sahajasri
-
సింగిల్స్, డబుల్స్ ఫైనల్లో సహజ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ 50కే ప్రైజ్‌మనీ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్‌కు చేరింది. ఎల్బీ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సహజ 6–1, 7–5తో కె. లిఖిత (తెలంగాణ)పై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో కర్ణాటకకు చెందిన ప్రతిభ ప్రసాద్‌తో తలపడుతుంది. డబుల్స్ సెమీఫైనల్లో సహజ– వై. సాయిదేదీప్య (తెలంగాణ) జంట 6–3, 6–1తో ప్రతిభ– ప్రగతి జోడీపై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. మరో సెమీస్ మ్యాచ్‌లో షాజీహా బేగం– షేక్ హుమేరా జంట 6–3, 7–5, 10–7తో భక్తి షా– సి. శ్రావ్య శివాని ద్వయాన్ని ఓడించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన కె. శ్రీనివాస్ ఫైనల్‌కు చేరాడు. -
కృష్ణ, సహజశ్రీ గేమ్‌లు డ్రా
గుర్గావ్: అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కృష్ణ, సహజశ్రీలు తమ ప్రత్యర్థులతో గేమ్‌ను డ్రా చేసుకున్నారు. ఇక్కడి సన్‌సిటీ స్కూల్లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన ఐదో రౌండ్ పోటీల్లో సీఆర్జీ కృష్ణ (4)... అంతర్జాతీయ మాస్టర్ స్వయం మిశ్రా (4)తో గేమ్‌ను డ్రాగా ముగించగా, చొల్లేటి సహజశ్రీ (3) కూడా అంతర్జాతీయ మాస్టర్ సారీన్ విశాల్ (3)తో డ్రా చేసుకుంది. కృష్ణ 4 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా ఏపీ క్రీడాకారుల్లో ఎస్.రవితేజ (3.5)కు... విక్రమ్ ఆదిత్య కులకర్ణి (4.5) చేతిలో పరాజయం ఎదురవగా, అభిలాష్ రెడ్డి (3.5)... వినాయక్ కులకర్ణి (3.5)తో డ్రా చేసుకున్నాడు. దీప్తాంశ్ రెడ్డి (4)... ఆదిత్య సంధు (3)పై, కార్తీక్ (4)... వంతిక అగర్వాల్ (3)పై గెలుపొందారు. మట్ట వినయ్ కుమార్ (3)... శుభమ్ కౌశిక్ (3)తో, లక్ష్మీకృష్ణ భూషణ్ (3)... సురేంద్రన్ (3)తో, తొషాలి (2.5)... మనన్ రాయ్ (2.5)తో గేమ్‌లను డ్రాగా ముగించుకున్నారు. హర్షిత (2)... మానవ్ సక్సేనా (3) చేతిలో కంగుతినగా, రాహుల్ శ్రీవాస్తవ్ (3)... అలోక్ సిన్హా (2)పై విజయం సాధించాడు. ఇంకా ఐదు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ సహజ్ గ్రోవర్ 5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
సహజశ్రీ గేమ్ డ్రా
అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ గుర్గావ్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చొల్లేటి సహజశ్రీ రెండో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకుంది. గురువారం ఇక్కడ ప్రారంభమైన గుర్గావ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆమె శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె భారత్‌కే చెందిన నవ్య తాయల్పై గెలుపొందింది. రెండో రౌండ్ గేమ్‌లో అంతర్జాతీయ మాస్టర్ నారాయణన్ శ్రీనాథ్ (1.5)ను నిలువరించింది. చివరికి ఈ గేమ్ డ్రాగా ముగిసింది. 1.5 పాయింట్లతో సహజశ్రీ ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండో రౌండ్ పోటీల్లో మిగతా ఏపీ క్రీడాకారుల్లో ఎస్. రవితేజ(2) ... రామలింగం కార్తీక్ (1)పై గెలుపొందగా, సీఆర్జీ కృష్ణ (1)... కుర్సనోవా ఫరీదా (ఉజ్బెకిస్థాన్)ను ఓడించాడు. కార్తీక్ (1)... కునాల్ మోడి (0)పై నెగ్గగా, దీప్తాంశ్ రెడ్డి (1)... అభినవ్ గోలా (2) చేతిలో కంగుతిన్నాడు. తులసీ రామ్‌కుమార్ (1)... సిద్ధాంత్నాత్ (0)పై గెలుపొందగా, మట్ట వినయ్ కుమార్ (1.5)... కేశ్ని బాసిన్ (0.5)పై విజయం సాధించాడు.