
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్ లో రష్మిక 6–3, 1–0తో టాప్ సీడ్ ఇరీనా మరియా (రొమేనియా)పై ... సహజ 6–3, 6–1తో జీల్ దేశాయ్‌పై గెలిచారు. రష్మికతో మ్యాచ్‌లో రెండో సెట్ మధ్యలో గాయంతో ఇరీనా వైదొలిగింది.