సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్లామ్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఎం. మధు ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. మెట్టుగూడలోని షఫల్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో మధు చాంపియన్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో మధు 9–1తో రుషి చక్రపై ఘనవిజయం సాధించాడు. అండర్–14 విభాగంలో క్రిస్ హామిల్టన్ రాస్, డి. హాసిని యాదవ్ విజేతలుగా నిలిచారు. బాలుర ఫైనల్లో హామిల్టన్ రాస్ 7–6తో విజయ్ సారథిపై గెలుపొందగా... బాలికల తుదిపోరులో హాసిని యాదవ్ 7–4తో తనిష్క యాదవ్‌ను ఓడించింది.
అండర్–12 విభాగంలో తన్మయ్, హాసిని టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఫైనల్లో తన్మయ్ 7–5తో యువన్ సార థిపై, హాసిని 7–5తో జిగ్నా చౌదరీపై గెలిచారు. అండర్–10 విభాగంలో హృతిక్, సృష్టి చాంపియన్‌లుగా నిలిచారు. బాలుర ఫైనల్లో హృతిక్ 6–2తో నిషిత్‌పై గెలిచాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన బాలికల మ్యాచ్‌ల్లో సృష్టి, శ్రీయుక్త వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment