సహజతో సాయిదేదీప్య (పింక్ జెర్సీ)
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ 50కే ప్రైజ్‌మనీ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్‌కు చేరింది. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సహజ 6–1, 7–5తో కె. లిఖిత (తెలంగాణ)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో కర్ణాటకకు చెందిన ప్రతిభ ప్రసాద్‌తో తలపడుతుంది.
డబుల్స్ సెమీఫైనల్లో సహజ– వై. సాయిదేదీప్య (తెలంగాణ) జంట 6–3, 6–1తో ప్రతిభ– ప్రగతి జోడీపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. మరో సెమీస్ మ్యాచ్‌లో షాజీహా బేగం– షేక్ హుమేరా జంట 6–3, 7–5, 10–7తో భక్తి షా– సి. శ్రావ్య శివాని ద్వయాన్ని ఓడించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన కె. శ్రీనివాస్ ఫైనల్‌కు చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment