
గుర్‌గ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో 301వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో టాప్ సీడ్, ప్రపంచ 229వ ర్యాంకర్ కార్లోటా మార్టినెజ్ సిరెజ్ (స్పెయిన్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
1 గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక 3–6, 6–1, 3–6తో దరియా కుదషోవా (రష్యా) చేతిలో, స్మృతి భాసిన్ 1–6, 3–6తో అంటోనియా ష్మిడిట్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment