లలిత్ బాబుకు తొలి పరాజయం | first time lalit babu lost grand master chess tournment | Sakshi
Sakshi News home page

లలిత్ బాబుకు తొలి పరాజయం

Published Mon, Jan 13 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

first time lalit babu lost grand master chess tournment

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు జోరుకు బ్రేక్‌పడింది. పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్ చెస్ టోర్నమెంట్‌లో ఐదో రౌండ్ గేమ్‌లో అతను తొలి పరాజయం చవిచూశాడు. ‘ఎ’ కేటగిరీలో ఆదివారం జరిగిన ఈ పోటీలో గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా (5)... ఏపీ ఆటగాడిపై విజయం సాధించాడు. తాజా పరాజయంతో లలిత్ 4 పాయింట్లతో 11 మందితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానానికి పడిపోయాడు.
 
 
 మిగతా ఏపీ క్రీడాకారుల్లో బొడ్డ ప్రత్యూష (3)... ప్రదీప్ కుమారి (2)పై, కార్తీక్ (2.5)... హరిణి (1.5)పై, జి.లాస్య (1.5)...రిషబ్ నరేశ్ నాయక్ (0.5)పై గెలుపొందారు. హర్ష భరతకోటి (2.5)... దేబాశిష్ దత్త (2.5)తో డ్రా చేసుకోగా, మట్ట వినయ్ కుమార్ (2)కు అపర్ణా దాస్ (3) చేతిలో ఓటమి ఎదురైంది. సోమవారం జరిగే ఆరో రౌండ్ గేమ్‌లో లలిత్‌బాబు అమెరికాకు చెందిన జియత్దినోవ్ రాసెట్‌తో తలపడతాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement