tennis tourney
-
ముంచుకొస్తున్న మరో ముప్పు! రెండు రోజులుగా ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వర్షాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
'మోస్ట్ అన్‌లక్కీ'.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఔట్
డిఫెండింగ్ చాంపియన్ బార్బరా క్రేజీకోవా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అనూహ్యంగా వైదొలిగింది. ఇప్పటికే సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన క్రేజీకోవా.. తాజాగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలడంతో డబుల్స్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో డబుల్స్ టైటిల్‌ను నిలుపుకోవాలనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. ఈ విషయాన్ని క్రేజీకోవా 'దురదృష్టవంతురాలిని' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మెడికల్ అప్డేట్ను షేర్ చేసుకుంది. ''మంగళవారం రాత్రి కాస్త అలసటగా అనిపించింది. తెల్లారి చూసేసరికి కొద్దిగా జ్వరం వచ్చినట్లయింది. దీంతో టెస్టుకు వెళ్లగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలియగానే వెంటనే టోర్నీ నుంచి వైదొలిగాను. సింగిల్స్ ఓడిపోయాను.. కనీసం డబుల్స్ టైటిల్ నిలుపుకుందామనుకున్నా.. కానీ బ్యాడ్‌లక్ కుదరలేదు''అంటూ ఎమెషనల్ అయింది. కాగా కేజ్రీకోవాతో పాటు చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మేరీ బౌజ్కోవా కూడా ఆరోగ్య కారణాలతో రెండో రౌండ్ సింగిల్స్ ఆడకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. కాగా సోమవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో బార్బరా క్రేజీకోవా 19 ఏళ్ల డైన్ పారీ చేతిలో ఓటమి చవిచూసింది. కాగా గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన కేజ్రీకోవా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాంపియన్‌గా నిలిచింది. సింగిల్స్ ఫైనల్లో అనస్తాసియా పావ్లియుచెంకోవాను ఓడించి తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత సినికోవాతో జతకట్టి ఫైనల్లో గెలిచిన కేజ్రీకోవా డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. కాగా మేరీ పియర్స్ తర్వాత ఒక ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ విజేతగా నిలిచిన రెండో మహిళగా కేజ్రీకోవా నిలిచింది. చదవండి: Nikhat Zareen-Mary Kom: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది French Open 2022: మూడో రౌండ్లోకి నొవాక్ జొకోవిచ్ -
క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట
ఇటాలియన్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సానియా జోడీతో ఆడాల్సిన రిబకినా (కజకిస్తాన్)–సమ్సోనోవా (రష్యా) ద్వయం గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో ఇండో–చెక్ జంటను విజేతగా ప్రకటించారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–7 (3/7), 3–6తో కూలాఫ్ (నెదర్లాండ్స్)–స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడింది. -
పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్ సీడ్ జో సాలిస్బరీ (బ్రిటన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి. -
Qatar Open: రన్నరప్ బోపన్న–షపోవలోవ్ జోడీ
Qatar Open: ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. దోహాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జోడీ 6–7 (4/7), 1–6తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–షపోవలోవ్ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న–షపోవలోవ్ జోడీకి 29,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 21 లక్షల 80 వేలు) లభించింది. ఫైనల్లో సాకేత్ జంట సాక్షి, హైదరాబాద్: బెంగళూరు ఓపెన్–2 ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తన భాగస్వామి రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బెంగళూరులో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–1, 7–6 (7/3)తో కుకావుడ్ (ఫ్రాన్స్)–ఆండ్రూ హారిస్ (ఆ్రస్టేలియా) జోడీపై గెలిచింది. మరో సెమీఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 4–6, 6–4, 3–10తో ‘సూపర్ టైబ్రేక్’లో అర్జున్ ఖడే (భారత్)–ఎర్లెర్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్‌కు కూడా డౌటే.. ఎందుకంటే! -
Rohan Bopanna-Ramkumar: టైటిల్‌కు విజయం దూరంలో...
అడిలైడ్: కొత్త ఏడాదిని టైటిల్‌తో శుభారంభం చేసేందుకు భారత టెన్నిస్ జోడీ రోహన్ బోపన్న–రామ్‌కుమార్ విజయం దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. బోపన్న కెరీర్లో ఇది 48వ ఏటీపీ టోర్నీ డబుల్స్ ఫైనల్‌కాగా... రామ్‌కుమార్ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో అన్‌సీడెడ్ బోపన్న–రామ్‌కుమార్ జంట 6–2, 6–4తో నాలుగో సీడ్ శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–తొమిస్లావ్ బిర్కిచ్ (బోస్నియా హెర్జెగోవినా) జోడీపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–మార్సెలో మెలో (బ్రెజిల్) జంటతో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం తలపడుతుంది. శాంటియాగో–బిర్కిచ్లతో 58 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో బోపన్న, రామ్‌కుమార్ ఎని మిది ఏస్‌లు సంధించారు. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. 41 ఏళ్ల బోపన్న తన కెరీర్లో 19 డబుల్స్ టైటిల్స్ సాధించి, 28 సార్లు రన్నరప్‌గా నిలిచాడు. (చదవండి: కోహ్లిని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. కౌంటరిచ్చిన వసీం జాఫర్) -
తొలి రౌండ్లోనే సానియా జంట ఓటమి
ఈస్ట్‌బార్న్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈస్ట్‌బార్న్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో నిరాశపరిచింది. బెతాని మ్యాటెక్ సాండ్స్ (అమెరికా)తో జతకట్టిన హైదరాబాదీకి తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ మ్యాచ్‌లో సానియా–మ్యాటెక్ సాండ్స్ జోడీ 3–6, 4–6తో అమెరికా ద్వయం సబ్రినా శాంటామరియా–క్రిస్టీనా మెక్‌హాలె చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
టెన్నిస్ టోర్నీలకు వేళాయె...
పారిస్: యూరప్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే ఫుట్‌బాల్ టోర్నీలు ఆరంభమైన నేపథ్యంలో తాజాగా జూలై నుంచి ఫ్రాన్స్‌లో టెన్నిస్ టోర్నీలను నిర్వహించనున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్ఎఫ్టీ) శనివారం ప్రకటించింది. ఫ్రాన్స్ దక్షిణ ప్రాంతమైన రివియెరాలో నిర్వహించే మినీ టూర్‌తో టెన్నిస్ క్రీడకు తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు ఎఫ్ఎఫ్టీ తెలిపింది. ఈ మినీ టూర్లో మొత్తం మూడు టోర్నీలు ఉండగా... ఆరంభ టోర్నీ నీస్‌లో జూలై 6–11 మధ్య... రెండో టోర్నీ కేన్స్‌లో జూలై 13–18 మధ్య... చివరిదైన మూడో టోర్నీ విల్నెవ్–లుబేలో జూలై 20–25 మధ్య జరుగుతాయి. ‘చాలెంజ్ ఎలైట్ ఎఫ్ఎఫ్టీ’ పేరుతో ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీల్లో పురుషుల విభాగంలో 24 మంది... మహిళల విభాగంలో 12 మంది బరిలోకి దిగుతారు. -
క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్ జోడీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్లో టాప్ సీడ్ విష్ణువర్ధన్ జోడీకి చుక్కెదురైంది. కోల్‌కతా వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్–అర్జున్ ఖడే జంట క్వార్టర్స్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 3–6, 4–6తో అభినవ్ షణ్ముగమ్–నితిన్ కుమార్ సిన్హా (భారత్) జోడీ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్లో 6–2, 6–0తో విఘ్నేశ్ పెరణమల్లూర్ (భారత్)–లుకాస్ రెనార్డ్ జోడీపై గెలుపొందింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో అనిరుధ్ చంద్రశేఖర్–కలియాంద పూనచా (భారత్) జంట 6–4, 4–6, 10–7తో వినాయక్ శర్మ కాజా–మనీశ్ కుమార్ (భారత్) జోడీపై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. సింగిల్స్ విభాగంలో విష్ణువర్ధన్, గంటా సాయి కార్తీక్ రెడ్డి తొలి రౌండ్లోనే వెనుదిరగగా... వినాయక్ శర్మ కాజా రెండో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. విష్ణువర్ధన్ 7–5, 2–6, 0–3తో నితిన్ కుమార్ సిన్హా చేతిలో, సాయి కార్తీక్ 6–7, 4–6తో లుకాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో వినాయక్‌శర్మ కాజా 3–6, 1–6తో ఐడో సీడ్ ఎరిక్ వాన్‌షెల్‌బోయిమ్ చేతిలో ఓడిపోగా... నాలుగో సీడ్ అర్జున్ ఖడే 6–3, 6–4తో క్వాలిఫయర్ ప్రబోధ్ సూరజ్‌పై, ఏడో సీడ్ ఆర్యన్ 6–3, 6–1తో లుకాస్‌పై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకున్నారు. -
ఆ్రస్టేలియన్ ఓపెన్ యథావిధిగా
సిడ్నీ: ఆ్రస్టేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కార్చిచ్చు సెగ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి తగులుతుందనే వార్తల్ని నిర్వాహకులు కొట్టిపారేశారు. ఈ నెల 20 నుంచి మెల్బోర్న్ పార్క్‌లో ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ జరగనుంది. ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు మెల్బోర్న్ పార్క్‌కు ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో రగులుతోందని దీని వల్ల వేదికకు, ఆటగాళ్లకు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగదని టెన్నిస్ ఆ్రస్టేలియా చీఫ్ క్రెయిగ్ టైలీ తెలిపారు. ఏటీపీ ప్లేయర్స్ కౌన్సిల్ అధ్యక్షుడైన నొవాక్ జొకోవిచ్ మీడియాతో మాట్లాడుతూ కార్చిచ్చు పొగవల్ల సమస్య ఉంటే మ్యాచ్‌ల్ని ఆలస్యంగా ప్రారంభించే అవకాశాల్ని పరిశీలించాలని సూచించారు. దీనిపై స్పందించిన క్రెయిగ్ వాతావరణ శాఖ నిపుణులు గాలి నాణ్యతపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తున్నారని... వారితో నిర్వాహక కమిటీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. -
కుర్రాళ్లు వెలుగులోకి వచ్చే మార్గమేది?
న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌లో కొత్తగా కుర్రాళ్లు వెలుగులోకి వచ్చే మార్గమే లేదని తెలుగుతేజం సాకేత్ మైనేని అన్నాడు. దేశంలో ఇప్పటివరకూ యువ టెన్నిస్ ఆటగాళ్లు రాణించేందుకు అవసరమైన ప్రాథమిక చర్యలే లేవన్నాడు. ఓ వార్తాసంస్థకిచి్చన ఇంటర్వ్యూ లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడైన సాకేత్ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఎప్పటి నుంచో ఎంతో మంది ఎన్నోసార్లు అది చేస్తాం, ఇది చేస్తామన్నారు... కానీ ఆచరణలో అవేవీ చూడలేదు ఇప్పటివరకు! క్రీడావర్గాలకు అసలు ఆటగాళ్లు ఎలా తయారవుతారన్న ఆలోచనే లేదు. నిజానికి ఇదంతా ఓ నిర్ణీత కాలచక్రంగా ఓ పద్ధతి ప్రకారం జరగాలి కానీ... ఇక్కడ అలా లేదు. ఆటగాళ్లంతా తమ సొంతంగా ఎదగడమే తప్ప... క్రీడా సంఘాలు, ఆ శాఖ చేసేది కూడా ఏమీ ఉండదు. ఒక్కోక్కరిది ఒక్కోకథ. అందరివీ కష్టంతో కూడుకున్నవే! ఏ ఒక్కరూ నల్లేరుపై నడకలా వచి్చనట్లు, ఎదిగినట్లు ఉండదు. ముఖ్యంగా జూనియర్ ఆటగాళ్లను ఆర్థిక కష్టాలు వేధిస్తాయి. స్పాన్సర్ షిప్ దొరకదు. అలాంటపుడు పెద్ద టోరీ్నలు ఆడేలా, భవిష్యత్తు తీర్చిదిద్దుకునేలా చేయూత లభించదు’ అని ముక్కుసూటిగా మాట్లాడాడు. అలాగే నేర్చుకోవాలన్నా... శిక్షణ పొందాలన్నా... మౌలిక సదుపాయాలు చాలా దూరంగా ఉంటాయని, 15 కిలోమీటర్లు వెళ్లి రావాల్సి ఉంటుందని ఆటగాళ్ల కష్టాలు వివరించాడు. -
రఘునందన్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల టెన్నిస్ టోర్నమెంట్లో జి. రఘునందన్ ఆకట్టుకున్నాడు. సికింద్రాబాద్‌లోని ఐఆర్‌ఐఎస్‌ఈటీ టెన్నిస్ కోర్ట్ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో రఘునందన్ రెండు సింగిల్స్ టైటిళ్లను హస్తగతం చేసుకున్నాడు. అండర్–16, అండర్–18 బాలుర సింగిల్స్ కేటగిరీల్లో అతను విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన అండర్–16 బాలుర ఫైనల్లో రఘునందన్ 6–0తో సయ్యద్ మొహమ్మద్ ఇషాన్‌పై, అండర్–18 టైటిల్‌పోరులో రఘునందన్ 6–0తో అక్షయ్‌పై విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో పి. రాజు చాంపియన్‌గా నిలిచాడు. తుదిపోరులో రాజు 6–1తో క్రిస్ అలెన్ జేమ్స్‌ను ఓడించాడు. డబుల్స్ ఫైనల్లో రాజా–దిలీప్ ద్వయం 6–2తో శశికాంత్–రాజు జోడీని ఓడించి విజేతగా నిలిచింది. అండర్–14 విభాగంలో శ్రీహరి, హాసిని యాదవ్ టైటిళ్లను అందుకున్నారు. బాలుర ఫైనల్లో శ్రీహరి 6–5 (3)తో శౌర్య సామలపై, బాలికల తుదిపోరులో హాసిని యాదవ్ 6–0తో తనిష్క యాదవ్‌పై గెలుపొందారు. అండర్–12 విభాగంలో వేదాన్‡్ష తేజ, ఆపేక్ష రెడ్డి చాంపియన్లుగా నిలిచారు. ఫైనల్లో వేదాన్‡్ష 6–3తో శ్రీహిత్‌పై, ఆపేక్ష 6–4తో క్రితికి రెడ్డిపై గెలుపొందారు. అండర్–10 బాలుర ఫైనల్లో సంకీర్త్ 6–4తో ఆర్యన్‌పై, మాన్యరెడ్డి 6–5 (3)తో నిషితపై నెగ్గారు. అండర్–8 కేటగిరీలో తనవ్ వర్మ 6–1తో మైత్రిని ఓడించి టైటిల్‌ను అందుకుంది. -
చాంపియన్ వెంకట్ అనికేత్
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్లామ్ జూనియర్, పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో వెంకట్ అనికేత్ విజేతగా నిలిచాడు. మెట్టుగూడలోని షఫిల్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అనికేత్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో అనికేత్ 8–6తో ఆనంద్‌పై గెలుపొందాడు. అండర్–16 బాలుర ఫైనల్లో జి. రఘునందన్ 6–3తో మొహమ్మద్ ఇర్షద్ను ఓడించాడు. అండర్–14 కేటగిరీలో ఇషాన్ సయ్యద్ మొహమ్మద్, తనిష్క యాదవ్ టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో ఇషాన్ 6–4తో అభిరామ రెడ్డిపై గెలుపొందగా, తనిష్క 6–1తో దీక్షితను ఓడించింది. అండర్–12 బాలుర ఫైనల్లో శ్రీహిత్ 6–4తో సంకీర్త్పై, బాలికల విభాగంలో హాసిని 6–2తో శ్రీవల్లిపై గెలుపొందారు. అండర్–10 బాలికల టైటిల్‌పోరులో శ్రీయుక్త 6–1తో శ్రీయ గుప్తాపై నెగ్గింది. అండర్–8 విభాగంలో తనవ్ వర్మ 6–2తో గీతన్ రెడ్డిపై గెలిచి చాంపియన్‌గా నిలిచాడు. -
టైటిల్ పోరుకు సంజన సిరిమల్ల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సంజన సిరిమల్ల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సంజన బాలికల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం బాలికల సింగిల్స్ సెమీస్‌లో సంజన 6–1, 3–6, 6–1తో ఐదో సీడ్ సలాక్థిప్ (థాయ్‌లాండ్)పై గెలుపొందింది. మరో సెమీస్‌లో మూడో సీడ్ లాన్లనా (థాయ్‌లాండ్) 6–3, 6–4తో ఆరోసీడ్ మెయ్ హసెగవా (జపాన్)పై గెలుపొంది సంజనతో టైటిల్‌పోరుకు సిద్ధమైంది. -
చాంపియన్ సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 టైటిల్ విజేతగా తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల నిలిచింది. గువాహటి వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సంజన 5–7, 6–2, 6–4తో రేష్మా మరూరి (కర్ణాటక)పై విజయం సాధించింది. 3 గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను కోల్పోయిన సంజన... రెండో సెట్ నుంచి విజంభించింది. తర్వాతి సెట్లలో ప్రత్యరి్థకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా రెండు సెట్లను గెలిచి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో సంజన 6–4, 6–4తో మల్లిక మరాటీపై, క్వార్టర్స్‌లో 6–1, 6–0తో కనిక శివరమన్పై, ప్రిక్వార్టర్స్‌లో 6–2, 6–2తో అమీక్ కిరణ్‌పై, తొలి రౌండ్లో 6–2, 6–0తో సుహిత మరూరిపై గెలిచింది. టైటిల్ గెలిచిన సంజనను స్పాన్సర్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఎండీ, చైర్మన్ డాక్టర్ రమేశ్ కంచర్ల అభినందించారు. -
భారత టెన్నిస్ జట్టులో భువన కాల్వ
సాక్షి, హైదరాబాద్: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల టెన్నిస్ జట్టులో తెలంగాణ క్రీడాకారిణి భువన కాల్వ చోటు దక్కించుకుంది. నేపాల్ వేదికగా డిసెంబర్ 1 నుంచి 10 వరకు దక్షిణాసియా క్రీడలు జరుగనున్నాయి. ఇందులో భారత్‌తో పాటు మరో ఏడు దేశాలు పాల్గొననున్నాయి. గత కొంతకాలంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీల్లో నిలకడగా రాణిస్తోన్న భువన ఈ క్రీడల్లోనూ రాణించాలని పట్టుదలగా ఉంది. -
ఐటా సింగిల్స్ చాంప్ వినీత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుర్రాడు ముత్యాల వినీత్ అదరగొట్టాడు. తొలిసారి తెలుగు రాష్ట్రాల నుంచి బాలుర విభాగంలో అఖిల భారత టెన్నిస్ సంఘం సింగిల్స్ టైటిల్‌ని నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. బాలుర అండర్–14 విభాగంలో వినీత్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో వినీత్ 6–3, 4–6, 6–3తో సిద్ధార్థ్ మరాఠే (మహారాష్ట్ర)పై విజయం సాధించి టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. తొలి సెట్ గెలిచిన వినీత్ రెండో సెట్లో వెనుకబడ్డాడు. అయితే నిర్ణాయక మూడో సెట్లో దూకుడుగా ఆడి సెట్‌తో పాటు మ్యాచ్‌నూ గెలిచాడు. -
‘దశ ధీరుడు’ ఫెడరర్
బాసెల్: స్విస్ దిగ్గజం, ప్రపంచ మూడో ర్యాంకర్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్ మరో రికార్డు సాధించాడు. స్వదేశంలో జరిగిన బాసెల్ ఏటీపీ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6-2, 6-2 తేడాతో అలెక్స్ డి మినావుర్(ఆస్ట్రేలియా)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇది ఫెడరర్‌కు 10వ బాసెల్ ఏటీపీ టైటిల్. ఫలితంగా ఈ టోర్నీలో రికార్డు టైటిల్స్ ఘనతతో ఫెడరర్ నయా రికార్డు నమోదు చేశాడు. తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన ఫెడరర్.. రెండో సెట్లో కూడా అదే ఊపును కనబరిచి మ్యాచ్‌తో పాటు చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇది ఓవరాల్‌గా ఫెడరర్‌కు 103 సింగిల్స్ టైటిల్ కావడం మరో విశేషం. అయితే ఒక టోర్నమెంట్‌ను 10సార్లు సాధించడం ఫెడరర్ కెరీర్లో రెండోసారి. బాసెల్ ఏటీపీ చాంపియన్‌షిప్‌లో ఫెడరర్ దూకుడు ముందు మినావుర్ తేలిపోయాడు. కేవలం 68 నిమిషాలు జరిగిన పోరు ఏకపక్షంగా సాగింది. వరుస రెండు సెట్లలోనే ఫెడరర్ తన విజయాన్ని ఖాయం చేసుకుని తనలో జోరు తగ్గలేదని నిరూపించాడు. ఈ ప్రదర్శనపై ఫెడరర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇదొక గొప్ప మ్యాచ్ అని పేర్కొన్న ఫెడరర్.. చాలా తొందరగా ముగిసిందని పేర్కొన్నాడు. నా సొంత గడ్డపై 10వసారి ఈ టైటిల్‌ను సాధించడం మరచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు. కాగా, ఈ చాంపియన్‌షిప్‌లో తొలి మ్యాచ్ మాత్రం చాలా కఠినంగా సాగిందన్నాడు. ఐదు సెట్లకు దారి తీసిన ఆ మ్యాచ్‌లో సుదీర్ఘమైన ర్యాలీలు వచ్చాయన్నాడు. -
సెమీస్‌లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సీవీజీ నాయుడు స్మారక ఆలిండియా మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఈ టోరీ్నలో దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. బుధవారం సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయిదేదీప్య 6–1, 6–1తో షరోన్ విలియమ్స్ (కర్ణాటక)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో 6–2, 6–2తో ఆపేక్ష సోలంకీ (కర్ణాటక)పై గెలుపొందగా... తొలి రౌండ్లో తెలంగాణ ప్లేయర్ మౌలికరామ్ తప్పుకోవడంతో దేదీప్యకు వాకోవర్ లభించింది. ఇదే టోరీ్నలో మరో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రషి్మక క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో రష్మిక 6–0, 6–1తో అదితి నారాయణన్‌పై నెగ్గింది. తొలి రౌండ్లో ఆమె 6–3, 6–0తో ఎస్బీ అపూర్వను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్స్ మ్యాచ్‌లో వన్షిత పతానియా (కర్ణాటక)తో దేదీప్య ఆడుతుంది. -
చాంపియన్స్ సౌజన్య, నిక్కీ
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఈ టోరీ్నలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలతో పాటు అండర్–18 బాలికల కేటగిరీలోనూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన నిక్కీ పునాచ, సౌజన్య భవిశెట్టి పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను హస్తగతం చేసుకోగా... అండర్–18 బాలికల సింగిల్స్‌లో తెలంగాణకు చెందిన రషి్మక భమిడిపాటి చాంపియన్‌గా అవతరించింది. శనివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ నిక్కీ పునాచ 6–2, 7–6 (7/4)తో ఆర్యన్ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. మరోవైపు శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌లో రిషికతో కలిసి డబుల్స్ టైటిల్ నెగ్గిన సౌజన్య... సింగిల్స్ విభాగంలోనూ సత్తాచాటింది. టాప్ సీడ్‌గా బరిలో దిగిన ఆమె ఫైనల్లో 6–4, 6–2తో ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)పై గెలు పొందింది. సౌజన్యకిదే తొలి జాతీయ టైటిల్ కావడం విశేషం. అండర్–18 బాలికల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ రష్మి క భమిడిపాటి 6–0, 6–4తో ఐదో సీడ్ సందీప్తి సింగ్ రావుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలుర తుదిపోరులో మాడ్విన్ కామత్ 6–2, 7–6 (7/1)తో ఉదిత్ గొగోయ్‌పై గెలుపొంది చాంపియన్‌గా నిలిచాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేసింది. -
మెయిన్ డ్రా పోటీలకు రష్మిక
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ మహిళల టెన్నిస్ టోర్నీ మెయిన్ డ్రా పోటీలకు తెలంగాణ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక అర్హత సాధించింది. న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా స్టేడియంలో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ సాధించిన రషి్మక మెరుగైన ప్రదర్శన కనబరిచింది. తొలి రౌండ్లో శ్రీవల్లి రష్మిక 9–2తో ఈశ్వరి (మహారాష్ట్ర)పై గెలుపొందగా... రెండో రౌండ్లో 9–0తో అద్రిజా బిశ్వాస్ (పశ్చిమ బెంగాల్)ను ఓడించింది. తర్వాత జరిగిన ఫైనల్ రౌండ్లో 6–0, 6–2తో కిరణ్ కల్కల్ (ఢిల్లీ)పై గెలుపొంది మెయిన్ డ్రాలో అడుగుపెట్టింది. -
టైటిల్‌పోరుకు అనిరుధ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ నిలకడగా రాణిస్తున్నాడు. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి విజయ్ సుందర్ ప్రశాంత్‌తో కలిసి అనిరుధ్ డబుల్స్ విభాగంలో టైటిల్‌పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్–విజయ్ సుందర్ (భారత్) ద్వయం 6–0, 6–4తో చుకాంగ్ వాంగ్–జిహావో షియా (చైనా) జోడీపై గెలుపొందింది. అంతకుముందు క్వార్టర్స్‌లో 6–1, 6–3తో చెంగ్ హాన్–చాంగ్ జాంగ్ (చైనా) జోడీపై నెగ్గారు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో విఘ్నేశ్ పెరణమల్లూర్–చెరుకు వశిష్ట్ (భారత్) జంట 6–3, 4–6, 5–10తో చుకాంగ్ వాంగ్–జిహావో షియా (చైనా) జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్ విభాగంలో అనిరుధ్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ (భారత్) 7–5, 0–6, 0–6తో నాలుగో సీడ్ టకాషి సయాటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో అనిరుధ్ 6–4, 6–1తో జియాన్ యావో హో (చైనా)పై గెలుపొందాడు. -
ప్రిక్వార్టర్స్‌లో తీర్థశశాంక్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ ఎం. తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్‌లోని జసోవాల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. సోమవారం పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–3, 6–4తో ఎనిమిదో సీడ్ అనురాగ్ (ఢిల్లీ)పై విజయం సాధించాడు. -
ఫైనల్లో సుమిత్ నాగల్
బోస్నియా: ఏటీపీ టూర్ బంజా లుకా చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో భారత ఆటగాడు సుమిత్ నాగల్ ప్రవేశించాడు. సెమీస్‌లో సుమిత్ 7–6 (7/1), 6–2తో ఫిలిప్ హొరంస్కీ (స్లొవేకియా)పై విజయం సాధించాడు. షాంగై చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఆడుతున్న మరో భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు సెమీస్‌లో చుక్కెదురైంది. అతను 6–7 (7/9), 4–6తో యసుటక ఉచియామ (జపాన్) చేతిలో ఓడాడు. -
భారత బధిర టెన్నిస్ జట్టులో భవాని
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ క్రీడలో నిలకడగా రాణిస్తోన్న తెలంగాణ అమ్మాయి భవాని కేడియా గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ప్రపంచ బధిర టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత లాన్ టెన్నిస్ జట్టుకు భవాని ఎంపికైంది. టర్కీలోని ఆంటాల్యాలో అక్టోబర్ 12 నుంచి 19 వరకు ప్రపంచ బధిర టెన్నిస్ చాంపియన్íÙప్ జరుగనుంది. జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా భవానిని ఆమె గురువులు, తల్లిదండ్రులు అభినందించారు. -
పిమ్రదా డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: రాజా నరసింహారావు స్మారక అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నమెంట్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి పిమ్రదా జటవపోర్నవీట్ చాంపియన్‌గా నిలిచింది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన అండర్–18 బాలికల ఫైనల్లో టాప్ సీడ్ పిమ్రదా 6–1, 6–1తో సందీప్తి సింగ్ రావు (భారత్)పై గెలుపొందింది. డబుల్స్‌లోనూ పిమ్రదా జోడీ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. తుదిపోరులో పిమ్రదా–లాన్లనా (థాయ్‌లాండ్) జంట 6–1, 7–6తో మల్లికా (భారత్)–యటావీ చిమ్‌చమ్ (థాయ్‌లాండ్) ద్వయంపై నెగ్గింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ ప్యాట్రన్ హన్‌చైకుల్ (థాయ్‌లాండ్) 5–7, 6–0, 6–2తో అదిత్ సిన్హా (అమెరికా)పై గెలుపొందాడు. డబుల్స్ తుదిపోరులో నిశాంత్ దబాస్ (భారత్)–తనపట్ నిరున్‌డోర్న్ (థాయ్‌లాండ్) ద్వయం 6–4, 6–3తో ఆర్యన్ భాటియా–చిరాగ్ దుహాన్ జోడీపై నెగ్గింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఫైనల్‌కు పిమ్రదా, సందీప్తి
సాక్షి, హైదరాబాద్: రాజా నరసింహారావు స్మారక అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నమెంట్లో టాప్ సీడ్ పిమ్రదా జటావపోర్నవిట్ (థాయ్‌లాండ్), ఎనిమిదో సీడ్ సందీప్తి సింగ్ (భారత్) ఫైనల్‌కు చేరుకున్నారు. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో పిమ్రదా 6–1, 6–3తో నాలుగో సీడ్ యిఫాన్ సున్ (చైనా)పై గెలుపొందగా... సందీప్తి సింగ్ 6–3, 6–4తో హైదరాబాద్ ప్లేయర్ వినీత ముమ్మడిని ఓడించింది. బాలుర సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు చిరాగ్ దుహాన్, ధ్రువ్ పోరాటం సెమీస్‌లో ముగిసింది. సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో చిరాగ్ 7–5, 3–6, 1–6తో పటోర్న్ హన్‌చైకుల్ (థాయ్‌లాండ్) చేతిలో, ధ్రువ్ 2–6, 6–4, 5–7తో అదిత్ సిన్హా (అమెరికా) చేతిలో ఓడిపోయారు. బాలికల డబుల్స్ విభాగంలో భారత జోడీలు సెమీస్‌లో ఓటమి పాలవ్వగా... బాలుర డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులు ఫైనల్‌కు చేరుకున్నారు. అండర్–18 బాలుర డబుల్స్ తొలి సెమీస్‌లో ఆర్యన్ భాటియా–చిరాగ్ దుహాన్ (భారత్) జోడీకి చైనా జోడీ నుంచి వాకోకవర్ లభించింది. రెండో సెమీస్‌లో నిశాంత్ దబాస్ (భారత్)–తనపట్ నిరున్‌డోర్న్ (థాయ్‌లాండ్) జంట 7–6 (7), 2–6, 10–5తో సంజీత్ దేవినేని (అమెరికా)–ఉదిత్ గొగోయ్ (భారత్) జోడీపై గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. బాలికల డబుల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ సారాదేవ్–ప్రేరణ విచారే (భారత్) ద్వయం 2–6, 1–6తో టాప్‌సీడ్ పిమ్రదా–లాన్లనా (థాయ్‌లాండ్) జోడీ చేతిలో, వినీత–సందీప్తి (భారత్) జోడీ 2–6, 0–6తో యటావీ చిమ్‌చమ్ (థాయ్‌లాండ్)–మల్లికా (భారత్) జంట చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి ని్రష్కమించాయి. -
సెమీస్‌లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో సాయి దేదీప్య మహిళల సింగిల్స్ విభాగంలో సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో సాయి దేదీప్య (తెలంగాణ) 6–3, 6–3తో అవిష్క గుప్తా (జార్ఖండ్)పై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుములతో దేదీప్య తలపడుతుంది. -
పోరాడి ఓడిన దివిజ్–ఎల్రిచ్ జంట
న్యూఢిల్లీ: అట్లాంటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో జంటగా 100 కంటే ఎక్కవ టైటిల్స్ నెగ్గిన అమెరికా కవల సోదరులు బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్‌లకు దివిజ్–ఎల్రిచ్ జోడీ చివరి క్షణం వరకు గట్టిపోటీనిచ్చింది. కానీ అపార అనుభవమున్న బ్రయాన్ బ్రదర్స్ కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దివిజ్ శరణ్–ఎల్రిచ్ జోడీ 4–6, 7–6 (7/4), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ బాబ్ బ్రయాన్–మైక్ బ్రయాన్ జంట చేతిలో పోరాడి ఓడింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్ జంట ఏడు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. క్వార్టర్స్‌లో ఓటమితో దివిజ్–ఎల్రిచ్‌లకు 6,240 డాలర్ల (రూ. 4 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో తెలంగాణ క్రీడాకారులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సామ సాత్విక ముందంజ వేశా రు. పోర్చుగల్‌లోని పల్మెలా వేదికగా సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో వీరిద్దరూ గెలుపొందారు. శ్రీవల్లి రష్మిక 4–6, 6–3, 13–10తో కింబర్లీ పుకుసా (బ్రిటన్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ సాత్విక 6–3, 6–1తో బెట్రిజ్ పసిలెట్టి డ్యూర్టె కోస్టా (పోర్చుగల్)ను ఓడించింది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అనా ఫిలిపా సాంటోస్ (పోర్చుగల్)తో సాత్విక, మూడో సీడ్ వాలెంటినా ఇవనోవ్ (న్యూజిలాండ్)తో శ్రీవల్లి రష్మిక ఆడతారు. -
చాందిని డబుల్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి చాందిని శ్రీనివాసన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. జలంధర్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలికల సింగిల్స్ ఫైనల్లో చాందిని 6–0, 6–1తో ప్రాణ్య (ఢిల్లీ)పై గెలుపొందింది. సెమీస్‌లో 6–0, 6–2తో సహీరా సింగ్ (హరియాణా)పై, క్వార్టర్స్‌లో 6–1, 6–1తో ఐశ్వర్య (మహారాష్ట్ర)పై గెలిచింది. డబుల్స్‌లో ప్రతిష్ట సైనీ (పంజాబ్)తో జతకట్టిన చాందిని ఫైనల్లో 6–2, 6–3తో ఇనాయత్ రాయ్–ప్రాణ్యలను ఓడించి చాంపియన్లుగా నిలిచారు. సెమీస్‌లో చాందిని–ప్రతిష్ట ద్వయం 6–2, 6–2తో సీరత్ (పంజాబ్)–షగుణ్ (ఉత్తరప్రదేశ్) జోడీపై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. -
సింగిల్స్ విజేత మధు
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్లామ్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎం. మధు ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. మెట్టుగూడలోని షఫల్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో మధు చాంపియన్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో మధు 9–1తో రుషి చక్రపై ఘనవిజయం సాధించాడు. అండర్–14 విభాగంలో క్రిస్ హామిల్టన్ రాస్, డి. హాసిని యాదవ్ విజేతలుగా నిలిచారు. బాలుర ఫైనల్లో హామిల్టన్ రాస్ 7–6తో విజయ్ సారథిపై గెలుపొందగా... బాలికల తుదిపోరులో హాసిని యాదవ్ 7–4తో తనిష్క యాదవ్‌ను ఓడించింది. అండర్–12 విభాగంలో తన్మయ్, హాసిని టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఫైనల్లో తన్మయ్ 7–5తో యువన్ సార థిపై, హాసిని 7–5తో జిగ్నా చౌదరీపై గెలిచారు. అండర్–10 విభాగంలో హృతిక్, సృష్టి చాంపియన్లుగా నిలిచారు. బాలుర ఫైనల్లో హృతిక్ 6–2తో నిషిత్‌పై గెలిచాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన బాలికల మ్యాచ్‌ల్లో సృష్టి, శ్రీయుక్త వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. -
ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలకు సిద్ధార్థ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో తలపడే భారత విశ్వవిద్యాలయాల టెన్నిస్ జట్టులో తెలంగాణ క్రీడాకారుడు పొన్నాల సిద్ధార్థ్ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతోన్న సిద్ధార్థ్ ఇటీవల జరిగిన ఆలిండియా యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంట్లో కాంస్య పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా 2015–16, 2016–17 సీజన్ పోటీల్లో సిద్ధార్థ్ ఉస్మానియా యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటలీలోని నపోలీలో జూలై 3 నుంచి ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు జరుగనున్నాయి. -
మనీశ్‌కు మూడు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్లామ్ కార్పొరేట్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో డి. మనీశ్ అదరగొట్టాడు. మణికొండలోని ప్రొఫెషనల్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో మనీశ్ పురుషుల సింగిల్స్, 40 ప్లస్ పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి మూడు టైటిళ్లను హస్తగతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్‌పోరులో మనీశ్ 8–1తో సాగర్‌పై గెలుపొందాడు. 40 ప్లస్ వయో విభాగంలో మనీశ్ 8–0తో దేవరకొండ రవిశంకర్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు డబుల్స్ విభాగంలో ధీరజ్–మనీశ్ జంట 8–1తో రవిశంకర్–నాగ్ జోడీపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాగర్–రవి ద్వయం 8–3తో ప్రశాంత్ రెడ్డి–ఉదయ్ శంకర్ జంటపై గెలిచి ట్రోఫీని అందుకుంది. -
సౌజన్యకు నిరాశ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టికి నిరాశ ఎదురైంది. చైనాలోని షెన్జెన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో సౌజన్య మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సౌజన్య 6–2, 6–2తో కాట్యా మలికోవా (ఉక్రెయిన్)పై గెలిచింది. అయితే నాలుగో సీడ్ జెస్సికా హో (అమెరికా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సౌజన్య గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగింది. తొలి సెట్‌ను 4–6తో కోల్పోయిన సౌజన్య, రెండో సెట్లో 1–4తో వెనుకబడిన దశలో గాయం కావడంతో ఆమె తప్పుకుంది. -
విష్ణు జంట ఓటమి
సాక్షి, హైదరాబాద్: చెక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ పోరాటం ముగిసింది. చెక్ రిపబ్లిక్లో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో విష్ణువర్ధన్ (భారత్)–నికోలా కాసిచ్ (సెర్బియా) ద్వయం 2–6, 6–4, 8–10తో రెండో సీడ్ డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)–ఇగోర్ జెలానీ (స్లొవేకియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు జంట నాలుగు ఏస్‌లు సంధించి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్లో ఓడిన విష్ణు జోడీకి 610 యూరోలు (రూ. 47 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
టైటిల్ పోరుకు సంజన
ముంబై: రమేశ్ దేశాయ్ స్మారక జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నం.1 ప్లేయర్, హైదరాబాదీ సంజన సిరిమల్ల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా స్థాయిలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో సంజన సింగిల్స్ విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సంజన (తెలంగాణ) 6–1, 6–1తో ఎనిమిదో సీడ్ పరీ సింగ్ (హరియాణా)పై గెలుపొందింది. రెండో సెమీస్‌లో ఏడో సీడ్ రెనీ సింగ్లా 6–0, 6–2తో అన్‌సీడెడ్ నైషా శ్రీవాస్తవ్‌ను ఓడించి సంజనతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. -
సెమీఫైనల్లో సంజన
ముంబై: రమేశ్ దేశాయ్ స్మారక సీసీఐ అండర్–16 జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ నం. 1 క్రీడాకారిణి, హైదరాబాదీ సంజన సిరిమల్ల నిలకడగా రాణిస్తోంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సంజన బాలికల సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకుంది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సంజన (తెలంగాణ) 6–4, 7–5తో దియా భరద్వాజ్ (గుజరాత్)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ రెనీ సింగ్లా (హరియాణా) 6–0, 6–2తో విధి జైన్ (గుజరాత్)పై, ఎనిమిదో సీడ్ పరీ సింగ్ (హరియాణా) 6–1, 6–2తో రేష్మా (కర్ణాటక)పై, అన్‌సీడెడ్ నైషా శ్రీవాస్తవ్ (కర్ణాటక) 6–3, 6–1తో భూమిక త్రిపాఠిపై విజయం సాధించి ముందంజ వేశారు. -
అనిరుధ్ జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నిక్కీ పూనాచ సత్తా చాటారు. ఉగాండాలోని కంపాలాలో జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన వీరిద్దరూ తమ హోదాకు న్యాయం చేస్తూ టైటిల్‌ను గెలుచుకున్నారు. టైటిల్‌పోరులో టాప్ సీడ్ అనిరుధ్ చంద్రశేఖర్–నిక్కీ పూనాచ (భారత్) జంట 6–3, 6–4తో సిమోన్ కర్ (ఐర్లాండ్)–ర్యాన్ జేమ్స్ స్టోరీ (బ్రిటన్) జోడీపై వరుస సెట్లలో విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అనిరుధ్ చంద్రశేఖర్–నిక్కీ పూనాచ ద్వయం 6–2, 6–4తో మూడోసీడ్ సెర్గీ టోలోటోవ్ (రష్యా)–ఎస్డీ ప్రజ్వల్ దేవ్ (భారత్) జోడీపై సులువుగా గెలుపొందింది. క్వారర్ ఫైనల్లో అనిరు«ద్ జోడీకి గట్టి పోటీ ఎదురైంది. తొలి సెట్‌ను కోల్పోయిన అనిరు«ద్ జంట తర్వాత పుంజుకుంది. ఈ మ్యాచ్‌లో 4–6, 6–3 (10/6)తో జులియన్ బ్రాడ్లీ (ఐర్లాండ్)–ఓర్లీ ఐరాడుకున్‌డ (బురుండి) జోడీపై నెగ్గి బరిలో నిలిచింది. తొలి రౌండ్లో 6–2, 6–1తో తరుణ్ చిలకలపూడి–అభినవ్ సంజీవ్ (భారత్) జంటపై గెలుపొందింది. -
సాయికార్తీక్ రెడ్డికి సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్లో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సాయికార్తీక్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్‌పోరులో అన్‌సీడెడ్ సాయికార్తీక్ 6–3, 6–3తో టాప్ సీడ్ అన్షు కుమార్ భూయాన్ (ఒడిశా)ను కంగుతినిపించాడు. ఈ టోర్నమెంట్ ఆసాంతం నిలకడగా ఆడిన సాయికార్తీక్... జనవరిలో జరిగిన ఖేలో ఇండియా చాంపియన్‌షిప్‌లో అండర్–21 పురుషుల సింగిల్స్, డబుల్స్ కేటగిరీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు. -
టైటిల్ పోరుకు సాయికార్తీక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గురుకుల్ ‘ఐటా’ ఆలిండియా పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు జి. సాయికార్తీక్ రెడ్డి నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సాయికార్తీక్ రెడ్డి తనకన్నా మెరుగైన క్రీడాకారులను ఓడించి టైటిల్‌పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాయికార్తీక్ రెడ్డి 6–2, 6–4తో రెండోసీడ్ విలాసిర్ (హరియాణా)పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయికార్తీక్ 4–6, 6–3, 6–2తో కైవల్య కలాంసే (మహారాష్ట్ర)పై పోరాడి గెలిచాడు. రెండో రౌండ్లో 3–6, 6–0, 6–2తో వి. హేవంత్ (తెలంగాణ)పై, తొలి రెండ్లో ఏకే రోహిత్‌పై గెలుపొందాడు. -
ఆసియా టెన్నిస్ టోర్నీకి చాహన
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్ ప్లేయర్ చాహన బుద్ధపాటి గొప్ప అవకాశాన్ని అందుకుంది. ఐటీఎఫ్ ఆసియా టెన్నిస్ అండర్–14 డెవలప్మెంట్ డివిజన్–1 చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు చాహన ఎంపికైంది. ఉజ్బెకిస్తాన్‌లో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ ఈనెల 19 వరకు జరుగుతుంది. ప్రస్తుతం ఆలిండియా అండర్–14 ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న చాహనతో పాటు పరీ సింగ్, సుహిత బాలికల జట్టుకు ఎంపికయ్యారు. బాలుర జట్టులో ఆయుష్మాన్, ఆగ్రేయ, యువన్ చోటుదక్కించుకున్నారు. -
రన్నరప్ దివిజ్ జంట
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్లో తన భాగస్వామి మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)తో కలిసి భారత టెన్నిస్ స్టార్ దివిజ్ శరణ్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 4–6, 2–6తో ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్)–టిమ్ పుయెట్జ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్ దివిజ్ జంటకు 15,200 యూరోల (రూ. 11 లక్షల 78 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో నిధి
పుణే: ఆసియా టెన్నిస్ టూర్ (ఏటీటీ) మహిళల ర్యాంకింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మా యి నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిం ది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో నిధి 6–1, 6–2తో హైదరాబాద్‌కే చెందిన మరో క్రీడాకారిణి శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో చామర్తి సాయి సంహిత 6–1, 6–2తో అవిక సగ్వాల్పై, రియా 6–0, 6–0తో అలీకా ఇబ్రహీమ్‌పై, వన్షిత పథానియా 2–6, 6–3, 7–6 (7/5)తో ఆలియా ఇబ్రహీమ్‌పై, బేలా తమ్హాంకర్ 6–4, 6–3తో ఆర్తి ముణియన్పై గెలుపొందారు. -
రన్నరప్ ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల రాణించింది. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ప్రాంజల 6–0, 1–6, 3–6తో రఖిమోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. -
క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్
సాక్షి, హైదరాబాద్: ఆసియా టెన్నిస్ టూర్ ఇంటర్నేషనల్ పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. ముంబైలో జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ (భారత్) 2–6, 6–2, 6–4తో ఐదో సీడ్ తేజస్ (భారత్)పై విజయం సాధించి ముందంజ వేశాడు. తొలి సెట్లో వెనుకబడిన తీర్థ శశాంక్ రెండో సెట్లో పుంజుకొని సెట్‌ను గెలుచుకున్నాడు. మూడో సెట్లో పోటీ ఎదురైనప్పటికీ శశాంక్ 6–4తో సెట్‌ను గెలుచుకొని టైటిల్ రేసులో నిలిచాడు. మరోవైపు పట్లోళ్ల అపురూప్ రెడ్డి ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. ఎనిమిదో సీడ్ అపురూప్ 4–6, 1–6తో రాఘవ్ జైసింఘాని చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. -
ప్రిక్వార్టర్స్‌లో శశాంక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెన్నిస్ ఆటగాడు తీర్థ శశాంక్ ఆసియా టెన్నిస్ టూర్ పురుషుల అంతర్జాతీయ టోర్నమెంట్లో సత్తాచాటుకున్నాడు. ముంబైలో జరుగుతున్న ఈ టోర్నీలో అతను ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోరులో తీర్థ శశాంక్ 3–6, 6–4, 7–5తో తొమ్మిదో సీడ్ అన్విత్ బెంద్రేపై విజయం సాధించాడు. మిగతా మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు చెందిన పట్లోళ్ల అపురూప్ రెడ్డి 7–5, 6–1తో కరణ్ లాల్చందానిపై గెలిచాడు. అయితే తాహ కపాడియాకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. అతను 4–6, 3–6తో సాహిల్ గవారే చేతిలో పరాజయం పాలయ్యాడు. -
విష్ణువర్ధన్‌కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: నాన్‌చాంగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో అతను తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. చైనాలో బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో విష్ణు 2–6, 3–6తో ఆండ్రూ హారిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ తొలి రౌండ్లో విష్ణువర్ధన్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట 4–6, 5–7తో సాండెర్ ఆరెండ్స్ (నెదర్లాండ్స్)–వీస్‌బార్న్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రామ్‌కుమార్ 6–3, 6–2తో రిగిలె టి (చైనా)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. -
తొలి రౌండ్లో సాకేత్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నాన్‌చాంగ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తొలి రౌండ్లోనే పరాజయం చవిచూశాడు. చైనాలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 4–6, 4–6తో జీజెన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 82 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్ 2–6, 4–6తో నికోలా మిలోజెవిచ్ (సెర్బియా) చేతిలో ఓడిపోయాడు. -
సన్నీత్కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ టోర్నీలో సరోజని అకాడమీకి చెందిన సన్నీత్ ఉప్పాటి విజేతగా నిలిచాడు. నేరేడ్మెట్లోని సెయింట్ థామస్ హైస్కూల్లో జరిగిన అండర్–14 బాలుర సింగి ల్స్ ఫైనల్లో సన్నీత్ 8–3తో శాంత్ శరణ్‌పై గెలుపొందాడు. సెమీస్‌లో 8–5తో రిషి వర్మపై, క్వార్టర్స్‌లో 8–4తో యశ్వంత్‌పై విజయం సాధించాడు. -
షేక్ హుమేరాకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా సత్తా చాటింది. కోల్‌కతాలో జరిగిన ఈ టోర్నీలో హుమేరా మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన టైటిల్‌పోరులో హుమేరా 6–1, 4–6, 7–5తో యుబ్రాని బెనర్జీ (కోల్‌కతా)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో హుమేరా 40 ర్యాంకింగ్ పాయింట్లు సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిక్కీ పునాచ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్ నిక్కీ పునాచ 6–3, 6–4తో దక్షిణేశ్వర్ సురేశ్‌పై గెలుపొందాడు. -
సన్నీత్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: లియో జూనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో సన్నీత్ ఉప్పా టి సత్తా చాటాడు. లింగంపల్లిలో జరిగిన ఈ టోర్నమెంట్లో సన్నీత్ అండర్–14, 16 విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నా రు. ఆదివారం జరిగిన అండర్–16 బాలుర ఫైనల్లో సన్నీత్ 6–1తో సాకేత రామపై గెలుపొందాడు. బాలికల కేటగిరీలో నవ్య 6–2తో స్ఫూర్తిని ఓడించింది. అండర్–14 బాలబాలికల ఫైనల్లో సన్నీత్ 6–3తో జైసింహాపై, స్ఫూర్తి 6–0తో నవ్యపై విజయం సాధించారు. అండర్–12 కేటగిరీలో పార్థ్, రితిక విజేతలుగా నిలిచారు. ఫైనల్లో పార్థ్ 6–3తో సాయి సూర్యపై గెలుపొందగా, రితిక 6–1తో ఎంఆర్వీబీ స్ఫూర్తిని ఓడించింది. అండర్–10 బాలుర టైటిల్‌పోరులో సాయి సూర్య సంజిత్ 6–5 (8–6)తో తారకఅర్జున్పై గెలుపొందాడు. బాలికల తుదిపోరులో మినాల్ 6–1తో శ్రీయుక్తను ఓడించింది. మిక్స్డ్ సింగిల్స్‌లో తనవ్ 6–3తో సిద్ధార్థ్‌పై విజయం సాధించాడు. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ కోల శ్రీనివాస్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. -
సంజన డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–16, అండర్–18 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. హరియాణాలోని కర్నల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆమె పాల్గొన్న రెండు వయో విభాగాల్లోనూ విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్–16 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన సంజన... అండర్–18 కేటగిరీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ అండర్–18 డబుల్స్ కేటగిరీలో తన భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన అండర్–16 బాలికల టైటిల్‌పోరులో సంజన 6–4, 7–5తో రాధిక రాజేశ్ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సంజన 6–2, 6–1తో నియతి (ఉత్తరాఖండ్)పై, క్వార్టర్స్‌లో 6–2, 6–0తో క్రిస్టీ బోరో (అస్సాం)పై, ప్రిక్వార్టర్స్‌లో 6–0, 6–0తో వన్య అరోరా (మహారాష్ట్ర)పై, తొలి రౌండ్లో 6–1, 6–3తో అనా వర్షిణి (ఉత్తర్‌ప్రదేశ్)పై విజయం సాధించింది. సింగిల్స్ ఓడినా.. డబుల్స్ దక్కింది అండర్–16 విభాగంలో ఆధిపత్యం ప్రదర్శించిన సంజన... అండర్–18 కేటగిరీ సింగిల్స్‌లో చివరి మెట్టుపై తడబడింది. ఫైనల్లో సంజన 4–6, 3–6తో గార్గి (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సంజన 6–4, 1–6, 6–1తో కశిష్ భాటియా (ఢిల్లీ)పై, క్వార్టర్స్‌లో 6–1, 5–7, 6–4తో హర్లీన్ కౌర్ (పంజాబ్)పై, ప్రిక్వార్టర్స్‌లో 6–1, 6–2తో క్రితిక (హరియాణా)పై, తొలి రౌండ్లో 6–1, 6–1తో ఐరా సూద్ (తెలంగాణ)పై గెలుపొంది ంది. మరోవైపు డబుల్స్ విభాగంలో భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి సంజన టైటిల్‌ను సాధించింది. అండర్–18 బాలికల డబుల్స్ తుదిపోరులో సంజన–ఆర్నిరెడ్డి ద్వయం 7–6, 6–4తో పవిత్రా రెడ్డి జోడీపై విజయం సాధించింది. -
మెయిన్ ‘డ్రా’కు చేరువలో భువన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు భువన కాల్వ, సామ సాత్విక, సాయి సంహిత చామర్తి ముందంజ వేశారు. జోధ్‌పూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరు మెయిన్ డ్రా పోటీలకు మరో విజయం దూరంలో నిలిచారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో పదో సీడ్ భువన 7–6 (7/3), 6–4తో నటాషాపై గెలుపొందగా... పన్నెండో సీడ్ సామ సాత్విక 6–0, 6–0తో వైదేహిని చిత్తుగా ఓడించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ సాయి సంహిత 6–2, 6–2తో ఫర్హత్ అలీన్ ఖమర్పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది. -
సంజన శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల శుభారంభం చేసింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సంజన 6–1, 6–0తో సానియా మనోజ్‌పై సులువుగా విజయం సాధించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో సంజన–రియా జోడీ తమ ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చింది. దీంతో టాప్ సీడ్ ప్రియాన్షి భండారి–హృదయ షా జంట నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. -
లక్ష్యం టాప్–50
కోల్‌కతా: స్వదేశంలో వచ్చే వారం ఇటలీతో జరుగనున్న డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో రాణిస్తానని అంటున్నాడు టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్. గ్రాస్ కోర్టులపై తాను మెరుగైన ఆటగాడినని పేర్కొంటూ, ఇటీవల గ్రాస్ కోర్టుపై ప్రపంచ 23వ ర్యాంకర్ డెనిస్ షపలొవ్ (కెనడా)ను ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. మోకాలి గాయంతో గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన ప్రజ్నేశ్... దాన్నుంచి కోలుకుని ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగి గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేశాడు. అయితే, తొలి రౌండ్లోనే 6–7 (7/9), 3–6, 3–6తో ఫ్రాన్సెస్ టియాఫొ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. వచ్చే సారి మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తే మరింత మెరుగైన ప్రదర్శన చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ర్యాంకు 104లో ఉన్న ప్రజ్నేశ్, తన లక్ష్యం టాప్–50లోకి చేరుకోవడమేనని వివరించాడు. ఇందులోభాగంగా ముందుగా టాప్–100లోకి రావడంపై దృష్టిపెట్టానన్నాడు. -
మలిష్క డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ సిరీస్ అండర్–14 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కె. మలిష్క సత్తా చాటింది. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మలిష్క సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ మలిష్క (తెలంగాణ) 6–0, 6–3తో రెండోసీడ్ హర్షిణి విశ్వనాథ్ (ఏపీ)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో మలిష్క 6–1, 6–2తో రాహీన్ తరనమ్ (తెలంగాణ)పై, క్వార్టర్స్‌లో 6–2, 6–1తో జ్యోత్స్న (ఏపీ)పై నెగ్గింది. మరోవైపు బాలికల డబుల్స్ టైటిల్‌పోరులో మలిష్క–రాహీన్ (తెలంగాణ) ద్వయం 7–5, 6–2తో హర్షిణి–జ్యోత్స్న (ఏపీ) జోడీపై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌లో మలిష్క జంట 6–1, 6–2తో శవినిత–చరిష్మా జోడీపై గెలిచింది. బాలుర విభాగంలో మహారాష్ట్రకు చెందిన అర్నవ్ విజేతగా నిలవగా... ఏపీ ప్లేయర్ సుహృధ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో అర్నవ్ 7–6 (1), 6–1తో సుహృధ్‌ను ఓడించాడు. డబుల్స్ ఫైనల్లో మురళీ సాత్విక్–సుహృధ్ (ఏపీ) జంట 6–3, 6–1తో సిద్ధాంత్ కృష్ణ (హరియాణా)–యజ్ఞేశ్ (తెలంగాణ) జోడీపై విజయం సాధించి టైటిల్‌ను అందుకుంది., , , -
రన్నరప్ ఉస్మానియా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ జోనల్ టెన్నిస్ టోర్నీలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచింది. కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీలో జరిగిన ఈ టోర్నీలో 16 యూనివర్సిటీ జట్లు టైటిల్ కోసం తలపడగా గుజరాత్ జట్టు విజేతగా నిలిచింది. శ్రావ్య శివాని, శ్రియ, సాయిదేదీప్య, అనూష కొండవీటి సభ్యులుగా ఉన్న ఉస్మానియా జట్టు ఫైనల్లో 1–2తో గుజరాత్ యూనివర్సిటీ చేతిలో ఓటమి పాలైంది. తొలి సింగిల్స్‌లో శ్రావ్య శివాని (ఓయూ) 6–7, 4–6తో వైదేహి (గుజరాత్ యూనివర్సిటీ) చేతిలో ఓడిపోయింది. రెండో సింగిల్స్‌లో టి.శ్రియ (ఓయూ) 6–2, 6–1తో రుత్వి (గుజరాత్)పై గెలుపొందడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో శ్రావ్య శివాని–శ్రియ (ఓయూ) ద్వయం 4–6, 4–6తో వైదేహి–రుత్వి (గుజరాత్) జోడీ చేతిలో ఓడటంతో ఓయూ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఓయూ 2–0తో పంజాబ్ యూనివర్సిటీపై, క్వార్టర్స్‌లో 2–0తో ఢిల్లీ యూనివర్సిటీ జట్టుపై విజయం సాధించింది. -
