న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్‌బాబు పార్శ్వనాథ్ అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. లుడ్లా క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో శుక్రవారం నాటి రెండో రౌండ్లో లలిత్‌బాబు ... అంతర్జాతీయ మాస్టర్ ఎస్.నితిన్ (1)పై విజయం సాధించాడు.
అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో అతను... భారత ఆటగాడు అనూప్ దేశ్‌ముఖ్‌ను ఓడించాడు. తాజా విజయాలతో అతను 2 పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తొలిరౌండ్‌లో గెలిచిన హర్ష భరతకోఠి (1.5).... ఫ్రాంకోయిస్ ఫార్గెర్‌తో జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. శనివారం జరిగే మూడో రౌండ్ పోరులో లలిత్‌బాబు... రాజేశ్‌తో తలపడతాడు.
వరుస గేముల్లో లలిత్‌బాబు గెలుపు
Published Sat, Jan 11 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement