గుర్గావ్: అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కృష్ణ, సహజశ్రీలు తమ ప్రత్యర్థులతో గేమ్‌ను డ్రా చేసుకున్నారు. ఇక్కడి సన్‌సిటీ స్కూల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన ఐదో రౌండ్ పోటీల్లో సీఆర్‌జీ కృష్ణ (4)... అంతర్జాతీయ మాస్టర్ స్వయం మిశ్రా (4)తో గేమ్‌ను డ్రాగా ముగించగా, చొల్లేటి సహజశ్రీ (3) కూడా అంతర్జాతీయ మాస్టర్ సారీన్ విశాల్ (3)తో డ్రా చేసుకుంది. కృష్ణ 4 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా ఏపీ క్రీడాకారుల్లో ఎస్.రవితేజ (3.5)కు... విక్రమ్ ఆదిత్య కులకర్ణి (4.5) చేతిలో పరాజయం ఎదురవగా, అభిలాష్ రెడ్డి (3.5)... వినాయక్ కులకర్ణి (3.5)తో డ్రా చేసుకున్నాడు. దీప్తాంశ్ రెడ్డి (4)... ఆదిత్య సంధు (3)పై, కార్తీక్ (4)... వంతిక అగర్వాల్ (3)పై గెలుపొందారు. మట్ట వినయ్ కుమార్ (3)... శుభమ్ కౌశిక్ (3)తో, లక్ష్మీకృష్ణ భూషణ్ (3)... సురేంద్రన్ (3)తో, తొషాలి (2.5)... మనన్ రాయ్ (2.5)తో గేమ్‌లను డ్రాగా ముగించుకున్నారు.
హర్షిత (2)... మానవ్ సక్సేనా (3) చేతిలో కంగుతినగా, రాహుల్ శ్రీవాస్తవ్ (3)... అలోక్ సిన్హా (2)పై విజయం సాధించాడు. ఇంకా ఐదు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ సహజ్ గ్రోవర్ 5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కృష్ణ, సహజశ్రీ గేమ్‌లు డ్రా
Published Sun, Jan 5 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement