pre quarter final
-
సింధు శుభారంభం
షెన్జెన్: చైనా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత షట్లర్లు మెరిశారు. బరిలోకి దిగిన వారందరూ విజయాన్ని అందుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం కూడా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మళ్లీ సింధుదే పైచేయి... ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో 21వసారి ఆడిన సింధు ఈసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న సింధు 21–17, 21–19తో బుసానన్ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 20వ విజయం కావడం విశేషం. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీ లభించినా కీలకదశలో ఆమె పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. గతవారం జపాన్ మాస్టర్స్ టోర్నీలోనూ తొలి రౌండ్లో బుసానన్పైనే సింధు గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్తో సింధు ఆడుతుంది. మరోవైపు ప్రపంచ 36వ ర్యాంకర్, భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సంచలన విజయంతో శుభారంభం చేసింది. ప్రపంచ 21వ ర్యాంకర్ లైన్ హొమార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక 20–22, 23–21, 21–16తో విజయాన్ని అందుకుంది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మాళవిక తొలి గేమ్‌ను కోల్పోయినా ఆందోళన చెందకుడా ఆడి ఆ తర్వాతి రెండు గేముల్లో నెగ్గి ముందంజ వేసింది. ఈ గెలుపుతో ఈ ఏడాది కొరియా ఓపెన్‌లో జార్స్‌ఫెల్డ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుపనిద (థాయ్‌లాండ్)తో మాళవిక తలపడుతుంది. ఏడో ర్యాంకర్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ సంచలన విజయంతో బోణీ చేశాడు. ప్రపంచ 7వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 13–21, 21–13తో గెలిచాడు. లీ జి జియాపై లక్ష్య సేన్‌కిది ఐదో విజయం కావడం విశేషం. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ ఆటలో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో అతడు గాడిలో పడటంతో విజయం దక్కింది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 15–11 వద్ద లక్ష్య సేన్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–11తో విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత అతను రెండు పాయింట్లు కోల్పోయాక మరో పాయింట్ నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గాయత్రి జోడీ ముందుకు.... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–15, 21–14తో హు లింగ్ ఫాంగ్–జెంగ్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. ఈ గెలుపుతో భారత జంట సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 12–21, 21–19, 21–18తో లీ జె హుయె–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సాతి్వక్–చిరాగ్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం. -
పోరాడి ఓడిన లక్ష్య సేన్
వాంటా (ఫిన్లాండ్): పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. తొలి రౌండ్లో ప్రత్యర్థి రస్ముస్ గెమ్కే (డెన్మార్క్) నుంచి ‘వాకోవర్’ దొరకడంతోపాటు లక్ష్య సేన్ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగాడు. ఏడో సీడ్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–19, 18–21, 15–21తో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌ను దక్కించుకున్నా... ఆ తర్వాత ప్రత్యర్థి దూకుడుకు జవాబివ్వలేకపోయాడు. మరో భారత ప్లేయర్ కిరణ్ జార్జి కథ కూడా ముగిసింది. ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి 17–21, 8–21తో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మాళవిక బన్సోద్ 15–21, 8–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్) చేతిలో... ఉన్నతి హుడా 10–21, 19–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో... ఆకర్షి 9–21, 8–21తో హాన్ యువె (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆద్యా–సతీశ్ కుమార్ (భారత్) ద్వయం 12–21, 15–21తో చెంగ్ జింగ్–జాంగ్ చి (చైనా) జోడీ చేతిలో.. రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) జంట 8–21, 10–21తో టాప్ సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. -
శ్రీకాంత్ శుభారంభం
మకావ్: నాలుగు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–14, 21–15తో డానిల్ దు»ొవెంకో (ఇజ్రాయెల్)పై నెగ్గాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21–13, 21–5తో సహచరుడు ఆలాప్ మిశ్రాను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో శంకర్ ముత్తుస్వామి (భారత్) 14–21, 21–10, 12–21తో పనిట్‌చాపోన్ (థాయ్‌లాండ్) చేతిలో, చిరాగ్ సేన్ (భారత్) 12–21, 17–21తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో, మిథున్ (భారత్) 12–21, 15–21తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ) చేతిలో, సమీర్ వర్మ (భారత్) 21–18, 11–21, 13–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 24–22, 10–21, 21–13తో లూ బింగ్ కున్–హో లో ఈ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–23, 22–24తో రుతానాపక్–జిహెనిచా (థాయ్‌లాండ్) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రుతి్వక జోడీ 17–21, 19–21తో నికోల్ చాన్–యాంగ్ చు యున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
Olympics 2024: ప్రి క్వార్టర్స్ చేరిన పీవీ సింధు
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ముందడుగు వేసింది. మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్- ఎమ్ టాపర్‌గా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఎస్టోనియా షట్లర్ క్రిస్టిన్ కౌబాను 21-5, 21-10తో ఓడించి ప్రి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.ఆది నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ ఆడుతూ పాడుతూ సింధు గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. కాగా తన తొలి మ్యాచ్‌లో సింధు.. మాల్దీవుల షట్లర్ ఫాతిమాత్ నబాహ అబ్దుల్ రజాక్‌ను 21-9, 21-6తో ఓడించింది. ఇక ప్యారిస్ ఒలింపిక్స్ ప్రి క్వార్టర్స్‌లో సింధు.. గ్రూప్-ఎన్ టాపర్, చైనాకు చెందిన హి బింగో జియావోను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ గురువారం జరుగనుంది. ఇదిలా ఉంటే.. టోక్యోలో వీరిద్దరు కాంస్యం కోసం పోటీపడగా సింధు పైచేయి సాధించిన విషయం తెలిసిందే.కాగా తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్-2016లో రజతం సాధించిన ఈ స్టార్ షట్లర్.. టోక్యో ఒలింపిక్స్-2020లో కాంస్య పతకం గెలిచింది. ముచ్చటగా మూడో మెడల్ మెడలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు.. ఆ దిశగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.చదవండి: మను మహరాణి -
ప్రిక్వార్టర్ ఫైనల్లో అనాహత్ సింగ్
ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్, జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మూడో రౌండ్లో అనాహత్ సింగ్ 11–7, 12–10, 11–6తో సమంతా జాఫీ (అమెరికా)పై గెలిచింది. బాలుర సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ శౌర్య బావా కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడో రౌండ్లో శౌర్య 4–11, 11–7, 12–10, 11–6తో రస్టిన్ వైజర్ (అమెరికా)పై నెగ్గాడు. -
అల్కరాజ్ అద్భుత రీతిలో...
లండన్: డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఓటమి అంచుల నుంచి గట్టెక్కి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ దాటేందుకే ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ చాంప్ అష్టకష్టాలు పడ్డాడు. ఐదు సెట్ల పాటు సాగిన సుదీర్ఘ పోరాటంలో ఎట్టకేలకు కార్లొస్ అల్కరాజ్ 5–7, 6–2, 4–6, 7–6 (7/2), 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై చెమటోడ్చి గెలిచాడు. ఈ మ్యాచ్‌లో 29వ సీడ్ టియాఫో... స్పెయిన్ స్టార్‌కు చుక్కలు చూపించాడు. దాదాపు ఓడించినంత పనిచేశాడు. అల్కరాజ్ 1–2 సెట్లతో వెనుకబడిన దశలో నాలుగో సెట్ హోరాహోరీగా సాగింది. స్కోరు 6–6 వద్ద సమం కాగా... టైబ్రేక్ నిర్వహించారు. ఇందులో పుంజుకున్న అల్కరాజ్ తర్వాత ఆఖరి ఐదో సెట్‌ను సులువుగా గెలుచుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఇతర మ్యాచ్‌లలో పదో సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 6–3తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై వరుస సెట్లలో విజయం సాధించగా, ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6–1, 6–3, 4–6, 1–1తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై ఆధిక్యంలో ఉన్న దశలో వర్షం వల్ల మ్యాచ్‌ను నిలిపివేశారు. మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ) ప్రిక్వార్టర్స్ చేరారు. మూడో రౌండ్లో కీస్ 6–4, 6–3తో 18వ సీడ్ మార్ట కొస్ట్యుక్ (ఉక్రెయిన్)పై, పావొలిని (ఇటలీ) 7–6 (7/4), 6–1తో బియాంక ఆండ్రీస్కు (కెనడా)పై విజయం సాధించారు. మరో మ్యాచ్‌లో ఎమ్మా నవారో (అమెరికా) 2–6, 6–3, 6–4తో డయానా స్నైడెర్ (రష్యా)పై నెగ్గింది. ముర్రే నిష్క్రమణ... స్థానిక బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కెరీర్ ప్రఖ్యాత వింబుల్డన్‌లో తొలి రౌండ్ ఓటమితో ముగిసింది. సోదరుడు జేమీ ముర్రేతో కలిసి అతను డబుల్స్ బరిలోకి దిగాడు. ముర్రే జోడీ 6–7 (6/8), 4–6 స్కోరుతో రింకీ హిజికట–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది. దీంతో రెండు సార్లు వింబుల్డన్ సింగిల్స్ చాంప్ (2013, 2016) ముర్రేకు ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్‌తో గౌరవ వందం ఇచ్చారు. దిగ్గజాలు ఫెడరర్, నాదల్, జొకోవిచ్, వీనస్ విలియమ్స్‌లు వీడియో సందేశాల ద్వారా అతనికి ఫేర్వెల్ పలికారు. వర్షం కారణంగా వింబుల్డన్ టోర్నీకి అంతరాయం కలిగింది. పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లను నిలిపివేసి శనివారానికి వాయిదా వేశారు. యూకీ, బాలాజీ జోడీలు అవుట్ డబుల్స్‌లో భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. యూకీ బాంబ్రీ పోరాటం రెండో రౌండ్లో ముగియగా, శ్రీరామ్ బాలాజీ కనీసం తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. రెండో రౌండ్లో యూకీ–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 6–4, 4–6, 3–6తో జర్మనీకి చెందిన కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యుయెట్జ్ జంట చేతిలో పరాజయం చవి చూసింది. తొలి సెట్లో కనబరిచిన ఉత్సాహం తర్వాతి సెట్లలో కొనసాగించడంతో భారత్–ఫ్రాన్స్ ద్వయం విఫలమైంది. మరో మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ జంటకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. బాలాజీ–జాన్సన్ (బ్రిటన్) జంట 4–6, 5–7తో నాలుగో సీడ్ మార్సెలొ అరెవలో (సాల్వేడార్)– మేట్ పావిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడింది. -
స్వియాటెక్ సులువుగా...
పారిస్: రెండో రౌండ్లో ఓటమి అంచుల్లో నుంచి గట్టెక్కిన పోలాండ్ టెన్నిస్ స్టార్ ఇగా స్వియాటెక్ మూడో రౌండ్లో మాత్రం అలవోకగా గెలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే ఈ టోర్నీలో మూడుసార్లు విజేతగా నిలిచిన స్వియాటెక్ శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 6–4, 6–2తో మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 34 విన్నర్స్ కొట్టిన ఆమె కేవలం ఎనిమిది అనవసర తప్పిదాలు చేసింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–2, 6–4తో డయానా యెస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్)పై, ఐదో సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో చోల్ పాక్వెట్ (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–4, 7–6 (7/5)తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సినెర్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సినెర్ మూడో రౌండ్లో 6–4, 6–4, 6–4తో కొటోవ్ (రష్యా)ను ఓడించాడు. ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) మాత్రం మూడో రౌండ్లోనే నిష్క్రమించాడు. అర్నాల్డి (ఇటలీ) 7–6 (8/6), 6–2, 6–4తో రుబ్లెవ్‌ను ఇంటిదారి పట్టించాడు. బాలాజీ జోడీ గెలుపు పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ రెండో రౌండ్‌కు చేరింది. తొలి రౌండ్లో బాలాజీ–వరేలా ద్వయం 6–3, 6–4తో రీస్ స్టాల్డెర్ (అమెరికా)–సెమ్ వీర్బీక్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 3–6, 6–7 (5/7)తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–సఫీయులిన్ (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
నిఖత్ శుభారంభం..
అస్తానా (కజకిస్తాన్): ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన 52 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్ 5–0తో రఖీమ్బెర్దీ జన్సాయా (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు) కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు.మీనాక్షి 4–1తో గసిమోవా రొక్సానా (కజకిస్తాన్)పై గెలుపొందగా... అనామిక పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుమ్బయేవా అరైలిమ్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. ఇస్మిత్ (75 కేజీలు), సోనియా (54 కేజీలు) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ఇష్మిత్ 0–5 తో అర్మాత్ (కజకిస్తాన్) చేతిలో, సోనియా 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు.ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ..రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలిరౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–2తో అర్నాల్డి–పసారో (ఇటలీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బొలెలీ–వావాసోరి (ఇటలీ)లతో బోపన్న–ఎబ్డెన్ తలపడతారు. -
పోరాడి ఓడిన సుమిత్
మరాకెష్ (మొరాకో): గ్రాండ్‌ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 6–1, 3–6, 4–6తో ప్రపంచ 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. సుమిత్ కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 16 వేలు) ప్రైజ్‌మనీ, 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యూకీ జోడీ శుభారంభం ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి జంట 6–3, 6–4తో స్టీవెన్స్ (నెదర్లాండ్స్)–పెట్రోస్ సిట్సిపాస్ (గ్రీస్) ద్వయంపై గెలిచింది. -
సుమిత్ నగాల్ శుభారంభం
గ్రాండ్‌ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొరాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 4–6, 6–3, 6–2తో కొరెంటిన్ ముటెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఆరు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)తో సుమిత్ ఆడతాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 21–18, 21–14తో 2019 చాంపియన్ జోడీ మొహమ్మద్ అసన్–హెండ్రా సెతియావాన్ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2022 విజేత జోడీ మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రి–బగాస్ మౌలానా (ఇండోనేసియా)తో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. లక్ష్య సేన్ బోణీ మరోవైపు పురుషుల సింగిల్స్‌లో 2022 రన్నరప్, భారత స్టార్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 21–14తో ప్రపంచ 33వ ర్యాంకర్ మాగ్నస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్‌కు నిరాశ ఎదురైంది. చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్షు 19–21, 21–11, 9–21తో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ముందంజ వేయగా... గత ఏడాది సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఈసారి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. అశి్వని–తనీషా ద్వయం 21–13, 21–18తో యెంగ్ ఎన్గా టింగ్–యెంగ్ పుయ్ లామ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గింది. గాయత్రి–ట్రెసా జోడీ 18–21, 12–21తో అప్రియాని రహాయు–సితీ ఫాదియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక , సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇండోర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్ లో రష్మిక 6–3, 1–0తో టాప్ సీడ్ ఇరీనా మరియా (రొమేనియా)పై ... సహజ 6–3, 6–1తో జీల్ దేశాయ్‌పై గెలిచారు. రష్మికతో మ్యాచ్‌లో రెండో సెట్ మధ్యలో గాయంతో ఇరీనా వైదొలిగింది. -
సింధు శుభారంభం
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. వ్యోన్ లీ (బెల్జియం)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు తొలి గేమ్‌ను 14 నిమిషాల్లో 21–10తో సొంతం చేసుకుంది. ఈ దశలో గాయం కారణంగా వ్యోన్ లీ వైదొలగడంతో సింధును విజేతగా ప్రకటించారు. ఆకర్షి కశ్యప్ 16–21, 11–21తో పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ 21–14, 13–21, 13–21తో సు లీ యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. ప్రపంచ నంబవర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 9–21, 9–21తో పరాజయం పాలయ్యాడు. 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ ఏ దశలోనూ డెన్మార్క్ స్టార్‌కు పోటీనివ్వ లేకపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్‌కిది 11వ ఓటమి కావడం గమనార్హం. -
గట్టెక్కిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 80 నిమిషాల్లో 20–22, 22–20, 21–19తో మిచెల్లి లీ (కెనడా)పై కష్టపడి గెలిచింది. తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌లో 7–14తో వెనుకబడిన సింధు నెమ్మదిగా పుంజుకుంది. స్కోరు 15–18 వద్ద సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరు 20–20తో సమమైనా... కీలకదశలో సింధు రాణించి రెండు పాయింట్లు నెగ్గి 22–20తో గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్ కూడా హోరాహోరీగా సాగినా కీలక తరుణంలో సింధు పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 20–22, 21–8తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... ప్రణయ్ 17–21, 17–21తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ 89 నిమిషాల్లో 6–7 (6/8), 6–3, 10–8తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)–మనారినో (ఫ్రాన్స్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడుతున్న యూకీ–హాస్ జంట ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
రష్మిక సంచలనం
సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ –125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. తొలి రౌండ్లో ప్రపంచ 520వ ర్యాంకర్ రష్మిక 2–6, 6–1, 7–6 (7/5)తోప్రపంచ 93వ ర్యాంకర్, రెండో సీడ్ నావో హిబినో (జపాన్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. -
క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల 50 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 3–2తో ఒయుత్సెసెగ్ యెసుగెన్ (మంగోలియా)పై నెగ్గింది. ఈ బౌట్లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ప్రతీ రౌండ్లోనూ పంచ్‌లతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు. చివరకు విజయం నిఖత్నే వరించింది. అయితే మరో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ బౌట్లో ఊహించని రీతిలో అనర్హతకు గురై వెనుదిరిగింది. 75 కేజీల విభాగంలో ఓ రూర్కే ఆయిఫే (ఐర్లాండ్)తో తలపడుతుండగా లవ్లీనా రిఫరీ మూడో హెచ్చరికకు గురైంది. దీంతో మూడో రౌండ్ పూర్తవకముందే డిస్క్వాలిఫైతో బౌట్ నుంచి నిరాశగా ని్రష్కమించింది. 57 కేజీల కేటగిరీలో సాక్షి చౌదరి 5–0తో సెల్మౌని చాహిర (అల్జీరియా)పై ఏకపక్ష విజయం సాధించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ (54 కేజీలు)కు ప్రిక్వార్టర్స్‌లో 2–3తో ఫే నియ (ఐర్లాండ్) చేతిలో చుక్కెదురైంది. -
కిరణ్ జార్జి సంచలనం
ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్, ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–11, 13–21, 21–18తో ప్రపంచ 18వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ౖఫైనల్కు చేరాడు. భారత్‌కే చెందిన లక్ష్య సేన్, ప్రియాన్షు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
శ్రమించి నెగ్గిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 69 నిమిషాల్లో 12–21, 21–18, 21–15తో ప్రపంచ 7వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్‌జంగ్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–13తో లుకాస్ కోర్వి–రొనన్ లాబర్ (ఫ్రాన్స్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
సంచలనాలతో బోణీ...
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్‌పై ప్రణయ్‌కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్పై శ్రీకాంత్‌కిది రెండో గెలుపు. 2014లో హాంకాంగ్ ఓపెన్‌లో చౌ తియెన్ చెన్ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్‌తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, స్వియాటెక్
లండన్: టాప్స్టార్లు నొవాక్ జొకోవిచ్, ఇగా స్వియాటెక్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సెర్బియన్ దిగ్గజం, రెండో సీడ్ జొకోవిచ్ తనదైన శైలిలో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాకు ఇంటిదారి చూపాడు. ఇప్పటికే ఈ సీజన్లో జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్న జొకోవిచ్ 6–3, 6–1, 7–6 (7/5)తో వరుస సెట్లలో స్విస్ ఆటగాడిని ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు. 11 ఏస్‌లతో రెచ్చిపోయిన జొకో ఒక డబుల్‌ఫాల్ట్ చేశాడు. 26 అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ 38 విన్నర్లు కొట్టాడు. ప్రపంచ నంబర్‌వన్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో నికోలస్ జెర్రి (చీలి)పై గెలిచేందుకు కష్టపడ్డాడు. రష్యా స్టార్, మూడో సీడ్ మెద్వెదెవ్ 4–6, 6–3, 6–4, 6–4తో మార్టన్ ఫుక్సొవిక్స్ (హంగేరి)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 7–6 (7/5), 6–4తో లాస్లొ జేర్ (సెర్బియా)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో 19వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 6–2, 6–2తో యోసుకె వాతనుకి (జపాన్)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ జన్నిక్ సిన్నెర్ (ఇటలీ) 3–6, 6–2, 6–3, 6–4తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో పాటు ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్), బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్స్ చేరారు. స్వియాటెక్ 6–2, 7–5తో పెట్ర మార్టిచ్ (క్రొయేషియా)ను వరుస సెట్లలో ఓడించగా, స్వితోలినా 7–6 (7/3), 6–2తో మాజీ ఆ్రస్టేలియా చాంప్ సోఫియా కెనిన్ (అమెరికా)ను కంగుతినిపించింది. మారి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్) ఐదో సీడ్ కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)కు షాకిచ్చింది. చెక్ అమ్మాయి 7–6 (7/0), 4–6, 7–5తో సీడెడ్ ప్లేయర్ గార్సియాను మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టించింది. 14వ సీడ్ బెన్సిక్ 6–3, 6–1తో మగ్ద లినెటి (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. బోపన్న జోడీ శుభారంభం భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియన్ మాథ్యూ ఎబ్డెన్తో జోడీకట్టిన బోపన్న ఆరో సీడ్ జంటగా బరిలోకి దిగింది. తొలిరౌండ్లో భారత్–ఆసీస్ జోడీ 6–2, 6–7 (5/7), 7–6 (10/8)తో గులెర్మో డ్యురన్– థామస్ ఎచెవెరీ (అర్జెంటీనా) జంటపై చెమటోడ్చి గెలిచింది. -
శ్రీకాంత్ ముందుకు...
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత క్రీడాకారులు ముందంజ వేశారు. కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. ప్రియాన్షు రజావత్‌కు ప్రపంచ మూడో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) నుంచి వాకోవర్ లభించడంతో అతను కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ గ్వాంజ్ జు లూ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–13, 21–19తో గెలుపొందాడు. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో శ్రీకాంత్ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు ప్రతిఘటన ఎదురైంది. అయితే స్కోరు 19–19 వద్ద శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు గ్వాంజ్ జు లూపై వరుసగా ఐదో విజయాన్ని సాధించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్, ఆసియా చాంపియన్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–17, 21–13తో గెలిచాడు. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో స్కోరు 17–17 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచాడు. రెండో గేమ్‌లో స్కోరు 5–3 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 12–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్‌నకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 43వ ర్యాంకర్ ఆకర్షి తొలి రౌండ్లో 10–21, 4–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లక్ష్య సేన్‌తో శ్రీకాంత్; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (వియత్నాం)తో ప్రణయ్; ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో ప్రియాన్షు రజావత్; తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో పీవీ సింధు తలపడతారు. -
French Open 2023: 55 ఏళ్ల తర్వాత...
పారిస్: బ్రెజిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 55 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఆ దేశ క్రీడాకారిణికి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో బ్రెజిల్‌కు చెందిన బీత్రిజ్ హదాద్ మాయ క్వార్టర్ ఫైనల్ చేరింది. టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968లో) మొదలయ్యాక దివంగత మరియా బ్యూనో చివరిసారి బ్రెజిల్ తరఫున గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 1968లో మరియా బ్యూనో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్‌కు... యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. మరియా బ్యూనో ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గినా ఆ విజయాలన్నీ ఓపెన్ శకంకంటే ముందు వచ్చాయి. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ బీత్రిజ్ 3 గంటల 51 నిమిషాల్లో 6–7 (3/7), 6–3, 7–5తో సారా సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–3, 6–1తో బెర్నార్డా పెరా (అమెరికా)పై, అమెరికా టీనేజర్ కోకో గాఫ్ 7–5, 6–2తో షిమెద్లోవా (స్లొవేకియా)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. -
నాదల్కు షాక్
న్యూయార్క్: ఈ ఏడాది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు నిరాశ ఎదురైంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా ప్లేయర్ ఫ్రాన్సిస్కో టియాఫో తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శనతో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్‌ను ఓడించి యూఎస్ ఓపెన్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ టియాఫో 6–4, 4–6, 6–4, 6–3తో రెండో సీడ్ నాదల్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)తో టియాఫో ఆడతాడు. నాదల్‌తో 3 గంటల 34 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో టియాఫో 18 ఏస్‌లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నాదల్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన టియాఫో 49 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు నాదల్ తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో నాదల్‌ను ఓడించిన మూడో అమెరికా ప్లేయర్‌గా టియాఫో ఘనత వహించాడు. గతంలో అమెరికా ప్లేయర్లు ఆండీ రాడిక్ (2004లో), జేమ్స్ బ్లేక్ (2005లో) నాదల్‌ను ఓడించారు. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో టైటిల్స్ సాధించి, వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నాడు. గాయం కారణంగా అతను సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆడకుండా తన ప్రత్యర్థి కిరియోస్ (ఆస్ట్రేలియా)కు వాకోవర్ ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), 11వ సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరారు. 2014 చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 3–6, 6–4, 4–6, 6–3తో గెలుపొంది వరుసగా రెండో ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరాడు. సినెర్ 6–1, 5–7, 6–2, 4–6, 6–3తో ఇవాష్క (రష్యా)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఆరో సీడ్ సబలెంకా (బెలారస్), ఎనిమిదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్వియాటెక్ 2–6, 6–4, 6–0తో నీమియెర్ (జర్మనీ)పై, సబలెంకా 3–6, 6–3, 6–2తో డానియెలా కొలిన్స్ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–2తో క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, ప్లిస్కోవా 7–5, 6–7 (5/7), 6–2తో మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచారు. -
Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో ర్యాంకర్ పీవీ సింధు 21–13, 17–21, 21–15తో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ గెలుపుతో ఇటీవల ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీలో హి బింగ్ జియావో చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. మరో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ 21–16, 17–21, 14–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. గతవారం మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలోనూ సైనా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సాయిప్రణీత్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21–8, 21–9తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై, కశ్యప్ 16–21, 21–16, 21–16తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–19, 21–14తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. సమీర్ వర్మ 21–10, 12–21, 14–21తో నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 19–21, 21–18, 16–21తో ఫాబ్రియానా కుసుమ– అమాలియా ప్రాతవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.