టైటిల్కు అడుగు దూరంలో..
బ్రిస్బేన్: గతేడాది విశేషంగా రాణించిన సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)జోడీ.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తోంది. బ్రిస్బేన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ జోడీ ఫైనల్ కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా-హింగిస్ల జంట 6-3, 7-5 తేడాతో అంద్రెజా క్లెపేక్-కుద్రయస్తివా (రష్యా) జోడిపై గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది.
ప్రస్తుతం మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ గా కొనసాగుతున్న సానియా-హింగిస్ల ద్వయం తొలి గేమ్ ను అలవోకగా గెలుచుకున్నా... రెండో గేమ్ లో మాత్రం రష్యా జంట నుంచి కాస్త ప్రతిఘటన ఎదుర్కొంది. అయినప్పటికీ సానియా-హింగిస్లు అనవసర తప్పిదాలకు పదేపదే చేయకుండా రెండో గేమ్ ను గెలుచుకుని టైటిల్ వేటకు అడుగు దూరంలో నిలిచారు.