ఆసియా చెస్: లలిత్ బాబు ఓటమి | Asian chess : lalit babu lost game | Sakshi
Sakshi News home page

ఆసియా చెస్: లలిత్ బాబు ఓటమి

Published Sun, Apr 20 2014 1:24 AM | Last Updated on Sat, Jun 2 2018 4:03 PM

Asian chess : lalit babu lost game

షార్జా: ఆసియా కాంటినెంటల్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు తొలి పరాజయాన్ని చవిచూశాడు. తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న అతను శనివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో ఓడిపోయాడు. చైనా ప్లేయర్ జూ యింగ్లున్ 52 ఎత్తుల్లో లలిత్‌ను ఓడించాడు.
 
 మరో గేమ్‌లో భారత్‌కే చెందిన అధిబన్ 93 ఎత్తుల్లో సహచరుడు గోపాల్‌పై గెలిచాడు. మూడో రౌండ్ తర్వాత అధిబన్ మూడు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement