దుబాయ్ ఓపెన్
సాక్షి, హైదరాబాద్: దుబాయ్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు 26వ స్థానంలో నిలిచాడు. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో లలిత్ ఆరు పాయింట్లతో మరో 18 మందితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా లలిత్ 26వ స్థానంలో నిలిచాడు.
భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా 6.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ ఎడూఆర్డ్ రొమైన్ 8 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు వీఏపీ కార్తీక్ 53వ ర్యాంక్‌లో (5 పాయింట్లు), ఎస్.రవితేజ 59వ ర్యాంక్‌లో (5 పాయింట్లు), సీఆర్‌జీ కృష్ణ 60వ ర్యాంక్‌లో (5 పాయింట్లు), బొడ్డ ప్రత్యూష 83వ ర్యాంక్‌లో (4.5 పాయింట్లు) నిలిచారు.
లలిత్‌కు 26వ స్థానం
Published Thu, Apr 17 2014 1:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement