లలిత్‌కు నాలుగో విజయం | M.R lalit babu fourth win in grand master chess tournment | Sakshi
Sakshi News home page

లలిత్‌కు నాలుగో విజయం

Published Sat, Jan 11 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

M.R lalit babu fourth win in grand master chess tournment

న్యూఢిల్లీ: పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. లూడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో అతను నాలుగో విజయాన్ని నమోదు చేశాడు. తాజా విజయంతో అతను 4 పాయింట్లతో అభిజిత్ గుప్తాతో కలిసి సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. శనివారం జరిగిన నాలుగో రౌండ్ పోరులో లలిత్... ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ ఎల్డర్ గెసనోవ్ (3)ను కంగుతినిపించాడు.
 
 అభిజిత్... భారత్‌కే చెందిన వెంకటేశ్‌పై గెలిచాడు. అంతకుముందు జరిగిన మూడో రౌండ్లో లలిత్‌బాబు... అంతర్జాతీయ మాస్టర్ రాజేశ్‌ను ఓడించాడు. ఇతర ఏపీ క్రీడాకారుల్లో మట్ట వినయ్ కుమార్ (2)... జితేంద్రకుమార్ చౌదరి (1)పై విజయం సాధించగా, బొడ్డ ప్రత్యూష (2)... బెరిక్ అకోజోవ్ (కజకిస్థాన్-2)తో గేమ్‌ను డ్రాగా ముగించింది. చొల్లేటి సహజశ్రీ ఇంకా ఖాతా తెరవలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement