
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్
ప్రణయ్ ఓటమి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 80 నిమిషాల్లో 20–22, 22–20, 21–19తో మిచెల్లి లీ (కెనడా)పై కష్టపడి గెలిచింది.
తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌లో 7–14తో వెనుకబడిన సింధు నెమ్మదిగా పుంజుకుంది. స్కోరు 15–18 వద్ద సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరు 20–20తో సమమైనా... కీలకదశలో సింధు రాణించి రెండు పాయింట్లు నెగ్గి 22–20తో గేమ్‌ను దక్కించుకుంది.
నిర్ణాయక మూడో గేమ్ కూడా హోరాహోరీగా సాగినా కీలక తరుణంలో సింధు పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... హెచ్‌ఎస్ ప్రణయ్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–15, 20–22, 21–8తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... ప్రణయ్ 17–21, 17–21తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు.
Comments
Please login to add a commentAdd a comment