సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల దూసుకెళ్తోంది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ చాంపియన్‌షిప్‌లో ఆమె సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ ప్రాంజల 6–4, 4–6, 6–3తో ధ్రుతి వేణుగోపాల్‌పై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో భువన కాల్వ 6–1, 1–6, 1–6తో అల్బీనా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, శ్రీవల్లి రష్మిక భమిడిపాటి 2–6, 3–6తో అనా వెసెలినోవిక్ (మాంటెనిగ్రో) చేతిలో పరాజయం పాలయ్యారు.
డబుల్స్ విభాగంలో సాయి సంహిత చామర్తి జంట సెమీస్‌కు చేరగా... రిషిక సుంకర, సామ సాత్విక జోడీలు క్వార్టర్స్‌లో నిష్క్రమించాయి. క్వార్టర్ ఫైనల్లో సంహిత (భారత్)–హో చింగ్ వు (హాంకాంగ్) జంట 6–2, 7–6 (7/4)తో ధ్రుతి–బున్వయి జోడీపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో రిషిక–శ్వేత చంద్ర ద్వయం 4–6, 3–6తో రియా భాటియా–స్నేహాదేవి రెడ్డి జోడీ చేతిలో, సాత్విక–జెన్నిఫర్ ద్వయం 0–6, 3–6తో రెండో సీడ్ డియా డెర్డ్‌జెలస్ (బోస్నియా)–చింగ్ వెన్ సు (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment