ITF
-
టాప్ సీడ్‌పై సహజ సంచలన విజయం
గుర్‌గ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో 301వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో టాప్ సీడ్, ప్రపంచ 229వ ర్యాంకర్ కార్లోటా మార్టినెజ్ సిరెజ్ (స్పెయిన్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1 గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక 3–6, 6–1, 3–6తో దరియా కుదషోవా (రష్యా) చేతిలో, స్మృతి భాసిన్ 1–6, 3–6తో అంటోనియా ష్మిడిట్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. -
సహజ సంచలనం
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ100 మహిళల టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 315వ ర్యాంకర్ సహజ 6–1, 3–6, 6–1తో ప్రపంచ 134వ ర్యాంకర్, నాలుగో సీడ్ మరియా తిమోఫీవా (రష్యా)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సారా బెజ్లెక్ (చెక్ రిపబ్లిక్)తో సహజ తలపడుతుంది. మరోవైపు భారత నంబర్‌వన్ అంకిత రైనా పోరాటం ముగిసింది. రెండో రౌండ్లో అంకిత 1–6, 3–6తో తాత్యానా మరియా (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో సహజ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి మరో సంచలన విజయం సాధించింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది.శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 284వ ర్యాంకర్ సహజ 6–3, 5–7, 6–3తో ప్రపంచ 190వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ మరియా మాటీస్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయిన సహజ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సహజ మూడో సీడ్, 214వ ర్యాంకర్ హీన్ షి (చైనా)ను బోల్తా కొట్టించింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ 153వ ర్యాంకర్ కథింక వోన్ డెష్మన్ (లిష్టన్స్టయిన్)తో సహజ తలపడుతుంది. -
ఈ మాణిక్యం మట్టిలో పుట్టింది
‘డ్రీమ్ బిగ్... అచీవ్ బిగ్’ అన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. గొప్ప కల కనాలి... ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రమించాలి. ఈ రెండు మాటలనూ ఒంట పట్టించుకుందా అమ్మాయి. తనకిష్టమైన టెన్నిస్ రాకెట్‌ని చేతిలోకి తీసుకుంది. టెన్నిస్‌ని ప్రేమిస్తోంది... టెన్నిసేప్రాణం అంటోంది... కానీ... ‘టాలెంట్ ఉంటేనే సరిపోతుందా’ అని పరిహసిస్తోంది రూపాయి. ప్రత్యర్థి మీద గెలవడం ఆమెకు ఏ మాత్రం చాలెంజ్ కాదు. ఆర్థిక పరిస్థితితో నిత్యపోరాటమే ఆమెను కుంగదీస్తోంది. తిరుపతికి చెందిన చందన పోతుగారి టెన్నిస్ ప్లేయర్. నేషనల్ ర్యాంకింగ్‌లో టాప్ 30లో ఉంది. మనదేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్లు మాత్రమే ఆడుతోంది. దేశం దాటి వెళ్లడానికి చేతిలో డబ్బు లేదు. ‘దేశంలో ఎక్కడికైనా సరే ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్లిపోతాను, విదేశాల్లో ఆడాలంటే విమానం టికెట్ కొనుక్కోలేను’ అంటున్నప్పుడు చందన కళ్లలో టెన్నిస్ ఆట పట్ల ప్రేమతోపాటు తన ఆర్థిక పరిస్థితి పట్ల నిస్సహాయత వ్యక్తమైంది. ఈ మాణిక్యం మట్టిలో పుట్టింది. వెలుగు–చీకటి సామాన్య కుటుంబంలో పుట్టిన చందన ఎనిమిదేళ్ల వయసులో టెన్నిస్ రాకెట్ పట్టుకుంది. లెక్కకు మించిన విజయాలతో సాగిపోతోంది. ఆటలో రాణించాలంటే మెరుగైన శిక్షణ అవసరమని నాలుగేళ్ల కిందట కుటుంబం హైదరాబాద్‌కి వచ్చింది. గణేశ్ రామన్ టెన్నిస్ అకాడమీలో చేరింది. చందనలో ఆట పట్ల ఉన్న అంకితభావం, వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న కోచ్ ఫీజు గురించి పట్టుపట్టకుండా దేశం మెచ్చే క్రీడాకారిణిని తయారు చేయడానికి సిద్ధమయ్యారు.సరిగ్గా ఇక్కడే చందనకు కాలం కొత్త పరీక్షలు పెట్టింది. జీవితంలోకి వెలుగు–చీకటి ఒక్కసారిగా వచ్చినట్లయింది. ‘శిక్షణ కోసం నగరానికి వెళ్లడమేంటి, వయసు వచ్చిన ఆడపిల్ల తెలియని మనుషుల మధ్య మెలగడమేంటి’... అని బంధువులు ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. వారి మాటలను పట్టించుకోలేదు, కానీ తండ్రి కూడా ‘ఇక ఆట చాలు, పెళ్లి చేస్తాను’ అనడంతో హతాశురాలైంది. ఆమె కన్నీళ్లు తల్లికి అర్థమయ్యాయి. కానీ తండ్రిని కరిగించలేకపోయాయి. కుటుంబం రెండయింది. తల్లి మునిలక్ష్మి ఒంటరిగా కూతురి బాధ్యత మోస్తోంది. దేశం తరఫున ఆడాలి! ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించి గెలవాలనేది నా లక్ష్యం’ అంటున్న చందన టోర్నమెంట్లో గెలిచినప్పుడు వచ్చిన డబ్బును బస చేసిన గదికి అద్దె చెల్లించేసి తిరుగు ప్రయాణానికి డబ్బులు లెక్క చూసుకుంటూ జనరల్ టికెట్ కొనుక్కుని ఇంటికి వస్తోంది. చందనకు కొత్త రాకెట్ కూడా లేదని, తోటి క్రీడాకారులిచ్చిన రాకెట్, దుస్తులు, షూస్‌తో టోర్నమెంట్‌కు వెళ్తున్నదని, టెన్నిస్ కోసం చందన పడుతున్న కష్టాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది మునిలక్ష్మి. భగవంతుడి దయ వల్ల స్పాన్సర్స్ ముందుకు వస్తే రాకెట్లా దూసుకుపోతానని, దేశానికి మెడల్స్ సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది చందన. రాయలసీమ టోర్నీ నుంచి ఇంటర్నేషనల్ టోర్నీల వరకు నొవాక్ జొకోవిచ్, సెరీనా విలియమ్స్ తన రోల్ మోడల్స్ అంటున్న చందన అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీల్లో ఆరుసార్లు స్టేట్ చాంపియన్. అండర్ 12 ఏజ్ గ్రూప్‌లో రాయలసీమ టోర్నమెంట్ గెలిచింది. అండర్ 14లో చిత్తూరు, చెన్నై, పులివెందుల టైటిల్స్ సొంతం చేసుకుంది. చందన తొలి డబుల్స్ టైటిల్ కూడా పులివెందుల నుంచే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేషనల్స్‌లో నాలుగు సార్లు పాల్గొన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇంటర్నేషనల్ టోర్నీలు 15 ఆడింది. ఈ రైట్ హ్యాండెడ్ ప్లేయర్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఉమెన్స్ డబుల్స్ (21), సింగిల్స్ (35), ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఒన్ లాక్ రుపీస్ ఉమెన్స్ టోర్నమెంట్ సింగిల్స్‌లో 5 సార్లు విజేతగా, మరో 12 సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆరుదఫాలు డబుల్స్ ఫైనలిస్ట్. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా రాకెట్‌ని వదల్లేదు చందన. సరైన ఆహారం లేక కళ్లు తిరుగుతున్నా అలాగే టోర్నమెంట్ ఆడి, మజిల్ క్రాంప్తో కడుపు నొప్పితో బాధపడినప్పుడు కూడా ‘టెన్నిస్ అంటే నాకుప్రాణం’ ఆట కోసంప్రాణమైనా ఇస్తానన్నది చందన. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
సహజ సంచలనం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సహజ 5–7, 6–0, 6–2తో మూడో సీడ్ హీన్ షి (చైనా)పై సంచలన విజయం సాధించింది. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో సహజ 6–3, 6–4తో కమోన్‌వన్ యోద్పెచ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక
అడిలైడ్ (ఆ్రస్టేలియా): ప్లేఫోర్డ్ ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ అమ్మాయ భమిడిపాటి శ్రీవల్లి రషి్మక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 303వ ర్యాంకర్ రష్మిక 6–4, 6–1తో గాబ్రియేలా (ఆ్రస్టేలియా)పై గెలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ విభాగంలో రష్మిక–వైదేహి (భారత్) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రషి్మక–వైదేహి ద్వయం 4–6, 6–7 (5/7)తో యుకీ నైటో–నహో సాటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
విజేత తనీషా
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ15 టోర్నమెంట్లో భారత్‌కు చెందిన తనీషా కశ్యప్ విజేతగా నిలిచిది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అస్సాంకు చెందిన 22 ఏళ్ల తనీషా మూడు సెట్ల పోరాటంలో విజయాన్ని అందుకుంది. భారత్‌కే చెందిన ఆకాంక్ష నిట్టూరేతో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో తనీషా 6–7 (5/7), 6–1, 6–1తో గెలుపొందింది. తద్వారా తన కెరీర్లో తొలి ఐటీఎఫ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో తనీషా 10 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో చేజార్చుకున్న తనీషా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. కేవలం రెండు గేమ్‌లను మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను దక్కించుకుంది. తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన తనీషా ప్రత్యర్థి సర్విస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసింది. చాంపియన్ తనీషాకు 2,352 డాలర్లు (రూ. 1 లక్షా 97 వేలు), రన్నరప్ ఆకాంక్షకు 1,470 డాలర్లు (రూ. 1 లక్షా 23 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
హుమేరా–పూజా జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ15 టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి హుమేరా బహార్మస్ డబుల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. బెంగళూరులో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హుమేరా భారత్‌కే చెందిన పూజా ఇంగాలెతో కలిసి డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ హుమేరా–పూజా ద్వయం 3–6, 6–0, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆకాంక్ష–సోహా సాదిక్ (భారత్) జోడీపై గెలిచింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హుమేరా–పూజా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకొని, ప్రత్యర్థి జోడీ సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. హుమేరా కెరీర్లో ఇది రెండో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2022లో హైదరాబాద్‌కే చెందిన శ్రీవల్లి రష్మికతో కలిసి హుమేరా గుర్‌గ్రామ్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో తొలిసారి డబుల్స్ టైటిల్‌ను సాధించింది. -
ఫైనల్లో హుమేరా జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ15 టోర్నీలో తెలంగాణ అమ్మాయి హుమేరా బహార్మస్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం బెంగళూరులో జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో హుమేరా–పూజా ఇంగాలె (భారత్) ద్వయం 7–6 (7/2), 6–4తో దివ భాటియా–సాయి సంహిత చామర్తి (భారత్) పై విజయం సాధించింది.హోరాహోరీగా సాగిన తొలి పోరులో పోరాడి గెలిచిన హుమేరా బహర్మస్ జంట... రెండో సెట్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ చెలరేగింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆకాంక్ష దిలీప్, తనీషా కశ్యప్ విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఆక్షాంక్ష 7–5, 3–6, 6–2తో వైష్ణవి ఆడ్కర్ (భారత్)పైనే విజయం సాధించగా... తనీషా 6–1, 7–5తో కరోలాన్ డెలానూ (న్యూ కాలెడోనియా) పై గెలిచింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ఆకాంక్షతో తనీషా అమీతుమీ తేల్చుకోనుంది. -
క్వార్టర్ ఫైనల్లో హుమేరా జోడీ
మైసూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి హుమేరా బహార్మస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో హుమేరా–పూజా ఇంగాలె (భారత్) జోడీ 7–6 (10/8), 6–4తో యశస్విని పన్వర్–వన్షిత పథానియా (భారత్) జంటపై గెలుపొందింది. తెలంగాణకే చెందిన స్మృతి భాసిన్ కూడా డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో స్మతి భాసిన్ (భారత్)–ఎలీనా జంషీది (డెన్మార్క్) ద్వయం 6–4, 6–4తో సోనల్ పాటిల్ (భారత్)–ప్రిషా వ్యాస్ (అమెరికా) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో అభయ వేమూరి, అపూర్వ వేమూరి తొలి రౌండ్లోనే ని్రష్కమించారు. అభయ 4–6, 3–6తో పూజా ఇంగాలె చేతిలో, అపూర్వ 5–7, 2–6తో యశస్విని చేతిలో ఓడిపోయారు. -
రష్మిక , స్మృతి శుభారంభం
మైసూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక , స్మృతి భాసిన్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 7–5, 6–1తో సోనల్ పాటిల్ (భారత్)పై నెగ్గగా... స్మృతి 4–6, 6–0, 6–2తో ఐదో సీడ్ కరోలాన్ డెలానే (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించింది.తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ హుమేరా బహార్మస్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో హుమేరా 7–5, 6–4తో అమోదిని నాయక్ (భారత్)పై గెలిచింది. డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ చిలకలపూడి శ్రావ్య శివాని (భారత్)–కరోలాన్ డెలానే (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో శ్రావ్య శివాని–కరోలాన్ ద్వయం 7–6 (7/3), 6–3తో శ్రీనిధి బాలాజీ–హర్షిణి నాగరాజ్ (భారత్) జంటను ఓడించింది. -
రన్నరప్ సహజ జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సహజ (భారత్)–జిబెక్ కులమ్బయేవా (కజకిస్తాన్) జోడీ 1–6, 7–5, 8–10తో అరియానా–కేలా క్రాస్ (కెనడా) జంట చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఐటీఎఫ్ టోర్నీ లో సహజ రన్నరప్‌గా నిలువడం ఇది రెండోసారి. జూలైలో ఇండియానాలో జరిగిన ఇవాన్స్విల్లె టోర్నీలో సహజ–హిరోకో (జపాన్) ద్వయం ఫైనల్లో ఓడిపోయింది. -
రన్నరప్ రష్మిక
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్లో రెండో సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన డబ్ల్యూ35 ఐటీఎఫ్ టోర్నీలో 22 ఏళ్ల రన్నరప్‌గా నిలిచింది. రెండో సీడ్ దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా)తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రష్మిక 3–6, 2–6తో ఓడిపోయింది. 67 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో రష్మికకు ప్రత్యర్థి సర్విస్‌ను బ్రేక్ చేసేందుకు తొమ్మిదిసార్లు అవకాశం వచ్చినా ఆమె ఒకసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఫైనల్ చేరే క్రమంలో రష్మిక టాప్ సీడ్, ఐదో సీడ్, ఏడో సీడ్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ టోర్నీ ప్రదర్శనతో రష్మిక నేడు విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ 428వ ర్యాంక్‌కు చేరుకుంటుంది. -
విజేత రష్మిక – వైదేహి జోడి
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వరల్డ్ టూర్ – డబ్ల్యూ35 టోర్నీ డబుల్స్ విభాగంలో భారత జోడి శ్రీవల్లి రష్మిక భమిడిపాటి – వైదేహి చౌదరి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రష్మిక – వైదేహి జంట 6–3, 7–5 స్కోరుతో నాలుగో సీడ్ య సువాన్ లీ (చైనీస్ తైపీ) – సొహ్యున్ పార్క్ (కొరియా)ని ఓడించింది. మరో వైపు సింగిల్స్ విభాగంలో కూడా రష్మిక ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్లో రష్మిక 6–3, 6–4తో ఏడో సీడ్ పొలినా లాట్సెంకో (రష్యా)పై గెలుపొందింది. ఫైనల్లో రెండో సీడ్ దలిలా జకుపొవిక్ (స్లొవేకియా)తో రష్మిక తలపడుతుంది. -
రఫ్ఫాడించిన రష్మిక
ఇండోర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కళ్లు చెదిరే ప్రదర్శన చేసింది. సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన రష్మిక... డబుల్స్ విభాగంలో తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 486వ ర్యాంకర్ రషి్మక 6–0, 6–0తో ప్రపంచ 249వ ర్యాంకర్ జస్టినా మికుల్స్కయిటీ (లిథువేనియా)పై జయభేరి మోగించింది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏకంగా ‘డబుల్ బేగల్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ ఇవ్వకుండా సెట్‌ను 6–0తో గెలిస్తే టెన్నిస్ పరిభాషలో దానిని ‘బేగల్’గా అభివర్ణిస్తారు. ఈ మ్యాచ్‌లో రష్మిక రెండు సెట్లలోనూ ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. జస్టినా సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసిన రష్మిక తన సర్వీస్‌లో మూడుసార్లు గేమ్ పాయింట్లను కాపాడుకుంది. మరోవైపు డబుల్స్ సెమీఫైనల్లో రష్మిక–వైదేహి జోడీ 6–1, 7–6 (8/6)తో హైదరాబాద్‌కు చెందిన సహజ యామలపల్లి–జీల్ దేశాయ్ (భారత్) జంటపై గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ద్వయం మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ యా సువాన్ లీ (చైనీస్ తైపీ)–షోయున్ పార్క్ (దక్షిణ కొరియా) జోడీతో రషి్మక–వైదేహి జంట తలపడుతుంది. సింగిల్స్ సెమీఫైనల్లో ఏడో సీడ్ పొలీనా లాచెంకో (రష్యా)తో రషి్మక ఆడుతుంది. -
రష్మిక జోడీ శుభారంభం
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–2, 6–1తో సౌజన్య బవిశెట్టి (భారత్)–మె హసెగావా (జపాన్) జంటను ఓడించింది. సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సౌజన్య బవిశెట్టి, హుమేరా బహార్మస్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
అంకిత రైనా జోడీకి టైటిల్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్ – డబ్ల్యూ35) మహిళల ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి అంకిత రైనా తన భాగస్వామితో కలిసి విజేతగా నిలిచింది. కజకిస్తాన్‌కు చెందిన జిబెక్ కులంబయెవాతో కలిసి అంకిత డబుల్స్ బరిలోకి దిగింది. శనివారం జరిగిన ఫైనల్లో అంకిత – జిబెక్ ద్వయం 6–4, 6–2 స్కోరుతో జాక్లిన్ కబాజ్ (స్వీడన్) – జస్టినా మికుల్‌సైట్ (లిథుయేనియా)పై విజయం సాధించింది. అయితే సింగిల్స్ విభాగంలో అంకితకు సెమీ ఫైనల్లోనే చుక్కెదురైంది. సెమీస్‌లో కొరియాకు చెందిన యెన్ వూ కూ 7–6 (7/4), 6–3 తేడాతో అంకితను ఓడించింది. మరో సెమీస్‌లో దలిలా జకుపొవిక్ (స్లొవేకియా)ను 6–4, 2–6, 7–6 (7/0)తో ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించిన జస్టినా మికుల్‌సైట్ (లిథుయేనియా) తుది పోరులో యెన్ వూ కూతో తలపడేందుకు సిద్ధమైంది. -
పోరాడి ఓడిన సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి పోరాటం ముగిసింది. గురుగ్రామ్‌లో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సహజ 5–7, 6–3, 0–6తో టాప్ సీడ్ దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత నంబర్‌వన్ అంకిత రైనా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో అంకిత 4–6, 6–2, 6–4తో జాక్వెలిన్ (స్వీడన్)పై గెలిచింది. -
సింగిల్స్ క్వార్టర్స్‌లో సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 329వ ర్యాంకర్ సహజ 7–6 (10/8), 7–5తో భారత్‌కే చెందిన రియా భాటియాను ఓడించింది. మరోవైపు తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ శ్రీవల్లి రషి్మక రెండో రౌండ్లో 6–1, 3–6, 6–7 (5/7)తో ఏడో సీడ్ జాక్వెలిన్ కబాజ్ అవాద్ (స్వీడన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో సహజ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు ప్లేయర్లు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ఐదో సీడ్ సహజ 6–4, 6–2తో జపాన్‌కు చెందిన కొషిషి అయుమిపై గెలుపొందగా, శ్రీవల్లి రష్మిక 6–1, 6–2తో క్వాలిఫయర్ యమజకి ఐకుమి (జపాన్)పై అలవోక విజయం సాధించింది. డబుల్స్ బరిలోనూ దిగిన రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో రష్మిక–వైదేహి చౌదరి జోడీ 6–0, 6–1తో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందిన భారత జంట కశిష్ భాటియా–సాహిర సింగ్‌పై గెలిచింది. టాప్‌సీడ్ అంకిత రైనా (భారత్)– కులంబయెవా జిబెక్ (కజకిస్తాన్) జంట 2–6, 6–3, 11–9తో జీల్ దేశాయ్ (భారత్)–ఒకువకి రినొన్ (జపాన్) ద్వయంపై గెలిచింది. మిగతా సింగిల్స్ పోటీల్లో రియా భాటియా 7–6 (7/5), 6–4తో భారత క్వాలిఫయర్ అంజలిని ఓడించింది. హుమేరా బహర్మస్ 1–6, 0–6తో కులంబయెవా జిబెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడింది. -
ఇస్లామాబాద్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
ఇస్లామాబాద్: డేవిస్‌కప్ గ్రూప్–1 ప్లేఆఫ్ పోరులో భాగంగా పాకిస్తాన్ జట్టుతో తలపడేందుకు 1964 తర్వాత భారత జట్టు మళ్లీ పాకిస్తాన్లో అడుగు పెట్టింది. రామ్‌కుమార్, శశికుమార్ ముకుంద్, యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ, దిగ్వి జయ్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత బృందంలో ఉన్నారు. చివరిసారిగా భారత్, పాక్‌లు 1964లో పాక్ గడ్డపై పోటీపడ్డాయి. 2019లోనూ పాకిస్తాన్లో భారత జట్టు పర్యటించాల్సి ఉండగా... ఈ మ్యాచ్‌ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) తటస్థ వేదిక కజకిస్తాన్‌కు మార్చింది. ఈ పోరులో భారత్ 4–1తో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈసారి మాత్రం పాకిస్తాన్లో భారత జట్టు ఆడాల్సిందేనని, వేదిక మార్చడం వీలుకాదని ఐటీఎఫ్ స్పష్టం చేసింది. భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌రోహిత్ రాజ్‌పాల్ వ్యక్తిగత కారణాలతో పాకిస్తాన్‌కు వెళ్లలేకపోవడంతో జీషాన్ అలీ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. కోచ్‌గా వచ్చిన జీషాన్ నాన్ ప్లేయింగ్ కెపె్టన్‌గానూ వ్యవహరిస్తాడు. -
టాప్ సీడ్ జోడీకి రష్మిక ద్వయం షాక్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టో ర్నీలో హైదరాబాద్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నవీ ముంబైలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక –వైదేహి (భారత్) ద్వయం 7–6 (7/5), 6–2తో టాప్ సీడ్ జిబెక్ కులమ్బయేవా (కజకిస్తాన్)–జస్టినా మికుల్స్కయిట్ (లిథువేనియా) జోడీని బోల్తా కొట్టించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సహజ యామలపల్లి–వైష్ణవి (భారత్) జంట 1–6, 6–2, 12–14తో అకీకో ఒమాయి (జపాన్)–బీట్రయిస్ గుమల్యా (ఇండోనేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. -
‘పాక్‌లో డేవిస్ కప్ ఆడాల్సిందే’
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో డేవిస్ కప్ పోరును మార్చే విషయంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)కు ఎదురు దెబ్బ తగిలింది. పాక్ గడ్డపై డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లేఆఫ్ ‘టై’ పోటీలు ఆడాల్సిందేనని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) శనివారం స్పష్టం చేసింది. పాక్‌లో కాకుండా మరో తటస్థ వేదికపై ఆడేందుకు అనుమతించాలని ‘ఐటా’ గతంలో అప్పీలు చేసుకుంది. దీన్ని విచారించిన ఐటీఎఫ్ ట్రిబ్యునల్ గురువారం తమ నిర్ణయాన్ని వెలువరించింది. 15 మంది సభ్యులు గల డేవిస్ కప్ కమిటీ (డీసీసీ) ‘ఐటా’ అప్పీల్‌ను తోసిపుచ్చింది. ‘పాకిస్తాన్లో డేవిస్ కప్ టై పోటీలు నిర్వహించాలనే డీసీసీ నిర్ణయానికి బలమైన ఆధారాలున్నాయి. డీసీసీ ఎంపిక చేసిన వేదికపై ఆడటం అన్ని దేశాలకు వర్తిస్తుంది’ అని ట్రిబ్యునల్ వెల్లడించినట్లు పాకిస్తాన్ తెలిపింది. పాక్‌లో డేవిస్ కప్ పోటీ లు విజయవంతంగా జరి గాయని, అలాంటపుడు భారత్ అక్కడ ఆడటానికి విముఖత చూపడం అర్థరహితమని డీసీసీ అభిప్రాయపడింది. ‘భద్రత ఏర్పాట్లు ఆతిథ్య దేశం చూసుకుంటుంది. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నప్పుడు తప్పించుకోవాలనుకోవడం సబబు కాదు’ అని డీసీసీ వర్గాలు తెలిపాయి. దీనిపై ‘ఐటా’ ప్రధాన కార్యదర్శి అనిల్ ధూపర్ స్పందిస్తూ ‘క్రీడాశాఖతో ఈ విషయంపై చర్చిస్తాం. ఆ తర్వాతే జట్టును పంపడంపై మార్గదర్శకాలు వస్తాయి’ అని అన్నారు. భారత్ వెళ్లకపోతే పాక్‌నే విజేతగా ప్రకటిస్తారు. -
రష్మిక జోడీకి డబుల్స్ టైటిల్... సింగిల్స్ చాంపియన్ రామ్‌కుమార్
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో భారత క్రీడాకారులు రాణించారు. అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్ టెన్నిస్ టూర్ టో ర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక భారత్‌కే చెందిన వైదేహితో కలిసి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్ ఫైనల్లో రష్మిక –వైదేహి ద్వయం 6–1, 6–2తో సోహా సాదిక్–ఆకాంక్ష (భారత్) జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక జోడీ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో రష్మిక పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో రామ్‌కుమార్ 6–2, 6–1తో డేవిడ్ పిచ్లార్ (ఆ్రస్టియా)పై నెగ్గాడు. రెండు నెలల వ్యవధిలో రామ్‌కుమార్‌కిది మూడో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. -
రన్నరప్ రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల టెన్నిస్ (ఐటీఎఫ్) సర్క్యూట్లో తొలి సింగిల్స్ టైటిల్ సాధించేందుకు హైదరాబాద్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఇంకొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. బ్యాంకాక్‌లోని హువా హిన్‌లో ఆదివారం ముగిసిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో రష్మిక రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆరో సీడ్ రష్మిక 2–6, 1–6తో రెండో సీడ్ అయూమి కోషిషి (జపాన్) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఏకంగా పది డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. తన సర్విస్‌ను ఆరుసార్లు కోల్పోయిన రష్మిక ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. రన్నరప్‌గా నిలిచిన రష్మికకు ట్రోఫీతోపాటు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సెమీస్‌లో రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీవల్లి రషి్మక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రషి్మక 6–2, 6–3తో వలెరి జినీనా (రష్యా)పై గెలిచింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించింది. మరోవైపు న్యూఢిల్లీలో జరుగుతున్న ఫెనెస్టా ఓపెన్ జాతీయ చాంపియన్íÙప్లో అండర్–14 బాలుర డబుల్స్ విభాగంలో హృతిక్ కటకం (తెలంగాణ)–తవీష్ (హరియాణా) జోడీ టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో హృతిక్–తవీష్ ద్వయం 6–4, 7–5తో శౌర్య–రణ్వీర్ జంటపై నెగ్గింది. సింగిల్స్‌లో హృతిక్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో హృతిక్ 6–4, 6–1తో అనురాగ్‌పై గెలిచాడు. -
ఐటీఎఫ్ టోర్నీలో రన్నరప్‌గా రష్మిక జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గుర్‌గ్రామ్‌లో శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ రష్మిక–వైదేహి చౌదరీ (భారత్) జోడీ 2–6, 2–6తో రెండో సీడ్ జీల్ దేశాయ్ (భారత్)–పునిన్ కొవాపిటుక్‌టెడ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ విభాగంలో రష్మిక పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. -
సానియా, ప్రాంజలకు ఐటీఎఫ్ ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తక్కువ ర్యాంకుల్లో ఉన్న టెన్నిస్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. జాతీయ క్రీడా సమాఖ్యల ద్వారా అర్హులైన ఆటగాళ్లకు ఈ సహాయ నిధిని అందిస్తామని చెప్పింది. సింగిల్స్‌లో 500–700 మధ్య... డబుల్స్‌లో 175–300 మధ్య ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను అర్హులుగా పేర్కొంది. ‘ఇదేం పెద్ద మొత్తం కాదు. ఒక్కో ఆటగాడికి 2000 డాలర్లు (రూ.1,51,100) లభించవచ్చు. జాతీయ సమాఖ్యలు అర్హులైన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అందజేస్తాయి’ అని ఐటీఎఫ్ ప్రకటించింది. దీని ప్రకారం 12 మంది భారత క్రీడాకారులు ఈ సహాయం పొందే వీలుంది. పురుషుల సింగిల్స్‌లో మనీశ్ కుమార్ (642 ర్యాంక్), అర్జున్ ఖడే (655)...డబుల్స్‌లో సాకేత్ మైనేని (180), విష్ణువర్ధన్ (199), అర్జున్ ఖడే (231), విజయ్ సుందర్ ప్రశాంత్ (300)... మహిళల సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ (606), సౌజన్య భవిశెట్టి (613), జీల్ దేశాయ్ (650), ప్రాంజల యడ్లపల్లి (664)... డబుల్స్‌లో రుతుజా భోస్లే (196), సానియా మీర్జా (226) ఈ సహాయం అందుకోనున్నారు. తక్కువ ర్యాంకుల్లో ఉన్న 800 మంది క్రీడాకారుల్ని ఆదుకునేందుకు ఏటీపీ, డబ్ల్యూటీఏ, గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆతిథ్య దేశాలు, అగ్రశ్రేణి క్రీడాకారులు కలిసి 60 లక్షల డాలర్ల (రూ. 45 కోట్లు) సహాయనిధిని ఏర్పాటు చేశాయి. -
క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్ జోడీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్ జోడీకి చుక్కెదురైంది. కోల్‌కతా వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్–అర్జున్ ఖడే జంట క్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 3–6, 4–6తో అభినవ్ షణ్ముగమ్–నితిన్ కుమార్ సిన్హా (భారత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్లో 6–2, 6–0తో విఘ్నేశ్ పెరణమల్లూర్ (భారత్)–లుకాస్ రెనార్డ్ జోడీపై గెలుపొందింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో అనిరుధ్ చంద్రశేఖర్–కలియాంద పూనచా (భారత్) జంట 6–4, 4–6, 10–7తో వినాయక్ శర్మ కాజా–మనీశ్ కుమార్ (భారత్) జోడీపై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. సింగిల్స్ విభాగంలో విష్ణువర్ధన్, గంటా సాయి కార్తీక్ రెడ్డి తొలి రౌండ్లోనే వెనుదిరగగా... వినాయక్ శర్మ కాజా రెండో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. విష్ణువర్ధన్ 7–5, 2–6, 0–3తో నితిన్ కుమార్ సిన్హా చేతిలో, సాయి కార్తీక్ 6–7, 4–6తో లుకాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో వినాయక్‌శర్మ కాజా 3–6, 1–6తో ఐడో సీడ్ ఎరిక్ వాన్‌షెల్‌బోయిమ్ చేతిలో ఓడిపోగా... నాలుగో సీడ్ అర్జున్ ఖడే 6–3, 6–4తో క్వాలిఫయర్ ప్రబోధ్ సూరజ్‌పై, ఏడో సీడ్ ఆర్యన్ 6–3, 6–1తో లుకాస్‌పై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకున్నారు. -
టైటిల్‌పోరుకు అనిరుధ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ నిలకడగా రాణిస్తున్నాడు. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి విజయ్ సుందర్ ప్రశాంత్‌తో కలిసి అనిరుధ్ డబుల్స్ విభాగంలో టైటిల్‌పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్–విజయ్ సుందర్ (భారత్) ద్వయం 6–0, 6–4తో చుకాంగ్ వాంగ్–జిహావో షియా (చైనా) జోడీపై గెలుపొందింది. అంతకుముందు క్వార్టర్స్‌లో 6–1, 6–3తో చెంగ్ హాన్–చాంగ్ జాంగ్ (చైనా) జోడీపై నెగ్గారు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో విఘ్నేశ్ పెరణమల్లూర్–చెరుకు వశిష్ట్ (భారత్) జంట 6–3, 4–6, 5–10తో చుకాంగ్ వాంగ్–జిహావో షియా (చైనా) జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్ విభాగంలో అనిరుధ్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ (భారత్) 7–5, 0–6, 0–6తో నాలుగో సీడ్ టకాషి సయాటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో అనిరుధ్ 6–4, 6–1తో జియాన్ యావో హో (చైనా)పై గెలుపొందాడు. -
పిమ్రదా డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: రాజా నరసింహారావు స్మారక అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నమెంట్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి పిమ్రదా జటవపోర్నవీట్ చాంపియన్‌గా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్–18 బాలికల ఫైనల్లో టాప్ సీడ్ పిమ్రదా 6–1, 6–1తో సందీప్తి సింగ్ రావు (భారత్)పై గెలుపొందింది. డబుల్స్‌లోనూ పిమ్రదా జోడీ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. తుదిపోరులో పిమ్రదా–లాన్లనా (థాయ్‌లాండ్) జంట 6–1, 7–6తో మల్లికా (భారత్)–యటావీ చిమ్‌చమ్ (థాయ్‌లాండ్) ద్వయంపై నెగ్గింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ ప్యాట్రన్ హన్‌చైకుల్ (థాయ్‌లాండ్) 5–7, 6–0, 6–2తో అదిత్ సిన్హా (అమెరికా)పై గెలుపొందాడు. డబుల్స్ తుదిపోరులో నిశాంత్ దబాస్ (భారత్)–తనపట్ నిరున్‌డోర్న్ (థాయ్‌లాండ్) ద్వయం 6–4, 6–3తో ఆర్యన్ భాటియా–చిరాగ్ దుహాన్ జోడీపై నెగ్గింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
తొలి రౌండ్లో సౌజన్య ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారుల పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. జోధ్‌పూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో సౌజన్య భవిశెట్టి, సాయి సంహిత చామర్తి మొదటి రౌండ్లోనే ఓడిపోయారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సౌజన్య 5–7, 3–6తో పైజె హైరియాన్ (న్యూజిలాండ్) చేతిలో, సాయి సంహిత 4–6, 1–6తో మూడో సీడ్ వలేరియా స్ట్రాకోవా (ఉక్రెయిన్) చేతిలో ఓటమి పాలయ్యారు. ఇతర మ్యాచ్‌ల్లో వైదేహి చౌదరి (భారత్) 3–6, 3–6తో మిహేలా జకోవిచ్ (సెర్బియా) చేతిలో, మహెక్ జైన్ (భారత్) 4–6, 4–6తో ఫత్మా నభాని (ఒమన్) చేతిలో ఓడటంతో ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. మరోవైపు డబుల్స్ విభాగంలోనూ తెలంగాణ క్రీడాకారులకు కలిసి రాలేదు. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సామ సాత్విక–సాయి సంహిత (భారత్) ద్వయం 2–6, 3–6తో సోఫియా షపటవా (జార్జియా)–ఎమిలీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయి తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. -
డబుల్స్ క్వార్టర్స్‌లో సంజన జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోర్‌లో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సంజన–రియా (భారత్) ద్వయం 6–4, 6–2తో అష్‌ప్రీత్ కౌర్ బజ్వా–నైషా శ్రీవాస్తవ్ (భారత్) జోడీపై విజయం సాధించింది. ఇదే టోర్నీ బాలుర డబుల్స్ తొలి రౌండ్లో వడ్డేపల్లి కార్తీక్‌నీల్ (భారత్)–ప్యాట్రిక్ స్పిగెల్ (స్లొవేనియా) జోడీ 2–6, 5–7తో నిశాంత్ దబస్–శక్తివేల్ భూపతి (భారత్) జంట చేతిలో ఓడింది. -
మెయిన్ ‘డ్రా’కు చేరువలో భువన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు భువన కాల్వ, సామ సాత్విక, సాయి సంహిత చామర్తి ముందంజ వేశారు. జోధ్‌పూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరు మెయిన్ డ్రా పోటీలకు మరో విజయం దూరంలో నిలిచారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో పదో సీడ్ భువన 7–6 (7/3), 6–4తో నటాషాపై గెలుపొందగా... పన్నెండో సీడ్ సామ సాత్విక 6–0, 6–0తో వైదేహిని చిత్తుగా ఓడించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ సాయి సంహిత 6–2, 6–2తో ఫర్హత్ అలీన్ ఖమర్పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది. -
సంజన శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల శుభారంభం చేసింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సంజన 6–1, 6–0తో సానియా మనోజ్‌పై సులువుగా విజయం సాధించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో సంజన–రియా జోడీ తమ ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చింది. దీంతో టాప్ సీడ్ ప్రియాన్షి భండారి–హృదయ షా జంట నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. -
ఫైనల్లో అనిరుధ్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీలో తెలంగాణ క్రీడాకారుడు అనిరుధ్ చంద్రశేఖర్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. చైనాలోని ఆనింగ్ నగరంలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ కేటగిరీలో అనిరుధ్ తన భాగస్వామి ఎన్. విజయ్ సుందర్ ప్రశాంత్‌తో కలిసి ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అనిరుధ్–విజయ్ సుందర్ (భారత్) ద్వయం 4–6, 7–5, 10–8తో సొరా ఫుకుడా–తైసీ ఇచికవా (జపాన్) జంటపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో భారత జోడీ 7–6 (7/5), 6–4తో జియు చె– వికియాంగ్ జెంగ్ (చైనా) జంటను ఓడించింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో అనిరుధ్ తొలిరౌండ్లోనే ఓడిపోగా... విజయ్ సుందర్ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో అనిరుధ్ 6–4, 1–6, 4–6తో టాప్ సీడ్ టి చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, ప్రిక్వార్టర్స్‌లో విజయ్ సుందర్ 5–7, 2–6తో హావో వు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సెమీస్‌లో రష్మిక ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–3 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. పుణేలోని డెక్కన్ జింఖానా గ్రౌండ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో రష్మిక సెమీస్‌లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీస్‌లో రష్మిక 4–6, 6–3, 3–6తో జటవపోర్నవంతి పిమ్రద (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడింది. -
సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక నిలకడగా రాణిస్తోంది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో రష్మిక సెమీఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–0, 7–6 (1)తో టాప్ సీడ్ శివాని అమినేనిపై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జటవపోర్నవీత్ పిమ్రద (ఐదో సీడ్)తో రష్మిక తలపడుతుంది. -
విజేత కేవీఎన్ మూర్తి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సీనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కేవీఎన్ మూర్తి విజేతగా నిలిచాడు. నేపాల్‌లో ఆదివారం జరిగిన 45 ప్లస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూర్తి 6–4, 6–1తో అమ్రిత్ బహదూర్ (నేపాల్)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో యూఎస్ఏలో ఈనెల 21 నుంచి 26 వరకు జరుగనున్న ఐటీఎఫ్ యంగ్ సీనియర్స్ ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యాడు. -
సింగిల్స్ ఫైనల్లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. నైజీరియాలోని లాగోస్ లాన్‌టెన్నిస్ క్లబ్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ లో ప్రాంజల ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరోసీడ్ ప్రాంజల(భారత్) 6–2, 5–0తో నాలుగోసీడ్ విక్టోరియా (అర్జెంటీనా)పై గెలుపొందింది. తొలి సెట్‌ను గెలిచిన ప్రాంజల రెండో సెట్లోనూ 5–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి విక్టోరియా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. -
ప్రాంజల జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డబుల్స్ కేటగిరీలో భారత్‌కు చెందిన రుతుజా భోసాలేతో జతకట్టిన ప్రాంజల టైటిల్‌ను గెలుచుకోగా... సింగిల్స్ విభాగంలో సెమీస్‌లో పరాజయం పాలైంది. థాయ్‌లాండ్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ ప్రాంజల–రుతుజ ద్వయం 2–6, 6–0, 10–6తో టాప్ సీడ్ బైన్స్ నయ్‌క్తా (ఆస్ట్రేలియా)–స్టెఫ్‌కోవా బార్బోరా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్రాంజల 3–6, 6–2, 2–6తో వాంగ్ జియు (చైనా) చేతిలో ఓటమి పాలైంది. -
రన్నరప్ సాయికార్తీక్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో గంటా సాయికార్తీక్ రెడ్డి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జోర్డాన్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో సాయికార్తీక్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచాడు. బాలుర సింగిల్స్ ఫైనల్లో సాయికార్తీక్ 3–6, 4–6తో అబెదల్లా షెల్బే (జోర్డాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సాయికార్తీక్ 6–2, 7–5తో ప్రసన్న ప్రవీణ్ (భారత్)పై గెలిచాడు. డబుల్స్ ఫైనల్లో అమెరికాకు చెందిన అర్జున్ మరియప్పతో జత కట్టిన సాయికార్తీక్ 2–6, 6–7తో అలెక్స్ జియాంగ్ (కెనడా)– కెవిన్ పటేల్ (భారత్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
రన్నరప్ సాయి కార్తీక్
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్–5 బాలుర టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయి కార్తీక్ రెడ్డి రాణించాడు. జోర్డాన్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 614వ స్థానంలో ఉన్న కార్తీక్ శనివారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో 2–6, 5–7తో అబెదల్లా షెల్‌బా (జోర్డాన్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో కార్తీక్ 6–3, 6–3తో మొహమ్మద్ బర్హామ్ (ట్యునీషియా)పై, క్వార్టర్స్‌లో 6–0, 7–5తో అర్జున్ మరియప్ప (అమెరికా)పై విజయాలు సాధించాడు. -
ప్రాంజల జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో భారత్‌కే చెందిన రుతుజా భోసాలేతో జతకట్టిన ప్రాంజల డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో ప్రాంజల–రుతుజ (భారత్) ద్వయం 7–5, 6–2తో రెండోసీడ్ పెయ్ సున్ చెన్–ఫాంగ్ సిన్ వు (చైనీస్ తైపీ) జోడీపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఈ భారత జోడీ 6–2, 6–3తో టాప్‌సీడ్ జియా–కి కంగ్ (చైనా)–పీంగ్టర్న్ లిపెచ్ (థాయ్‌లాండ్) జంటకు షాకిచ్చింది. -
తుదిపోరుకు ప్రాంజల జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఫైనల్‌కు చేరుకుంది. హాంకాంగ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి విక్టోరియా ముంటేన్ (ఫ్రాన్స్)తో కలిసి తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాంజల (భారత్)– విక్టోరియా (ఫ్రాన్స్) జంట 7–5, 7–5తో రిసా ఓజాకి– రము యుడా (జపాన్) జోడీపై నెగ్గింది. -
ఫైనల్లో ఓడిన అనిరుధ్–విఘ్నేశ్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జింబాబ్వే ఎఫ్–1 ఫ్యూచర్స్ పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు అనిరుధ్ చంద్రశేఖర్– విఘ్నేశ్ పెరణమల్లూర్ జంటకు నిరాశ ఎదురైంది. జింబాబ్వేలో జరిగిన ఈ టోర్నీలో ఈ జోడీ ఫైనల్లో పరాజయం పాలై టైటిల్‌ను కోల్పోయింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అనిరుధ్–విఘ్నేశ్ (భారత్) జంట 3–6, 0–6తో టాప్ సీడ్ బెంజమిన్ లాక్–కాట్నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో అనిరుధ్ రెండోరౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో అనిరుధ్ (భారత్) 4–6, 2–6తో ఆరోన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓటమి చవిచూశాడు. అంతకుముందు తొలిరౌండ్లో అనిరుధ్ 6–0, 7–6 (7/5)తో వాసిలియోస్ కారిపి (రష్యా)పై గెలుపొందాడు. -
రన్నరప్ ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల–రలూకా సెర్బాన్ (రొమేనియా) ద్వయం 4–6, 4–6తో టాప్ సీడ్ గిలియానా (మెక్సికో)–లారా పిగోసి (బ్రెజిల్) జంట చేతిలో ఓడిపోయింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల జోడీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. -
సెమీస్‌లో వినాయక్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు కాజా వినాయక్ శర్మకు బుధవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. చండీగఢ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్‌లో సెమీస్‌కు చేరిన వినాయక్ శర్మ సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. పురు షుల డబుల్స్ క్వార్టర్స్‌లో మోహిత్ మయూర్ జయప్రకాశ్– వినాయక్ శర్మ జంట 7–5, 5–4 (రిటైర్డ్ హర్ట్)తో విజయంత్ మలిక్–దల్విందర్ సింగ్ (భారత్) జోడీపై నెగ్గింది. నేడు జరిగే సెమీస్‌లో కునాల్ ఆనంద్–షాబాజ్ ఖాన్ (భారత్) జంటతో వినాయక్ శర్మ ద్వయం తలపడుతుంది. మరోవైపు సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో వినాయక్ శర్మ 4–6, 2–6తో దల్విందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. -
సెమీస్‌లో సాకేత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియన్ ఫ్యూచర్స్–2 పురుషుల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని నిలకడగా రాణిస్తున్నాడు. కోల్‌కతాలో జరుగుతోన్న ఈ టోర్నీలో సాకేత్ సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఏడో సీడ్ సాకేత్ 6–3, 6–3తో రెండోసీడ్ శశికుమార్ ముకుంద్‌కు షాకిచ్చాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ఐదో సీడ్ అర్జున్‌తో సాకేత్ తలపడతాడు. -
రన్నరప్ ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల (భారత్)–లీ పెచి (చైనీస్ తైపీ) ద్వయం 2–6, 3–6తో నాలుగో సీడ్ మార్టినా కోల్‌మాగ్నా (ఇటలీ)–వలెరియా సోలోవియా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. 67 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. -
ఫైనల్లో ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో టైటిల్ పోరుకు చేరుకుంది. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాంజల (భారత్)–లీ పెచి (చైనీస్ తైపీ) ద్వయం 6–2, 6–2తో చార్లోటి రొమెర్ (ఈక్వెడార్)–హెలెన్ షోల్సెన్ (బెల్జియం) జంటపై గెలిచింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల జంట రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. శనివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ మార్టినా కోల్‌మాగ్నా (ఇటలీ)–వలెరియా సోలోవియా (రష్యా) జంటతో ప్రాంజల ద్వయం ఆడుతుంది. సింగిల్స్ విభాగంలో మాత్రం ప్రాంజల తొలి రౌండ్లోనే ఓడిపోయింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన ప్రాంజల తొలి రౌండ్లో 3–6, 2–6తో క్వాలిఫయర్ కరోలినా బెరెన్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి చవిచూసింది. -
తండ్రీ కొడుకుల తడాఖా
సాక్షి, హైదరాబాద్: ఇండియా టెన్నిస్ లీగ్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు సత్తా చాటారు. వీరిద్దరూ జంటగా బరిలోకి దిగి డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లోని కల్లూర్ టెన్నిస్ అకాడమీలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో కేవీఎన్ మూర్తి–కె. పరేశ్ జంట టాప్ సీడ్ సూర్య పవన్–ఎర్రన్ సాయి జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో 35+, 45+ వయో విభాగంలో సత్తా చాటుతోన్న కేవీఎన్ మూర్తి 30 ఏళ్ల వయస్సులో ఆటవిడుపుగా టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్నాడు. తర్వాత ఈ క్రీడలో రాణిస్తూ 2017లో జరిగిన నేపాల్ ఐటీఎఫ్ సీనియర్ (45+) చాంపియన్ షిప్లో డబుల్స్ విజేతగా నిలవడంతో పాటు, సింగిల్స్ రన్నరప్ టైటిల్‌ను సాధించాడు. థాయ్‌లాండ్‌లో జరిగిన పట్టాయా టెన్నిస్ సీనియర్ సిరీస్‌లోనూ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఇవే కాకుండా పలు ఐటా సీనియర్ ర్యాంకింగ్ టోర్నీల్లో పతకాలను సాధించాడు. -
రిత్విక్ ‘డబుల్’ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–4 టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు రిత్విక్ చౌదరి బొల్లిపల్లి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. బాలుర సింగిల్స్ ఫైనల్లో రిత్విక్ 4–6, 6–2, 6–0తో అబ్దుల్ షకుర్ కబురా (బురుండి)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో 6–3, 6–0తో గిలియన్ ఓస్మోంట్ (ఫ్రాన్స్)పై, క్వార్టర్స్‌లో 6–3, 6–0తో అలీ హబిద్ (గ్రేట్ బ్రిటన్)పై విజయం సాధిం చాడు. మరోవైపు బాలుర డబుల్స్ టైటిల్‌పోరులో టాప్ సీడ్ రిత్విక్ (భారత్)–యాన్ అహ్మద్ (గ్రేట్ బ్రిటన్) జంట 6–1, 6–4తో అబ్దుల్ (బురుండి)–ర్యాన్ అటెటొ ర్యాండిక్ (కెన్యా) జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. -
రిత్విక్ జోడి ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారుల పోరాటం ముగిసింది. బాలుర డబుల్స్ విభాగంలో రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సెమీస్‌లో వెనుదిరగగా, బాలికల కేటగిరీలో శ్రీవల్లి రష్మిక, శివాని అమినేని క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యారు. ఢిల్లీలో గురువారం జరిగిన బాలుర డబుల్స్ సెమీస్‌లో రిత్విక్– అభిమన్యు (భారత్) జంట 6–7 (6), 2–6తో యాసిర్ కిలాని (మొరాకో)– బ్రాండన్ (వెనిజులా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–3, 1–6, 2–6తో ఆకాంక్ష (భారత్) చేతిలో ఓడిపోయింది. శివాని 6–1, 2–1తో ఆధిక్యం లో ఉన్న సమయంలో గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకుంది. ఫలితంగా ఆమె ప్రత్యర్థి మయ్ నపట్ నిరుండోర్న్ (థాయ్‌లాండ్) సెమీస్‌కు చేరుకుంది. -
క్వార్టర్స్‌లో రష్మిక, శివాని
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, శివాని అమినేనిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌కు చేరిన వీరిద్దరూ... డబుల్స్ కేటగిరీలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–4, 6–4తో సొనాషి భట్నాగర్ (భారత్)పై గెలుపొందింది. మరో ప్రిక్వార్టర్స్‌లో ఐదోసీడ్ శివాని (భారత్) 6–2, 6–2తో జూలి బెల్గ్రావెర్ (నెదర్లాండ్స్)ను ఓడించి ముందంజ వేసింది. మరోవైపు డబుల్స్ క్వార్టర్స్‌లో శివాని అమినేని (భారత్)–డోరోతేజ జొక్సోవిక్ (సెర్బియా) జంట 3–6, 4–6తో ఆంచిసా చాంట (థాయ్‌లాండ్)–హొ కి జెన్ని వాంగ్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్)–యునా ఒహాషి (జపాన్) ద్వయం 3–6, 6–3, 9–11తో సోఫియా–మార్గక్స్ (ఫ్రాన్స్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. బాలుర డబుల్స్ విభాగంలో రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సెమీస్‌కు చేరుకోగా, మాచెర్ల తీర్థ శశాంక్ జంట క్వార్టర్స్‌లో నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో రిత్విక్ చౌదరి–అభిమన్యు రెడ్డి (భారత్) జంట 6–3, 6–4తో సుశాంత్–రిథమ్ మల్హోత్రా (భారత్) జోడీపై గెలిచింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రిత్విక్–అభిమన్యు (భారత్) జంట 6–4, 6–1తో నాలుగో డాంగ్ జు కిమ్–జోంగ్ పార్క్ (కొరియా) జోడికి షాకిచ్చింది. మరో క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్–పీయూశ్ సురేంద్ర (భారత్) జంట 4–6, 2–6తో లూయిస్ హెర్మన్–గౌథియర్ (బెల్జియం) జోడీ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ జోడి 7–5, 7–5తో నాథోలిన్ కాల్విన్ గోల్మి (భారత్)–నికిత్ రెడ్డి (అమెరికా) జోడీపై గెలుపొందింది. -
ప్రిక్వార్టర్స్‌లో భువన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో రాష్ట్ర క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో భువన కాల్వ ప్రిక్వార్టర్స్‌కు చేరుకోగా, సామ సాత్విక తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భువన 6–3, 6–3తో ప్రేరణ బాంబ్రీపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో సామ సాత్విక 6–4, 3–6, 1–6తో ధ్రుతి వేణుగోపాల్ చేతిలో ఓడిపోయింది. డబుల్స్ విభాగంలో సామ సాత్విక–రిషిక సుంకర జోడీలు క్వార్టర్స్‌కు చేరుకోగా... నిధి చిలుముల, షేక్ హుమేరా బేగం, సాయిదేదీప్య, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జంటలు ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సామ సాత్విక–జెన్నిఫర్ (భారత్) జంట 7–6 (7/5), 6–2తో షేక్ హుమేరా బేగం–సౌమ్య జోడీపై, రిషిక సుంకర–శ్వేత చంద్ర (భారత్) ద్వయం 6–1, 7–5తో సాయిదేదీప్య–సారా యాదవ్ (భారత్) జంటపై గెలుపొందాయి. శ్రీవల్లి రష్మిక–మౌలిక రామ్ జంట 2–6, 4–6తో హెర్డ్‌జెలస్ డియా (బోస్నియా)–సు చింగ్ వెన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో ప్రేరణ బాంబ్రీ–నిధి జంట 4–6, 0–6తో రియా–స్నేహాదేవి జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక నిలకడగా రాణిస్తోంది. దుబాయ్‌లోని ఏవియేషన్ క్లబ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సెమీఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–2, 6–4తో ముస్కాన్‌గుప్తా (భారత్)పై గెలుపొందింది. పాంజల, నిధి ఓటమి సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, నిధి చిలుముల పోరాటం ముగిసింది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ డబుల్స్ విభాగంలో క్వార్టర్స్‌లో వెనుదిరిగారు. మహిళల డబుల్స్ తొలి క్వార్టర్స్ మ్యాచ్‌లో రుతుజా భోస్లే– ప్రాంజల (భారత్) ద్వయం 5–7, 5–7తో మూడో సీడ్ లీ చి పెయ్ (చైనీస్ తైపీ)– యానా సిజికోవా (రష్యా) జంట చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో నిధి– ప్రేరణ బాంబ్రీ (భారత్) జంట 6–4, 5–7, 2–10తో జీల్ దేశాయ్ (భారత్)– బున్వాయి థాంచవత్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. -
క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ముందంజ వేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–1, 6–4తో ఎవెలినా కొంటారెవా (రష్యా)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండోరౌండ్లో రష్మిక 6–1, 6–0తో పి కోర్సుబ్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. -
ప్రాంజల జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. థాయ్‌లాండ్‌లో శనివారం జరిగిన మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌తో కలిసి ప్రాంజల టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో ప్రాంజల–జీల్ దేశాయ్ ద్వయం 6–2, 7–5తో రుతుజా భోస్లే (భారత్)–అలెగ్జాండ్రా వాల్టర్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది ప్రాంజలకిది రెండో డబుల్స్ టైటిల్. గత జూన్‌లో ఔరంగాబాద్‌లో జరిగిన టోర్నీలో జియావోజి జావో (చైనా)తో కలిసి ప్రాంజల తొలి టైటిల్‌ను నెగ్గింది. మరోవైపు డబుల్స్‌లో ఓడినప్పటికీ... సింగిల్స్‌లో రుతుజా భోస్లే విజేతగా నిలిచింది. ఫైనల్లో రుతుజా 6–4, 2–6, 7–5తో హువా చెన్ లీ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు జ్యోతి సురేఖ సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ‘అర్జున’ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ... మెక్సికోలో అక్టోబర్ 15 నుంచి 22 వరకు జరిగే ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. సోనెపట్‌లో జరిగిన సెలక్షన్స్‌లో ఆమె రికార్డు విజయాన్ని సాధించింది. శనివారం నిర్వహించిన ఒలింపిక్ రౌండ్లో జ్యోతి సురేఖ నిర్ణీత 150 పాయింట్లకు గానూ 150 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. -
సెమీస్‌లో ప్రాంజల జోడి
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల–జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6–3, 7–5తో వత్సకోల్ సవాస్డీ–చనికర్న్ సిలాకుల్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో ప్రాంజల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 2–6, 6–7 (4/7)తో వత్సకోల్ సవాస్డీ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. -
శ్రావ్య శివానికి డబుల్స్ టైటిల్
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని సత్తా చాటింది. తనీషా కశ్యప్ (భారత్)తో జతకట్టిన శ్రావ్య శివాని డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఎల్బీ స్టేడియం ‘శాట్స్’ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్లో రెండో సీడ్ శ్రావ్య శివాని–తనీషా కశ్యప్ ద్వయం 6–4, 6–4తో నాలుగో సీడ్ ఆలియా ఇబ్రహీమ్–శివాని స్వరూప్ ఇంగ్లే (భారత్) జోడీపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన అమినేని శివాని రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో రెండో సీడ్ శివాని 4–6, 2–6తో టాప్ సీడ్ ఆకాంక్ష భాన్ (భారత్) చేతిలో పరాజయం పాలైంది. -
ఫైనల్లో అమినేని శివాని
ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి శివాని అమినేని టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఎల్బీ స్టేడియం ‘శాట్స్’ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ శివాని 4–6, 7–5, 6–4తో నాలుగో సీడ్ తనీష కశ్యప్‌పై విజయం సాధించింది. మరో సెమీస్‌లో ఆకాంక్ష భాన్ 6–2, 6–1తో శివాని స్వరూప్ ఇంగ్లేపై నెగ్గింది. శనివారం శివాని, ఆకాంక్షల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో అభిమన్యు వన్నెం రెడ్డి 6–1, 5–7, 6–1తో భార్గవ్ పటేల్‌పై, సచిత్ శర్మ 6–3, 6–3తో కరణ్ శ్రీవాస్తవపై గెలిచారు. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రావ్య శివాని–తనీష కశ్యప్ జంట 6–4, 6–1తో సోనాషి భట్నాగర్–జాన్వీ పటేల్ జోడీపై, ఆలియా–శివాని స్వరూప్ ద్వయం 6–2, 6–0తో సిమెలి–చంద్రిక జోషి జంటపై, సాయి దేదీప్య–భక్తి పార్వణి జోడీ 7–5, 6–1తో దివ్య వాణి–శ్రేయ ద్వయంపై, శ్రీవల్లి రష్మిక–హుమేరా బేగం జంట 6–2, 6–2తో శివాని అమినేని–సల్సా అహెర్ జోడీపై గెలుపొందాయి. -
సెమీస్‌లో శివాని
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శివాని అమినేని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని ‘శాట్స్’ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్‌లో శివాని అమినేని 6–4, 6–1తో శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో శివాని 3–6, 7–5, 6–1తో షేక్ హుమేరాను ఓడించింది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో తనీషా కశ్యప్ 6–2, 6–2తో శివాని మంజనపై, ఆకాంక్ష 7–5, 6–4తో ప్రింకెల్ సింగ్‌పై, శివాని స్వరూప్ 6–4, 6–3తో సల్సా అహర్‌పై గెలుపొందారు. బాలుర క్వార్టర్స్ ఫలితాలు అభిమన్యు 6–0, 3–6, 6–3తో కార్తీక్‌రెడ్డి గంటాపై, సచిత్ శర్మ 6–1, 6–4తో ఫ్రాన్సెస్కో బొనాసియా (ఇటలీ)పై, మేఘ్ భార్గవ్ పటేల్ 6–2, 6–1తో నిఖిత్ రెడ్డిపై, కరణ్ శ్రీవాస్తవ 6–7 (2), 6–4, 6–2తో దేవ్ జావియాపై నెగ్గారు. -
సెమీస్‌లో ఓడిన శ్రీవల్లి రష్మిక
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) జూనియర్స్ అండర్–18 గ్రేడ్–3 సౌత్ సెంట్రల్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి శ్రీవల్లి రష్మిక పోరాటం సెమీస్‌లో ముగిసింది. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్‌కు షాకిచ్చి ఆకట్టుకున్న రష్మిక సెమీస్‌లో 3–6, 3–6తో ఐదో సీడ్ విక్టోరియా అలెన్ చేతిలో పరాజయం పాలైంది. జింబాబ్వేలో జరుగుతోన్న ఈ టోర్నీ క్వార్టర్స్‌లో రష్మిక 7–5, 6–1తో అనా గ్రాస్‌పై, ప్రిక్వార్టర్స్‌లో 6–4, 6–4తో టాప్ సీడ్ హాల ఖాలేద్ (ఈజిప్ట్)ను కంగుతినిపించింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో 6–1, 6–1తో కవోమి (జింబాబ్వే)ను చిత్తుగా ఓడించింది. -
రన్నరప్ ప్రాంజల జోడీ
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఆకట్టుకుంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ విభాగంలో ప్రాంజల జంట రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల– మోమ్కూంథోడ్ (థాయ్‌లాండ్) ద్వయం 0–6, 6–7 (5/7)తో గముల్య బియాట్రేస్–రోమ్పీస్ జెస్సీ జంట చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో ప్రాంజల పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. సెమీఫైనల్లో ప్రాంజల 3–6, 3–6తో ఖాజి హరుకా (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్లో యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సింగిల్స్‌లో ఆమె 6–4, 6–0తో సిలకుల్ చనికర్న్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. డబుల్స్ తొలి రౌండ్లో ప్రాంజల–మంకూంతొడ్ (థాయ్‌లాండ్) జోడి 6–3, 7–5తో నటాషా (భారత్)–కారోలిన్ (ఫ్రాన్స్) జంటపై విజయం సాధించింది. -
రష్మికకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సత్తా చాటింది. వియత్నాంలోని హో చి మిన్ సిటీలో జరిగిన ఈ టోర్నీలో ఆమె విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి రష్మిక (భారత్) 6–4, 6–2తో టాప్ సీడ్ యుజియావో (చైనా)ను కంగు తినిపించింది. -
టైటిల్ పోరుకు శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 జూనియర్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి శ్రీవల్లి రష్మిక టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. వియత్నాంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ రష్మిక (భారత్) 6–1, 4–6, 6–4తో ఏడో సీడ్ పీ యు లై (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. మరోవైపు డబుల్స్ విభాగంలో శ్రావ్య శివాని జోడీకి నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ సెమీ ఫైనల్లో శ్రావ్య శివాని (భారత్)–రఫెలా జీన్ (ఫిలిప్పీన్స్) జంట 2–6, 2–6తో యుజియావో– చున్‌జి గుయో (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక, టాప్‌సీడ్ యుజియావో (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. -
సెమీఫైనల్లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, శ్రావ్య శివానిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వియత్నాంలోని హో చి మింగ్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీవల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... శ్రావ్య పరాజయం చవిచూసింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి రష్మిక 6–3, 6–4తో ఆరో సీడ్ జింగ్యి వాంగ్ (చైనా)పై గెలుపొందగా, ఐదో సీడ్ శివాని 4–6, 6–0, 3–6తో నాలుగో సీడ్ చున్‌జి గుయో (చైనా) చేతిలో ఓడింది. నేడు జరిగే సెమీఫైనలో శ్రీవల్లి... ఏడో సీడ్ పీ యు లై (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–1తో రాఫెల్లా విల్లనుయెరా (ఫిలిప్పీన్స్)పై అలవోక విజయం సాధించగా, శ్రావ్య శివాని 7–5, 6–2తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గింది. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి–జింగ్ యంగ్ (చైనా) జోడి 5–7, 7–5, 6–10తో గాబ్రియెల్లా–రేనియా అజీజ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడింది. శివాని–రాఫెల్లా విల్లనుయెరా జోడి 6–3, 6–1తో హుయాన్ హుయంగ్–కె సుయాన్ జంగ్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. -
చాంపియన్ రిత్విక్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సత్తా చాటాడు. నైరోబి జూనియర్ ఓపెన్ 2, గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో రిత్విక్ జోడీ విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రిత్విక్ (భారత్)–షేలి కొటేచా (కెన్యా) ద్వయం 6–2, 6–2తో అబ్దుల్లా అల్ బర్వాణి – అర్జున్ మరియప్ప (అమెరికా) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ విభాగంలో రిత్విక్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. క్వార్టర్స్‌లో 3–6, 2–6తో పాబ్లో స్కెల్చర్ (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. గతవారమే రిత్విక్ నైరోబి జూనియర్ ఓపెన్–1 డబుల్స్ టైటిల్‌నూ గెలుచుకున్నాడు. -
విజేత రిత్విక్ జంట
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నైరోబి జూనియర్ ఓపెన్–1 టెన్నిస్ టోర్నమెంట్లో నగరానికి చెందిన రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సత్తాచాటాడు. కెన్యాలో జరిగిన ఈ టోర్నీలో బాలుర డబుల్స్ విభాగంలో రిత్విక్ జంట విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రిత్విక్ (భారత్)–షేల్ కొటెచా (కెన్యా) ద్వయం 6–4, 6–2తో డెన్నిస్ మోసెస్ (జింబాబ్వే)– చానోన్ హున్సావత్ (థాయ్‌లాండ్) జంటపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో రిత్విక్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ 2–6, 1–6తో స్కెల్చర్ మురో (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
టైటిల్ పోరుకు సంజన
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–18 టెన్నిస్ టోర్నమెంట్లో సంజన ఫైనల్లోకి అడుగు పెట్టింది. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఈ టోర్నీ జరుగుతోంది. సెమీఫైనల్లో 12 ఏళ్ల సంజన 6–3, 6–2తో టాప్ సీడ్ భక్తి షాపై సంచలన విజయాన్ని సాధించింది. ఈ టోర్నీలో క్వాలిఫయర్స్ ఆడి మెయిన్స్‌కు అర్హత సాధించిన సంజన తొలి రౌండ్లో 9–4తో పూర్వ రెడ్డిపై, రెండో రౌండ్లో 6–3, 6–0తో నాలుగో సీడ్ వుదులా రెడ్డిపై, క్వార్టర్స్‌లో 6–3, 6–3తో మూడో సీడ్ కిరణ్ రాణిపై గెలుపొందింది. -
ప్రాంజల జంట సంచలనం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల జోడీ సంచలనంతో శుభారంభం చేసింది. ఈజిప్ట్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో పెద్దిరెడ్డి శ్రీ వైష్ణవితో జత కట్టిన ప్రాంజల మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలిరౌండ్లో ప్రాంజల–శ్రీ వైష్ణవి (భారత్) ద్వయం 6–3, 6–3తో టాప్ సీడ్ జాక్వెలిన్ (స్వీడన్)–యషినా (రష్యా) జంటపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ప్రాంజల జంట ఎనిమిది ఏస్‌లు సంధించి, ఐదు బ్రేక్ పాయింట్లు సాధించింది. -
ప్రాంజల జంటకు డబుల్స్ టైటిల్
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మెరిసింది. స్థానిక క్లే ఔట్‌డోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి జియోజి జావోతో కలి సి డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివా రం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల–జియోజి జావో (చైనా) ద్వయం 2–6, 6–3, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో రుతుజ–కనిక వైద్య (భారత్) జంటపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల జంట ఒక ఏస్ సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. జూనియర్ స్థాయిలో నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గిన 18 ఏళ్ల ప్రాంజలకు సీనియర్ ప్రొ సర్క్యూట్లో మాత్రం ఇదే తొలి డబుల్స్ టైటిల్ కావడం విశేషం. -
సౌజన్యకు మూడో సీడింగ్
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో ముగ్గురు హైదరాబాద్ క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నగరానికి చెందిన భవిశెట్టి సౌజన్య, నిధి చిలుముల, ప్రాంజల ఈ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో సౌజన్య మూడో సీడ్‌గా బరిలోకి దిగుతుండగా... నిధి, ప్రాంజలకు వరుసగా ఐదు, ఏడో సీడింగ్స్ దక్కాయి. డబుల్స్ విభాగంలో నిధి–శ్వేత రాణా జోడీకి రెండో సీడ్ దక్కగా, ప్రాంజల జంట మూడో సీడ్‌గా బరిలోకి దిగుతుంది. -
ఆ విషయం తెలియదు.. అయినా తప్పు చేశా
మాస్కో: అవగాహన లేకుండా నిషేధిత ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినందుకు నిషేధం ఎదుర్కొన్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యను నిందించింది. నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో మెల్డోనియంను చేర్చినట్టుగా తనను అప్రమత్తం చేయడంలో ఐటీఎఫ్ తగిన ప్రయత్నాలు చేయలేదని షరపోవా పేర్కొంది. 2016 ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా షరపోవా నిషేధ ఉత్ప్రేరకం మెల్డోనియం వాడినట్టు పరీక్షల్లో తేలడంతో ఆమెపై రెండేళ్లు సస్పెన్షన్ విధించారు. తర్వాత నిషేధిత కాలాన్ని 15 నెలలకు తగ్గించారు. మెల్డోనియంను నిషేధించిన విషయం తనకు తెలియదని, అధికారులు ఈ విషయాన్ని నేరుగా అథ్లెట్లకు తెలియజేసి ఉంటే బాగుండేదని షరపోవా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏదేమైనా తెలుసుకోకుండా నిషేధిత ఉత్ప్రేరకం వాడటం తనదే తప్పని, ఇందుకు బాధ్యత తనదేనని వాపోయింది. ఈ నెల చివర్న జరిగే టోర్నీలో షరపోవా ఆడనుంది. -
విష్ణుకు మరో డబుల్స్ టైటిల్
త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడి సత్తా చాటింది. త్రివేండ్రంలో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్‌ను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–3, 7–5తో జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)–హాంగ్ కిట్ వాంగ్ (హాంకాంగ్) జంటపై గెలుపొంది విజేతగా నిలిచింది. విష్ణువర్ధన్ కెరీర్లో ఇది 33వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. మరోవైపు సింగిల్స్ సెమీఫైనల్లో విష్ణువర్ధన్ 3–6, 2–6తో శ్రీరామ్ బాలాజీ చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–0, 6–3తో దల్వీందర్ సింగ్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నాడు. -
ఫైనల్లో విష్ణువర్ధన్ జోడి
టెన్నిస్ టోర్నమెంట్ త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడి ఫైనల్లో ప్రవేశించింది. త్రివేండ్రం టెన్నిస్ క్లబ్లో గురువారం జరిగిన డబుల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–2,7–5తో కునాల్ ఆనంద్– అన్విత్ బిండ్రే జంటపై గెలుపొందింది. శుక్రవారం జరిగే ఫైనల్లో విష్ణువర్ధన్ జోడి జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)– హాంగ్ కిట్ వాంగ్ జంటతో తలపడుతుంది. సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో విష్ణు 6–3, 7–6 (3)తో హాడిన్ బావాపై గెలుపొందగా... టాప్ సీడ్ ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–2, 6–2తో విజయ్ సుందర్ ప్రశాంత్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీరామ్ బాలాజీ 6–4, 6–2తో రాజ్‌నీత్ విరాళి మురుగేశన్‌పై, దల్వీందర్ సింగ్ 6–3, 6–3తో జయేశ్‌పై గెలిచారు. సెమీస్‌లో విష్ణు, శ్రీరామ్ బాలాజీతో తలపడతాడు. -
రన్నరప్ విష్ణువర్ధన్ జోడి
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ కోర్టులో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–2, 4–6, 6–10తో రెండో సీడ్ ‘సూద్’ బ్రదర్స్ చంద్రిల్– లక్షిత్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–4, 6–4తో సామి రెన్‌వెన్ (జర్మనీ)పై, శ్రీరామ్ బాలాజీ 4–6, 6–3, 7–5తో కరుణుదయ్ సింగ్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. -
సెమీస్‌లో విష్ణువర్ధన్ జోడీ
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ నిలకడగా రాణిస్తున్నాడు. కర్ణాటక స్టేట్ లాన్‌టెన్నిస్ అసోసియేషన్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకున్న విష్ణువర్ధన్... సింగిల్స్‌లో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 7–5, 6–1తో జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)–హాంగ్ కిట్ వాంగ్ (హాంకాంగ్) జంటపై గెలుపొందగా... అనిరుధ్–విఘ్నేశ్ జోడీ∙(భారత్) 5–7, 3–6తో అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్ (జర్మనీ) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ విష్ణువర్ధన్ 6–2, 6–1తో భారత్‌కే చెందిన దక్షిణేశ్వర్ సురేశ్‌పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ 6–2, 7–5తో సిద్ధార్థ్ విశ్వకర్మపై గెలుపొందగా... రిషబ్ అగర్వాల్ 4–6, 4–6తో హాడిన్ బావా (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్
భిలాయ్ (ఛత్తీస్‌గఢ్): అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టోర్నీలో హైదరాబాద్ ఆటగాడు విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బీఎస్పీ టెన్నిస్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మూడో సీడ్ విష్ణువర్ధన్ 6–1, 6–0తో భారత్‌కే చెందిన విజయంత్ మలిక్‌పై విజయం సాధించాడు. మరోవైపు డబుల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ జోడి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ– విష్ణువర్ధన్ ద్వయం 7–6 (7/3), 6–2తో మోహిత్ మయూర్–నికి కలియండ (భారత్) జంటపై నెగ్గింది. గురువారం జరిగే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సిద్ధార్థ్ రావత్‌తో విష్ణువర్ధన్ తలపడతాడు. ఇతర సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–2, 6–3తో మోహిత్ మయూర్‌పై, సిద్ధార్థ్ రావత్ 6–1, 6–0తో శివదీప్ కొసరాజుపై, శశికుమార్ ముకుంద్ 7–5, 6–4తో తేజస్‌పై, సిద్ధార్థ్ విశ్వకర్మ 4–6, 6–3, 6–1తో రిషబ్ అగర్వాల్‌పై గెలుపొందారు. డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో కునాల్ ఆనంద్–అన్విత్ బింద్రె జోడి (భారత్) 6–2, 6–1తో ఆర్యన్– శశికుమార్ ముకుంద్ (భారత్) జంటపై నెగ్గి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. -
శశాంక్–రిత్విక్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్లో తీర్థ శశాంక్ జోడి సత్తా చాటింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన బాలుర డబుల్స్ ఫైనల్లో శశాంక్–రిత్విక్ చౌదరీ ద్వయం 6–3, 4–6, 10–7తో భార్గవ్ పటేల్–అథర్వ శర్మ జంటపై నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో శశాంక్ పోరాటం ముగిసింది. సెమీస్ మ్యాచ్‌లో శశాంక్ 3–6, 7–6, 3–6తో తో కరణ్ శ్రీవాస్తవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. బాలికల విభాగంలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ఫైనల్‌కు చేరుకుంది. బాలికల సింగిల్స్ తొలి సెమీస్ మ్యాచ్‌లో రష్మిక 6–3, 6–3తో శివాని ఇంగ్లేపై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో తనీషా కశ్యప్ 3–6, 7–6, 6–0తో వినీతను ఓడించింది. -
సెమీస్‌లో రష్మిక
టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక సెమీస్‌కు చేరుకుంది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో రష్మిక 5–7, 6–4, 6–3తో సారాపై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో వినీత 7–5, 6–4తో వైదేహి చౌదరీని ఓడించింది. బాలుర విభాగంలో తీర్థ శశాంక్ 6–3, 7–6తో టాప్ సీడ్ రిషభ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. -
శివానికి నిరాశ
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని పోరాటం ముగిసింది. గురువారం జరిగిన సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌ల్లో శివాని పరాజయం పాలైంది. స్థానిక సీఎల్‌టీఏ టెన్నిస్ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో రియా వర్మ (భారత్) 6-3, 7-6 (5)తో శివానిపై గెలుపొందింది. డబుల్స్ సెమీస్ మ్యాచ్‌లో శివాని- వైదేహి చౌదరీ (భారత్) జంట 3-6, 3-6తో కున్ రుు లీ- మనంచయ సావంగ్ జోడీ చేతిలో ఓడిపోరుుంది. ఇతర బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మెహక్ జైన్ (భారత్) 6-0, 6-0తో వైదేహి చౌదరీపై, అక్సానా మరీన్ (బెల్జియం) 6-3, 6-1తో ఆకాంక్ష భాను (భారత్)పై, థసపోర్న్ (థారుులాండ్) 6-1, 6-1తో తనీషా కశ్యప్ (భారత్)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు బాలుర సింగిల్స్ క్వార్టర్స్: సిద్ధాంత్ బాంటియా (భారత్) 6-2, 7-5తో టోంక్లా ములదా (థారుులాండ్)పై, ధ్రువ్ సునీశ్ (భారత్) 6-2, 6-2తో దోస్టాన్బెక్ తశ్బులటోవ్ (కజకిస్థాన్)పై గెలుపొందారు. బాలుర డబుల్స్ సెమీస్: వశిష్ట్ చెరకు- జాక్ జోడీ 6-2, 6-4తో సిద్ధాంత్ బాంటియా- పరీక్షిత్ సోమని జంటపై నెగ్గింది. -
శివాని శుభారంభం
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని శుభారంభం చేసింది. బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో శివాని 6-1, 6-4తో ప్రిన్సి పాంచల్‌పై విజయం సాధించింది. డబుల్స్ విభాగంలో శివాని-వైదేహి చౌదరీ జోడీ 6-0, 6-2తో దాదాసాహెబ్ చౌగులే-సృష్టి ధీర్ జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన షేక్ హుమేరా జోడీకి తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. హుమేరా-ప్రింకిల్ సింగ్ జోడీ 4-6, 6-4, 9-11తో ఎస్తర్-హేత్ గమ్మ జంట చేతిలో పరాజయం పాలైంది. బాలుర సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో పరీక్షిత్ 6-3, 6-3తో శ్రీవత్స రాచకొండపై గెలుపొందగా... తీర్థ శశాంక్ 2-6, 2-6తో దోస్టాన్బెక్ చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ విభాగంలో వశిష్ట్- జాక్ డ్రాపర్ జోడీ 6-2, 6-1తో శ్రీవత్స రాచకొండ-అథర్వ శర్మ జంటపై, బొల్లిపల్లి రిత్విక్-మాచెర జోడీ 6-3, 6-2తో నబీవ్ ఓలిజన్-సచిత్ శర్మ జంటపై గెలుపొందాయి. -
మెయిన్ ‘డ్రా’కు హుమేరా
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఐటీఎఫ్ జూనియర్స్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ బాలికల చివరి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ హుమేరా 5-7, 6-3, 7-5తో హర్లీన్ కౌర్ (చండీగఢ్)ను ఓడించింది. బాలుర విభాగంలోనూ టాప్ సీడ్ అలెక్స్ సోలెంకి 6-4, 6-1తో ఐదో సీడ్ సాగర్ బైన్సపై గెలుపొంది మెయిన్ డ్రాకు అర్హత పొందాడు. మెయిన్ డ్రా మ్యాచ్‌లు నేటి (సోమవారం) నుంచి ఈనెల 7 వరకు జరుగుతాయి. ఇతర బాలుర మ్యాచ్‌ల్లో ఆర్. బొల్లిపల్లి 4-6, 7-5, 6-3తో అశుతోష్ తివారిపై, సుమిత్ పాల్ సింగ్ 6-3, 4-6, 6-4తో కృషన్ హుడాపై, అథర్వ శర్మ 6-0, 6-3తో ద్రోణ వాలియాపై గెలుపొందారు. బాలికల మ్యాచ్‌ల్లో శివాని మంజన్న 6-3, 6-1తో మిషా సూద్‌పై, యుబ్రాని బెనర్జీ 7-6 (7), 6-1తో దాదాసాహెబ్ చౌగ్లేపై, గౌరీ భాగియా 6-2, 6-3తో అంజలి మొగిలిపై విజయం సాధించారు. -
రిత్విక్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఈస్ట్ ఆఫ్రికా జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ సత్తా చాటాడు. బాలుర డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. ఫైనల్లో రిత్విక్ చౌదరీ (భారత్)- మాథ్యూ బెచర్ (గ్రేట్ బ్రిటన్) జోడీ 7-6 (7/4), 5-7, 10-2తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ కెవిన్ చెరియట్-షేల్ కొటెచా (కెన్యా) జంటపై సంచలన విజయం సాధించి విజేతగా నిలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన రిత్విక్ జంట రెండో రౌండ్లో 7-5, 6-3తో నియిజెనా (రువాండా)-మొహమ్మద్ ఒమర్ (బురుండి) ద్వయంపై... క్వార్టర్ ఫైనల్లో 3-6, 6-3, 11-9తో జంకోవియాక్-మార్సిన్ (పోలాండ్) జంటపై, సెమీఫైనల్లో 6-3, 4-6, 11-9తో దేవ్ జవియా-కరణ్ శ్రీవాస్తవ (భారత్) జోడీపై గెలిచింది. -
సెమీస్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల బాలికల సింగిల్స్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 6-4, 6-4తో తనకన్నా మెరుగైన క్రీడాకారిణి నటాషా పల్హాపై విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 3-6, 6-1, 6-3తో శ్వేత చంద్ర రాణాపై గెలుపొంది క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు డబుల్స్‌లో ప్రాంజల పోరాటం ముగిసింది. ప్రాంజల- నిధి చిలుముల ద్వయం 0-6, 4-6తో రియా భాటియా- శ్వేత జోడీ చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. -
ఫైనల్లో ప్రాంజల జోడీ
సాక్షి, హైదరాబాద్: ఎల్‌టీఏటీ ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు ప్రాంజల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. థాయ్‌లాండ్‌లోని నేషనల్ టెన్నిస్ డెవలప్మెంట్ సెంటర్లో శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాం జల- జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6-4, 7-5తో హిండోవా (చెక్ రిపబ్లిక్)- అర్పన (ఫిన్లాండ్) జోడీపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్‌లో ప్రాంజల పోరాటం ముగిసింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 5-7, 4-6తో సుహ్యున్ పార్క్ (కొరియా) చేతిలో పరాజయం పాలైంది. -
ఆకాంక్ష, సిద్ధాంత్లకు టైటిల్స్
టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్లో సిద్ధాంత్, ఆకాంక్ష విజేతలుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సిద్ధాంత్ 6-1, 6-4తో ధ్రువ్ సునీశ్పై గెలుపొందగా... ఆకాంక్ష 2-6, 7-5, 6-0తో శివాని అమినేనిపై విజయం సాధించి చాంపియన్లుగా నిలిచారు. అంతకుముందు జరిగిన బాలుర సెమీఫైనల్లో ధ్రువ్ 6-7 (5), 6-2, 7-6 (3)తో నితిన్ కుమార్‌పై, సిద్ధాంత్ 6-1, 6-4తో సునీల్ జగ్త్యానిపై నెగ్గారు. బాలికల విభాగంలో ఆకాంక్ష 6-4, 6-1తో శివాని స్వరూప్‌పై విజయం సాధించింది. బాలికల డబుల్స్ విభాగంలో హర్షసారుు- వైదేహి జోడి 6-4, 7-6తో ఆకాంక్ష- ఆర్జ చక్రభర్తిపై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. బాలుర డబుల్స్ విభాగంలో సునీల్ జగ్త్యాని- అలెక్స్ సోలెంకి జోడి 6-2, 6-2తో సిద్ధాంత్- ధ్రువ్ జంటపై నెగ్గి చాంపియన్లుగా నిలిచారు. డబుల్స్ సెమీఫైనల్ ఫలితాలు బాలురు: సునీల్- అలెక్స్ సోలెంకి జోడి 6-3, 6-3తో రోహిత్- కై వల్య జంటపై, సిద్ధాంత్-ధ్రువ్ జోడి0-6, 6-3తో మేఘ్ భార్గవ్- పరీక్షిత్ సోమనిపై గెలుపొందారు. బాలికలు: ఆకాంక్ష- ఆర్జ చక్రభర్తి జోడి 6-3, 6-4తో శివాని- లాస్య పట్నాయక్ జంటపై, హర్షసారుు- వైదేహి జోడి 6-4, 4-6, 10-8తో ఆనంద్ ముదళియార్- దేదీప్య జంటపై నెగ్గారు. -
తుదిపోరుకు శివాని
టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్లో అమినేని శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన సెమీస్‌లో అమినేని శివాని 6-3, 1-6, 6-0తో సామ సాత్వికపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శివాని 6-1, 4-6, 6-3తో హెచ్. షేక్‌పై, సామ సాత్విక 6-4, 6-1తో వి.చౌదరీపై, భాను 6-3, 6-2తో ఏ. చక్రవర్తిపై గెలుపొందారు. బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎన్. సిన్హా 6-2, 6-3తో సోలెంకి అలెక్స్‌పై, ఉనిష్ 6-4, 7-4 (4)తో వశిష్ట్‌పై, ఎస్. బాంతియా 6-2, 6-1తో వన్నెం రెడ్డిపై, పి. సోమని 6-3, 6-3తో ఎస్. జగ్త్యానిపై నెగ్గారు. -
మూడో రౌండ్లో శివాని, సాత్విక
టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మారుులు అమినేని శివాని, సామ సాత్విక మూడోరౌండ్లోకి ప్రవేశించారు. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ బాలికల రెండో రౌండ్లో శివాని అమినేని (తెలంగాణ) 6-1, 6-0తో భక్తి పర్వాని (గుజరాత్)పై గెలుపొందగా... సామ సాత్విక (తెలంగాణ) 6-3, 6-2తో జితాషా శాస్తి్ర (మహారాష్ట్ర)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రత్యూష (తెలంగాణ) 6-3, 6-1తో శివాని మంజన (కర్నాటక)పై, శ్రీవల్లి రష్మిక (తెలంగాణ) 7-6 (3), 6-2తో దివ్యవాణి (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6-4, 6-0తో లాస్య పట్నాయక్ (తెలంగాణ)పై, సారుు దేదీప్య (తెలంగాణ) 6-1, 7-5తో గౌరి (మహారాష్ట్ర)పై, హర్ష సారుు (తెలంగాణ) 6-2, 6-1తో శ్రీజ రెడ్డిపై, శ్రావ్య శివాని (తెలంగాణ) 6-3, 6-3తో ఎం. షేక్ (ఏపీ)పై విజయం సాధించారు. బాలుర విభాగంలో శశాంక్ తీర్థ (తెలంగాణ) 7-5, 6-2తో సత్య (తమిళనాడు)పై, శ్రీవత్స రాచకొండ (తెలంగాణ) 6-3, 6-1, 6-1తో మిశ్రాపై నెగ్గారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు బాలికలు: అకాంక్ష భాను (గుజరాత్) 6-2, 6-4తో ముస్కాన్ గుప్తా (ఢిల్లీ)పై, సల్సా అహెర్ (మహారాష్ట్ర) 6-4, 6-3తో రిషిక రవి (తమిళనాడు)పై, ఎ. చక్రవర్తి (ఢిల్లీ) 6-4, 6-1తో వినీత (తెలంగాణ)పై, శివాని స్వరూప్ (మహారాష్ట్ర) 6-3, 6-2తో ఉర్మి పాండ్యాపై, తనీషా కశ్యప్ (అస్సాం) 6-1, 6-4తో డర్నా మదళియార్పై, వైదేహి చౌదరీ (గుజరాత్) 6-1, 6-2తో షాజియా బేగంపై గెలుపొందారు. బాలురు: అలెక్స్ సోలంకి 6-2, 6-4తో కెవిన్ పటేల్ (గుజరాత్)పై, రిషబ్ (ఛత్తీస్గడ్) 6-2, 6-0తో రోహిత్‌పై, నితిన్ 6-2, 6-0తో అర్జున్ (కర్నాటక)పై, ధ్రువ్ 6-1, 6-4తో జాదవ్‌పై, సురేశ్ (తమిళనాడు) 6-2, 6-3తో మహదేవన్‌పై, కబీర్ 6-4, 6-4తో మకేర్పై, సచిత్ (ఢిల్లీ) 6-3, 6-3తో సెంథిల్ కుమార్‌పై నెగ్గారు. -
సెమీస్‌లో శ్రీవల్లి జోడి
► సింగిల్స్‌లో తీర్థ శశాంక్ ఓటమి సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-5 టోర్నమెంట్లో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక జోడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ సింగిల్స్, డబుల్స్‌లో పరాజయం చవిచూశాడు. సింగపూర్‌లోని కల్లాంగ్ టెన్నిస్ సెంటర్లో గురువారం జరిగిన బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి-దివ్యవాణి (భారత్) జోడి 6-4, 6-7 (8/3), 10-8తో వాన్ స్కైలర్-అలిసియా యూ (హాంకాంగ్) జంటపై గెలుపొందింది. సింగిల్స్‌లో ఆమె 2-6, 3-6తో టాప్ సీడ్ గ్లౌడియా (హాంకాంగ్) జోడి చేతిలో ఓడింది. బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తీర్థ శశాంక్ 3-6, 3-6తో టాప్ సీడ్ హు చెన్ యూ (తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. డబుల్స్‌లో గిరిధరన్ (సింగపూర్)-అలీ మూరాజ్ (పాకిస్తాన్) జంట 3-6, 7-5, 14-12తో తీర్థ శశాంక్-ద్రోణ వాలియా (భారత్) జోడీని ఇంటిదారి పట్టించింది. -
క్వార్టర్స్‌లో తెలుగు తేజాలు శశాంక్, రష్మిక
హైదరాబాద్: తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ జోరుమీదున్నాడు. సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-5 టోర్నీలో అతను సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కల్లాంగ్ టెన్నిస్ సెంటర్లో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ 6-3, 6-3తో ఐదో సీడ్ ఆర్మిన్ రోస్తామి (ఇరాన్)కి షాకిచ్చాడు. బాలుర డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ద్రోణ వాలియాతో జతకట్టిన శశాంక్ 4-6, 7-5, 10-8తో దర్శన్ సురేశ్ (మలేసియా)-షెంగ్ యిన్ స్టిఫెన్ (చైనా)లపై చెమటోడ్చి నెగ్గాడు. బాలికల సింగిల్స్‌లో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-3, 6-2తో ఎనిమిదో సీడ్ యిమ్ అష్లె (చైనా)పై సంచలన విజయం సాధించింది. -
రియో జట్టులో షరపోవా!
మాస్కో: డోపింగ్ వల్ల సస్పెన్షన్‌కు గురైన రష్యా స్టార్ ప్లేయర్ మరియా షరపోవా పేరును రష్యా టెన్నిస్ ఫెడరేషన్ (ఆర్టీఎఫ్) రియో ఒలింపిక్స్‌కు నామినేట్ చేసింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ జాబితాలో స్వెత్లానా కుజనెత్సోవా, అనస్థాషియా పవ్లిన్చుకోవా, డర్యా కసాట్కినాతో పాటుగా షరపోవాను చేర్చింది. కానీ రియోలో షరపోవా ప్రాతినిధ్యంపై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నుంచి ఇంకా అనుమతి రాలేదు. నిషేధిత ఉత్ప్రేరకం మాల్డోనియంను ఉపమోగించినందున మార్చి 12 నుంచి షరపోవాపై నిషేధం కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం అనుమతి లభించకపోతే షరపోవా స్థానంలో... ఎకటేరియన్ మస్కిమోవా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. -
విష్ణు జంటకు డబుల్స్ టైటిల్
చండీగఢ్: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్-1 టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్-శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6-1, 6-4తో యుచి ఇటో-షో కటయామ (జపాన్) జోడీపై విజయం సాధించింది. విష్ణు కెరీర్లో ఇది 25వ ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. మరోవైపు సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో విష్ణు 6-1, 7-6 (7/5)తో షో కటయామ (జపాన్)పై గెలిచాడు. -
‘చాంపియన్స్’గా సానియా, హింగిస్ జోడి.
లండన్: ఈ ఏడాది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ కలిసి మహిళల డబుల్స్‌లో అత్యద్భుత విజయాలు సాధించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఈ జోడిని మహిళల డబుల్స్ వరల్డ్ చాంపియన్‌గా ప్రకటించింది. హింగిస్‌కు గతం (2000)లో సింగిల్స్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అనుభవముంది. ఈఏడాది మార్చిలో సానియా, హింగిస్ కలిసి డబుల్స్ ఆడడం ప్రారంభించి రెండు గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు ఏడు ఇతర టైటిళ్లు సాధించారు. యూఎస్ ఓపెన్ నుంచి తమ చివరి 22 మ్యాచ్‌ల్లో వీరికి ఓటమనేది లేదు. ఈ క్రమంలో గ్వాంగ్జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యుటీఏ ఫైనల్స్ టైటిల్స్ సాధించారు. ఓవరాల్‌గా ఈ సీజన్‌ను 55-7తో ముగించారు. ‘మేం జత కట్టిన తక్కువ సమయంలోనే ఇన్ని విజయాలు సాధించినందుకు ఆనందంగా ఉంది. ఐటీఎఫ్ నుంచి ఈ అవార్డునందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. కెరీర్లో ఇప్పటిదాకా సహాయపడిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా విజయాలు భారత క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తాయని ఆశిస్తున్నాను’ అని సానియా తెలిపింది. మరోవైపు పురుషుల, మహిళల సింగిల్స్ వరల్డ్ చాంపియన్స్‌గా జొకోవిచ్ ఐదోసారి, సెరెనా విలియమ్స్ ఆరోసారి ఎంపికయ్యారు. -
సానియా-హింగిస్ జోడికి ఐటీఎఫ్ అవార్డు
లండన్:ఈ ఏడాది మహిళల డబుల్స్ విభాగంలో అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) వరల్డ్ చాంపియన్స్ అవార్డును భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మహిళల మాజీ నెంబరవన్ మార్టినా హింగిస్(స్విట్టర్లాండ్)ల జోడి గెలుచుకుంది. 2015 మార్చిలో జత కట్టిన వీరిద్దరూ విశేషంగా రాణించి మొత్తం తొమ్మిది టైటిల్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కూడా ఉన్నాయి. మొత్తం 61 గేమ్‌లు నెగ్గిన ఈ జోడీ ప్రత్యర్థులకు కేవలం 31 గేమ్‌లను సమర్పించుకుంది. వరుసగా 22 మ్యాచ్‌లను సానియా జోడీ గెలుచుకోవడం విశేషం. దీంతో ఊహించినట్లుగానే ప్రతిష్టాత్మక ఐటీఎఫ్ అవార్డుకు ఈ జోడీ ఎంపికైంది. కాగా, 2000లో మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి ఐటీఎఫ్ అవార్డును మార్టినా హింగిస్ గెలుచుకుంది. ఐటీఎఫ్ అవార్డును గెలుచుకోవడం పట్ల సానియా ఆనందం వ్యక్తం చేసింది. 'ఈ సంవత్సరం మాకు చాలా సంతృప్తిని మిగిల్చింది. అనుకున్నదాని కంటే చాలా సాధించాం. ఐటీఎఫ్ అవార్డును స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. నా సక్సెస్ భారత్ లో చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది'అని సానియా పేర్కొంది. -
భారత్‌కు రెండో ఓటమి
వరల్డ్ జూనియర్ టెన్నిస్ టోర్నీ ప్రోస్టెజోవ్ (చెక్ రిపబ్లిక్) : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వరల్డ్ జూనియర్ బాలికల టెన్నిస్ ఫైనల్స్ టోర్నమెంట్లో భారత్‌కు వరుసగా రెండు పరాజయాలు ఎదురయ్యాయి. గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చెక్ రిపబ్లిక్ చేతిలో 1-2తో ఓడిన భారత్... రెండో మ్యాచ్‌లో 0-3తో ఇటలీ చేతిలో ఓటమి చవిచూసింది. దాంతో భారత్ సెమీఫైనల్ చేరుకునే అవకాశాలకు తెరపడింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి అమినేని శివానికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో శివాని 6-4, 6-4తో సిస్కోవాపై గెలి చింది. అయితే రెండో సింగిల్స్‌లో మహెక్ జైన్ 4-6, 5-7తో ఇవానా సెబెస్తోవా చేతిలో ఓడింది. నిర్ణాయక డబుల్స్‌లో శివాని-మహెక్ ద్వయం 2-6, 3-6తో ఇవానా-సిస్కోవా జంట చేతిలో ఓడిపోవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఇటలీతో జరిగిన పోటీలో తొలి సింగిల్స్‌లో శివాని 4-6, 1-6తో ఫెడెరికా చేతిలో... రెండో సింగిల్స్‌లో మహెక్ 4-6, 5-7తో ఎలిజెబెట్టా చేతిలో ఓడారు. డబుల్స్‌లో శివాని-ప్రింకిల్ ద్వయం 1-6, 4-6తో ఫెడెరికా-ఎలిజెబెట్టా జంట చేతిలో ఓడింది. -
రిషిక జోడికి డబుల్స్ టైటిల్
సింగిల్స్ సెమీస్‌లో ఓడిన నిధి ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ చెన్నై: అంతర్జాతీయు టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నీలో తెలుగు అమ్మాయి రిషిక సుంకర డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తన భాగస్వామి షర్మదా బాలు (భారత్)తో కలిసి ఆడిన రిషిక ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో 6-0, 7-6(7/4)తో నటాషా-ప్రార్థన (భారత్) జోడిపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి చిలుముల పరాజయం పాలైంది. ఆరో సీడ్ నిధి 3-6, 5-7తో టాప్ సీడ్ ప్రార్థన (భారత్) చేతిలో ఓడిపోయింది. మరో సెమీఫైనల్లో ఏడో సీడ్ ఇతీ మెహతా (భారత్) 3-6, 7-5, 6-3తో రెండో సీడ్ నటాషా (భారత్)పై నెగ్గి ఫైనల్స్‌కు చేరుకుంది. నేటి ఫైనల్ మ్యాచ్‌లో ఇతీ మెహతా, ప్రార్థన అమీతుమీ తేల్చుకోనున్నారు.