మకావ్: నాలుగు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21–14, 21–15తో డానిల్ దు»ొవెంకో (ఇజ్రాయెల్)పై నెగ్గాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ పూర్తి ఆధిపత్యం చలాయించాడు.
మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21–13, 21–5తో సహచరుడు ఆలాప్ మిశ్రాను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో శంకర్ ముత్తుస్వామి (భారత్) 14–21, 21–10, 12–21తో పనిట్‌చాపోన్ (థాయ్‌లాండ్) చేతిలో, చిరాగ్ సేన్ (భారత్) 12–21, 17–21తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో, మిథున్ (భారత్) 12–21, 15–21తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ) చేతిలో, సమీర్ వర్మ (భారత్) 21–18, 11–21, 13–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 24–22, 10–21, 21–13తో లూ బింగ్ కున్–హో లో ఈ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–23, 22–24తో రుతానాపక్–జిహెనిచా (థాయ్‌లాండ్) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–రుతి్వక జోడీ 17–21, 19–21తో నికోల్ చాన్–యాంగ్ చు యున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment