grand masters chess tournment
-
లలిత్‌కు నాలుగో విజయం
న్యూఢిల్లీ: పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. లూడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో అతను నాలుగో విజయాన్ని నమోదు చేశాడు. తాజా విజయంతో అతను 4 పాయింట్లతో అభిజిత్ గుప్తాతో కలిసి సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. శనివారం జరిగిన నాలుగో రౌండ్ పోరులో లలిత్... ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ ఎల్డర్ గెసనోవ్ (3)ను కంగుతినిపించాడు. అభిజిత్... భారత్‌కే చెందిన వెంకటేశ్‌పై గెలిచాడు. అంతకుముందు జరిగిన మూడో రౌండ్లో లలిత్‌బాబు... అంతర్జాతీయ మాస్టర్ రాజేశ్‌ను ఓడించాడు. ఇతర ఏపీ క్రీడాకారుల్లో మట్ట వినయ్ కుమార్ (2)... జితేంద్రకుమార్ చౌదరి (1)పై విజయం సాధించగా, బొడ్డ ప్రత్యూష (2)... బెరిక్ అకోజోవ్ (కజకిస్థాన్-2)తో గేమ్‌ను డ్రాగా ముగించింది. చొల్లేటి సహజశ్రీ ఇంకా ఖాతా తెరవలేదు. -
వరుస గేముల్లో లలిత్‌బాబు గెలుపు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో శుక్రవారం నాటి రెండో రౌండ్లో లలిత్‌బాబు ... అంతర్జాతీయ మాస్టర్ ఎస్.నితిన్ (1)పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో అతను... భారత ఆటగాడు అనూప్ దేశ్‌ముఖ్‌ను ఓడించాడు. తాజా విజయాలతో అతను 2 పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తొలిరౌండ్లో గెలిచిన హర్ష భరతకోఠి (1.5).... ఫ్రాంకోయిస్ ఫార్గెర్తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. శనివారం జరిగే మూడో రౌండ్ పోరులో లలిత్‌బాబు... రాజేశ్‌తో తలపడతాడు. -
కృష్ణ, సహజశ్రీ గేమ్‌లు డ్రా
గుర్గావ్: అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కృష్ణ, సహజశ్రీలు తమ ప్రత్యర్థులతో గేమ్‌ను డ్రా చేసుకున్నారు. ఇక్కడి సన్‌సిటీ స్కూల్లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన ఐదో రౌండ్ పోటీల్లో సీఆర్జీ కృష్ణ (4)... అంతర్జాతీయ మాస్టర్ స్వయం మిశ్రా (4)తో గేమ్‌ను డ్రాగా ముగించగా, చొల్లేటి సహజశ్రీ (3) కూడా అంతర్జాతీయ మాస్టర్ సారీన్ విశాల్ (3)తో డ్రా చేసుకుంది. కృష్ణ 4 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా ఏపీ క్రీడాకారుల్లో ఎస్.రవితేజ (3.5)కు... విక్రమ్ ఆదిత్య కులకర్ణి (4.5) చేతిలో పరాజయం ఎదురవగా, అభిలాష్ రెడ్డి (3.5)... వినాయక్ కులకర్ణి (3.5)తో డ్రా చేసుకున్నాడు. దీప్తాంశ్ రెడ్డి (4)... ఆదిత్య సంధు (3)పై, కార్తీక్ (4)... వంతిక అగర్వాల్ (3)పై గెలుపొందారు. మట్ట వినయ్ కుమార్ (3)... శుభమ్ కౌశిక్ (3)తో, లక్ష్మీకృష్ణ భూషణ్ (3)... సురేంద్రన్ (3)తో, తొషాలి (2.5)... మనన్ రాయ్ (2.5)తో గేమ్‌లను డ్రాగా ముగించుకున్నారు. హర్షిత (2)... మానవ్ సక్సేనా (3) చేతిలో కంగుతినగా, రాహుల్ శ్రీవాస్తవ్ (3)... అలోక్ సిన్హా (2)పై విజయం సాధించాడు. ఇంకా ఐదు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ సహజ్ గ్రోవర్ 5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
బాలచంద్ర మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతోన్న అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ మరో సంచలన విజయం నమోదు చేశాడు. ఇక్కడి కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన ఏడో రౌండ్లో బాలచంద్ర ప్రసాద్ సెర్బియాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ద్రాజిక్ సినిసాను ఓడించాడు. ఈ టోర్నీలో జీఎం హోదా ఉన్న క్రీడాకారుడిని ఓడించడం బాలచంద్రకిది రెండోసారి కావడం విశేషం. తొలి రౌండ్లో భారత జీఎం విష్ణు ప్రసన్నపై నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్ కుర్రాడు మరో ఇద్దరు జీఎంలు నీలోత్పల్ దాస్, దీపన్ చక్రవర్తిలతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఏడో రౌండ్ తర్వాత బాలచంద్ర ప్రసాద్ ఐదు పాయింట్లతో మరో తొమ్మిది మందితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన జీఎం లలిత్ బాబు నాలుగో విజయం సాధించాడు. శార్దూల్ గగారే (భారత్)తో జరిగిన గేమ్‌లో నెగ్గిన లలిత్ ఐదు పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో ఉన్నాడు. తమిళనాడుకు చెందిన జీఎం ఎస్.పి.సేతురామన్ ఆరు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలోకి వెళ్లాడు. టాప్ సీడ్ ఇవాన్ పొపోవ్ (రష్యా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను సేతురామన్ ‘డ్రా’గా ముగించాడు. ఏడో రౌండ్ తర్వాత రాష్ట్రానికే చెందిన హర్ష భరత్‌కోటి 29వ ర్యాంక్‌లో, రవితేజ 56వ ర్యాంక్‌లో, కార్తీక్, సీఆర్జీ కృష్ణ వరుసగా 67వ, 68వ ర్యాంకుల్లో, దీప్తాంశ్ రెడ్డి 72వ ర్యాంక్‌లో, వైవీకే చక్రవర్తి 76వ ర్యాంక్‌లో ఉన్నారు.