M.R lalit babu
-
ఆసియా చెస్: లలిత్ బాబు ఓటమి
షార్జా: ఆసియా కాంటినెంటల్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు తొలి పరాజయాన్ని చవిచూశాడు. తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న అతను శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో ఓడిపోయాడు. చైనా ప్లేయర్ జూ యింగ్లున్ 52 ఎత్తుల్లో లలిత్‌ను ఓడించాడు. మరో గేమ్‌లో భారత్‌కే చెందిన అధిబన్ 93 ఎత్తుల్లో సహచరుడు గోపాల్‌పై గెలిచాడు. మూడో రౌండ్ తర్వాత అధిబన్ మూడు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. -
లలిత్‌కు 26వ స్థానం
దుబాయ్ ఓపెన్ సాక్షి, హైదరాబాద్: దుబాయ్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు 26వ స్థానంలో నిలిచాడు. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో లలిత్ ఆరు పాయింట్లతో మరో 18 మందితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా లలిత్ 26వ స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా 6.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ ఎడూఆర్డ్ రొమైన్ 8 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు వీఏపీ కార్తీక్ 53వ ర్యాంక్‌లో (5 పాయింట్లు), ఎస్.రవితేజ 59వ ర్యాంక్‌లో (5 పాయింట్లు), సీఆర్జీ కృష్ణ 60వ ర్యాంక్‌లో (5 పాయింట్లు), బొడ్డ ప్రత్యూష 83వ ర్యాంక్‌లో (4.5 పాయింట్లు) నిలిచారు. -
లలిత్ బాబుకు తొలి పరాజయం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు జోరుకు బ్రేక్‌పడింది. పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్ చెస్ టోర్నమెంట్లో ఐదో రౌండ్ గేమ్‌లో అతను తొలి పరాజయం చవిచూశాడు. ‘ఎ’ కేటగిరీలో ఆదివారం జరిగిన ఈ పోటీలో గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా (5)... ఏపీ ఆటగాడిపై విజయం సాధించాడు. తాజా పరాజయంతో లలిత్ 4 పాయింట్లతో 11 మందితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానానికి పడిపోయాడు. మిగతా ఏపీ క్రీడాకారుల్లో బొడ్డ ప్రత్యూష (3)... ప్రదీప్ కుమారి (2)పై, కార్తీక్ (2.5)... హరిణి (1.5)పై, జి.లాస్య (1.5)...రిషబ్ నరేశ్ నాయక్ (0.5)పై గెలుపొందారు. హర్ష భరతకోటి (2.5)... దేబాశిష్ దత్త (2.5)తో డ్రా చేసుకోగా, మట్ట వినయ్ కుమార్ (2)కు అపర్ణా దాస్ (3) చేతిలో ఓటమి ఎదురైంది. సోమవారం జరిగే ఆరో రౌండ్ గేమ్‌లో లలిత్‌బాబు అమెరికాకు చెందిన జియత్దినోవ్ రాసెట్తో తలపడతాడు. -
లలిత్‌కు నాలుగో విజయం
న్యూఢిల్లీ: పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. లూడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో అతను నాలుగో విజయాన్ని నమోదు చేశాడు. తాజా విజయంతో అతను 4 పాయింట్లతో అభిజిత్ గుప్తాతో కలిసి సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. శనివారం జరిగిన నాలుగో రౌండ్ పోరులో లలిత్... ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ ఎల్డర్ గెసనోవ్ (3)ను కంగుతినిపించాడు. అభిజిత్... భారత్‌కే చెందిన వెంకటేశ్‌పై గెలిచాడు. అంతకుముందు జరిగిన మూడో రౌండ్లో లలిత్‌బాబు... అంతర్జాతీయ మాస్టర్ రాజేశ్‌ను ఓడించాడు. ఇతర ఏపీ క్రీడాకారుల్లో మట్ట వినయ్ కుమార్ (2)... జితేంద్రకుమార్ చౌదరి (1)పై విజయం సాధించగా, బొడ్డ ప్రత్యూష (2)... బెరిక్ అకోజోవ్ (కజకిస్థాన్-2)తో గేమ్‌ను డ్రాగా ముగించింది. చొల్లేటి సహజశ్రీ ఇంకా ఖాతా తెరవలేదు. -
వరుస గేముల్లో లలిత్‌బాబు గెలుపు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్లో శుక్రవారం నాటి రెండో రౌండ్లో లలిత్‌బాబు ... అంతర్జాతీయ మాస్టర్ ఎస్.నితిన్ (1)పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో అతను... భారత ఆటగాడు అనూప్ దేశ్‌ముఖ్‌ను ఓడించాడు. తాజా విజయాలతో అతను 2 పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తొలిరౌండ్లో గెలిచిన హర్ష భరతకోఠి (1.5).... ఫ్రాంకోయిస్ ఫార్గెర్తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. శనివారం జరిగే మూడో రౌండ్ పోరులో లలిత్‌బాబు... రాజేశ్‌తో తలపడతాడు.