
సాక్షి, హైదరాబాద్: ట్విన్ సిటీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కె. ఆదిత్య సత్తా చాటాడు. మెట్టుగూడలోని ఎన్‌ఎస్‌టీఏ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆదిత్య పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆదిత్య 6–0, 6–0తో మోహన్‌కుమార్‌ను సులువుగా ఓడించాడు. డబుల్స్ తుదిపోరులో ఆదిత్య–మోహన్‌కుమార్ జంట 8–5తో నరేశ్–చిన్న జోడీపై గెలుపొందింది.
అండర్–16 పురుషుల సింగిల్స్ ఫైనల్లో కె. అభిరామ రెడ్డి 6–2తో ప్రణవ్ ఆదిత్యపై నెగ్గాడు. అండర్–14 బాలుర తుదిపోరులో అభిరామరెడ్డి 6–0తో అర్నవ్‌పై, బాలికల విభాగంలో ఆపేక్ష రెడ్డి 6–0తో శ్లోకపై గెలుపొంది చాంపియన్‌లుగా నిలిచారు. అండర్–12 బాలుర ఫైనల్లో వేదాన్‡్ష 6–0తో అశ్వత్‌పై, బాలికల తుదిపోరులో శ్రీకృష్ణ వైష్ణవి 6–2తో శ్రీవాస్తవపై... అండర్–10 బాలుర ఫైనల్లో సుజయ్ 6–1తో కైలాశ్‌పై, బాలికల ఫైనల్లో జోహా 6–1తో సవర్ణికపై గెలిచారు. అండర్–8 సింగిల్స్ కేటగిరీలో సుజయ్ 6–3తో తనీశ్ రెడ్డిని ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment