international chess tournment
-
డబుల్ ధమాకా...
ఐల్ ఆఫ్ మ్యాన్ (యూకే): అంతర్జాతీయ వేదికపై భారత చెస్ క్రీడాకారులు ఆర్. వైశాలి, విదిత్ సంతోష్ గుజరాతి సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో ఐల్ ఆఫ్ మ్యాన్ దీవిలో జరిగిన స్విస్ గ్రాండ్ టోరీ్నలో ఓపెన్ విభాగంలో విదిత్ (మహారాష్ట్ర), మహిళల విభాగంలో వైశాలి (తమిళనాడు) చాంపియన్స్‌గా అవతరించారు. ఈ టోరీ్నలో టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారులుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత విదిత్ 8.5 పాయింట్లతో... వైశాలి కూడా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. విదిత్ ఏడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. వైశాలి ఆరు గేముల్లో నెగ్గి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చాంపియన్స్‌గా నిలిచిన విదిత్‌కు ట్రోఫీలతో పాటు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షల 57 వేలు), వైశాలికి ట్రోఫీలతో పాటు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టైటిల్స్‌తో ఓపెన్ విభాగంలో విదిత్... మహిళల విభాగంలో వైశాలి క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. ఓపెన్, మహిళల విభాగాల్లో వేర్వేరుగా ఎనిమిది మంది ప్లేయర్ల మధ్య క్యాండిడేట్స్ టోర్నీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 2 నుంచి 25 వరకు కెనడాలోని టొరంటోలో జరుగుతుంది. క్యాండిడేట్స్ టోరీ్నలో విజేతగా నిలిచిన వారు ఓపెన్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో... మహిళల విభాగంలో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్íÙప్ టైటిల్ కోసం తలపడతారు. -
మౌనంగా ఎదిగింది...
‘ఇది ఖరీదైన ఇండోర్ గేమ్. శిక్షణ తీసుకోవాలన్నా, విదేశాల్లో టోర్నమెంట్స్ ఆడాలన్నా బోలెడన్ని డబ్బులుండాలి. మీ దగ్గర అంత డబ్బులేనప్పుడు ఇదంతా మీకు అవసరమా?’ అని కొందరి ఎద్దేవా... ‘మరీ డాబు కాకపోతే ఉన్నదాంట్లో చూసుకోవాలి గాని ఎగిరెగిరి పడడమెందుకు?’ అని చెవులు కొరుక్కునే బంధువులు మరికొందరు. చాలీ చాలని కుటుంబ సంపాదన మరోపక్క... ఇవన్నీ ఆ యువతిని రాటుదేల్చాయి. దీంతోపాటు కొందరు ప్రముఖుల స్ఫూర్తిదాయక కథనాలు, మరికొందరి ఆపన్న హస్తం, కఠోరశ్రమ ఆమెను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్‌ను చేసాయి. ఆమే గుంటూరుకు చెందిన పందొమ్మిదేళ్ల బొమ్మిని మౌనిక అక్షయ. ఈ నెల 9న స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్ చెస్ ఫెస్టివల్లో 3వ విమ్ నార్మ్ (మహిళా అంతర్జాతీయ మాస్టర్) సాధించిన ఆమె విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే... ‘‘అమ్మా నాన్నలు స్కూలు నడిపేటప్పుడు చిన్న పిల్లలతో చెస్ ఆడేవారు. ముఖ్యంగా అమ్మ ఇష్టంగా ఆడే చెస్ అంటే నాకు కూడా ఇష్టమేర్పడింది. అలా అమ్మానాన్నలు నాకు తొలి గురువులయ్యారు. తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడంతో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా అమ్మ నాతో వచ్చేది. అమ్మ బిఎస్సీ, బిఎడ్ చదివారు. రెండు మూడు ప్రభుత్వ ఉద్యోగవకాశాలను నా కోసం వదిలేసారు. నాన్న అయితే తదుపరి మ్యాచ్‌లకు డబ్బులు ఎలా సమకూర్చాలా అని ఆలోచిస్తూ చాలా సరదాలు మా కోసం త్యాగం చేశారని చెప్పాలి. వారానికొక గంటే శిక్షణ నేను సుమారు 20 దేశాల్లో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్స్‌లో ఆడాను. ప్రస్తుతం తమిళనాడుకు చెందిన శ్యామ్ సుందర్, ఒడిషాకు చెందిన స్వయంశ్ మిశ్రాల వద్ద వారానికి గంటసేపు ఆన్లైన్ శిక్షణ తీసుకుంటున్నాను. ఒక్క గంట నేర్చుకుంటే రూ.1500 చెల్లించాలి. కనీసం వారానికి మూడు గంటల శిక్షణ తీసుకుంటూ, అంతర్జాతీయ టోర్నీలు ఆడితే ఏడాదిలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధిస్తాననే నమ్మకముంది. కోనేరు హంపి నాకు స్ఫూర్తి. ఆమె ఆడే స్టైల్ బాగా నచ్చుతుంది. 2003 తర్వాత జిల్లాలోనే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను సాధించాను. ఆ కసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది! తొలినాళ్లలో నేను జిల్లా స్థాయి పోటీల్లో తీవ్ర ఒత్తిడికి లోనయ్యేదానిని. దానివల్ల గేమ్‌లు చేజారిపోయేవి. అటువంటి సమయంలో ‘విజయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే, అపజయం నిన్ను నీకు పరిచయం చేస్తుంది. అప్పుడు నీ నిశ్శబ్దంతో అపజయాలను ఛేదించాలి’ అన్న కొందరి స్ఫూర్తిదాయక మాటలు, పుస్తకాలు నన్ను చాలా మార్చేసాయి. ఒత్తిడిలోనూ విజయం వైపు ఎలా అడుగులు వేయాలో నేర్పించాయి. ఇక వెనుతిరగలేదు. అండర్–7 నుంచి అండర్–20 వరకు రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాల్లోనూ విజేతగా నిలిచాను. మూడుసార్లు సీనియర్ ఉమెన్స్‌లోనూ టైటిల్ నెగ్గాను. ఈ క్రమంలోనే 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో తొలి విమ్ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో రెండో విమ్ నార్మ్, ఈ నెల 9న స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్ చెస్ ఫెస్టివల్లో 3వ విమ్ నార్మ్ సాధించడం ద్వారా ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాను. నా అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’ అని చెబుతోంది మౌనిక. – మురమళ్ళ శ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు ఫోటోలు: గజ్జల రామ్‌గోపాల్ రెడ్డి అమ్మానాన్న ఏమంటున్నారు? కట్టుబాట్లు ఉన్న కుటుంబం కావడంతో బంధువులు చాలా మంది ఆడపిల్లను బయటకు పంపడాన్ని ఇష్టపడలేదు. చదువు పాడైపోతుందని కొందరన్నారు. కొందరు మాట్లాడడం మానేసారు. ఇవి మాకు సవాలుగా మారాయి. పాప చిన్నప్పటి నుంచి చదువులోని అన్ని విభాగాల్లోనూ అగ్రస్థానంలోనే ఉండేది. ఇటీవల బీటెక్ ప్రథమ సంవత్సరం లోనూ 8.6 శాతం స్కోర్ చేసింది. క్రీడల వల్ల చదువు పాడవుతుందంటే మేము నమ్మం. మన దేశంలో గత రెండేళ్ళ నుంచి అంతర్జాతీయ టోర్నీలు పెద్దగా జరగడంలేదు. ఎలో రేటింగ్స్, నార్మ్స్ రావాలంటే ఇతర దేశాల్లో జరిగే టోర్నీల్లో ఆడాలి. ఒక్క టోర్నీకి కనీసం రూ.3 లక్షలు అవుతుంది. ఆమె కల నెరవేరేందుకు ఎన్ని సంతోషాలు దూరమైనా అవి మాకు ఆనందమే. తను ఈ దేశం గర్వించే స్థాయికి రావాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాం.. – నాన్న రామారావు, అమ్మ లక్ష్మి. తండ్రి రామారావు, చెల్లెలు హరిణి, తల్లి లక్ష్మిలతో మౌనిక అక్షయ -
అమ్మ తీర్చిదిద్దిన మాస్టర్
విజయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే... అపజయం నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ఓటములను విజయాలుగా మార్చుకోవాలంటే కఠోర శ్రమతోపాటు చెదరని ఆత్మస్థైర్యం కూడా నీకుండాలని అమ్మ, శిక్షకులు చెప్పిన మాటలు ఆ చిన్నారిని ఎన్నో అవరోధాలు అధిగమించి విజయ శిఖరం చేరుకునేలా చేశాయి. హంగేరిలో జరిగిన అంతర్జాతీయ స్ప్రింగ్ ఫెస్టివల్ పోటీల్లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను సొంతం చేసుకునేలా చేశాయి. దీంతో ఇండియన్ రైల్వేస్ హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాన్ని కల్పించింది. 2008లో మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరెడ్డి నిండు మనస్సుతో వృద్ధిలోకి వస్తావని ఇచ్చిన ఆశీర్వచనం ఆ యువకుడిలో ఎంతో స్ఫూర్తిని నింపడమే కాకుండా అది నిజమయ్యిందని ఆ కుటుంబం ఎంతో మురిసిపోతోంది. నాన్న ఆశయం... అమ్మ కష్టం గుంటూరుకు చెందిన చింతగుంట శివరామ్ రెడ్డి, భారతిల రెండో కుమారుడు మెహర్ చిన్నారెడ్డి. శివరామ్‌కు చెస్ అంటే ప్రాణం కావడంతో తన కుమారుడైన మెహర్‌కు ఆరేళ్ళ ప్రాయంలో ఆయనే చెస్ శిక్షణలో చేర్పించారు. రోజూ దగ్గరుండి శిక్షణకు తీసుకెళ్ళే వారు. మెహర్‌కు ఏడేళ్ళు వచ్చేసరికి 2002లో అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెదారు. తల్లి భారతికి పెద్దగా చదువులేదు. ఎప్పుడూ గడప దాటి బయటకు వచ్చింది లేదు. ఇద్దరు చిన్న బిడ్డలతో ఏం చేయాలో తెలీని పరిస్థితి. మరోవైపు భర్త ఇచ్చిన బాధ్యతతోపాటు ఆశయాలను నెరవేర్చాలి. ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముతూ తన బిడ్డలను ఉన్నదాంట్లో పోషించుకుంటూ ముందుకెళ్ళింది. బిడ్డల పోషణతోపాటు మెహర్‌ను ఇతర ప్రాంతాలకు పోటీలకు తీసుకెళ్ళేది. తల్లి కష్టాన్ని చూసిన మెహర్ కఠోర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగాడు. ఆట కోసం శిక్షణనిస్తూ... మెహర్ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయికి చేరుకునే సరికి మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పిల్లలకు ఆన్లైన్ చెస్ పాఠాలు బోధిస్తూ అంతో ఇంతో సంపాదించడం ప్రారంభించాడాయువకుడు. అలా తన పోటీలకు తానే సంపాదించుకోవడంతోపాటు రాంకీ లాంటి సంస్థలు కొంత ఆర్థిక చేయూతనందించాయి. దీంతో సుమారు 15 దేశాల్లో అంతర్జాతీయ పోటీలలో పాల్గొని తన రేటింగ్‌ను మెరుగుపరచుకున్నాడు. ఈ ఏడాది మేలో హంగేరీలో జరిగిన స్ప్రింగ్స్ ఫెస్టివల్ అంతర్జాతీయ చెస్ పోటీల్లో పాల్గొని తొలిసారి 2400 రేటింగ్‌ను అధిగమించడంతో ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ హోదా సాధించాడు. బలహీనతలు ఆవరిస్తే ... అది 2015 బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీలు అవతలవైపు రష్యాకు చెందిన గ్రాండ్ మాస్టర్ ఇయాన్ చెపరినాతో మ్యాచ్. అందరూ విజయం ఏకపక్షమే అనుకున్నారు. మరొకరైతే ఒత్తిడికి లోనయ్యే వారే అయితే మెహర్ మాత్రం చిరునవ్వుతో గేమ్‌ను ప్రారంభించాడు. దాదాపు విజయానికి చేరువలోకి వచ్చిన సమయంలో చేసిన చిన్నపొరపాటుతో మ్యాచ్ డ్రా అయ్యింది. చెపరినాకు చెమటలు పట్టినంత పనయ్యింది. దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు మెహర్ ఆటను చూసి విస్మయం చెందారు. మెహర్‌కు ఆర్థిక వెసులుబాటు ఉండి అన్ని టోర్నమెంట్లు ఆడగలిగితే ఈ పాటికే గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకునే వాడు. అయితే తన రేటింగ్ ప్రస్తుతం 2426 ఉంది. – మురమళ్ళ శ్రీనివాసరావు సాక్షి, గుంటూరు వెస్ట్ ఫోటోలు: గజ్జల రామ్‌గోపాల్ రెడ్డి. సాధించిన విజయాలు ►2006 ఇరాన్లో జరిగిన అండర్–12 బాలుర టోర్నమెంట్లో బంగారు పతకం. ►2007లో డిల్లీలో జరిగిన కామన్ వెల్త్ అండర్–14 విభాగంలో రజత పతకం. ►2011లో నాగ్‌పూర్‌లో జరిగిన 12వ జాతీయ నేషనల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం. ►2014లో దిండిగల్‌లో జరిగిన నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం. ►2015లో కాకినాడలో జరిగిన ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చాంపియన్‌షిప్‌లో ప్ర«థమ స్థానం. అదే ఏడాది విజయవాడలో జరిగిన ఇదే టోర్నమెంట్లోనూ ప్రథమ స్థానం. ►దీంతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించాడు. -
మూడో ర్యాంక్‌లో హంపి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 2,577 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. రెండేళ్ల విరామం తర్వాత... ఇటీవల రష్యాలో జరిగిన గ్రాండ్‌ప్రి టోరీ్నలో పాల్గొన్న హంపి విజేతగా నిలిచి 17 రేటింగ్ పాయింట్లను సంపాదించింది. హు ఇఫాన్ (చైనా–2,659) టాప్ ర్యాంక్‌లో... ప్రపంచ చాంపియన్ జూ వెన్ జున్ (చైనా–2,586) రెండో స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హారిక 2,495 రేటింగ్ పాయింట్లతో 13వ ర్యాంక్‌లో ఉంది. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2,748) 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
చదరంగం చిరుత
సరదాగా మొదలుపెట్టిన ఆట... అతడి కెరీర్‌గా మారింది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చిరు ప్రాయంలోనే అపార నైపుణ్యంతో మేటి ఆటగాళ్లకు ‘చెక్’ పెట్టే స్థాయికి తీసుకెళ్లింది. ఒక్కో పావును కదుపుతూ, ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ చెస్ క్రీడాకారులు కలలు కనే గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దిశగా అడుగులు వేయిస్తోంది. ఆ కుర్రాడే హర్ష భరతకోటి...! కొన్నాళ్లుగా అంతర్జాతీయ చెస్‌లో నిలకడగా రాణిస్తూ భవిష్యత్ తారగా కితాబు అందుకుంటున్నాడితడు. ఇప్పటికే రెండు జీఎం నార్మ్‌లు సొంతం చేసుకుని చిరకాల స్వప్నానికి మరో అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు గ్రాండ్ మాస్టర్లైన కోనేరు హంపి, పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, లలిత్‌బాబు ఆంధ్రప్రదేశ్ వారు. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే హర్ష భరతకోటి రూపంలో తెలంగాణ నుంచి తొలి గ్రాండ్ మాస్టర్‌ను మనం చూడవచ్చు. సాక్షి, హైదరాబాద్ : ప్రతిభ ఉన్నా సరైన సమయంలో గుర్తింపు రాకపోతే అది మరుగున పడిపోతుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే నైపుణ్యానికి నిత్యం పదును పెట్టుకుంటూ ఉండాలి. ప్రతిభావంతులకు తగిన చేయూత లభించాలి. మన దగ్గర వ్యవస్థ ద్వారా కాకుండా స్వయంకృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రీడాకారులెందరో ఉన్నారు. మేధో క్రీడ చెస్లోనూ ఇలాంటి వారెందరో కనిపిస్తారు. దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మొదలు తాజా గ్రాండ్‌మాస్టర్ హిమాన్షు శర్మ వరకు ఎన్నో అవాంతరాలను అధిగమించి అనుకున్న స్థానానికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అపార ప్రతిభ ఉన్న యువ చెస్ ఆటగాళ్ల కోవలోకే వస్తాడు 18 ఏళ్ల హర్ష భరతకోటి. ఇటీవలే నేపాల్‌లో జరిగిన కఠ్మాండూ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన హర్ష కొన్నేళ్లుగా తన ఖాతాలో క్రమం తప్పకుండా విజయాలు జమ చేసుకుంటున్నాడు. తొమ్మిదేళ్ల ప్రాయంలో చెస్ పట్ల ఆకర్షితుడైన హర్ష కోచ్ ఎన్వీఎస్ రామరాజు శిక్షణలో రాటు దేలాడు. ఓనమాలు నేర్చుకున్న రెండేళ్ల తర్వాత జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగి కాంస్య పతకం సాధించాడు. తర్వాత పలు ర్యాంకింగ్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. అటాకింగ్ ఆటతో దూసుకెళ్లే అలవాటున్న హర్ష పరిస్థితిని బట్టి వ్యూహాలను మార్చేసి ఫలితాన్ని తారుమారు చేసే సత్తాగలవాడు. ఏడేళ్లుగా చెస్ టోర్నీలు ఆడుతున్న తను ఇప్పటివరకు 20 కంటే ఎక్కువమంది గ్రాండ్మాస్టర్లను ఓడించడం విశేషం. ప్రస్తుతం 2463 ఎలో రేటింగ్ పాయింట్లతో ఉన్న హర్ష 2500 మార్క్‌ను అందుకొని గ్రాండ్‌మాస్టర్ హోదా పొందాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. రోజూ తొమ్మిది గంటల పాటు సాధనతో రాబోయే రెండు నెలల కాలంలో కోల్‌కతా, ఒడిశా, ముంబైలలో జరిగే టోర్నీల్లో పాల్గొననున్నాడు. ఒక్కో పర్యటనకు భారీ మొత్తం... భారత్‌లో ప్రస్తుతం చెస్ టోర్నీల సంఖ్య భారీగా పెరిగింది. అయితే రేటింగ్ పాయింట్లు పెంచుకోవాలంటే తమకంటే రేటింగ్ ఎక్కువ ఉన్న క్రీడాకారులు పాల్గొనే టోర్నీల్లో ఆడాల్సి ఉంటుంది. యూరోప్‌లో గ్రాండ్‌మాస్టర్స్ ఎక్కువ పాల్గొనే టోర్నీలు చాలా జరుగుతాయి. ఇలాంటి టోర్నీల్లో పాల్గొనడం అందరివల్ల అయ్యే పనికాదు. రానుపోను ఖర్చులు, వసతి, టోర్నీ సందర్భంగా చెస్ సహాయకులతో (సెకండ్స్) శిక్షణ... ఇలా ఒక్కో పర్యటనకు కనీసం ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తం భరించడం ఔత్సాహిక యువ క్రీడాకారులకు సాధ్యమయ్యే పనికాదు. కార్పొరేట్ సంస్థలు, క్రీడాభిమానులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) ముందుకువచ్చి తమవం తుగా ఆర్థిక సహాయం చేస్తే హర్ష కెరీర్ మరింత వెలిగిపోతుంది. కార్ల్‌సన్‌నే ఆకట్టుకున్నాడు... అది 2017 ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీ వేదిక... ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), హికారు నకముర (అమెరికా), విశ్వనాథన్ ఆనంద్ తదితర దిగ్గజాలు పాల్గొన్న ఈ టోర్నీలో హర్ష కూడా బరిలోకి దిగాడు. తొలి ఐదు రౌండ్లలో ఐదుగురు గ్రాండ్మాస్టర్స్తో తలపడి, అందులో ఇద్దరిని ఓడించి, మరో ఇద్దరితో ‘డ్రా’ చేసుకొని మరో గేమ్‌లో ఓడిపోయాడు. అప్పటి హర్ష ఎలో రేటింగ్ (2394)ను బట్టి చూస్తే అతని ప్రదర్శన అద్భుతమని ఆ టోర్నీలో పాల్గొన్న చెస్ పండితులు కితాబిచ్చారు. హర్ష గేమ్‌లు ఆడతున్న సమయంలో ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ హర్ష బోర్డు వద్దకు వచ్చి అతని ఎత్తులను పరిశీలించి వెళ్లడం జరిగింది. హర్ష భరతకోటి విజయాలు... 2011: అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో అండర్–11 విభాగంలో కాంస్య పతకం. 2012: శ్రీలంక ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అండర్–12 ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం. 2012: చెన్నైలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో అండర్–12 విభాగంలో స్వర్ణం. 2013: పాండిచ్చేరిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అండర్–13 విభాగంలో స్వర్ణం. 2014: న్యూఢిల్లీలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం. 2016: న్యూఢిల్లీలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం. 2017: పాట్నాలో జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం. 2017: ఇరాన్లో జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో రజతం. 2017: ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీలో తొలి జీఎం నార్మ్ సొంతం. 2018: దుబాయ్ ఓపెన్‌లో రెండో జీఎం నార్మ్ సొంతం. -
లలిత్‌కు 26వ స్థానం
దుబాయ్ ఓపెన్ సాక్షి, హైదరాబాద్: దుబాయ్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు 26వ స్థానంలో నిలిచాడు. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో లలిత్ ఆరు పాయింట్లతో మరో 18 మందితో కలిసి ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా లలిత్ 26వ స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా 6.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ ఎడూఆర్డ్ రొమైన్ 8 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు వీఏపీ కార్తీక్ 53వ ర్యాంక్‌లో (5 పాయింట్లు), ఎస్.రవితేజ 59వ ర్యాంక్‌లో (5 పాయింట్లు), సీఆర్జీ కృష్ణ 60వ ర్యాంక్‌లో (5 పాయింట్లు), బొడ్డ ప్రత్యూష 83వ ర్యాంక్‌లో (4.5 పాయింట్లు) నిలిచారు. -
ఆనంద్ పిలుస్తాడేమో!
సాక్షి, హైదరాబాద్: దాదాపు పదిహేడేళ్ల క్రితం ప్రపంచ అండర్-10 చాంపియన్‌షిప్‌లో గెలిచిననాటినుంచి ప్రపంచ చెస్‌లో తెలుగు తేజం పెంటేల హరికృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2700 ఎలో రేటింగ్‌తో ఆనంద్ తర్వాత భారత్‌నుంచి రెండో సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన అతను, ఇటీవల యూరోపియన్ సర్క్యూట్లో పలు విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా స్విట్జర్లాండ్‌లో జరిగిన బీల్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో రెండు టైటిల్స్ నెగ్గాడు. ఇటీవలి విజయాలు తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయని చెబుతున్న హరికృష్ణ తన ఆటకు సంబంధించి వివిధ అంశాలపై ‘సాక్షి’ తో ముచ్చటించాడు. విశేషాలు అతని మాటల్లోనే... బీల్ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శన... గత ఏడాది కూడా నేను ఈ టోర్నీ ఆడినా ఐదో స్థానం మాత్రమే దక్కింది. ఈ సారి రెండు విభాగాల్లో (మాస్టర్స్, ర్యాపిడ్) టైటిల్ నెగ్గడం ఆనందంగా ఉంది. సర్క్యూట్‌లోని అనేక మంది మెరుగైన గ్రాండ్‌మాస్టర్లు ఇందులో బరిలో నిలిచారు. డ్రాతో టోర్నీని మొదలు పెట్టి, ఆఖరి గేమ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితుల్లో బాగా ఆడి టైటిల్ సాధించడం సంతృప్తినిచ్చింది. చాలా కాలంగా నేను టీమ్ ఈవెంట్లే ఆడుతున్నాను. వ్యక్తిగత విభాగంలో ఏ టోర్నీ గెలిచినా విశేషమే. యూరోపియన్ సర్క్యూట్కే పరిమితం కావడం... తప్పడం లేదు! అక్కడ ఏడాదంతా చెస్ టోర్నీలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కో దేశంలో అక్కడి క్లబ్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్నాను. ఆటలో బ్రేక్ రాదు...అటు రేటింగ్ పాయింట్లు దక్కుతాయి. నాకున్న రేటింగ్, ర్యాంకింగ్ వల్ల అనేక టోర్నీల్లో ఆడేందుకు ఆహ్వానాలు అందుతూనే ఉంటాయి. నా ప్రదర్శన కొనసాగాలంటే ఇది తప్పనిసరి. అక్కడ క్లబ్ టోర్నీలకు కూడా మంచి ఆదరణ ఉంది. కెరీర్లో వేగం తగ్గడం... అలా ఏమీ లేదు. అండర్-10, 12, 14లాంటి ఏజ్ గ్రూప్ కేటగిరీల్లో వేగంగా ఎదిగినంతగా సీనియర్ స్థాయిలో సాధ్యం కాదు. నా 15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్ అయి 2500 రేటింగ్ వరకు ఒక్కసారిగా దూసుకొచ్చాను. అయితే 2600 పాయింట్లు దాటిన తర్వాత గట్టి ప్రత్యర్థులు ఎదురవుతారు, పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. 2009లో నా కెరీర్ కొంత వెనుకబడిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు కోలుకున్నాను. నిలకడగా విజయాలతో పాయింట్లు సాధిస్తున్నాను. ఇప్పుడు మళ్లీ 2700 ఎలైట్ జాబితాలో చేరాను. ర్యాంకింగ్స్‌లో టాప్-40లో ఉన్నాను. కానీ పెద్ద టోర్నీల్లో విజయాలు లేవు కదా... ఎక్కువగా వార్తల్లో నిలిచే లినారెస్, తాల్ మెమోరియల్, డార్ట్మండ్, కోరస్ (టాటా)లాంటి పెద్ద టోర్నీల్లో అవకాశం అంత సులభంగా రాదు. అలాంటి ఒక్క టోర్నీ కూడా భారత్‌లాంటి దేశంలో లేకపోవడం దురదృష్టకరం. మన వద్ద జరిగితే నేరుగా దిగ్గజ ఆటగాళ్లతో ఆడే అవకాశం మనకు దక్కుతుంది. ప్రస్తుతం 2750 రేటింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాను. కొన్ని లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాను. త్వరలో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌పై... చెస్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గతంలో ఈ స్థాయి ఈవెంట్లో ఆడిన అనుభవం, ఒత్తిడిని ఎదుర్కోగలిగే సామర్ధ్యం ఆనంద్ బలాలు కాగా, వయసు కాస్త ప్రతిబంధకం కావచ్చు. అదే 22 ఏళ్ల కార్ల్సన్ బలం. అతని ఆత్మవిశ్వాసం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ అనుభవం లేకపోవడం వల్ల కీలక సమయాల్లో తడబడవచ్చు. అయితే ఆనంద్ కూడా బాగా సిద్ధమవుతున్నాడు. తనకు సహకరించే ‘సెకండ్స్’ను ఎంపిక చేసుకుంటున్నాడు. వారిలో గంగూలీ ఉండవచ్చు. నన్ను కూడా పిలుస్తాడని అనుకుంటున్నాను. ఇంకా నేరుగా పిలుపు రాలేదు. అవకాశం వస్తే ఆనంద్‌తో చేరడానికి సిద్ధం. ఆ రకంగానైనా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నేనూ భాగస్వామి కావచ్చు.