మరాకెష్ (మొరాకో): గ్రాండ్‌ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 6–1, 3–6, 4–6తో ప్రపంచ 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. సుమిత్ కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 16 వేలు) ప్రైజ్‌మనీ, 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
యూకీ జోడీ శుభారంభం
ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో యూకీ–ఒలివెట్టి జంట 6–3, 6–4తో స్టీవెన్స్ (నెదర్లాండ్స్)–పెట్రోస్ సిట్సిపాస్ (గ్రీస్) ద్వయంపై గెలిచింది.
పోరాడి ఓడిన సుమిత్
Published Thu, Apr 4 2024 3:52 AM | Last Updated on Thu, Apr 4 2024 3:52 AM
Comments
Please login to add a commentAdd a comment