బ్రిస్బేన్: కొత్త ఏడాదిలో తాను పాల్గొన్న తొలి టోర్నీలో భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాడు. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఏటీపీ–250 టోర్నీలో రిత్విక్ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 2–6తో రింకీ హిజికాటా–జేసన్ కుబ్లెర్ (ఆ్రస్టేలియా) జోడీ చేతిలో ఓడిపోయింది.
65 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–డచ్ జంట ఐదు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్‌లో రిత్విక్–రాబిన్ హాస్ 7–6 (7/4), 3–6, 10–6తో గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా)లపై గెలిచారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన రితి్వక్–రాబిన్ హాస్‌లకు 2,980 డాలర్ల (రూ. 2 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 20 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment