సాక్షి, హైదరాబాద్: జంట నగరాల టెన్నిస్ టోర్నమెంట్‌లో జి. రఘునందన్ ఆకట్టుకున్నాడు. సికింద్రాబాద్‌లోని ఐఆర్‌ఐఎస్‌ఈటీ టెన్నిస్ కోర్ట్ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో రఘునందన్ రెండు సింగిల్స్ టైటిళ్లను హస్తగతం చేసుకున్నాడు. అండర్–16, అండర్–18 బాలుర సింగిల్స్ కేటగిరీల్లో అతను విజేతగా నిలిచాడు. సోమవారం జరిగిన అండర్–16 బాలుర ఫైనల్లో రఘునందన్ 6–0తో సయ్యద్ మొహమ్మద్ ఇషాన్‌పై, అండర్–18 టైటిల్‌పోరులో రఘునందన్ 6–0తో అక్షయ్‌పై విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో పి. రాజు చాంపియన్‌గా నిలిచాడు.
తుదిపోరులో రాజు 6–1తో క్రిస్ అలెన్ జేమ్స్‌ను ఓడించాడు. డబుల్స్ ఫైనల్లో రాజా–దిలీప్ ద్వయం 6–2తో శశికాంత్–రాజు జోడీని ఓడించి విజేతగా నిలిచింది. అండర్–14 విభాగంలో శ్రీహరి, హాసిని యాదవ్ టైటిళ్లను అందుకున్నారు. బాలుర ఫైనల్లో శ్రీహరి 6–5 (3)తో శౌర్య సామలపై, బాలికల తుదిపోరులో హాసిని యాదవ్ 6–0తో తనిష్క యాదవ్‌పై గెలుపొందారు. అండర్–12 విభాగంలో వేదాన్‡్ష తేజ, ఆపేక్ష రెడ్డి చాంపియన్‌లుగా నిలిచారు. ఫైనల్లో వేదాన్‡్ష 6–3తో శ్రీహిత్‌పై, ఆపేక్ష 6–4తో క్రితికి రెడ్డిపై గెలుపొందారు. అండర్–10 బాలుర ఫైనల్లో సంకీర్త్ 6–4తో ఆర్యన్‌పై, మాన్యరెడ్డి 6–5 (3)తో నిషితపై నెగ్గారు. అండర్–8 కేటగిరీలో తనవ్ వర్మ 6–1తో మైత్రిని ఓడించి టైటిల్‌ను అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment