షరపోవాపై రెండేళ్ల పాటూ నిషేధం | Maria Sharapova has been banned for two years by the International Tennis Federation | Sakshi
Sakshi News home page

షరపోవాపై రెండేళ్ల పాటూ నిషేధం

Jun 8 2016 9:11 PM | Updated on Sep 4 2017 2:00 AM

షరపోవాపై రెండేళ్ల పాటూ నిషేధం

షరపోవాపై రెండేళ్ల పాటూ నిషేధం

డోపింగ్ టెస్టులో దొరికిపోయిన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ రెండేళ్లపాటూ నిషేధం విధించింది.

డోపింగ్ టెస్టులో దొరికిపోయిన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవాపై అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ రెండేళ్లపాటూ నిషేధం విధించింది. ఐదు సార్లు గ్రాండ్స్లామ్ చాంపియన్ అయిన మరియా షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడినట్టు ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని షరపోవా స్వయంగా వెల్లడించడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. 

2006 నుంచి డ్రగ్ తీసుకుంటున్నానని, అయితే దీన్ని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా చెప్పింది. ఆరు అడుగులకుపైగా ఎత్తుతో ఉండే ఈ  28 ఏళ్ల అందాల సుందరి తిరుగులేని ఆటతో కొన్నేళ్లపాటు టెన్నిస్‌ను ఏలింది. అత్యద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement