫోర్ హ్యాండ్. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తర్వాత సౌజన్య ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఇటీవల జరిగిన రెండు ఐటీఎఫ్ టోర్నీలలో తనకంటే ఎంతో మెరుగైన ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్లను ఆమె ఓడించగలిగింది. కెరీర్లో ఎదిగే క్రమంలో స్పెయిన్‌లో సాంచెజ్ అకాడమీలో కూడా సౌజన్య శిక్షణ పొందింది. జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గౌరవ్ ఉప్పల్ ప్రణాళిక ప్రకారం ఫెడ్ కప్ టోర్నీలో అదృష్టం కలిసొస్తే ఆమె మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఉంది. నగరంలోని ఎస్కే టెన్నిస్ అకాడమీలో ఆమె ఫెడ్ కప్ కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. కోచ్, తన భర్త సురేశ్ కృష్ణతో పాటు ఫిట్నెస్ ట్రెయినర్ హర్ష మార్గనిర్దేశనంలో ఆమె మరింత ఫిట్‌గా మారింది. ర్యాంక్‌ను మరింత మెరుగుపర్చుకొని గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పాల్గొనే లక్ష్యంతో సౌజన్య శ్రమిస్తోంది. స్పాన్సర్షిప్ లేకపోయినా... చాలా మంది టెన్నిస్ క్రీడాకారిణులు ఎదుర్కొనే సమస్య సౌజన్యకు కూడా ఎదురైంది. టెన్నిస్ సర్క్యూట్లో శిక్షణ మొదలు టోర్నీల్లో పాల్గొనడం భారీ ఖర్చుతో కూడుకున్నది కావడం, ఆర్థికపరమైన అండదండలు లేనిదే సొంత డబ్బులతో ఆటను కొనసాగించడం అంత సులువు కాదు. ఇదే కారణంగా ఆమె తప్పుకునేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పటి వరకు సౌజన్యకు ఏ రకమైన ప్రైవేట్ స్పాన్సర్షిప్ లభించలేదు. ఇది ఆమె భవిష్యత్ అవకాశాలను దెబ్బ తీస్తోంది. కెరీర్ బాగా సాగుతున్న ఈ దశలో యూరోప్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని కూడా ఆమె భావిస్తోంది. గతంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే టెన్నిస్‌లో మరిన్ని విజయాలు సాధించాలనే సౌజన్య పట్టుదల ముందు ఇవన్నీ పెద్ద అవరోధాలు కాకపోవచ్చు. సీనియర్ స్థాయిలో విజేతగా నిలవడం నా ఆత్మవిశ్వాసాన్ని ఎన్నో రెట్లు పెంచింది. తర్వాతి ఐటీఎఫ్ టోర్నీలలో దాని ఫలితం కూడా కనిపించింది. ఫెడ్ కప్‌లో చోటు దక్కడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎన్ని ఐటీఎఫ్ టోర్నీలు ఆడినా భారత్ తరఫున ఒక టీమ్ ఈవెంట్లో ఆడే అవకాశం రావడం గొప్ప విషయం. ప్రస్తుతం నా కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాను. ఇదే జోరు కొనసాగించి ర్యాంక్‌ను మెరుగుపర్చుకునేందుకు బరిలోకి దిగుతున్నా. గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో బరిలోకి దిగాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను. –సౌజన్య కార్పొరేట్ కంపెనీల స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఫలితం రాలేదు. ఆర్థికపరమైన అంశాల ఒత్తిడి లేకపోతే ప్లేయర్ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. విదేశీ టోర్నీల్లో ఆడటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా, ఆసియా లోపలే టోర్నీలను ఎంచుకోవాల్సి వస్తోంది. యూరోపియన్ సర్క్యూట్లో ఆడగలిగితే సౌజన్య ఆట మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు ఆమె ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. చిన్న చిన్న లోపాలు సరిదిద్ది మరింతగా రాటుదేల్చే ప్రయత్నంలో ఉన్నాం. –సురేశ్ కృష్ణ (సౌజన్య కోచ్, భర్త) -
శభాష్ మానస్
ఫ్లోరిడా (అమెరికా): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో జూనియర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీగా పరిగణించే ఎడ్డీ హెర్ జూనియర్ చాంపియన్‌షిప్ లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా మానస్ ధామ్నె చరిత్ర సృష్టించాడు. ఫ్లోరిడాలో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన అండర్–12 బాలుర సింగిల్స్ ఫైనల్లో పుణేకి చెందిన 11 ఏళ్ల మానస్ 3–6, 6–0, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మాక్స్వెల్ ఎక్స్టెడ్ (అమెరికా)పై విజయం సాధించాడు. డబుల్స్ విభాగంలో మానస్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో మానస్ (భారత్)–ఆరవ్ హడా (నేపాల్) జంట 6–7 (5/7), 2–6తో సె హ్యుక్ చో–మిన్సెక్ మాయెంగ్ (కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. జూనియర్స్ విభాగంలో ఎడ్డీ హెర్ ఓపెన్, ఆరెంజ్ బౌల్ ఓపెన్ టోర్నీలను గ్రాండ్‌స్లామ్ టోరీ్నలుగా భావిస్తారు. 2008లో యూకీ బాంబ్రీ ఆరెంజ్ బౌల్ ఓపెన్ విజేతగా నిలిచాడు. అదే ఏడాది ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఎడ్డీ హెర్ టోర్నీలో 90 దేశాల నుంచి 2 వేల మంది జూనియర్ ఆటగాళ్లు అండర్–12, అండర్–14, అండర్–16 బాలబాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీపడ్డారు. గతంలో షరపోవా (రష్యా), ఆండీ రాడిక్ (అమెరికా) తదితరులు ఈ టోర్నీలో విజేతలుగా నిలిచి ఆ తర్వాత సీనియర్స్ విభాగంలోనూ మెరిపించారు. -
విజేత శివాని
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–4 జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని చాంపియన్‌గా నిలిచింది. న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా టెన్నిస్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ శివాని 6–1, 6–3తో రెండో సీడ్ ఎరిన్ రిచర్డ్సన్ (ఇంగ్లండ్)పై విజయం సాధించింది. శివాని కెరీర్లో ఇది రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. 17 ఏళ్ల శివాని ఇప్పటి వరకు ఏడు ఐటీఎఫ్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరుకోగా ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచి, రెండుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
విజేత ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల సర్క్యూట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల వరుసగా రెండో టైటిల్ సాధించింది. నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్‌లో ప్రాంజల విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ప్రాంజల 6–1, 7–6 (7/2)తో టాప్ సీడ్, ప్రపంచ 142వ ర్యాంకర్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది. గంటా 35 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రెండో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నాలుగుసార్లు చొప్పున చేజార్చుకున్నారు. అయితే టైబ్రేక్‌లో ప్రాంజల పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గతవారం కూడా ఇదే వేదికపై జరిగిన టోర్నీలో క్యానీ పెరిన్నే ఓడించి ప్రాంజల తొలి టైటిల్ దక్కించుకుంది. -
ప్రాంజల సంచలనం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రొ సర్క్యూట్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నైజీరియాలో జరిగిన లాగోస్ ఓపెన్‌లో 19 ఏళ్ల ప్రాంజల విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 396వ ర్యాంకర్ ప్రాంజల 2–6, 7–5, 6–0తో ప్రపంచ 144వ ర్యాంకర్, టాప్ సీడ్ క్యానీ పెరిన్ (స్విట్జర్లాండ్)ను బోల్తా కొట్టించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2 గంటల 15 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల రెండు ఏస్‌లు సంధించడం తోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. గతేడాది ఈజిప్ట్‌లో జరిగిన షర్మ్ ఎల్ షేక్ ఓపెన్‌లో టైటిల్ గెలిచిన తర్వాత ప్రాంజల ఖాతాలో చేరిన మరో టైటిల్ ఇదే. -
ఫైనల్లో ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో ప్రాంజల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరింది. స్పెయిన్‌లో గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల (భారత్)–రలుకా సెర్బన్ (రొమేనియా) ద్వయం 6–0, 6–4తో నాలుగోసీడ్ పొలీనా లేకినా (రష్యా)– ఇసాబెల్లా షినికోవా (బల్గేరియా) జంటపై గెలుపొందింది. -
ఉజ్బెకిస్తాన్ ఐటీఎఫ్ టోర్నీ విజేత సాకేత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్–2 టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని విజేతగా నిలిచాడు. ఉజ్బెకిస్తాన్‌లోని కర్షీ నగరంలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సాకేత్ 4–6, 6–3, 7–6 (7/4)తో షైలా యారాస్లావ్ (బెలారస్)పై నెగ్గాడు. సాకేత్ కెరీర్లో ఇది 12వ అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్. -
ప్రాంజల జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. షోలాపూర్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల (భారత్)–చింగ్ వెన్ సు (చైనీస్ తైపీ) ద్వయం 7–5, 1–6, 10–6తో మయా జాన్సెన్ (అమెరికా)–ఎరిన్ రౌట్లిఫి (న్యూజిలాండ్) జంటపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ప్రాంజల జోడి 6–3, 6–7 (7/9), 10–8తో యెక్సిన్ మా (చైనా)–మెక్‌పీ (ఆస్ట్రేలియా) జంటను ఓడించింది. -
విష్ణువర్ధన్‌కు 32వ డబుల్స్ టైటిల్
భిలాయ్ (ఛత్తీస్‌గఢ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాదీ ఆటగాడు విష్ణువర్ధన్ జోడి సత్తా చాటింది. ఇక్కడి బీఎస్పీ టెన్నిస్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6–2, 6–4తో రెండో సీడ్ అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా) సామి రెన్‌వెన్ (జర్మనీ) జంటపై గెలుపొంది విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో విష్ణువర్ధన్ ఖాతాలో 32వ డబుల్స్ టైటిల్ చేరింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో విష్ణువర్ధన్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 7–6 (7/4), 6–4తో మూడో సీడ్ విష్ణువర్ధన్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో సెమీఫైనల్లో శ్రీరామ్ బాలాజీ (భారత్) 6–1, 6–2తో సామి రెన్‌వెన్ (జర్మనీ)ని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. -
క్వార్టర్స్‌లో భువన
గ్వాలియర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కాల్వ భువన క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో క్వాలిఫయర్ భువన 6–2, 6–3తో మూడో సీడ్, హైదరాబాద్‌కే చెందిన సౌజన్య భవిశెట్టిపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రాంజల 5–7, 6–7 (5/7)తో టాప్ సీడ్ ఫాత్మా అల్ నభాని (ఒమన్) చేతిలో... పెద్దిరెడ్డి శ్రీవైష్ణవి రెడ్డి 1–6, 3–6తో మెహక్ జైన్ (భారత్) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ క్వార్టర్స్‌లో నిధి చిలుముల–ప్రేరణ జంట 7–6 (7/4), 4–6, 10–6తో రష్మీ –ఇతీ మెహతా (భారత్) జోడీపై నెగ్గింది. -
ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల
గ్వాలియర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 6–2, 2–6, 7–5తో భారత్‌కే చెందిన నందిని శర్మపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి నిధి చిలుముల 6–4, 2–6, 4–6తో లులు రాడోవిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు గువహటిలో జరుగుతున్న ఇండియా ఫ్యూచర్స్–3 టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ రెండో రౌండ్లోకి చేరాడు. తొలి రౌండ్లో విష్ణు 6–3, 7–6 (7/3)తో జతిన్ దహియాపై గెలిచాడు. -
భువన, సౌజన్య శుభారంభం
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ గ్వాలియర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నమెంట్లో తెలుగు అమ్మా యిలు భువన కాల్వ, సౌజన్య భవిశెట్టి శుభారంభం చేశారు. ఇక్కడి సిటీ సెంటర్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన తొలి రౌండ్లో భువన 7–5, 6–4తో అలెగ్జాండ్ర వాల్టర్స్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా, మూడో సీడ్ సౌజన్య 6–1, 6–1తో భారత్‌కే చెందిన యువరాణి బెనర్జీపై అలవోక విజయం సాధించింది. శివిక బర్మన్తో జరిగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి 4–1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో శ్రీవైష్ణవి ముందంజ వేసింది. డబుల్స్ విభాగంలో నిధి చిలుముల–ప్రేరణ బాంబ్రి జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 6–0, 6–2తో హర్షిత–హిమాని మోర్ జంటపై విజయం సాధించింది. గువాహటిలో జరుగుతున్న ఐటీఎఫ్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విఘ్నేశ్ పెరణమల్లూర్ జంట 3–6, 6–3, 5–10తో మాటెస్జ్ టెర్జిన్స్కీ (పోలండ్)– జోస్కో విడలజారిన్ (స్పెయిన్) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది. -
టెన్నిస్ బ్యూటీ ఆశలపై నీళ్లు
రష్యా టెన్నిస్ బ్యూటీ, ఆరు అడుగుల పొడగరి మారియా షరపోవా ఆశలు అడియాసలు అయ్యాయి. రియో ఒలింపిక్స్ లో తన దేశం తరఫున ఆడాలనుకున్న ఈ సుందరిలో తాజా ఉత్తర్వులు నిరాశా నింపాయి. డోపింగ్ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోయి టెన్నిస్ కు దూరమైన షరపోవా తాజాగా చేసుకున్న అప్పీలుపై క్రీడా వివాదాల పరిష్కార కోర్టు తన తీర్పును సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది. దీంతో రియో ఒలింపిక్స్ లో షరపోవా ఆడే చాన్స్ పూర్తిగా లేనట్టే. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన షరపోవా రెండేళ్లు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తనపై అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ ఆమె కోర్టుకు వెళ్లింది. ఈ అప్పీలుపై సోమవారం తీర్పు వెలువడాల్సి ఉండగా.. తీర్పు వాయిదాకు షరపోవా, ఐటీఎఫ్ అంగీకరించాయని, దీంతో తుది ఉత్తర్వులను సెప్టెంబర్ లో వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది. -
షరపోవాపై రెండేళ్ల పాటూ నిషేధం
డోపింగ్ టెస్టులో దొరికిపోయిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ రెండేళ్లపాటూ నిషేధం విధించింది. ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన మరియా షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడినట్టు ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని షరపోవా స్వయంగా వెల్లడించడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. 2006 నుంచి డ్రగ్ తీసుకుంటున్నానని, అయితే దీన్ని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా చెప్పింది. ఆరు అడుగులకుపైగా ఎత్తుతో ఉండే ఈ 28 ఏళ్ల అందాల సుందరి తిరుగులేని ఆటతో కొన్నేళ్లపాటు టెన్నిస్‌ను ఏలింది. అత్యద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. -
భారత్‌కు టాప్ సీడింగ్
న్యూఢిల్లీ : డేవిస్ కప్ గ్రూప్ 1 ఆసియా/ఓసియానియా జోన్లో భారత టెన్నిస్ జట్టుకు టాస్ సీడింగ్ దక్కింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఈ టోర్నీ డ్రాను సాంటియాగోలో నేటి (బుధవారం) నుంచి జరిగే అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఏజీఎం ముగింపు రోజున వెల్లడిస్తారు. ఉజ్బెకిస్తాన్‌కు రెండో సీడ్ దక్కింది. ఈ రెండు జట్లకు తొలి రౌండ్లో బై లభించింది. ఇటీవల జరిగిన ప్లేఆఫ్‌లో చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిన భారత జట్టు ప్రపంచ గ్రూప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆసియా స్థాయి గ్రూప్-1లో భారత్, ఉజ్బెకిస్తాన్లతో పాటు చైనా, కొరియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. -
మూడో రౌండ్లో సాత్విక
♦ శివాని, శ్రీవత్స, సిద్ధార్థ్‌ల ఓటమి ♦ ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అండర్-18 జూనియర్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బాలికల సింగిల్స్‌లో టాప్ సీడ్ సామ సాత్విక, హర్షసాయి చల్లా మూడో రౌండ్లోకి అడుగుపెట్టగా, అమినేని శివాని, షేక్ హుమేర రెండో రౌండ్లోనే నిష్ర్కమించారు. బాలుర ఈవెంట్లో పొన్నాల సిద్ధార్థ్, శ్రీవత్స రాతకొండలు కూడా రెండో రౌండ్లోనే ఓడారు. తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలోని ‘శాట్స్’ టెన్నిస్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ రెండో రౌండ్లో సాత్విక 6-1, 6-2తో బాని సింగ్‌పై అలవోక విజయం సాధించింది. హర్షసాయి చల్లా 6-1, 6-3తో నాలుగో సీడ్ మరియా డామినిక్ (ఫిలిప్పీన్స్)ను కంగుతినిపిం చగా, సాయి నిఖిత 6-3, 4-1తో తొమ్మిదో సీడ్ లలిత దేవరకొండపై ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. మూడో సీడ్ మహక్ జైన్ 6-3, 6-0తో అమినేని శివానిపై, జుల్ యున్ చాంగ్ (చైనీస్ తైపీ) 6-1, 6-1తో షేక్ తహూరాపై, ఆర్జా చక్రబర్తి 6-4, 6-4తో షేక్ హుమేరా బేగంపై, ఆరో సీడ్ శివాని మంజన్న 6-1, 6-0తో ప్రతిభా నారాయణ్‌పై గెలుపొందారు. బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో పొన్నాల సిద్ధార్థ్ 6-3, 0-6, 4-6తో ఆదిల్ కళ్యాణ్పూర్ చేతిలో, శ్రీవత్స రాతకొండ 3-6, 6-2, 4-6తో 12వ సీడ్ సిద్ధాంత్ బాంటియా చేతిలో పరాజయం చవిచూశారు. రెండో సీడ్ చెరుకు వశిష్ట్ 6-1, 6-2తో నతాసిత్ కున్సువాన్ (థాయ్‌లాండ్)పై, శ్రమయ్ ధావన్ 7-5, 6-4తో అలిస్టెర్ మగలిట్ (హాంకాంగ్)పై గెలిచారు. మిగతా మ్యాచ్‌ల్లో పరీక్షిత్ సొమాని 4-6, 6-1, 6-1తో ముత్తు ఆదిత్య సెంథిల్ కుమార్‌పై, షాహిద్ అలమ్ (సింగపూర్) 6-3, 6-4తో శివదీప్ కొసరాజుపై, ధ్రువ్ సునీశ్ 6-4, 6-2తో రిషిరెడ్డిపై, సాగర్ బైన్స్ 6-0, 3-6, 6-4తో అనిరుధ్ చంద్రశేఖర్‌పై, సాహిల్ దేశ్‌ముఖ్ 7-6 (7/5), 7-6 (8/6)తో బాజ్వపై, రియాన్ పండోలే 6-1, 6-2తో అన్షుమన్ గులియాపై, ఇశాక్ ఇక్బాల్ 7-6తో యుగల్ బన్సాల్ (రిటైర్డ్‌హర్ట్)పై, సానిల్ జగ్యాని 6-3, 1-6, 7-5తో శ్రేయ్ గుప్తాపై, మయూక్ రావత్ 3-6, 7-6 (7/3), 6-4తో రాఘవ్‌పై, పరమ్ 4-6, 6-2, 6-3తో గౌరంగ్పై, అనురాగ్ 6-2, 4-6, 6-2తో అల్విన్ (మలేసియా)పై, అలెక్స్ సోలంకి 4-6, 6-1, 6-2తో అభిమన్యుపై విజయం సాధించారు.