ఫైనల్లో అనిరుధ్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల టోర్నీలో తెలంగాణ క్రీడాకారుడు అనిరుధ్ చంద్రశేఖర్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. చైనాలోని ఆనింగ్ నగరంలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ కేటగిరీలో అనిరుధ్ తన భాగస్వామి ఎన్. విజయ్ సుందర్ ప్రశాంత్‌తో కలిసి ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అనిరుధ్–విజయ్ సుందర్ (భారత్) ద్వయం 4–6, 7–5, 10–8తో సొరా ఫుకుడా–తైసీ ఇచికవా (జపాన్) జంటపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో భారత జోడీ 7–6 (7/5), 6–4తో జియు చె– వికియాంగ్ జెంగ్ (చైనా) జంటను ఓడించింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో అనిరుధ్ తొలిరౌండ్లోనే ఓడిపోగా... విజయ్ సుందర్ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో అనిరుధ్ 6–4, 1–6, 4–6తో టాప్ సీడ్ టి చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, ప్రిక్వార్టర్స్‌లో విజయ్ సుందర్ 5–7, 2–6తో హావో వు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సూర్య పవన్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: బి. వెంకట సుబ్బయ్య స్మారక టెన్నిస్ టోర్నమెంట్లో సూర్య పవన్ ఆకట్టుకున్నాడు. గోల్డ్‌స్లామ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఎన్వీకే టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సూర్య పవన్ 8–7తో విశాఖ్‌పై నెగ్గాడు. డబుల్స్ తుదిపోరులో సూర్య పవన్–సూర్య సిరి ద్వయం 8–4తో సమర్ ఖాన్–విశాఖ్ జోడీపై గెలిచింది. 40 ప్లస్ పురుషుల సింగిల్స్‌లో వహీద్ 9–2తో కల్యాణ్ చక్రవర్తిని ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. డబుల్స్ టైటిల్‌పోరులోనూ వహీద్–రవీందర్ రెడ్డి జంట 9–2తో కల్యాణ్–వంశీ జోడీపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక నిలకడగా రాణిస్తోంది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో రష్మిక సెమీఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–0, 7–6 (1)తో టాప్ సీడ్ శివాని అమినేనిపై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జటవపోర్నవీత్ పిమ్రద (ఐదో సీడ్)తో రష్మిక తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో రష్మిక
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్–3 టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారులు శ్రీవల్లి రష్మిక, అమినేని శివాని క్వార్టర్స్‌కు చేరుకున్నారు. పుణేలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్) 2–6, 7–5, 6–3తో యు యున్ లీ (చైనీస్ తైపీ)పై, టాప్ సీడ్ శివాని 6–2, 6–2తో గార్గి పవార్ (భారత్)పై విజయం సాధించారు. సంజన సిరిమల్ల 3–6, 5–7తో కొహరు నిమి (జపాన్) చేతిలో పరాజయం పాలై తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. డబుల్స్ విభాగంలో రష్మిక జంట క్వార్టర్స్‌లో, శివాని జోడీ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాయి. బాలికల డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక (భారత్)–చెయ్ హున్ సిమ్ (కొరియా) ద్వయం 3–6, 6–3, 10–6తో ప్రియాన్షి–సుదీప్త (భారత్) జంటపై గెలుపొంది... క్వార్టర్స్‌లో 2–6, 1–6తో టాప్ సీడ్ మాటిల్డా ముతాజిక్–ఎరిన్ రిచర్డ్సన్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. శివాని–శరణ్య జంట 1–6, 3–6తో మల్లిక –మెయ్ హసేగవా (జపాన్) జంట చేతిలో తొలి రౌండ్లోనే ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నీలో హైదరాబాద్ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, అమినేని శివాని క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రష్మిక 6–3, 6–3తో అనన్య గోయెల్‌పై గెలుపొందింది. అంతకుముందు తొలి రౌండ్లో రష్మిక 6–3, 6–3తో జగ్మీత్ కౌర్‌ను ఓడించింది. మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ శివాని అమినేని 6–3, 6–4తో సారా దేవ్‌పై నెగ్గింది. -
క్వార్టర్స్‌లో సాకేత్
బెంగళూరు: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 6–1, 3–6, 6–1తో క్వాలిఫయర్ యూసుఫ్ హసమ్ (ఈజిప్ట్)పై గెలుపొందాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) జంట 6–3, 7–6 (7/5)తో ప్రజ్వల్ దేవ్–నికీ పునాచా (భారత్) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సుమీత్ 6–3, 7–6 (7/4)తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై, ప్రజ్నేశ్ 4–6, 6–4, 7–5తో సెబాస్టియన్ (జర్మనీ)పై గెలి చారు. శశికుమార్‌తో మ్యాచ్‌లో స్కోరు 6–7 (2/7), 1–3 వద్ద ఉన్నపుడు గాయం కారణంగా బ్లాజ్ కావిచ్ (స్లొవేనియా) వైదొలిగాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–7 (3/7), 3–6తో పర్సెల్–సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడింది. -
విజేతలు తానియా, అనిరుధ్
సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో జి. తానియా సరయ్, బి. అనిరుధ్ చాంపియన్లుగా నిలిచారు. బేగంపేట్‌లోని ఏస్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరు టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో అనిరుధ్ 6–3తో వి. ప్రణవ్‌పై గెలుపొందగా... హోరాహోరీగా సాగిన బాలికల సింగిల్స్ తుదిపోరులో తానియా 6–5 (7/1)తో ఎం. భారతిని ఓడించింది. అండర్–12 కేటగిరీలోనూ తానియా విజేతగా నిలిచింది. ఫైనల్లో తానియా 6–4తో రిషితా రెడ్డిపై గెలుపొందింది. బాలుర ఫైనల్లో శౌర్య 6–4తో డి. నిఖిల్‌పై నెగ్గాడు. అండర్–10 కేటగిరీలో తేజస్ సింగ్, మరియా వైజ్ టైటిళ్లను దక్కించుకున్నారు. బాలుర సింగిల్స్ టైటిల్ పోరులో తేజస్ 6–3తో శశాంక్‌పై, బాలికల తుదిపోరులో మరియా 6–4తో సాయి అనన్యపై విజయం సాధించారు. -
యూకీ పరాజయం
యాంట్‌వర్ప్ (బెల్జియం): యూరోపియన్ ఓపెన్ ఏటీ పీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 100వ ర్యాంకర్ యూకీ 6–7 (6/8), 7–5, 1–6తో ప్రపంచ 167వ ర్యాంకర్ సాల్వటోర్ కరూసో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్లో ఓడిన యూకీకి 6,200 (రూ. 5 లక్షల 20 వేలు) యూరోలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదే టోర్నీ డబుల్స్ విభాగం తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట 7–5, 6–4తో లియాండర్ పేస్ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) ద్వయంపై గెలిచింది. -
విజేత కేవీఎన్ మూర్తి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సీనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కేవీఎన్ మూర్తి విజేతగా నిలిచాడు. నేపాల్‌లో ఆదివారం జరిగిన 45 ప్లస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూర్తి 6–4, 6–1తో అమ్రిత్ బహదూర్ (నేపాల్)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో యూఎస్ఏలో ఈనెల 21 నుంచి 26 వరకు జరుగనున్న ఐటీఎఫ్ యంగ్ సీనియర్స్ ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యాడు. -
వన్షిక మరియా డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్లామ్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో వన్షిక మరియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. బోయిన్‌పల్లిలోని కృష్ణస్వామి అడ్వాన్స్డ్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో వన్షిక అండర్–10, 12 బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన అండర్–12 బాలికల సింగిల్స్ ఫైనల్లో వన్షిక 6–1తో జి. హర్ష్మితపై గెలుపొందింది. బాలుర టైటిల్‌పోరులో వి. ధీరజ్ రెడ్డి 6–5తో సి. హేమంత్ రెడ్డిపై గెలుపొంది విజేతగా నిలిచాడు. అండర్–10 బాలికల ఫైనల్లో వన్షిక 6–5తో సాయి అనన్యను ఓడించింది. బాలుర ఫైనల్లో ఎం. శ్రీవంత్ రెడ్డి 6–4తో కె. శశాంక్ సాయి ప్రసాద్‌పై నెగ్గాడు. అండర్–14 విభాగంలో జోయ్, సామ చెవిక చాంపియన్లుగా నిలిచారు. బాలుర ఫైనల్లో జోయ్ 6–3తో అనిరుధ్‌పై, బాలికల ఫైన ల్లో చెవిక 6–3తో శ్రీ జశ్వితపై గెలుపొందారు. -
అదితి డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ఐటా చాంపియన్‌షిప్ సిరీస్‌లో తెలంగాణ అమ్మాయి అదితి ఆరే రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నీలో ఆమె అండర్–16, 18 బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్ ఫైనల్లో అదితి 6–4, 6–2తో ఆర్ని రెడ్డి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర విభాగంలో ఇక్బాల్ ఖాన్ (తెలంగాణ) 7–5, 6–4తో సుహిత్ రెడ్డి (తెలంగాణ)ను ఓడించాడు. అండర్–16 ఫైనల్లో అదితి 6–3, 6–4తో అభయ వేమూరి (తెలంగాణ)పై గెలుపొందింది. బాలుర డబుల్స్‌లో మోహిత్ జోడీ విజేతగా నిలిచింది. అండర్–18 బాలికల డబుల్స్ ఫైనల్లో అభయ– అపూర్వ (తెలంగాణ) ద్వయం 6–3, 6–0తో వేద వశిష్ట– వేదరాజు ప్రపూర్ణ (తెలంగాణ) జోడీపై నెగ్గగా... బాలుర విభాగంలో సుహిత్ రెడ్డి (తెలంగాణ)–అద్వైత్ అగర్వాల్ (మహారాష్ట్ర) జంట 7–5, 6–3తో రిషికేశ్ సుంకర–కార్తీక్ నీల్ వడ్డేపల్లి (తెలంగాణ) జోడీని ఓడించి విజేతలుగా నిలిచాయి. -
సెమీస్‌లో సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 జూనియర్స్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమళ్ల నిలకడగా రాణిస్తోంది. శ్రీలంకలో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్న సంజన... డబుల్స్ విభాగంలో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో సంజన (భారత్) 6–2, 7–5తో టాప్‌సీడ్ లింగ్ చుయ్ కీ (హాంకాంగ్)కి షాకిచ్చింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 6–4, 6–4తో మ యుజా (చైనా)పై, తొలిరౌండ్లో 6–4, 5–7, 6–4తో సెనివిరత్నే (శ్రీలంక)పై గెలుపొందింది. మరోవైపు బాలికల డబుల్స్ తొలిరౌండ్లో బిపాషా– సంజన (భారత్) ద్వయం 6–4, 7–5తో లిన్ జిన్ టాన్– హనా సీన్ ఇయాన్ యిప్ (మలేసియా) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది. -
టైటిల్ పోరుకు నిఖిత, కావ్య
సాక్షి, హైదరాబాద్: ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) ఆధ్వర్యంలో జరుగుతోన్న స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో హెచ్ఎస్ నిఖిత, కావ్య ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన క్యాడెట్ బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో వీరిద్దరూ విజయం సాధించారు. తొలి సెమీస్‌లో నిఖిత (వీపీజీ) 11–6, 11–5, 11–5, 11–3తో ధ్రితి (జీఎస్ఎం)పై గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో కావ్య (ఏడబ్ల్యూఏ) 6–11, 12–10, 11–7, 11–5, 11–7తో ప్రగ్యాన్ష (వీపీజీ)ని ఓడించింది. మరోవైపు బాలుర విభాగంలో జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్), పార్థ్ భాటియా (ఏడబ్ల్యూఏ), శౌర్య రాజ్ సక్సేనా (ఎంఎల్ఆర్), కార్తీక్ (నల్లగొండ) సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో జతిన్‌దేవ్11–8, 11–5, 11–5తో ధ్రువ్ సాగర్ (జీఎస్ఎం)పై, పార్థ్ భాటియా 11–4, 11–6, 11–4తో ఒమర్ మంజూర్ ఖాన్ (వీపీజీ)పై, శౌర్యరాజ్ 11–7, 11–6, 11–8తో తరుణ్ ముఖేశ్ (ఎంహెచ్‌జే)పై, కార్తీక్ 8–11, 11–9, 11–8, 10–12, 11–6తో మహేశ్ (జీటీటీఏ)పై విజయం సాధించారు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల వివరాలు సబ్ జూనియర్ బాలురు: కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 3–0తో ఎ. వరుణ్‌పై, ప్రణవ్ (ఏడబ్ల్యూఏ) 3–0తో సయ్యద్ నజీబుల్లా (ఏడబ్ల్యూఏ)పై, త్రిశూల్ మెహ్రా (ఎల్బీ స్టేడియం) 3–1తో యశ్ గోయెల్ (జీఎస్ఎం)పై, సాయికిరణ్ (ఏడబ్ల్యూఏ) 3–2తో శ్రేష్ట్ (ఏడబ్ల్యూఏ)పై, అథర్వ (ఏడబ్ల్యూఏ) 3–0తో రాజు (ఏడబ్ల్యూఏ)పై, జి. వివేక్ సాయి (హెచ్‌వీఎస్) 3–1తో క్రిష్ సింఘ్వి (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. బాలికలు: ఎన్. భవిత (జీఎస్ఎం) 3–0తో నందిని (వీపీజీ)పై, విధిజైన్ 3–0తో వై. శ్రేయ సత్యమూర్తిపై, ఫాతిమా (డాన్‌బాస్కో) 3–1తో పూజపై, నమ్రత 3–2తో నిఖితపై, అనన్య (జీఎస్ఎం) 3–1తో మెర్సీ (హెచ్‌వీఎస్)పై, గోధ తేజస్విని (నల్లగొండ) 3–2తో పలక్‌పై, ప్రియాన్షి (జీఎస్ఎం) 3–0తో ప్రగ్యాన్ష (వీపీజీ)పై, ఇక్షిత (ఏడబ్ల్యూఏ) 3–0తో అహ్మదీ నౌసీన్ (డాన్‌బాస్కో)పై విజయం సాధించారు. మహిళల సింగిల్స్: నైనా 4–0తో శరణ్య (జీఎస్ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 4–0తో హనీఫాపై, లాస్య (ఏడబ్ల్యూఏ) 4–3తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, జి. ప్రణీత (హెచ్‌వీఎస్)4–0తో దివ్య (హెచ్‌వీఎస్)పై, బి. రాగ నివేది (జీటీటీఏ) 4–0తో వినిచిత్ర (జీఎస్ఎం)పై, మౌనిక (జీఎస్ఎం) 4–0తో పలక్ షా (ఏవీఎస్‌సీ)పై, నిఖత్ బాను (ఆర్బీఐ) 4–0తో ఐశ్వర్య డాగా (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. -
చాంపియన్ శౌర్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–14 టాలెంట్ సిరీస్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ శౌర్య సామల ఆకట్టుకున్నాడు. నేరేడ్మెట్లోని రామ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో 10 ఏళ్ల శౌర్య బాలుర సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. బుధవారం జరిగిన ఫైనల్లో శౌర్య 9–8తో ధరణి దత్తా (తెలంగాణ)పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో 8–7తో అర్నవ్ బిష్ణోయ్‌పై, క్వార్టర్స్‌లో 6–1తో కోట శ్రీకాంత్ (ఏపీ)పై గెలుపొందాడు. -
సంజనకు హ్యాట్రిక్ టైటిల్
హైదరాబాద్: ‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్లలో హైదరాబాద్ క్రీడాకారిణి సంజన సిరిమల్ల నిలకడ విజయాలతో సత్తా చాటుతోంది. కొంపల్లిలోని సురేశ్ కృష్ణ టెన్నిస్ అకాడమీలో జరిగిన అండర్–16 టోర్నీలో సంజన విజేతగా నిలిచింది. ఈనెలలో ఆమెకు ఇది మూడో సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. జూన్ 11 నుంచి 16 వరకు జరిగిన అండర్–18 చాంపియన్‌షిప్ సిరీస్, జూన్ 18 నుంచి 23 వరకు జరిగిన అండర్–16 సూపర్‌సిరీస్ టోర్నీల్లోనూ సంజన విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఈ టోర్నీ అండర్–16 బాలికల సింగిల్స్ ఫైనల్లో సంజన 6–2, 6–4తో రితి అగర్వాల్ (కర్ణాటక)పై గెలుపొందింది. బాలుర విభాగంలో మహారాష్ట్రకు చెందిన ఆర్యన్ భటి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు ఇదే టోర్నీ అండర్–16 బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి అదితి ఆరే టైటిల్‌ను గెలుచుకుంది. టైటిల్‌పోరులో అదితి 6–0, 6–2తో త్రిష్యా ఖండేవాల్ (కర్ణాటక)ను ఓడించింది. -
సహజ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ 50కే ప్రైజ్‌మనీ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి రెండు టైటిళ్లతో మెరిసింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సహజ మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సహజ 6–1, 6–1తో టాప్‌సీడ్ ప్రతిభ ప్రసాద్ (కర్ణాటక)పై ఘనవిజయం సాధించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్యతో జతకట్టి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో సహజ–సాయిదేదీప్య (తెలంగాణ) జంట 7–6 (7/5), 7–5తో టాప్ సీడ్ షాజిహా బేగం–షేక్ హుమేరా (తెలంగాణ) జోడీకి షాకిచ్చింది. పురుషుల విభాగంలో ఏపీకి చెందిన కె. శ్రీనివాస్‌కు నిరాశ ఎదురైంది. సింగిల్స్ ఫైనల్లో శ్రీనివాస్ 6–3, 4–6, 2–6తో భరత్ కుమారన్ (తమిళనాడు) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. డబుల్స్ ఫైనల్లో నిక్షీప్–జూడ్ రేమండ్ జంట 7–6 (7/5), 6–4తో కవిన్ మసిలమణి–భరత్ కుమారన్ జోడీపై విజయం సాధించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) కార్యదర్శి అశోక్ కుమార్ మఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీఏ సంయుక్త కార్యదర్శి వి. నారాయణదాస్ పాల్గొన్నారు. -
సింగిల్స్, డబుల్స్ ఫైనల్లో సహజ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ 50కే ప్రైజ్‌మనీ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్‌కు చేరింది. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సహజ 6–1, 7–5తో కె. లిఖిత (తెలంగాణ)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో కర్ణాటకకు చెందిన ప్రతిభ ప్రసాద్‌తో తలపడుతుంది. డబుల్స్ సెమీఫైనల్లో సహజ– వై. సాయిదేదీప్య (తెలంగాణ) జంట 6–3, 6–1తో ప్రతిభ– ప్రగతి జోడీపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. మరో సెమీస్ మ్యాచ్‌లో షాజీహా బేగం– షేక్ హుమేరా జంట 6–3, 7–5, 10–7తో భక్తి షా– సి. శ్రావ్య శివాని ద్వయాన్ని ఓడించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన కె. శ్రీనివాస్ ఫైనల్‌కు చేరాడు. -
రన్నరప్ సన్నీత్
సాక్షి, హైదరాబాద్: ‘ఐటా’ అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో సరోజిని అకాడమీ క్రీడాకారుడు సన్నీత్ ఉప్పాటి రన్నరప్‌గా నిలిచాడు. బంజారాహిల్స్‌లోని సంజయ్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సన్నీత్ 7–8తో వర్షిత్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో 7–1తో వేదాంత్ మిశ్రాపై, క్వార్టర్స్‌లో 8–7తో జయసింహాపై విజయం సాధించాడు. ఈ సందర్భంగా సన్నీత్ను టీఎస్ఆర్టీసీ కార్యదర్శి, మాజీ వాలీబాల్ క్రీడాకారుడు జి. కిరణ్‌రెడ్డి అభినందించారు. -
చాంపియన్ శ్రావ్య–హుమేరా జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) 50కే ప్రైజ్‌మనీ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రావ్య శివాని సత్తా చాటింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన శివాని... సింగిల్స్ కేటగిరీలో రన్నరప్ ట్రోఫీని అందుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ శ్రావ్య శివాని–షేక్ హుమేరా (తెలంగాణ) ద్వయం 6–0, 6–4తో ఆకాంక్ష–ముష్రత్ అంజుమ్ జంటపై గెలుపొందింది. సింగిల్స్ టైటిల్‌పోరులో సహజ యామలపల్లి (తెలంగాణ) 6–4, 6–4తో శ్రావ్య శివానిని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన బి. సాయి శరణ్ రెడ్డి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో టాప్ సీడ్ పృథ్వీ శేఖర్ (తమిళనాడు) 6–3, 6–0తో సాయి శరణ్ రెడ్డిపై గెలుపొందాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కోశాధికారి డి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. -
తుదిపోరుకు ప్రాంజల జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఫైనల్‌కు చేరుకుంది. హాంకాంగ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి విక్టోరియా ముంటేన్ (ఫ్రాన్స్)తో కలిసి తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాంజల (భారత్)– విక్టోరియా (ఫ్రాన్స్) జంట 7–5, 7–5తో రిసా ఓజాకి– రము యుడా (జపాన్) జోడీపై నెగ్గింది. -
ఫైనల్లో సంజన, ప్రపూర్ణ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, వేదరాజు ప్రపూర్ణ ఫైనల్‌కు చేరారు. అజీజ్‌నగర్‌లోని లేక్‌వ్యూ టెన్నిస్ అకాడమీలో గురువారం జరిగిన అండర్–16 బాలికల సింగిల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ సంజన 2–6, 7–6, 6–1తో రేష్మ (కర్నాటక)పై గెలుపొందగా, ప్రపూర్ణ 6–3, 1–6, 6–3తో యానా ధమిజ (హరియాణా)ను ఓడించాడు. డబుల్స్ విభాగంలో రెండోసీడ్ అదితి ఆరే (తెలంగాణ)– పావని పాథక్ (మహారాష్ట్ర) జంట 6–1, 6–2తో హర్షాలి– భూమిక (మహారాష్ట్ర) జోడీపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు అండర్–14 విభాగంలో ఏపీకి చెందిన అనంత్ మణి తుదిపోరుకు అర్హత సాధించాడు. బాలుర సింగిల్స్ సెమీస్‌లో అనంత్ (ఏపీ) 4–6, 6–2, 6–3తో మోనిల్ లోట్లికార్ (కర్నాటక)ను ఓడించాడు. -
సంజన శుభారంభం
హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, రోహన్ కుమార్ శుభారంభం చేశారు. కొంపల్లిలో సోమవారం జరిగిన అండర్–16 బాలుర సింగిల్స్ తొలిరౌండ్లో రోహన్ (తెలంగాణ) 6–1, 6–4తో కుశ్ ఆర్జీ రాయ్ (మధ్యప్రదేశ్)పై గెలుపొందాడు. అండర్–18 బాలికల విభాగంలో సంజన సిరిమల్ల (తెలంగాణ) 6–2, 6–1తో రేచల్ ఏంజిల్స్ (తెలంగాణ)పై నెగ్గింది. ఇతర బాలుర మ్యాచ్‌ల్లో ప్రసాద్ ఇంగ్లే (మహారాష్ట్ర) 6–1, 6–1తో మోహిత్ సాయిచరణ్ రెడ్డి (తెలంగాణ)పై, హితేశ్ (తెలంగాణ) 6–1, 6–0తో అనీశ్ రెడ్డి (తెలంగాణ)పై, సిద్ధార్థ్ (మహారాష్ట్ర) 6–3, 6–1తో రత్నవ్ (తెలంగాణ) పై గెలుపొందారు. బాలికల మ్యాచ్‌ల్లో చరిత (తెలంగాణ) 6–3, 6–3తో శ్రేష్ట (తెలంగాణ)పై, అనీష (ఆంధ్రప్రదేశ్) 6–3, 7–6తో రాధిక మహాజన్ (మహారాష్ట్ర)పై విజయం సాధించారు. -
నైషిక్, జష్వితలకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: గౌస్ మొహమ్మద్ ఖాన్ డే–నైట్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో జి. నైషిక్ రెడ్డి, జష్విత రెడ్డి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్–12 బాలుర ఫైనల్లో నైషిక్ 6–0తో మురళి కౌషాన్పై గెలుపొందగా, బాలికల విభాగంలో జష్విత 6–4తో వన్షికను ఓడించింది. అండర్–10 కేటగిరీలో కేఎల్ రాహుల్, హర్షిణి విజేతలుగా నిలిచారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో రాహుల్ 6–4తో శామ్యూల్‌పై, విజయం సాధించాడు. బాలికల విభాగంలో హర్షిణి 6–5తో వన్షికను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. అండర్–8 బాలుర సింగిల్స్ ఫైనల్లో ఇరిత్ 6–4తో దైవిక్పై విజయం సాధించాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ హెచ్‌జె దొర ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. -
రేపటి నుంచి టెన్నిస్ టోర్నమెంట్
హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ రేపటి నుంచి జరుగనుంది. కొంపల్లిలోని జి. బంగారు రాజు కల్చరల్ సొసైటీ వేదికగా అండర్–16, 18 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల కోసం శనివారం క్వాలిఫయింగ్ టోర్నీని నిర్వహించారు. నేటితో క్వాలిఫయింగ్ పోటీలు ముగుస్తాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఐటా టోర్నీకి అర్హత సాధిస్తారు. ఈనెల 15వ తేదీ వరకు ఐటా టోర్నీ జరుగుతుంది. -
ఫైనల్లో ఓడిన అనిరుధ్–విఘ్నేశ్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జింబాబ్వే ఎఫ్–1 ఫ్యూచర్స్ పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు అనిరుధ్ చంద్రశేఖర్– విఘ్నేశ్ పెరణమల్లూర్ జంటకు నిరాశ ఎదురైంది. జింబాబ్వేలో జరిగిన ఈ టోర్నీలో ఈ జోడీ ఫైనల్లో పరాజయం పాలై టైటిల్‌ను కోల్పోయింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అనిరుధ్–విఘ్నేశ్ (భారత్) జంట 3–6, 0–6తో టాప్ సీడ్ బెంజమిన్ లాక్–కాట్నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో అనిరుధ్ రెండోరౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో అనిరుధ్ (భారత్) 4–6, 2–6తో ఆరోన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓటమి చవిచూశాడు. అంతకుముందు తొలిరౌండ్లో అనిరుధ్ 6–0, 7–6 (7/5)తో వాసిలియోస్ కారిపి (రష్యా)పై గెలుపొందాడు. -
సెమీస్‌లో సాకేత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియన్ ఫ్యూచర్స్–2 పురుషుల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని నిలకడగా రాణిస్తున్నాడు. కోల్‌కతాలో జరుగుతోన్న ఈ టోర్నీలో సాకేత్ సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఏడో సీడ్ సాకేత్ 6–3, 6–3తో రెండోసీడ్ శశికుమార్ ముకుంద్‌కు షాకిచ్చాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ఐదో సీడ్ అర్జున్‌తో సాకేత్ తలపడతాడు. -
టైటిల్‌పోరుకు ప్రణీత్ సింగ్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు ప్రణీత్‌సింగ్ భాటియా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నీలో అండర్–12 బాలుర సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ప్రణీత్ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణీత్ 6–1, 6–1తో రామధనుశ్పై గెలుపొందాడు. మరో సెమీస్‌లో ఎన్. అనిరుధ్ 6–2, 6–2తో వెంకట్ రిషిని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. డబుల్స్ సెమీస్‌లో ప్రణీత్ – అర్నవ్ బిష్ణోయ్ జంట 6–1, 6–3తో ప్రత్యూష్ – రేయాన్ష్ రాజీవ్ జోడీపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీస్‌లో వెంకట్ రిషి – అనిరుధ్ జోడీ 6–1, 6–1తో సంజిత్ – అనీశ్ శర్మ జంటపై గెలుపొందింది. -
క్వార్టర్స్‌లో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: అంతర్ రాష్ట్ర పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు నిలకడగా రాణిస్తోంది. ఛత్తీస్‌గఢ్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో భిలాయ్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ టీమ్ విభాగంలో తెలంగాణ క్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తెలంగాణ జట్టు విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ 3–0తో గుజరాత్‌పై గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో తరుణ్ అనిరుధ్ (తెలంగాణ) 6–7 (1–7), 6–1, 6–4తో జై సోనిపై, రెండో సింగిల్స్‌లో పీసీ అనిరుధ్ (తెలంగాణ) 6–0, 6–7 (5–7), 6–4తో ఉదయన్ భాస్కర్‌పై నెగ్గగా... డబుల్స్ మ్యాచ్‌లో అంకం కృష్ణ తేజ– తరుణ్ జంట 6–3, 6–2తో జైసోని– ఉదయన్ భాస్కర్ జోడీపై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో తెలంగాణ 2–0తో మధ్యప్రదేశ్ జట్టును ఓడించింది. తరుణ్ అనిరుధ్ 7–6 (7–4), 6–4తో భవేశ్ గౌర్ (మధ్యప్రదేశ్)పై, పీసీ అనిరుధ్ 6–2, 6–1తో యశ్ యాదవ్ (మధ్యప్రదేశ్)పై గెలుపొందారు. -
విష్ణు–బాలాజీ జోడీకి టైటిల్
చెన్నై: స్వదేశంలో ఈ ఏడాది జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ విష్ణు–బాలాజీ ద్వయం 7–6 (7/5), 5–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో సెమ్ ఇల్కెల్ (టర్కీ)–డానిలో పెట్రోవిక్ (సెర్బియా) జోడీని ఓడించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం మూడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయినప్పటికీ... కీలకమైన సూపర్ టైబ్రేక్‌లో భారత జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ కెరీర్లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన భారత జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్లో యూకీ మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్), టాప్ సీడ్ జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) టైటిల్ పోరుకు అర్హత సాధించారు. సెమీఫైనల్స్‌లో యూకీ 7–5, 6–2తో డక్‌హీ లీ (కొరియా)పై, థాంప్సన్ 6–1, 7–6 (7/5)తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలుపొందారు. -
రిత్విక్ ‘డబుల్’ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–4 టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు రిత్విక్ చౌదరి బొల్లిపల్లి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. బాలుర సింగిల్స్ ఫైనల్లో రిత్విక్ 4–6, 6–2, 6–0తో అబ్దుల్ షకుర్ కబురా (బురుండి)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో 6–3, 6–0తో గిలియన్ ఓస్మోంట్ (ఫ్రాన్స్)పై, క్వార్టర్స్‌లో 6–3, 6–0తో అలీ హబిద్ (గ్రేట్ బ్రిటన్)పై విజయం సాధిం చాడు. మరోవైపు బాలుర డబుల్స్ టైటిల్‌పోరులో టాప్ సీడ్ రిత్విక్ (భారత్)–యాన్ అహ్మద్ (గ్రేట్ బ్రిటన్) జంట 6–1, 6–4తో అబ్దుల్ (బురుండి)–ర్యాన్ అటెటొ ర్యాండిక్ (కెన్యా) జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. -
శాన్వికి డబుల్ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: మాతృశ్రీ టెన్నిస్ అకాడమీలో జరిగిన జూనియర్స్ టెన్నిస్ టోర్నీలో సరోజిని క్రికెట్, టెన్నిస్ అకాడమీకి చెందిన ప్లేయర్ శాన్వి రెడ్డి సత్తాచాటింది. అండర్–10, 8 వయో విభాగాల్లో బాలికల కేటగిరీలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. మియాపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–10 బాలికల ఫైనల్లో శాన్వి 6–1తో శ్రేయ పాట్కర్‌పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో 4–1తో సుహానిపై, క్వార్టర్స్‌లో 4–0తో రిధిమపై గెలుపొందింది. అండర్–8 విభాగంలో శాన్వి 4–0తో సంజను ఓడించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా అకాడమీ కార్యదర్శి, టీఎస్ఆర్టీసీ సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి. ఆర్. కిరణ్ ఆమెను అభినందించారు. -
ఉస్మానియా జట్టుకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టు రాణించింది. విశాఖ పట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్ ముంబై స్వర్ణాన్ని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ జట్టు రజతాన్ని గెలుచుకున్నాయి. కాంస్య పతక పోరులో ఉస్మానియా జట్టు 2–1తో ఎస్పీ యూనివర్సిటీ (పుణే)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భాగంగా జరిగిన తొలి సింగిల్స్‌లో దీక్ష అజిత్ (ఓయూ) 6–3, 6–2తో ప్రగతి (ఎస్పీయూ)పై గెలుపొందింది. రెండో సింగిల్స్‌లో శ్రావ్య శివాని (ఓయూ) 1–6, 0–6తో స్నేహల్ (ఎస్పీయూ) చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఫలితం తేల్చే డబుల్స్ మ్యాచ్‌లో దీక్ష– శ్రావ్య (ఓయూ) ద్వయం 3–6, 7–5, 10–5తో ప్రగతి–స్నేహల్ (ఎస్పీయూ) జంటపై గెలుపొందడంతో ఓయూకు పతకం ఖాయమైంది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఓయూ 0–2తో యూనివర్సిటీ ఆఫ్ ముంబై చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో 2–0తో పంజాబ్ యూనివర్సిటీపై గెలుపొందింది. -
రిత్విక్ జోడి ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారుల పోరాటం ముగిసింది. బాలుర డబుల్స్ విభాగంలో రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సెమీస్‌లో వెనుదిరగగా, బాలికల కేటగిరీలో శ్రీవల్లి రష్మిక, శివాని అమినేని క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యారు. ఢిల్లీలో గురువారం జరిగిన బాలుర డబుల్స్ సెమీస్‌లో రిత్విక్– అభిమన్యు (భారత్) జంట 6–7 (6), 2–6తో యాసిర్ కిలాని (మొరాకో)– బ్రాండన్ (వెనిజులా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–3, 1–6, 2–6తో ఆకాంక్ష (భారత్) చేతిలో ఓడిపోయింది. శివాని 6–1, 2–1తో ఆధిక్యం లో ఉన్న సమయంలో గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకుంది. ఫలితంగా ఆమె ప్రత్యర్థి మయ్ నపట్ నిరుండోర్న్ (థాయ్‌లాండ్) సెమీస్‌కు చేరుకుంది. -
ఆకాంక్ష, ప్రతినవ్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ టోర్నమెంట్లో ఎం. ప్రతినవ్, ఆకాంక్ష విజేతలుగా నిలిచారు. నేరెడ్‌మెట్‌లోని సెయింట్ థామస్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీ అండర్–14 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన బాలుర సింగిల్స్ టైటిల్‌పోరులో టాప్‌సీడ్ ప్రతినవ్ 8–6తో వి. కౌషిక్ కుమార్ రెడ్డిపై విజయం సాధించాడు. బాలికల తుదిపోరులో ఆకాంక్ష 8–6తో రహీన్ తరన్నుమ్‌ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఆకాంక్ష 8–3తో అనికా కరంపూరిపై, రహీన్ 8–5తో రిషిక రావుపై, కౌషిక్ కుమార్ 8–1తో లలిత్ మోహన్‌పై, ప్రతినవ్ 8–0తో శ్రీహరిపై విజయం సాధించారు. అండర్–12 బాలబాలికల విభాగాల్లో రహీన్, శ్రీహరి చాంపియన్లుగా నిలిచారు. ఫైనల్లో శ్రీహరి 8–5తో కోట శ్రీనాథ్‌పై, రహీన్ 8–3తో రిషిక రావుపై గెలుపొందారు. అండర్–10 బాలుర సింగిల్స్ టైటిల్‌పోరులో చైత్ర దర్శన్ రెడ్డి 8–0తో ఆకాశ్ సాగర్‌ను చిత్తుగా ఓడించి వరుసగా నాలుగో మాస్టర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బాలికల ఫైనల్లో థానియా 8–7 (5)తో రిషితా రెడ్డిపై గెలుపొంది విజేతగా నిలిచింది. -
చాంపియన్ రూహి
సాక్షి, హైదరాబాద్: ఇండియా టెన్నిస్ లీగ్ (ఐటీసీ) టోర్నమెంట్లో సరోజిని క్రికెట్, టెన్నిస్ అకాడమీ విద్యార్థి రూహి సత్తా చాటింది. గచ్చిబౌలిలోని నూర్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలికల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన టైటిల్‌పోరులో రూహి 4–1, 4–2తో రహీన్పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్ మ్యాచ్‌లో 2–4, 4–1, 4–4 (10–8)తో చరికా రెడ్డిపై, క్వార్టర్స్‌లో 4–2, 4–1తో నలమర్తిపై విజయం సాధించింది. ఐటీసీ టైటిల్‌ను సాధించిన రూహిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జీఆర్ కిరణ్ అభినందించారు. , -
ఓపెన్ టెన్నిస్ టోర్నీ విజేత అపురూప్
సాక్షి, హైదరాబాద్: స్పెయిన్‌లో జరిగిన పురుషుల ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ యువ ఆటగాడు పి. అపురూప్ రెడ్డి విజేతగా నిలిచాడు. ఆరు వారాల పాటు శిక్షణ కోసం బార్సిలోనాకు వెళ్లిన అపురూప్ ఈ సందర్భంగా జరిగిన ఓపెన్ టోర్నీలో చాంపియన్ అయ్యాడు. పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో ఫైనల్లో అపురూప్ 6–3, 2–6, 6–4తో ఎంజో బ్లాగ్‌వినాట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. సెమీస్‌లో అపురూప్ 3–6, 6–3, 10–4తో మార్క్ గార్డెనో రస్కో (స్పెయిన్)పై, క్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–4తో జూడీపై, రెండో రౌండ్లో 6–1, 6–0తో బెన్ వులియామి (బ్రిటన్)పై, తొలి రౌండ్లో 7–5, 6–0తో నికితా ప్లిస్‌చికోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. -
శివాని జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–3 టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని సత్తా చాటింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి ఆకాంక్ష భాన్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను అందుకుంది. శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ శివాని–ఆకాంక్ష (భారత్) ద్వయం 3–6, 6–2, 10–3తో సాల్సా అహర్ (భారత్)–షియోరి ఇటో (జపాన్) జంటపై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలో శివాని పోరాటం సెమీస్‌లో ముగిసింది. సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ శివాని 5–7, 0–6తో టాప్ సీడ్ ఆకాంక్ష చేతిలో పరాజయం పాలైంది. -
రాచెల్, రోహన్‌లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: టాలెంట్ సిరీస్ అండర్–16 టెన్నిస్ టోర్నమెంట్లో రాచెల్ ఏంజెలా, రోహన్ కుమార్ విజేతలుగా నిలిచారు. నూర్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలికల సింగిల్స్ టైటిల్‌పోరులో రాచెల్ ఏంజెలా 6–3, 6–3తో వేదరాజు ప్రపూర్ణపై విజయం సాధించింది. బాలుర తుదిపోరులో రోహన్ కుమార్ 6–0, 6–0తో రోహిత్ బిశ్వాస్‌ను ఓడించి టైటిల్‌ను సాధించాడు. -
చాంపియన్ సృజన
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సృజన రాయరాల అండర్–14 బాలికల విభాగంలో టైటిల్‌ను సాధిం చింది. కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో సృజన 6–3, 6–2తో ప్రేరణ కోయిరాలపై విజయం సాధించింది. అండర్–16 బాలికల ఫైనల్లో సృజన 2–6, 5–7తో సీహెచ్ రితుజ చేతిలో పరాజయం పాలైంది. -
సెమీస్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల నిలకడగా రాణిస్తోంది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో ప్రాంజల సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ ప్రాంజల 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ అల్బీనాపై గెలుపొందింది. డబుల్స్ విభాగంలో సాయి సంహిత జంట సెమీస్‌లో వెనుదిరిగింది. గాయం కారణంగా సంహిత (భారత్)– హో చింగ్ వు (హాంకాంగ్) ద్వయం 2–6, 1–2తో అల్బీనా– సేనియా పల్కీనా జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
క్వార్టర్స్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల దూసుకెళ్తోంది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ చాంపియన్‌షిప్‌లో ఆమె సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ ప్రాంజల 6–4, 4–6, 6–3తో ధ్రుతి వేణుగోపాల్‌పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో భువన కాల్వ 6–1, 1–6, 1–6తో అల్బీనా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, శ్రీవల్లి రష్మిక భమిడిపాటి 2–6, 3–6తో అనా వెసెలినోవిక్ (మాంటెనిగ్రో) చేతిలో పరాజయం పాలయ్యారు. డబుల్స్ విభాగంలో సాయి సంహిత చామర్తి జంట సెమీస్‌కు చేరగా... రిషిక సుంకర, సామ సాత్విక జోడీలు క్వార్టర్స్‌లో నిష్క్రమించాయి. క్వార్టర్ ఫైనల్లో సంహిత (భారత్)–హో చింగ్ వు (హాంకాంగ్) జంట 6–2, 7–6 (7/4)తో ధ్రుతి–బున్వయి జోడీపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో రిషిక–శ్వేత చంద్ర ద్వయం 4–6, 3–6తో రియా భాటియా–స్నేహాదేవి రెడ్డి జోడీ చేతిలో, సాత్విక–జెన్నిఫర్ ద్వయం 0–6, 3–6తో రెండో సీడ్ డియా డెర్డ్జెలస్ (బోస్నియా)–చింగ్ వెన్ సు (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
ప్రిక్వార్టర్స్‌లో భువన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో రాష్ట్ర క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో భువన కాల్వ ప్రిక్వార్టర్స్‌కు చేరుకోగా, సామ సాత్విక తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భువన 6–3, 6–3తో ప్రేరణ బాంబ్రీపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో సామ సాత్విక 6–4, 3–6, 1–6తో ధ్రుతి వేణుగోపాల్ చేతిలో ఓడిపోయింది. డబుల్స్ విభాగంలో సామ సాత్విక–రిషిక సుంకర జోడీలు క్వార్టర్స్‌కు చేరుకోగా... నిధి చిలుముల, షేక్ హుమేరా బేగం, సాయిదేదీప్య, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జంటలు ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సామ సాత్విక–జెన్నిఫర్ (భారత్) జంట 7–6 (7/5), 6–2తో షేక్ హుమేరా బేగం–సౌమ్య జోడీపై, రిషిక సుంకర–శ్వేత చంద్ర (భారత్) ద్వయం 6–1, 7–5తో సాయిదేదీప్య–సారా యాదవ్ (భారత్) జంటపై గెలుపొందాయి. శ్రీవల్లి రష్మిక–మౌలిక రామ్ జంట 2–6, 4–6తో హెర్డ్‌జెలస్ డియా (బోస్నియా)–సు చింగ్ వెన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో ప్రేరణ బాంబ్రీ–నిధి జంట 4–6, 0–6తో రియా–స్నేహాదేవి జోడీ చేతిలో ఓడిపోయింది. -
బెంగళూరు ఓపెన్ క్వార్టర్స్‌లో యూకీ బాంబ్రీ
స్వదేశంలో వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉన్న భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ బెంగళూరు ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 6–2, 7–6 (7/0)తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సుమీత్ నాగల్ (భారత్) 6–4, 4–6, 7–5తో బ్రైడన్ క్లియెన్ (బ్రిటన్)పై, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 6–2, 6–7 (1/7), 6–1తో మార్క్ పాల్మన్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు.అయితే రామ్‌కుమార్ రామనాథన్ 7–6 (7/3), 2–6, 4–6తో జే క్లార్క్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. -
చాంప్స్ కార్తీక్, అపూర్వ
సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో వడ్డేపల్లి కార్తీక్ నీల్, అపూర్వ వేమూరి సత్తా చాటారు. ఆనంద్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీ అండర్–14 బాలబాలికల విభాగంలో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. శనివారం జరిగిన అండర్–14 బాలుర ఫైనల్లో కార్తీక్ నీల్ 6–3, 4–6, 6–2తో రోహన్ కావలిపై గెలుపొందగా, బాలికల విభాగంలో అపూర్వ 6–2, 6–1తో ఐరా షా (మహారాష్ట్ర)ను ఓడించింది. డబుల్స్ విభాగంలోనూ అపూర్వ జోడి విజేతగా నిలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో అపూర్వ–అభయ వేమూరి ద్వయం 6–0, 6–1తో మలిష్క (తెలంగాణ)–జ్యోతిష (తమిళనాడు) జంటపై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. బాలుర డబుల్స్ టైటిల్ పోరులో కహిర్ వరిక్ (మహారాష్ట్ర)–సి.ఆర్యంత్ (తెలంగాణ) జోడీకి వాకోవర్ లభించింది. అండర్–12 బాలికల ఫైనల్లో ఐరా (మహారాష్ట్ర) 7–5, 6–1తో సౌమ్య (తెలంగాణ)పై, బాలుర తుదిపోరులో మోహి త్ సాయిచరణ్ రెడ్డి (తెలంగాణ) 6–3, 4–6, 6–3తో శ్రీశరణ్ (తెలంగాణ)పై గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. -
ఫైనల్లో మోహిత్, సౌమ్య
సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ అండర్–12, 14 బాలబాలికల టెన్నిస్ టోర్నమెంట్లో మోహిత్ సాయిచరణ్ రెడ్డి, సౌమ్య టైటిల్ పోరుకు అర్హత సాధించారు. ఆనంద్ టెన్నిస్ అకాడమీలో శుక్రవారం జరిగిన అండర్–12 బాలుర సెమీస్‌లో మోహిత్ 1–6, 6–3, 6–3తో సమీర్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, శ్రీశరణ్ 6–4, 6–2తో అర్నవ్ అన్షుమన్ రావు (మహారాష్ట్ర)ను ఓడించాడు. బాలికల సెమీస్ మ్యాచ్‌ల్లో సౌమ్య (తెలంగాణ) 7–5, 6–1తో జి. శివాని (తెలంగాణ)పై, ఐరా (మహారాష్ట్ర) 6–3, 6–2తో అభయ వేమూరి (తెలంగాణ)పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నారు. అండర్–14 బాలుర సెమీస్‌లో కార్తీక్ నీల్ 7–5, 3–6, 6–4తో మోహిత్ సాయిచరణ్‌పై, రోహన్ 6–0, 6–2తో ఉద్భవ్‌పై విజయం సాధించారు. బాలికల సెమీస్‌లో అపూర్వ 6–4, 6–4తో అభయ వేమూరిపై, ఐరా (మహారాష్ట్ర) 6–2, 6–0తో సౌమ్యపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించారు. డబుల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో అపూర్వ–అభయ జంట 8–1తో సౌమ్య–నిరాలి జోడీపై, మలిష్క (తెలంగాణ)–జ్యోషిత (తమిళనాడు) జంట 8–4తో పుష్టి–హియా జితేశ్ (తెలంగాణ) జోడీపై గెలుపొందాయి. -
సెమీస్‌లో ఉద్భవ్, అపూర్వ
సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ అండర్–12, 14 బాలబాలికల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు ఉద్భవ్, అపూర్వ వేమూరి నిలకడగా రాణిస్తున్నారు. ఆనంద్ టెన్నిస్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో వీరిద్దరూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన అండర్–14 బాలుర సింగిల్స్ క్వార్టర్స్‌లో ఉద్భవ్ 6–0, 6–2తో సి. ఆర్యంత్ రెడ్డిపై గెలుపొందగా, బాలికల విభాగంలో అపూర్వ 6–2, 6–3తో శ్రీహితను ఓడించింది. ఇతర బాలికల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో అభయ వేమూరి 6–2, 6–3తో నీలా కుంకుమ్‌పై, ఐరా షా 1–6, 6–3, 6–3తో కె. మలిష్కపై, సౌమ్య 6–1, 6–3తో జాహ్నవిపై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. బాలుర క్వార్టర్స్‌లో మోహిత్ సాయిచరణ్ రెడ్డి 6–3, 2–6, 6–4తో సిద్ధార్థ్ శ్రీనివాస్‌పై, కార్తీక్ నీల్ 6–0, 6–2తో టి. శ్రీప్రణవ్పై, రోహన్ 1–6, 6–2, 6–3తో వర్షిత్ కుమార్‌రెడ్డిపై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు అండర్–12 బాలుర క్వార్టర్స్: సమీర్ 6–2, 6–3తో వినీత్ ముత్యాలపై, మోహిత్ సాయిచరణ్ 6–1, 6–3తో మహాలింగం (తమిళనాడు)పై, అర్నవ్ (మహారాష్ట్ర) 6–3, 4–6, 7–6 (2)తో భీమ (ఏపీ)పై, శ్రీశరణ్ 6–1, 4–6, 6–3తో శ్రీహరిపై గెలుపొందారు. బాలికల క్వార్టర్స్: నిరాలి 6–1, 6–0తో ఐరా షా (మహారాష్ట్ర)పై, అభయ 6–1, 7–5తో రిధి చౌదరిపై, సౌమ్య 6–2, 7–6 (6)తో అపూర్వపై, శివాని 6–0, 5–7, 7–6 (5)తో కె. మలిష్కపై విజయం సాధించారు. -
సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక నిలకడగా రాణిస్తోంది. దుబాయ్‌లోని ఏవియేషన్ క్లబ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సెమీఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–2, 6–4తో ముస్కాన్‌గుప్తా (భారత్)పై గెలుపొందింది. పాంజల, నిధి ఓటమి సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, నిధి చిలుముల పోరాటం ముగిసింది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ డబుల్స్ విభాగంలో క్వార్టర్స్‌లో వెనుదిరిగారు. మహిళల డబుల్స్ తొలి క్వార్టర్స్ మ్యాచ్‌లో రుతుజా భోస్లే– ప్రాంజల (భారత్) ద్వయం 5–7, 5–7తో మూడో సీడ్ లీ చి పెయ్ (చైనీస్ తైపీ)– యానా సిజికోవా (రష్యా) జంట చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో నిధి– ప్రేరణ బాంబ్రీ (భారత్) జంట 6–4, 5–7, 2–10తో జీల్ దేశాయ్ (భారత్)– బున్వాయి థాంచవత్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. -
సెమీస్‌లో సంజన
సాక్షి, హైదరాబాద్: ఆసియా అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల నిలకడగా రాణిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఆమె సెమీస్‌కు చేరింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సంజన 6–2, 6–3తో సుర్యాన్షి తన్వర్ (చండీగఢ్)పై గెలుపొందింది. -
తొలిరౌండ్లోనే బోపన్న జంట ఓటమి
పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పారిస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–క్యువాస్ ద్వయం 2–6, 6–7 (7/9)తో యువాన్ సెబాస్టియన్ కాబల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న–క్యువాస్ జంటకు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. తమ సర్వీస్‌ను మాత్రం రెండుసార్లు కోల్పోయింది. -
అనిరుధ్–విఘ్నేశ్ జంట ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుల పోరాటం ముగిసింది. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విఘ్నేశ్ పెరణమల్లూర్ జంట సెమీస్‌లో ఓటమి పాలైంది. గురువారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో అనిరుధ్ – విఘ్నేశ్ (భారత్) జంట 4–6, 6–7 (2/7)తో అర్జున్–శశి కుమార్ ముకుంద్ (భారత్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మరో సెమీస్ మ్యాచ్‌లో కాజా వినాయక్ శర్మ (ఏపీ)–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) ద్వయం 2–6, 2–6తో టాప్ సీడ్ చంద్రిల్ సూద్–లక్షిత్ సూద్ (భారత్) జంట చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో శివాని
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శివాని అమినేని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని ‘శాట్స్’ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అండర్–18 బాలికల సింగిల్స్‌లో శివాని అమినేని 6–4, 6–1తో శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో శివాని 3–6, 7–5, 6–1తో షేక్ హుమేరాను ఓడించింది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో తనీషా కశ్యప్ 6–2, 6–2తో శివాని మంజనపై, ఆకాంక్ష 7–5, 6–4తో ప్రింకెల్ సింగ్‌పై, శివాని స్వరూప్ 6–4, 6–3తో సల్సా అహర్‌పై గెలుపొందారు. బాలుర క్వార్టర్స్ ఫలితాలు అభిమన్యు 6–0, 3–6, 6–3తో కార్తీక్‌రెడ్డి గంటాపై, సచిత్ శర్మ 6–1, 6–4తో ఫ్రాన్సెస్కో బొనాసియా (ఇటలీ)పై, మేఘ్ భార్గవ్ పటేల్ 6–2, 6–1తో నిఖిత్ రెడ్డిపై, కరణ్ శ్రీవాస్తవ 6–7 (2), 6–4, 6–2తో దేవ్ జావియాపై నెగ్గారు. -
క్వార్టర్స్‌లో శివాని
హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని రాణిస్తోంది. ఉజ్బెకిస్తాన్‌లోని ఫెరంగాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో శివాని 6–4, 6–4తో దరియా దెట్కోవ్స్కయా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. -
రన్నరప్ ప్రాంజల జోడీ
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఆకట్టుకుంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ విభాగంలో ప్రాంజల జంట రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల– మోమ్కూంథోడ్ (థాయ్‌లాండ్) ద్వయం 0–6, 6–7 (5/7)తో గముల్య బియాట్రేస్–రోమ్పీస్ జెస్సీ జంట చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో ప్రాంజల పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. సెమీఫైనల్లో ప్రాంజల 3–6, 3–6తో ఖాజి హరుకా (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
రష్మికకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సత్తా చాటింది. వియత్నాంలోని హో చి మిన్ సిటీలో జరిగిన ఈ టోర్నీలో ఆమె విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి రష్మిక (భారత్) 6–4, 6–2తో టాప్ సీడ్ యుజియావో (చైనా)ను కంగు తినిపించింది. -
టైటిల్ పోరుకు శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 జూనియర్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి శ్రీవల్లి రష్మిక టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. వియత్నాంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ రష్మిక (భారత్) 6–1, 4–6, 6–4తో ఏడో సీడ్ పీ యు లై (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. మరోవైపు డబుల్స్ విభాగంలో శ్రావ్య శివాని జోడీకి నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్ సెమీ ఫైనల్లో శ్రావ్య శివాని (భారత్)–రఫెలా జీన్ (ఫిలిప్పీన్స్) జంట 2–6, 2–6తో యుజియావో– చున్‌జి గుయో (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక, టాప్‌సీడ్ యుజియావో (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. -
సెమీఫైనల్లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, శ్రావ్య శివానిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వియత్నాంలోని హో చి మింగ్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీవల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... శ్రావ్య పరాజయం చవిచూసింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి రష్మిక 6–3, 6–4తో ఆరో సీడ్ జింగ్యి వాంగ్ (చైనా)పై గెలుపొందగా, ఐదో సీడ్ శివాని 4–6, 6–0, 3–6తో నాలుగో సీడ్ చున్‌జి గుయో (చైనా) చేతిలో ఓడింది. నేడు జరిగే సెమీఫైనలో శ్రీవల్లి... ఏడో సీడ్ పీ యు లై (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–1తో రాఫెల్లా విల్లనుయెరా (ఫిలిప్పీన్స్)పై అలవోక విజయం సాధించగా, శ్రావ్య శివాని 7–5, 6–2తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గింది. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి–జింగ్ యంగ్ (చైనా) జోడి 5–7, 7–5, 6–10తో గాబ్రియెల్లా–రేనియా అజీజ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడింది. శివాని–రాఫెల్లా విల్లనుయెరా జోడి 6–3, 6–1తో హుయాన్ హుయంగ్–కె సుయాన్ జంగ్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. -
చాంపియన్ రిత్విక్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సత్తా చాటాడు. నైరోబి జూనియర్ ఓపెన్ 2, గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో రిత్విక్ జోడీ విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రిత్విక్ (భారత్)–షేలి కొటేచా (కెన్యా) ద్వయం 6–2, 6–2తో అబ్దుల్లా అల్ బర్వాణి – అర్జున్ మరియప్ప (అమెరికా) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ విభాగంలో రిత్విక్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. క్వార్టర్స్‌లో 3–6, 2–6తో పాబ్లో స్కెల్చర్ (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. గతవారమే రిత్విక్ నైరోబి జూనియర్ ఓపెన్–1 డబుల్స్ టైటిల్‌నూ గెలుచుకున్నాడు. -
ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య శుభారంభం చేసింది. చండీగఢ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన సింగిల్స్ తొలిరౌండ్లో సాయి దేదీప్య 6–2, 3–6, 7–6 (7/5)తో యుబ్రానీ బెనర్జీ (పశ్చిమ బెంగాల్)పై విజయం సాధించింది. నేడు (మంగళవారం) జరిగే ప్రిక్వార్టర్స్‌లో హరియాణాకు చెందిన స్మృతి సింగ్‌తో సాయి దేదీప్య తలపడుతుంది. -
ఫైనల్లో విష్ణువర్ధన్ జోడి
టెన్నిస్ టోర్నమెంట్ త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ జోడి ఫైనల్లో ప్రవేశించింది. త్రివేండ్రం టెన్నిస్ క్లబ్లో గురువారం జరిగిన డబుల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ విష్ణువర్ధన్– శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–2,7–5తో కునాల్ ఆనంద్– అన్విత్ బిండ్రే జంటపై గెలుపొందింది. శుక్రవారం జరిగే ఫైనల్లో విష్ణువర్ధన్ జోడి జుయ్–చెన్ హంగ్ (చైనీస్ తైపీ)– హాంగ్ కిట్ వాంగ్ జంటతో తలపడుతుంది. సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో విష్ణు 6–3, 7–6 (3)తో హాడిన్ బావాపై గెలుపొందగా... టాప్ సీడ్ ప్రజ్నేశ్ గున్నేశ్వరన్ 6–2, 6–2తో విజయ్ సుందర్ ప్రశాంత్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీరామ్ బాలాజీ 6–4, 6–2తో రాజ్‌నీత్ విరాళి మురుగేశన్‌పై, దల్వీందర్ సింగ్ 6–3, 6–3తో జయేశ్‌పై గెలిచారు. సెమీస్‌లో విష్ణు, శ్రీరామ్ బాలాజీతో తలపడతాడు. -
భారత అమ్మాయిలకు తొలి గెలుపు
న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అమ్మాయిలు తొలి విజయం సాధించారు. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 2–1 తేడాతో పసిఫిక్ ఓసియానియా జట్టుపై గెలుపొందింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో సాల్సా పరాగ్ అహీర్ (భారత్) 6–1, 6–1తో నైయా గుట్టన్‌పై గెలిచి భారత్‌కు శుభారంభాన్నిచ్చింది. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ షేక్ హుమేరా 1–6, 2–6తో కరోల్ యంగ్ సు లీ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. అయితే నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో షేక్ హుమేరా–సాల్సా పరాగ్ ద్వయం 6–4, 6–0తో నైయా గుట్టన్–కరోల్ యంగ్ సు లీ జంటపై గెలుపొంది మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి గ్రూప్ ‘డి’ లో 3 పాయింట్లతో చైనీస్ తైపీ అగ్రస్థానంలో నిలవగా... 2 పాయింట్లతో ఉజ్బెకిస్థాన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. కేవలం ఒక మ్యాచ్‌లో నెగ్గిన భారత్ (1) మూడో స్థానంలో, పసిఫిక్ ఓసియానియా చివరి స్థానంలో నిలిచాయి. గురువారం 9 నుంచి 16 స్థానాల వరకు జరిగే వర్గీకరణమ్యాచ్‌లో భారత్... కజకిస్తాన్‌తో తలపడుతుంది. -
రిషబ్ ముందంజ
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ త్రివేండ్రం: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు రిషబ్ అగర్వాల్, విష్ణువర్ధన్ ముందంజ వేశారు. త్రివేండ్రం టెన్నిస్ క్లబ్లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌లో రిషబ్ అగర్వాల్ 4–6, 6–3, 6–1తో భారత్‌కే చెందిన చంద్రిల్ సూద్‌పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. మరో మ్యాచ్‌లో అనిరుధ్ చంద్రశేఖర్ 3–6, 6–7 (3/7)తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–7 (3/7), 6–4, 10–3తో అలెగ్జాండర్ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్ (జర్మనీ) జంటపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో ‘సూద్’ బ్రదర్స్ చంద్రిల్– లక్షిత్ (భారత్) జంట 6–1,6–2తో మొహమ్మద్ నజీమ్– గౌతమ్ కృష్ణన్ రమేశ్ జోడీపై గెలుపొందింది.