లండన్: డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు... రొమేనియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సిమోనా హాలెప్‌పై ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. 31 ఏళ్ల హాలెప్ 2022 యూఎస్ ఓపెన్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో విఫలమైంది. దాంతో ఆమెపై 2022 అక్టోబర్‌లో తాత్కాలిక నిషేధం విధించారు.
ఐటీఐఏ ప్యానెల్ విచారణలో హాలెప్ ఉద్దేశపూర్వకంగానే డోపింగ్ నియమావళిని ఉల్లంఘించిందని తేలింది. దాంతో ఆమెపై నిషేధాన్ని అక్టోబర్ 2026 వరకు పొడిగించారు. 2017లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన హాలెప్ రెండు గ్రాండ్‌స్లామ్ (2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్) సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మరోవైపు ఐటీఐఏ విధించిన నిషేధాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో సవాలు చేస్తానని హాలెప్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment