
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 2,577 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. రెండేళ్ల విరామం తర్వాత... ఇటీవల రష్యాలో జరిగిన గ్రాండ్‌ప్రి టోరీ్నలో పాల్గొన్న హంపి విజేతగా నిలిచి 17 రేటింగ్ పాయింట్లను సంపాదించింది. హు ఇఫాన్ (చైనా–2,659) టాప్ ర్యాంక్‌లో... ప్రపంచ చాంపియన్ జూ వెన్ జున్ (చైనా–2,586) రెండో స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హారిక 2,495 రేటింగ్ పాయింట్లతో 13వ ర్యాంక్‌లో ఉంది. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2,748) 18వ ర్యాంక్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment