సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఫైనల్‌కు చేరుకుంది. హాంకాంగ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి విక్టోరియా ముంటేన్ (ఫ్రాన్స్)తో కలిసి తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాంజల (భారత్)– విక్టోరియా (ఫ్రాన్స్) జంట 7–5, 7–5తో రిసా ఓజాకి– రము యుడా (జపాన్) జోడీపై నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment