సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల నిలకడగా రాణిస్తోంది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో ప్రాంజల సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ ప్రాంజల 6–4, 6–4తో ఎనిమిదో సీడ్ అల్బీనాపై గెలుపొందింది. డబుల్స్ విభాగంలో సాయి సంహిత జంట సెమీస్‌లో వెనుదిరిగింది. గాయం కారణంగా సంహిత (భారత్)– హో చింగ్ వు (హాంకాంగ్) ద్వయం 2–6, 1–2తో అల్బీనా– సేనియా పల్కీనా జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment