ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ముందడుగు వేసింది. మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్- ఎమ్ టాపర్‌గా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. గ్రూప్ దశలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఎస్టోనియా షట్లర్ క్రిస్టిన్ కౌబాను 21-5, 21-10తో ఓడించి ప్రి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
ఆది నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ ఆడుతూ పాడుతూ సింధు గెలుపొందింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. కాగా తన తొలి మ్యాచ్‌లో సింధు.. మాల్దీవుల షట్లర్ ఫాతిమాత్ నబాహ అబ్దుల్ రజాక్‌ను 21-9, 21-6తో ఓడించింది.
ఇక ప్యారిస్ ఒలింపిక్స్ ప్రి క్వార్టర్స్‌లో సింధు.. గ్రూప్-ఎన్ టాపర్, చైనాకు చెందిన హి బింగో జియావోను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ గురువారం జరుగనుంది. ఇదిలా ఉంటే.. టోక్యోలో వీరిద్దరు కాంస్యం కోసం పోటీపడగా సింధు పైచేయి సాధించిన విషయం తెలిసిందే.
కాగా తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్-2016లో రజతం సాధించిన ఈ స్టార్ షట్లర్.. టోక్యో ఒలింపిక్స్-2020లో కాంస్య పతకం గెలిచింది. ముచ్చటగా మూడో మెడల్ మెడలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు.. ఆ దిశగా వరుస విజయాలతో దూసుకుపోతోంది.
చదవండి: మను మహరాణి
Comments
Please login to add a commentAdd a comment