Brisbane International Tournament
-
‘బ్రిస్బేన్’తో జొకోవిచ్ సీజన్ మొదలు
బెల్గ్రేడ్: కొత్త ఏడాదిలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటకు టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ సిద్ధమయ్యాడు. జనవరి 12 నుంచి జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న జొకోవిచ్... దానికి ముందు మరో టోర్నీతో తన సీజన్ మొదలు పెడుతున్నాడు. డిసెంబర్ 29 నుంచి జనవరి 5 వరకు జరిగే బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ఆడతాడు. 2009 తర్వాత అతను ఈ టోర్నీలో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జొకోవిచ్‌తో పాటు దిమిత్రోవ్, రూన్, టియాఫో, కిరియోస్ తదితర అగ్రశ్రేణి ఆటగాళ్లు బ్రిస్బేన్ టోర్నీలో పాల్గొంటున్నారు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను 10 సార్లు గెలిచిన జొకోవిచ్ మరోసారి టైటిల్ సాధిస్తే రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అతని ఖాతాలో చేరుతుంది. -
టైటిల్‌కు అడుగు దూరంలో..
బ్రిస్బేన్: గతేడాది విశేషంగా రాణించిన సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)జోడీ.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తోంది. బ్రిస్బేన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ జోడీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా-హింగిస్ల జంట 6-3, 7-5 తేడాతో అంద్రెజా క్లెపేక్-కుద్రయస్తివా (రష్యా) జోడిపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ప్రస్తుతం మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ గా కొనసాగుతున్న సానియా-హింగిస్ల ద్వయం తొలి గేమ్ ను అలవోకగా గెలుచుకున్నా... రెండో గేమ్ లో మాత్రం రష్యా జంట నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొంది. అయినప్పటికీ సానియా-హింగిస్లు అనవసర తప్పిదాలకు పదేపదే చేయకుండా రెండో గేమ్ ను గెలుచుకుని టైటిల్ వేటకు అడుగు దూరంలో నిలిచారు.